నెంబర్ వన్ కొంటె కుర్రాళ్ళు

Number One Konte Kurralu | Telugu Comedy Story | Nallabati Raghavendra Rao
నెంబర్ వన్ కొంటె కుర్రాళ్ళు | తెలుగు హాస్య కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు
Published in manatelugukathalu.com on 11/09/2026
“నెంబర్ వన్ కొంటె కుర్రాళ్ళు” ఒక చమత్కారమైన తెలుగు హాస్య వ్యంగ్యకథ. సిటీ బస్సులో ప్రయాణించే పుష్ప చుట్టూ చేరిన యువకులు, సీటు కోసం వారు చేసే కొంటె ప్రయత్నాలు, ఆమె చూపించే ధైర్యం కథను ఆద్యంతం సరదాగా నడిపిస్తాయి. బస్సులో జరిగే చిన్న సంఘటనల ద్వారా రచయిత పరిస్థితిజన్య హాస్యాన్ని అద్భుతంగా పండించారు.
బోయ్స్ హాస్టల్ దగ్గరకు వచ్చి ఆగింది సిటీ బస్సు. హ్యాండ్ బ్యాగ్ సరి చేసుకుంటూ పూర్తి ఖాళీగా ఉన్న బస్సులో ఎవరో తోస్తున్నట్టు కంగారుగా ఎక్కేసింది పుష్ప.
లేడీస్ సీటులో కూర్చుంది. అంతేనా, తన పక్క అటు, ఇటు సీట్లలో మగపురుగులు కూర్చోకుండా చేతులు బార్లా చాచింది.
ఆమె ఎక్కిన వెంటనే అక్కడే ఉన్న బాయ్స్ హాస్టల్ నుంచి నూనూగు మీసాల కుర్రోళ్ళు షోల్డర్ బ్యాగులు తగిలించుకుని పరుగు కన్నా మించిన ఉరుకులతో వచ్చి అదే బస్సు ఎక్కి మగవాళ్ళ సీట్లతో పాటు ఆడవాళ్ళ సీట్లు కూడా ఆక్రమించేశారు. ఇంకా స్టాండింగ్ లో 20 మంది కుర్రాళ్ళు నిలబడ్డారు. పుష్ప తనకు అటూ ఇటూ ఎవరూ కూర్చోకుండా కళ్ళతోటే... 'బి కేర్ ఫుల్'... అంటుంది. కొంటె కుర్రాళ్ళు ఇద్దరు ఆమె పక్క కూర్చోవాలని ట్రై చేశారు. తెగ ట్రై చేశారు.
''మీ పక్కన కూర్చోవచ్చా అండి..'' ధైర్యంగా అడిగాడు ఓ ధైర్యవంతుడయిన కుర్రోడు.
''లేడీస్ సీట్లో మీరెలా కూర్చుంటారు..? ఇదో ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. అలా నిలబడి ఉండండి.'' కసిరినట్టు అంది పుష్ప.
"మీరు తప్ప లేడీస్ ఎవరు ఎక్కలేదు కదండీ.."
"అయితే... కూర్చుంటారా? దారిలో ఎక్కవచ్చు కదా. అసలు అమ్మాయిలకు అభ్యంతరం లేకపోతేనే అబ్బాయిలు పక్కగా వచ్చి కూర్చోవాలి. లేకుంటే కూర్చునే హక్కు మీకు లేదు.." అన్నట్టు కళ్ళు తిప్పింది పుష్ప.
ఆమె చూసే చూపులకు కాస్తంత బిడియపడి బెంబేలు పడిన ఆ నూనూగు మీసాల కుర్ర గ్యాంగు వినిపించని ఇకిలి సకిలి నవ్వులతో... జారుతున్న జీన్స్ ప్యాంట్లు పైకి లాక్కోవడం పుష్ప గమనించింది.
బస్సులో కుర్రాళ్ళతో అనుభవాలు ఇంతకు పూర్వం ఆమెకు చాలా ఉన్నాయి. అందులో ఓ సంఘటన అలా గుర్తొచ్చింది పుష్పకు.
'గతంలో ఎప్పుడో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగితే అది తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు... పుష్పను కాలేజీ మానేయమన్నారు. తను అందుకు ఒప్పుకోకపోవడంతో... తమ కుటుంబ సభ్యులు "వాళ్లే"... మూడు రోజులు భోజనం మానేశారు. తను మాత్రం ఆకలికి ఆగలేక ఫుల్లుగా లాగిన్ చేసేది.' చివరికి నోరు మూసుకొని ఊరుకోక తప్పలేదు వాళ్ళ వాళ్ళకు. అప్పటి ఆ సంఘటన మగవాళ్ళ పట్ల... తన జీవిత స్థితిగతులను మార్చేసింది.
పుసుక్కున, పుటుక్కున... సినిమా ఫ్లాష్ బ్యాక్ రూపంలో అవన్నీ గుర్తుకు తెచ్చుకుని... తన రెండు చేతులూ మరింత బలంగా బార్లా చాచింది, తన పక్క సీట్లలో మగవాళ్ళు కూర్చోకుండా.
ఓ కుర్రోడు కండక్టర్ వైపు చూసి పరిస్థితి చక్కదిద్దమన్నట్టు... ఏదో చెప్పాడు సైగతో పుష్ప వైపు చూపిస్తూ.
'బాబోయ్, నాకెందుకు...' అంటూ ఆ కండక్టర్ మహాశయుడు గుండెల మీద చెయ్యి వేసుకోవడమూ కనిపెట్టింది పుష్ప. దూరంగా ఉన్న డ్రైవరు వీరుడు కూడా... "మీరు మీరు చూసుకోండయ్యా" అన్నట్టు నెత్తి మీద టవల్ వేసుకుని డ్రైవ్ చేస్తున్న ఆకారమూ... ఆమె కంటి రెటీనా పై పడిపోయింది.
'ఈ మధ్యన చాలా మంది అమ్మాయిలు... బస్సు కండక్టర్లను, డ్రైవర్లను చొక్కా విప్పి మరీ చితకమతక బాదిన సంఘటనలు యూట్యూబ్ లో చూడలేదా?... జాగ్రత్త.' అన్నట్లు... చురుక్కున అందరివైపు చూసింది పుష్ప.
అంతేకాదు...
'ఆడవాళ్ళా మజాకా...
ఆడవాళ్లు మీకు జోహార్లు...
ఆడవాళ్లు అపరకాళీమాతలు,
ఆడవాళ్లు ఆదిమహాపరాశక్తిలు...
ఆడవాళ్లు అణుబాంబులతో సమానం...'
లాంటి పదాలన్నీ కలగలిపిన పోజుతో... బస్సులో మొత్తం కుర్రాళ్ళ వైపు చుట్టూ ఒక లుక్కేసేసింది.
వాళ్లందరూ బిగించిన మూతిపెదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ విప్పకూడదని నిర్ణయించుకుని నవ్వులను ఆపేసుకున్నారు... బలవంతంగా.
కాసేపటికి పుష్ప హ్యాండ్ బ్యాగ్ లో సెల్ఫోన్ రింగ్ అయింది... అయినా బార్లా చాచిన చేతులను తీసి బ్యాగ్ లో సెల్ ఆన్ చేయలేదు... కాసేపు అలాగే మొరిగింది... మాట్లాడే... ఆ... చిట్టి చిన్నారి శబ్దం పిట్ట.
"ఫోన్ రింగ్ అవుతుంది... పర్వాలేదు తీయండి మేం మీ పక్కన కూర్చుంటాం." అన్నాడు చూడగానే కన్ను గీటుతున్నట్టు కనిపించే ఓ కుర్రోడు.
"నాకేమన్నా చెవుడా? బ్రహ్మజెముడా?... నాగజెముడా?... నువ్వు చెప్పాలా... నాకు వినబడుతుంది, కనబడుతుంది కూడా!" పళ్ళు బిగిస్తూ అంది పుష్ప.
"నాకు తెలుసు మీరు ఎలాగోలా మాటలు కలుపుతారు. ఆ తర్వాత స్వీటుగా 'సీటు' అడుగుతారు. ఆ తర్వాత కథ మామూలే..." అన్నట్టు గుర్రుగా... బుర్రుగా ఆ కన్నుగీటే టైపు కుర్రాడు కళ్ళలోకి కొరకొర చూసింది పుష్ప.
అంతే... వెళుతున్న బస్సు జర్క్ ఇవ్వడం... ఆ కుర్రాడితో పాటు నిలబడ్డ 20 మంది కుర్రాళ్ళు ముందుకు పడిపోవడం... అరసెకనులో జరిగిపోయాయి. మరో పది నిమిషాలలో కండక్టర్ గట్టిగా "ఓల్డాన్! ఓల్డాన్!.." అన్నాడు. బస్సు ఒక స్టేజి దగ్గర ఆగింది. "దిగండి దిగేవాళ్ళు." అరిచాడు కండక్టరు మళ్ళీ.
అంతే... 75 ఏళ్ల పుష్పమ్మ... తన హ్యాండ్ బ్యాగు సవరించుకొని తన చేతికర్ర సహాయంతో నెమ్మదిగా లేచి నిలబడి వణుకుతూ బస్సు దిగిపోయింది.
ఆ మొత్తం సీటును విజయవంతంగా ఆక్రమించుకున్న ఆ కుర్రాళ్ళతో... బస్సు ఎక్కిన మిగిలిన... నూనూగు మీసాల జీన్స్ ప్యాంట్ కుర్రాళ్ళందరూ మొట్టమొదటగా పూర్తి ఊపిరి పీల్చుకున్నారు.
సమాప్తం
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు











Comments