top of page
Original.png

ఒరు వరుట్టమ్ (ఒకవిషాదం)

2 hours ago
4 min read

చెన్నై అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ లీక్ అవుతుంటే బకెట్ పెట్టి విసుక్కుంటున్న పెద్దాయన

Oru Varuttam (Oka Vishadam) - Telugu Comedy Story | Veereswara Rao Moola

ఒరు వరుట్టమ్ (ఒకవిషాదం) - తెలుగు హాస్య కథ | వీరేశ్వర రావు మూల

Published In manatelugukathalu.com On 21/09/2026


ఒరు వరుట్టమ్ (ఒకవిషాదం)


రచయిత వీరేశ్వర రావు మూల కలం నుండి వచ్చిన ‘ఒరు వరుట్టమ్ (ఒక విషాదం)’ మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ అద్దె ఇళ్లలో సర్దుకుపోయే మధ్యతరగతి యువత, వారిని చూడటానికి ఊరి నుండి వచ్చే తల్లిదండ్రులు పడే అవస్థలను హాస్యభరితంగా చిత్రించిన కథ. ‘హ్యాపీ నెస్ట్’ అనే అపార్ట్‌మెంట్‌లో భానుమూర్తి అనే పెద్దాయన ఎదుర్కొన్న భాషా సమస్యలు, వింత అనుభవాలు, పాతకాలపు ఆలోచనలకు ఆధునిక అపార్ట్‌మెంట్ జీవనశైలికి మధ్య జరిగిన ఘర్షణ ప్రతి పాఠకుడి పెదవులపై నవ్వులు పూయిస్తుంది.


భానుమూర్తి కొడుకు భాస్కర్ చాలామందిలా కాకుండా, అంటే హైదరాబాద్, బెంగుళూరు కాకుండా, చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇల్లు చెంగల్పట్టులో. 'HappyNest Towers' లో, '601' లో, ఉంటున్నాడు. 'రా, రా... ' అని కొడుకు గోల పెడితే భానుమూర్తి చెన్నై వచ్చాడు. మొదట్లో క్రొత్తగా ఉన్నా, రాను రాను

 'హేపీ నెస్ట్' అంటే ఆనందాల గూడు, కాస్త విషాదాల 'గోడు' గా మారింది. 


*******


భాస్కర్ తీసుకున్నది IBHK. పెళ్ళయ్యాక 2 BHK లోకి మారుదామని చూస్తున్నాడు. మొదటి రోజు భానుమూర్తి కనిపెట్టింది. ఏమిటంటే ఆ '601' కి బాల్కనీ లేదని. బట్టలు దండెం కట్టుకుని పడకగదిలోనే ఆరవేసుకోవాలని. 


ఇక్కడి నుండే 'సర్దుకుపోదాం, రండి!' మొదలు అనుకున్నాడు. సాధారణంగా వరుణుడు చెన్నై వాసులను ఎప్పుడో కాని కరుణించడు. ఆరోజు సాయంకాలం మేఘాలతో హడావిడి మెదలు పెట్టాడు. భానుమూర్తి కిటికీ తలుపు మూసి వేసాడు. రాత్రి 8 గం కి భాస్కర్ వచ్చాడు ఆఫీసునుండి. కిటికీ మూసినా ఇంకా వర్షం వస్తోందేంటి అని అనుకున్నాడు. పడక గది సీలింగ్ లీక్ అయి వర్షం పడుతోంది. ఆరాత్రి తండ్రి, కొడుకూ హాలులో పడుకున్నారు. 


'ఒరే మన పరిస్థితి చూస్తే, వరద బాధితులు స్కూల్లో తల దాచుకున్నట్టు ఉందిరా' అన్నాడు భానుమూర్తి చిరాకుగా!


' అప్పుడే సర్దుకు పోదాం రండి' సినిమా వస్తోంది టీవిలో. భాస్కర్ వేలుతో చూపించాడు టివిని తండ్రికి. 


*********


''ఇంటి అద్దె ఎంత? " అడిగాడు భానుమూర్తి మరునాడు ఉదయం. 

"పాతిక వేలు"

"అదే గుర్రం గుడ్డిదయినా, దాణాకి తక్కువలేదు. !" అన్నాడు చిరాకుగా భానుమూర్తి. 

'ఇది దొరకడమే కష్టమయ్యింది. తెలుసా?' అన్నాడు భాస్కర్ ఆఫీసు కి వెడుతూ. భానుమూర్తి ఆశ్చర్యంగా చూసాడు. 


******


భానుమూర్తి కి లిఫ్ట్ లో క్రిందకి వెళ్ళినప్పుడల్లా గుండెలు అదురుతుంటాయి. ఎందుకంటే ఫ్లైట్ లో TURBULENCE గురించి భానుమూర్తికి తెలుసు. కానీ లిఫ్ట్ లో కూడా Turbulence' ఉంటుందని తొలి సారిగా తెలుసుకున్నాడు. భయపడుతూనే గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళి, చెయ్యి చూపించి కూరలు తెచ్చుకున్నాడు. భానుమూర్తి కి తమిళం రాదుగా! పదకొండు గంటలికి ప్లంబర్ వచ్చాడు. 


'ఎన్న వేణుం? ఎన్న సొల్లరే (ఏం కావాలి, ఏం చెప్తున్నారు ) అన్నాడు. 


 'నా సమస్యలు చెబుతుంటే నీకు 'సొల్లు' కబుర్లు వలే ఉన్నాయా?' అని తెలుగులో తిట్టాడు భానుమూర్తి. 


'సొల్లు' అంటే సొల్లు కబుర్లు కావు. తమిళంలో 'సొల్లు' అంటే చెప్పు అని భాస్కర్ తండ్రికి ఫోన్ లో చెప్పి, తరువాత ప్లంబర్ తో మాట్లాడాడు.. వాడు తల ఊపి ' పురింజిదా, పురింజిదా" అన్నాడు.. 


'పురు కోస(జనపనార) కావాలంటే తెచ్చేవాడిని గా. ఇంట్లో బోలేడు చుట్టలు ఉన్నాయి.' అన్నాడు భానుమూర్తి. ప్లంబర్ భానుమూర్తి ని చూసి 'నీంగళ్ రొంబ కష్టం' అని వెళ్ళి పోయాడు. భాను మూర్తి లంచ్ చేసి గంట విశ్రాంతి తీసుకున్నాడు. 


********

సమయం: మాడు గంటలు. 


Happy Nest టవర్స్ లో ఉన్న జనాన్ని చూసి, మతి తప్పిన మర్కటం ఒకటి వచ్చి, కిచెన్ లో తన శక్తి కొలదీ నష్టం కలిగించి, వెళ్ళేటప్పుడు Ac outer unit వైరు తెంపి మరీ పోయింది. ఇప్పుడే కదా, 'అచ్చేదిన్ ' వచ్చాయి అనుకున్న. AC రిపేరా ' అని ఢీలా పడ్డాడు భానుమూర్తి. 


రాత్రి భాస్కర్ వచ్చాక విషయం చెప్పాడు. 


 'ఇది రిపేరు అవ్వదా ?' అని భానుమూర్తి, AC కంపెనీ పేరు చూసాడు. 


 `సాహాయి' అని 1980 వింటేజ్ మోడల్ పేరు ఉంది. 


 'ఇప్పుడు ఈ AC ఇప్పుడు మార్కెట్లో లేదు. ఎప్పుడో ఎలక్ట్రానిక్ మ్యాజియం లోకి వెళ్ళిపోయింది' అన్నాడు భాస్కర్. 


"ఫర్నిచర్ తో సహ ఇల్లు ఇస్తున్నాడు అంటే కళ్ళు మాసుకుని దిగిపోవడం కాదు." అన్నాడు భానుమూర్తి. 


భాస్కర్ మాట్లాడలేదు. సరే AC సంగతి చూడు' అని స్పీడు పెరగని ఫ్యాను చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు భానుమూర్తి. 


**** **


AC outerunit పాతది తీసుకు వెడుతూ, గొట్టం ఒకటి పగలుగొట్టే పోయాడు టెక్నిషియన్, గొట్టం బాగుకి, భాస్కర్ కి వెయ్యి రూపాయిలు ఖర్చు అయింది.. నాలుగు రోజుల తరవాత కొత్త AC వచ్చింది. దానిని ఇన్స్టాల్ చేసే ఆ టెక్నీషియన్ జారిపడ్డాడు. 


జారి పడ్డ వాడు కనబడకుండా పోయాడు, టవర్స్ మెయింటెనెన్స్ టీం వచ్చింది. AC ఫిట్ చేసేవాడు మూడు అంతస్థులో షేడ్ మీద పడ్డాడు అని తెలిసింది, గంటసేపు వెదికాక. 


"పడకేం చేస్తాడు? అక్కడ ఇరుకు బొక్కలో AC outer unit పెట్టారు. ఒక్క పాదం పెట్టడానికి తప్ప, అంగుళం స్థలం ఎక్కువ లేదు." అన్నాడు భానుమూర్తి కోపంగా! 


'నాన్నా, శాంతం' అన్నాడు భాస్కర్. తరువాత మూడో అంతస్థులో షేడ్ మీద పడ్డవాడికి చెయ్యి విరిగితే, చికిత్స చేయించాడు భాస్కర్. Happy Nest టవర్స్ స్పెషల్ టీం, భద్రతా బెల్ట్ లతో, పరికరాలతో, వచ్చి మొత్తానికి బాహుబలి లో రాణా విగ్రహాన్ని ఎత్తి నంత హడావిడి చేసి, కొత్త AC బిగించి వెళ్ళారు. నాలుగు రోజులు భాను మూర్తి సౌఖ్యం అనుభవించాడు. నాలుగురోజుల తర్వాత AC నుండి కూలింగ్ రాలేదు. గ్యాస్ సమస్యట. 


*********

భానుమూర్తి ఇంటికి నల్ల పని మనిషి వచ్చి, సుతారంగా చీపురును అటూఇటూ తిప్పి, గిన్నెలు తోమి నెలకు నాలుగు వేలు తీసుకు వెడ్తుంది. 


'ఎందుకురా అన్ని డబ్బులు దానికి తగలెయ్యటం, చక్కగా తెల్లవారుజామున లేచి తుడుచుకోవచ్చుగా.' అని సలహా పారేశాడు భానుమూర్తి. 


పనిమనిషి పేరు రేవది.

 

ఒక రోజు రేవది ఇల్లు తుడుస్తూ, నేల మీద పడ్డ నాలుగు ఐదువందల నోట్లు, ఎవరు చూడడం లేదనుకుని జాకెట్ లోకి దోపేసింది. ఆ దృశ్యం భానుమూర్తి కంట పడింది. ఎలా పట్టుకోవాలి? చిక్కు పరీక్ష పెట్టింది. ఏదైనా అంటే తమిళం లో రేప్ (కర్పళిప్పు) అంటుందేమో. 


ఐనా ధెర్యం చేసి 'మనీ, జాకెట్' అన్నాడు. 


వెంటనే ఇతగాడికి తమిళం రాదని, "వాంగా, ఇంద వీడు అమ్మ, అంద వీడు అమ్మ ఎల్లారు వాంగా (అందరూ రండి). ఇంగ రేప్ ముయార్చి."


అందరూ మూగారు. 


"ఒంటరి ఆడదాన్ని చేసి.." అంటూ కొంత మంది ఆడవాళ్లు చెలరేగి పోయారు. 


లక్కీగా భానుమూర్తి కీ తెలుగు తెలిసిన వాడు దొరికాడు. అతనికి తన బాధ చెప్పుకున్నాడు. 


అతను చెప్పాడు. "దాన్ని ఏమనద్దు. ఏమన్నా అన్నా, 

తనకు అనుకూలం గా మార్చుకుంటుంది." 

అని చెప్పి రేవదిని కేకలు వేసాడు. 


"రెండు వారాలు ఐయ్యింది. ఎప్పుడైనా నీతో 

 మిస్ బిహేవ్ చేసాడా? వేషాలు మాని పని చూసుకో. " 


భానుమూర్తి బతుకు జీవుడా అనుకున్నాడు. 

రేవది వెళ్ళిపోయింది. అదే రేవది జాకెట్ మనీ ఆఖరి జీతమయ్యింది. 


*********

నెల తర్వాత 


'సరే బాబూ, నువ్వు కొత్త AC ఇంజనీరుకి కబురు పెట్టి బాగు చేయించుకో! నేను రేపు కంచి వెళ్ళి, కామాక్షిని వేడుకుంటా! నాకొడుక్కి ఆంధ్రప్రదేశ్ బదిలీ అవ్వాలని..’ అన్నాడు భానుమూర్తి. 


మరుసటి వారం భానుమూర్తి కంచికామాక్షిని చూసి, సర్కార్ లో ఆంధ్రా వెళ్ళి పోయాడు. 


 సమాప్తం


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


 వీరేశ్వర రావు మూల  గారి కొన్ని ఇతర రచనలు:


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

వీరేశ్వర రావు మూల
వీరేశ్వర రావు మూల

రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 









Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page