పగిలిన కుండ
- Munipalle Vasundhara Rani

- 1 day ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #అసలునైజం, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 40
Pagilina Kunda- New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 08/03/2026
పగిలిన కుండ - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
బామ్మ చిన్ననాటి స్నేహితురాలు జానకమ్మ ఒకరోజు చాలా బాధపడుతూ ఇంటికి వచ్చింది. తన మనవరాలు అంజలి తన గురించి తానూ ఎప్పుడూ తక్కువ చేసుకుంటూ బాధపడుతోందని జానకమ్మ కన్నీరు పెట్టుకుంది. "చూడు శారదా, అంజలికి తాను అందరికంటే తక్కువ అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది. తన స్నేహితులందరూ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు, తానూ మాత్రం కొంచెం నలుపుగా ఉన్నాననో, లేదా తనకి కొంచెం నత్తి ఉందనో ఎప్పుడూ గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది" అని తన బాధను స్నేహితురాలితో పంచుకుంది.
అది విన్న బామ్మ, "జానకమ్మా, నువ్వు ఏం కంగారుపడకు, ఒకసారి అంజలిని నా దగ్గరకు తీసుకురా, నేను తనతో మాట్లాడతాను" అని ధైర్యం చెప్పింది.
మరుసటి రోజు జానకమ్మ తన మనవరాలు అంజలిని తీసుకుని వచ్చింది. బామ్మ అంజలిని చూసి చిరునవ్వుతో, "అంజలి, నాకు ఈ తోటకి నీళ్లు పెట్టడంలో కొంచెం సహాయం చేస్తావా?" అని అడిగింది. బామ్మ దగ్గర రెండు మట్టి కుండలు ఉన్నాయి. వాటిని ఒక కర్రకి అటు ఇటు కట్టి, భుజాన వేసుకుని ప్రతిరోజూ దూరంగా ఉన్న బావి నుండి తోటకి నీళ్లు తెచ్చేది.
అందులో ఒక కుండ చాలా బాగుంది, కానీ రెండో కుండకు ఒక పక్కన చిన్న పగులు ఉంది. బావి నుండి ఇంటికి వచ్చేసరికి బాగున్న కుండ నిండుగా ఉండేది, కానీ పగులు ఉన్న కుండలో నీళ్లు సగానికి పడిపోయేవి.
దారిలో నడుస్తున్నప్పుడు అంజలి ఆ పగులు ఉన్న కుండను గమనించింది.
ఇంటికి చేరాక, అంజలి బామ్మతో ఇలా అంది, "బామ్మ, ఈ కుండకు పగులు ఉంది కదా, దీని వల్ల నీళ్లు వృథా అవుతున్నాయి. మంచి కుండతో వచ్చి, కావాలంటే నువ్వే దారి పక్కన నీళ్లు పోయవచ్చు కదా? ఈ పగిలిన కుండను మోయడం ఎందుకు?" అని అడిగింది.
బామ్మ నవ్వుతూ అంజలిని పక్కన కూర్చోబెట్టుకుంది. "అంజలి, మంచి కుండతో వచ్చి నేనే నీళ్లు పోయవచ్చు, కానీ నా దృష్టి అంతా తోటకి నీళ్లు చేర్చడం మీదే ఉంటుంది. అప్పుడు ఈ దారి పక్కన ఉన్న చిన్న మొక్కలను నేను పట్టించుకోకపోవచ్చు. కానీ ఈ పగులు ఉన్న కుండ తన లోపం ద్వారానే, నేను ప్రత్యేకంగా శ్రమించక్కర్లేకుండానే ఈ మొక్కలకు ప్రాణం పోస్తోంది. ఇది కేవలం నీళ్లు వృథా చేయడం లేదు, నాకు తెలియకుండానే ఒక అందమైన పని చేస్తోంది."
"చూడు అంజలి, ఈ పగులు ఉన్న కుండ లేకపోతే ఈ దారి పక్కన ఇంత అందమైన పూలు ఉండేవి కావు. అలాగే మనలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. నీకు నత్తి ఉండటం లోపం కావచ్చు, కానీ దాని వల్ల నువ్వు తక్కువ మాట్లాడి, ఎదుటివారి బాధలను ఎక్కువ వినగలుగుతున్నావు. అది నీ ప్రత్యేకత.
మంచి కుండతో అందరూ నీళ్లు తెస్తారు, కానీ పగిలిన కుండ మాత్రమే ఇలా దారిని పూలవనం చేయగలదు. మనలో ఉన్న లోపాలను చూసి బాధపడకూడదు, వాటిని మన బలాలుగా మార్చుకున్నప్పుడే మన జీవితం ఒక అందమైన తోటలా మారుతుంది " అని బామ్మ వివరించింది.
బామ్మ మాటలు విన్న అంజలికి తన మీద తనకున్న అసహ్యం పోయింది. తన లోపాలను చూసి సిగ్గుపడటం మానేసి, తనలో ఉన్న ప్రత్యేకతలను ప్రేమించడం మొదలుపెట్టింది.
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments