top of page

పై వాడున్నాడు


'Pai Vadunnadu' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

ఒక ఊరి స్కూల్లో ఓ మాస్టారుండేవారు. ఆయన పిల్లలకు పాఠాలతోపాటు నీతికథలు చెప్పడం ఉపదేశాలు చేయడం చేస్తుండేవారు. అలా పిల్లలకు రోజుకో ఉపదేశం చేస్తుండేవారు.


ఒక రోజు ఆయన పిల్లలందరికీ ఒక్కొక్క అరటిపండు ఇఛ్చి " పిల్లలూ! మీరందరూ ఇంటికెళ్ళేక ఈ అరటిపండును ఎవరూ చూడకుండా తినాలి. రేపు వఛ్చినపుడు మీరంతా ఎవరెవరు ఎలా తిన్నది చెప్పాలి. " అన్నారు.

పిల్లలంతా " ఓ దీనికేం భాగ్యం " అన్నట్లుగా అరటిపళ్ళు తీసుకుని ఇళ్లకు వెళ్ళిపోయేరు.


మర్నాడు అందరూ స్కూలుకు వచ్ఛేక మాష్టారడిగేరు పిల్లల్ని 'అరటిపండును ఎవరెవరు ఎలా తిన్నారో చెప్పం'డని. పిల్లలు వరుసగా చెప్పడం మొదలుపెట్టేరు. ఒకడు నేను గది తలుపులు వేసేసుకుని ఎవరూ చూడకుండా తిన్నానని, మరొకడు రాత్రి అందరూ పడుకున్నాక తిన్నాననీ, ఇంకొకడు ఇంట్లో అయితే ఎవరైనా చూస్తారని బయటకు వెళ్ళిపోయి ఎవరూ లేని చోట తిన్నాననీ ఇలా ఎవరికి వారు మేము ఎవరూ చూడకుండా తిన్నామని చెప్పేరు.

అందరూ చెప్పడం అయిపోయేక మాస్టారన్నారు " మీ అందరు చెప్పిందీ అబద్ధం " అని.


"అదేంటి మాస్టారూ " అన్నారు పిల్లలంతా ఒక్కసారిగా.


అప్పుడు మాస్టారు " పిల్లలూ మీరందరూ ఎవరూ చూడకుండా తిన్నామని అనుకుంటున్నారు కదూ! కాని పై వాడున్నాడు కదా! వాడు చూడకుండా మీరు ఏదీ తినలేరు, ఏదీ చెయ్యలేరు " అన్నారు.


" పై వాడా? " పిల్లలు అడిగేరు.


" అదేనర్రా ! పై వాడు అంటే భగవంతుడు. మీరు ఎవరూ చూడకుండా అరటిపండు తిన్నామని ఎలా అనుకుంటున్నారో అలాగే చెడ్డ పనులు చేసేటప్పుడు కూడా ఎవరూ చూడడం లేదని అనుకుంటారు. కాని మంచిపని చేసినా, చెడ్డపని చేసినా పైనుండి భగవంతుడు చూస్తుంటాడు. మంచి పనైతే మనం గొప్పగా చెప్పుకుంటాం. చెడ్డ పనైతే ఎవరూ చూడకపోయినా భగవంతుడు చూస్తున్నాడని అనుకుంటే మీరు చెడ్డ పనులు చేయలేరు. తెలిసిందా? " అన్నారు మాస్టారు.


" అలాగే మాస్టారూ ! ఓ మంచి విషయం చెప్పేరు. " అన్నారు పిల్లలంతా.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం


54 views0 comments

Comments


bottom of page