top of page

రచయితలకు సన్మానం


'Rachayithalaku Sanmanam' Posted By Admin Manatelugukathalu

విషయ సూచిక

1. రచయితలకు సన్మానం మరియు బిరుదు ప్రదానం

2. ఉగాది కథల పోటీ

3. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )

4. నవ్వించండి - జోకుల పోటీలు

5. పాఠకులకు బహుమతులు

6. ప్రొఫైల్స్

7. Popular Writer 2022 Award

8 . January 2022 NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) Results

9. యు ట్యూబ్ ఛానల్


1. రచయితలకు సన్మానం మరియు బిరుదు ప్రదానం

కరోనా కారణంగా అనుకున్న సంఖ్యలో రచనలు పంపలేక పోయామని పలువురు రచయితలు తెలిపారు.

రచయితల కోరిక మేరకు గడువు తేదీ 30/06/2022 వరకు పొడిగింపబడింది.


మాకు రెగ్యులర్ గా కథలు పంపిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ, పాఠకులను అలరిస్తూ ఉన్న మా అభిమాన రచయితలను సన్మానించి, సత్కరించాలని భావిస్తున్నాము.


నిబంధనలు/ఇతర వివరాలు


*16 /10 /2021 నుండి 30/06/2022 మధ్య కాలంలో మనతెలుగుకథలు.కామ్ లో కనీసం 10 రచనలైనా ప్రచురింపబడి ఉండాలి.


*ఉగాది కథల పోటీలో బహుమతులు పొంది ఉండాలన్న నిబంధన లేదు.


*క్రింద ఇవ్వబడ్డ బిరుదుల్లో మీకు ఇష్టమైన రెండు బిరుదులను ఎంచుకోండి.


*ఒకే విభాగానికి పోటీ ఏర్పడినప్పుడు న్యాయ నిర్ణేతల అభిప్రాయం ప్రకారం ఆయా రచయితలను సంప్రదించి నిర్ణయం తీసుకొనబడుతుంది.


*ఈ బిరుదు ప్రదానం/సన్మాన కార్యక్రమం లో ఏ విధమైన నగదు బహుమతి ఇవ్వబడదు.


*రచయితలను సన్మానించి, బిరుదు బహూకరించిన సర్టిఫికెట్ ఇచ్చి, జ్ఞాపిక (మొమెంటో) ఇవ్వబడుతుంది.


*అలాగే మీ వద్ద నుండి ఏ విధమైన చందా వసూలు చేయబడదు.


*మనతెలుగు.కామ్ రచయితలను ఒకే వేదిక పైకి తీసుకొని రావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.


*ఈ క్రింది వాటిలో రెండు బిరుదులు ఎంపిక చేసుకొని, వీలు చూసుకొని story @manatelugukathalu.com కి మెయిల్ చేయండి.


1 . ఉత్తమ రచయిత 2022


2 . ఉత్తమ రచయిత్రి 2022


3 . ఉత్తమ అభ్యుదయ రచయిత 2022


4 . ఉత్తమ అభ్యుదయ రచయిత్రి 2022


5 . ఉత్తమ నవతరం రచయిత 2022


6 . ఉత్తమ నవతరం రచయిత్రి 2022


7 . ఉత్తమ ఆధునిక రచయిత 2022


8 . ఉత్తమ ఆధునిక రచయిత్రి 2022


9 . ఉత్తమ ఈ తరం రచయిత 2022


10 . ఉత్తమ ఈ తరం రచయిత్రి 2022


11 . ఉత్తమ సీనియర్ రచయిత 2022


12 . ఉత్తమ సీనియర్ రచయిత్రి 2022


13 . మెగా రైటర్ (మేల్ ) 2022


14 . మెగా రైటర్ (ఫిమేల్ ) 2022


*సన్మాన కార్యక్రమం జూలై 2022 చివరివారంలో హైదరాబాద్/నెల్లూరు లలో ఆయా రచయితలను సంప్రదించి ఏర్పాటు చేయడం జరుగుతుంది.


*కార్యక్రమం, అప్పటి కోవిడ్ నిబంధనలను అనుసరించి ఉంటుంది.


*రచయితలు ఈ కార్యక్రమం లో మార్పులు సూచించవచ్చును.

2. ఉగాది కథల పోటీ

సంక్రాంతి 2021 మరియు విజయదశమి 2021 పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విభాగం లో ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా రచయితలకు/రచయిత్రులకు గౌరవ పారితోషకం తో పాటు E - ప్రశంసా పత్రాలు అందజేశాము.

ఇప్పుడు ఉగాది 2022 కథల పోటీని ప్రకటిస్తున్నాము.

ఉగాది 2022 బహుమతుల వివరాలు :

ప్రథమ బహుమతి రూ: 5000 /-

ద్వితీయ బహుమతి రూ: 2000 /-

తృతీయ బహుమతి రూ: 1000 /-

ప్రత్యేక ప్రథమ బహుమతి రూ: 1000 /-

( కేవలం నూతన రచయితలకు)

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి. నూతన రచయితల కథలు కూడా ముందుగా మెయిన్ విభాగంలో పరిశీలింప బడతాయి. అందులో ఎంపిక కాకపోతే ప్రత్యేక ప్రథమ బహుమతికి పరిశీలింపబడతాయి.

నిబంధనలు :

*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.

*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.

*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.

*ఐదు, లేదా అంతకంటే తక్కువ కథలు ప్రచురింపబడ్డవారు నూతన రచయితలుగా పరిగణింపబడతారు..

*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.

*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.

*వెంటనే మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.

*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.

*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 20 /03 /2022

*ఫలితాలు 03 /04 /2022 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.

*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.

*మనతెలుగుకథలు.కామ్ యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.

3. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )

రచయితల, పాఠకుల ఆదరణ పొంది, ఇతరులకు ఇన్స్పిరేషన్ కలిగించిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 30/04 /2022 వరకు పొడిగించాలని నిర్ణయించాము.

4. నవ్వించండి - జోకుల పోటీలు

మనతెలుగుకథలు.కామ్ లో 'జోకులు' విభాగాన్ని ప్రారంభించాము.

ప్రతినెలా పది లేక అంతకంటే ఎక్కువ జోకులు ప్రచురింప బడ్డ వారి నుండి ( ఒక్కసారిగా గానీ, విడి విడిగా గానీ ) ముగ్గురు విజేతలను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి 116 /- బహుకరిస్తాము.

20 /03 /2022 నాటికి ఎక్కువ జోకులు ప్రచురింప బడ్డవారికి 1116 /- బహూకరిస్తాము.

జోక్స్ ప్రచురించినట్లుగా ఇంటిమేషన్ ఇవ్వడం సాధ్యం కాదు.

మీ జోకుల్ని https://www.manatelugukathalu.com/post/jokes-1-telugu-jokes విసిట్ చేసి ప్రచురింపబడ్డదీ, లేనిదీ తెలుసుకోవచ్చు.

ఈ విషయంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపబడవు.

సాధారణంగా జోక్స్ ని మూడు రోజుల్లోగా ప్రచురిస్తాము.

అన్ని జోక్స్ నూ ఒకే పోస్ట్ లో అప్డేట్ చెయ్యడం జరుగుతుంది.

5. పాఠకులకు బహుమతులు

మనతెలుగుకథలు.కామ్ ని రెగ్యులర్ గా విసిట్ చేస్తున్న పాఠకులకు బహుమతులు అందించాలని నిర్ణయించుకున్నాము.

ప్రతి నెల 5 లేదా అంతకంటే ఎక్కువ కథల పైన సమీక్షలు రాసిన వారినుండి ముగ్గురు విజేతలను ఎంపిక చేసి వారికి Rs 116 /- పారితోషకంగా అందించబడుతుంది.

20 /03 /2022 నాటికి ఎక్కువ సమీక్షలు ప్రచురింప బడ్డవారికి 1116 /- బహూకరిస్తాము.

కేవలం బహుమతుల కోసం పంపే సమీక్షలు పరిగణింప బడవు.

6. ప్రొఫైల్స్

మనతెలుగుకథలు.కామ్ లో ఇప్పడు పాఠకులు, రచయితలు లాగ్ ఇన్ అయి తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇతర రచయితలను ఫాలో చెయ్యడం, కథలకు కామెంట్స్ చెయ్యడం సులభంగా చెయ్యవచ్చు.

7. Popular Writer 2022 Award

ప్రారంభించిన నాటి నుండి పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్న మనతెలుగుకథలు.కామ్ వారు ఇప్పుడు పాపులర్ రచయిత/రచయిత్రి 2022 అవార్డు అందిస్తున్నారు.

ఈ అవార్డు పూర్తిగా పాఠకుల ఆదరణను బట్టి ఉంటుంది.

15/10/2021 తో మా విజయదశమి కథల పోటీ ముగిసింది.

కాబట్టి 16 /10 /2021 నుండి 15 /09 /2022 వరకు ప్రచురింప బడే కథలనుండి ఈ అవార్డు ఎంపిక చెయ్యబడుతుంది.

ఈ అవార్డును ఒక రచయిత/రచయిత్రి మొత్తం రచనలను పరిగణించి ప్రకటించడం జరుగుతుంది.

1. మనతెలుగుకథలు.కామ్ వెబ్ సైట్ www.manatelugukathalu.com

2. మనతెలుగుకథలు.కామ్ పోడ్ కాస్ట్ https://linktr.ee/manatelugukathalu

3. మనతెలుగుకథలు.కామ్ యూ ట్యూబ్ ఛానల్ https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఈ మూడింటిలో కలిపి, రచయిత/రచయిత్రుల మొత్తం రచనలకు కలిపి పాఠకుల జనాదరణ ఎంత వుందో పరిగణించి అవార్డు ను బహుకరించడం జరుగుతుంది.

పాఠకుల జనాదరణ శాస్త్రీయ పద్ధతిలో పరిశీలింప బడుతుంది

పాఠకులు కథను కేవలం క్లిక్ చెయ్యడం కాకుండా, చదవడానికి ఎంత సమయం కేటాయించారు, కొత్తగా ఎంతమంది సబ్స్క్రయిబ్ చేశారు అనే విషయాలు పరిగణిస్తాము.

మా ప్రియమైన రచయితలు/రచయిత్రులు వ్యూస్ పెంచడం కోసం అశాస్త్రీయ పద్ధతులు వాడరని ఆశిస్తున్నాము.

అవార్డు విజేతకు 1౦౦౦౦/-బహుమతి ఉంటుంది.
5 కన్సోలేషన్ బహుమతులు ఒక్కొక్కటి 5౦౦/- ఇవ్వబడతాయి.

ఈ అవార్డు కోసం విడిగా రచనలు పంపవలసిన అవసరం లేదు.

16/10/2021 నుండి ప్రచురింప బడే కథలన్నీ ఈ అవార్డు కు పరిశీలింప బడతాయి.

ఈ అవార్డు కు ఇతర బహుమతులతో సంబంధం లేదు.

రచయిత/రచయిత్రులు ఇదివరకే ప్రకటించిన ఉగాది బహుమతులు, వారం వారం బహుమతులు, భవిష్యత్తులో ప్రకటించబోయే బహుమతులు ఎప్పటిలాగే గెలుచుకోవచ్చు.

మాకువచ్చిన అన్ని కథలనూ పోడ్కాస్ట్ చెయ్యడం/యూట్యూబ్ లో ఉంచడం చేయలేము.

రచయితలు/రచయిత్రులు తమ కథలను పంపేటప్పుడు కథ, వింటే కూడా అర్ధమయ్యే విధంగా రాయవలసిందిగా కోరుతున్నాము.

8 . January 2022 NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) Results

వారానికి ఒక కథనే ఎంపిక చేయాలనుకున్నా మంచికథలు ఎక్కువ రావడంతో మరిన్ని కథలు బహుమతికి ఎంపిక చేసాము.

02/01/2022 తాత చెప్పిన కథ జీడిగుంట శ్రీనివాసరావు

09/01/2022 సారీ! ఫ్రెండ్.... నందిరాజు పద్మలతా జయరాం

09/01/2022 తిండీ - తిప్పలు దాసు రాధిక

16/01/2022 కామ్రేడ్ కిరణ్ జమ్మలమడక

23/01/2022 ఆమె విజేత A. అన్నపూర్ణ

23/01/2022 ధైర్యవంతుడు N. ధనలక్ష్మి

23/01/2022 మొబైల్ ఆటవస్తువు గాదే అల్లు సాయిరాం

30/01/2022 ఈ అవార్డు నాది కాదు M R V సత్యనారాయణ మూర్తి

30/01/2022 అమ్మ అంబ ఐతే అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

30/01/2022 మదన్ మథనం తీరిన వేళ పెండేకంటి లావణ్య కుమారి


జోక్స్ పోటీ విజేతలు:


డిసెంబర్ నెల విజేత: పతి మురళీధర శర్మ

జనవరి నెల విజేత : ఓట్ర ప్రకాష్ రావు


చక్కటి రచనలుపంపిన రచయితలకు, ఆదరించిన పాఠకులకు మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము.

మీ ఆదరణ మరింత పొందేలా వెబ్ సైట్ ను తీర్చి దిద్దుతామని తెలియజేస్తున్నాము.9. యు ట్యూబ్ ఛానల్

మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించబడిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

అందుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ ఇస్తున్నాము.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఈ లింక్ ను మీ మిత్రులకు, అభిమానులకు షేర్ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యమని కోరండి.

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ధన్యవాదాలు.


167 views0 comments

Comments


bottom of page