top of page

అత్తమ్మ ప్రేమ విలువ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Atthamma Prema Viluva' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

" స్వార్థం లేకుండా ఆప్యాయతని, స్వచ్ఛమైన అమ్మ ప్రేమను పంచే అత్త మనసును కోడలు అర్థం చేసుకుంటుందా?????"..

యువ రచయిత్రి ధనలక్ష్మి గారి అత్తమ్మ ప్రేమ విలువ కథలో తెలుసుకోండి.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం


@@@@@@@@@@@@@@@@@@@@

“సుశీలా! కాస్త మంచి నీళ్లు ఇవ్వు....”


“అమ్మా! ఒక సారి బయటకు రావా.... నీ కోసం కంటి అద్దాలు తెచ్చాను. పెట్టుకొని ఒక్క సారి చూసి చెప్పు సరిపోతాయో లేదో…” అని మాట్లాడుతూనే ఉన్నాడు ఆనంద్.


“ఇదిగోండి మంచి నీళ్లు. అలాగే మీకు ఇష్టం అని పకోడీ చేశాను. ఎలా ఉన్నాయో చెప్పండి.”

అంది అతని భార్య సుశీల


మంచి నీళ్లు తాగి, “తింటాను సరే కానీ అమ్మ ఏమి చేస్తూంది? అసలు ఎంత సేపు నుంచి పిలుస్తున్నా రావడం లేదు. ఏంటి.. ఏమైనా ఆరోగ్యం బాగా లేదా?”


సుశీల కంగారు పడుతూ “నేను మన వికాస్ స్కూల్ దగ్గరకి వెళ్లి వచ్చాను. మీ అమ్మగారు నిద్ర పోతున్నారేమో.. అని నేను పకోడీ తయారు చేసే పనిలో ఉండిపోయా. అయినా ఈ మధ్య మీ అమ్మ గారు నా మాట ఏమి వింటున్నారు కనుక.. మీ అమ్మను ఏమైనా అంటే మీరు నా మీదకి గొడవకి వస్తారు"


"మీ అమ్మ గారు ఏంటి? హా.. అత్తమ్మ అనలేవా? అయినా ఏమైంది.. ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నావు..చీటికీ మాటికీ విసుక్కుంటున్నావు… నేను లేనప్పుడు అమ్మను ఏమన్నా అన్నావా?"


"నేను విసిగిపోయానండీ! మన పెళ్లి అయి 15 ఏళ్లు అయింది. అప్పటి నుంచి ఇంటికి సంబంధించిన అన్ని విషయాలూ ఆమే చూసుకుంటారు. ఏంకావాలన్నా, తీసుకోవాలన్నా సవాలక్ష ప్రశ్నలు? మీరూ ఉన్నారు! జీతం రాగానే నేరుగా ఆవిడకే ఇస్తారు. మాటవరసకు ఒక్క సారి అయిన నా చేతికి ఇవ్వరు."


" మన వికాస్ అయితే నేను అనే దానిని ఇంట్లో ఉన్నాను అని వాడికి తెలీదు . ఎప్పుడు చూడు నాన్నమ్మ అంటు ఆవిడే వెనకాలే ఉంటాడు..స్కూలో ఏమి గిఫ్ట్ వచ్చిన మొదట తీసుకువెళ్ళి ఆమెకి చూపిస్తాడు..నాకంటూ ఏమి గుర్తింపు లేదు ఈ ఇంట్లో. ఇప్పుడు కూడా మీరు నన్ను పట్టించుకోవడం మానేసి ఆవిడ గురించే ఆరాలు తీరుస్తున్నారు..??” అని ఏడుస్తూ తన రూంకి వెళ్ళిపోతుంది.


ఆనంద్ కచ్చితంగా అమ్మకు, సుశీలకు మధ్య ఎదో జరిగింది అని మనసులో బాధపడుతుంటాడు.. అసలు అమ్మ ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని తన ఫ్రెండ్స్ దగ్గరకి ఏమైనా వెళ్లి ఉంటుంది ఏమో అనుకొని ఫోన్ చేశాడు .వాళ్ళు కూడా రాలేదు అనే చెప్పారు…


ఇలా కాదు అని తనే వెళ్లి వాళ్ళమ్మ రెగ్యులర్ గ వెళ్ళే ప్రతి చోటికి వెళ్లి వెతికి విసిగిపోయి రాత్రి ఎప్పటికో చేరుకున్నాడు..


వికాస్, వాళ్ళ నాన్న రాగనే కిచెన్ లోకి వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు...? “నాన్నమ్మ చెప్పింది నాన్న! బయటనుండి రాగనే వాటర్ ఇవ్వాలని” అన్నాడు.


వికాస్ ని గట్టిగ హత్తుకొని ఏడుస్తాడు ఆనంద్ .

“నాన్నమ్మ దొరికిందా నాన్న????”


“ లేదురా” అని బాధ పడుతుంటాడు.

సుశీల కి చాలా బాధ వేస్తుంది, తన భర్తను చూసి. కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోతుంది ??

పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయిన ఏమి ప్రయోజనం లేకుండా పోయింది

.

ఒక వారం రోజులు ఆ ఇంట్లో నిశబ్దం. ఎదో ఇంట్లో ఉండాలి కాబట్టి ఉంటున్నాడు. ఇంట్లో ఏమి తినడం లేదు ఆనంద్.


ఇంక ఉండబట్టలేక సుశీల " ఇంట్లో ఎవరూ చచ్చిపోయారు అని ఇలా ఉంటున్నారు? అసలు నాతో మాట్లాడి వారం రోజులు అయింది..నేను ఇలా ఉండలేకపోతున్నాను ..."అంది


" నేను నీతో మాట్లాడడం లేదు అని నువ్వు ఎలా బాధపడుతున్నవో అంతకన్నా రెట్టింపుగా నేను

బాధపడతున్న.. అమ్మ గురించి ?

నేను నిన్ను కొట్టలేను, అలా అని వదిలిపెట్టి వెళ్ళలేను. ఎందుకంటే అమ్మ చెప్పింది.. ‘ఎటువంటి పరిస్థితిలో కూడా నీ భార్యను కొట్టడం కానీ, తిట్టడం కానీ, వదిలిపెట్టి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోకు నువ్వు తప్ప తనకి ఎవరు ఉన్నారు అసలు ఈ లోకంలో.’ అని.


బహుశా నువ్వు మర్చిపోయినట్లు ఉన్నావు. నాకు నా మరదలితో వివాహం చేయాలి అని అనుకున్నారు .నేను, నిన్ను ప్రేమించిన విషయం తెలిసి తన అన్నతో ఉన్న అనుబంధాన్ని కూడా తెంచుకొని మరి మన వివాహం చేసింది అమ్మ.


నీకు అమ్మ ,నాన్న లేరు అని తెలిసిన , కట్నకానుకలు ఏమి తీసుకురాకపోయిన కోడలిగా నిన్ను ఒప్పుకున్నారు. చివరికి నీకు సీమంతం దగ్గర నుంచి ఇప్పటి వికాస్ పెంపకం వరకు ఎన్నో రకాలుగా చేదోడు వాదొడుగా ఉన్నారు నీకు.

మొన్న ఏమి అన్నావు? జీతం మొత్తం అమ్మకు ఇస్తున్న అని కదా. ఒకటి చెప్పు. ఇంట్లో ఏమి సరకులు కావాలి అన్న, ఇంటి ఖర్చులు అన్నీ ఎవరు మెయింటెన్ చేస్తున్నారు..?


ఏమి సైలంట్ అయ్యావు..నువ్వే కదా చూసుకునేది.. అమ్మ నీకే కదా డబ్బు అప్పచెప్పుతుంది.

కొడుకుగా నా బాధ్యతగా అమ్మకు ఇస్తాను. అది అమ్మకు నేను ఇచ్చే గౌరవం. ఇంకా ఏమి అన్నావు.. ఎక్కడికి వెళ్ళాలి అన్న చెప్పేసి వెళ్ళాలి అని కదు!


ఏమి సుశీల ! నేను చెప్పకుండా ఎక్కడికి అయిన వెళ్ళితే చెప్పి వెళ్ళవచ్చు కదండీ అని అడుగుతావు కదా . అలా అడగడంలో నీ ప్రేమ ఉంది. అదే కదా అమ్మ చేసింది.. ఏదైనా సరే మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. వికాస్ ఎప్పుడు తన వెంటే ఉంటాడు అని బాధ పడుతూ ఉన్నావు కదా. వాడు పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని తనే చూసుకొంది. నీకు యాక్సిడెంట్ అయి మూడు నెలలు బెడ్ పైన ఉంటే నిన్ను, పసి కందు అయిన వికాస్ ని తనే చూసుకొంది. వాడికి అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ.

అయినా ఇలాంటివి అన్నీ నీకు ఎందుకు చెప్పుతున్నా.. ఇలాంటివి నీకు అర్థం కావు కదా..” అని చెప్పి తన వైపు కోపంగా చూస్తూ బయటకి వెళ్ళిపోయాడు..


సుశీల పశ్చాత్తాపంతో అలాగే సోఫాలో కూర్చొని తను అత్తయ్యతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంది..


" చూడండి మీరు ఉండడం వల్ల నాకు నా ఇంట్లో విలువ లేకుండా పోతుంది . ఇంకా ఈ ఇంట్లో నేను ఉండలేను. ఉంటే మీరేనా ఉండాలి లేదా నేను అయినా ఉండాలి. మీకు మీ అబ్బాయీ పైన ప్రేమ ఉన్నది నిజమే అయితే ఈ ఇంట్లో నుంచి మీరు వెళ్లిపోవాలి...."


“ఇంట్లో ఎవరూ అయిన ఉన్నారా” అన్న పిలుపుతో ఈ లోకం లోకి వచ్చింది.

“హా చెప్పండి ఎవరు కావాలి..”


“అమెజాన్ నుండి మీరు ఆర్డర్ చేసిన న్యూ మొబైల్ మామ్. అమౌంట్ కూడా పే చేసేశారు

రామలక్ష్మి గారు కట్టేశారు..మామ్ ఇక్కడ సైన్ చేయండి..” అంటూ ఒక వ్యక్తి మొబైల్ డెలివరీ ఇచ్చాడు


ఫోన్ తీసుకొన్న తనకు గతం ఙ్ఞప్తికి వచ్చింది..


ఏమి మొబైల్ ఏంటో ?? న్యూ అప్ ఏవీ యూస్ చేసేది

లేదు అని విసుక్కుంది ఓ రోజు..


“ఇంత డబ్బు పెట్టీ నాకు ఫోన్ కొన్నారు అంటే పెన్షన్ డబ్బు.. అయ్యో అత్తయ్య పెన్షన్ డబ్బు పెట్టీ మరి కొన్నారా ఫోన్ నా కోసం.అమ్మ లాంటి అత్తమ్మ ను నా చేతులారా నేనే దూరం చేసుకున్న కదా ?” అని తల బాదుకుంటూ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది.


అప్పుడే బయట నుంచి వచ్చిన ఆనంద్ తన భార్య అలా బాధ పడడం చూడలేక అక్కున చేర్చుకుంటాడు.


“నన్ను క్షమించండి. అత్తయ్య మనసును కష్ట పెట్టాను. మీరు కొద్దీ రోజులు సెలవు పెట్టండి. మనం వెళ్లి అత్తయ్య ఎక్కడ ఉన్నారో వెతుక్కొని మన ఇంటికి తెచ్చుకుందాం.”


“నేను కూడా లీవ్ పెట్టేసి వచ్చాను నువ్వు అన్నట్టే చేద్దాము. అవును మన వికాస్ ఎక్కడ.??”


“అవును అండి నేను మన గొడవల్లో పడి వాడిని మర్చిపోయా.రేయ్ వికాస్…” అంటు ఇళ్లంతా వెతికారు వాడి ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి వెళ్లి కనుక్కొని వచ్చారు. ఏమి అయిపోయాడో అర్థం కాక వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటే “అమ్మా” అంటు వికాస్ వచ్చాడు..

“ఏమి అయిపోయావు రా!!!” అంటూ సుశీల వికాస్ ని హత్తుకొని తనివితీరా ఏడుస్తుంది.


" ఎందుకు అమ్మా నువ్వు ఏడుస్తున్నావు. నేను కొద్దిసేపు కనపడకపోతే ఏమి అయింది . నువ్వు అంతలా బాధపడుతున్నావ్..”

“అదేంటి వికాస్ అలా అంటావు .తల్లికి బిడ్డ దూరం అయితే బాధ ఉండదా ఏంటి!!!”


“నేను కొద్దీ సేపు కనపడకపోతే నువ్వు తట్టుకోలేక పోతున్నావు .. మరీ నాన్నమ్మ నుండి నాన్నను ఎలా దూరం చేశావు. అప్పుడు గుర్తుకు రాలేదా ఏంటి?”


సుశీలకి లాగిపెట్టి కొట్టినట్టు అనిపించింది..

“నిజమే వికాస్ చాలా దారుణంగా ప్రవర్తించాను.

అత్తయ్య కనపడితే తన కాళ్ళని నా కన్నీళ్లతో కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటా. ఆవిడను బాగా చూసుకుంటా…”


“అయితే చేయి మరి” అంటు వికాస్ వాళ్ళ నానమ్మని పిలుస్తాడు..


రామలక్ష్మి గారు రాగానే సుశీల, ఆవిడ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది..


“ బిడ్డ కోపంలో అంటే ఎవరికి అయిన బాధ పడతారా. నువ్వు నా బిడ్డవి రా” అంటూ సుశీలను ప్రేమగా గుండెలకు హత్తుకుంటారు..


ఆనంద్ కూడా వాళ్ల అమ్మను హత్తుకొని తనవితీర ఏడ్చాడు..


“ఇంతకీ ఎక్కడ ఉన్నావు అమ్మా? . అయినా వికాస్.. నీకు ఎలా తెలుసు???”


“నాన్నమ్మ ఒక రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చదువుతూ ఓ మాట అన్నారు..." నేను కూడా ఈ ఆశ్రమానికి వెళ్లి కొద్దీ రోజులు ఉండాలి అని .. ఎందుకంటే ఆ ఆశ్రమం చుట్టూ ప్రకృతి, వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగ ఉంటుంది. పైగా మనకు నచ్చిన పని చేసే అవకాశం ఉంటుంది అని..

నాన్నమ్మ కనపడకపోతే ఒక వేళ అక్కడికీ వెళ్లి ఉంటారు ఏమో అని అనుమానం వచ్చి పక్కింటి అన్న సహాయంతో వెళ్లి తీసుకొని వచ్చాను ..

నీకు తెలుసా అమ్మ! అక్కడా కూడా మన గురించే ఆలోచించి మన కోసం పర్సులు తయారు చేశారు..” చెప్పాడు వికాస్

“అత్తమ్మ! నన్ను క్షమించండి...ఇక నుంచి మీరు నాకు అమ్మ ..మీ విలువ,మీ గొప్పతనం తెలిసి వచ్చింది. అమ్మ ప్రేమను మించింది ఏది ఈ లోకం లేదు అని తెలిసొచ్చింది నాకు. మీ ప్రేమ అనంతం, అజరామరం. “ అని సుశీల ప్రేమగా రామలక్ష్మి గారిని హత్తుకున్నారు. వాళ్ళిద్దరినీ చూసిన ఆనంద్ మనసు ఆనందంతో నిండిపోయింది...

ఆనంద్ వికాస్ ని హత్తుకొని “వెల్ డన్ కన్నా” అన్నాడు.

“నాన్నా! అయితే నాకు ఐస్ క్రీమ్స్ చాలా చాలా కావాలి.. అండ్ పెద్ద డైరీ మిల్క్ కావాలి. తీసి ఇస్తారా.”


“ హా తప్పకుండా రా కన్న.. నీకు ఎన్ని కావాలి.. అన్నీతీసి ఇస్తా .”


“రేయ్ వికాస్ ! అన్ని తిన్నకు రా పళ్ళు పుచ్చిపోతాయి అని, నేను కూడా అసలు అనను. నీకు ఎన్ని కావాలి అంటే అన్ని తిను రా...నీవల్లే నాకు అత్తమ్మ ప్రేమ విలువ తెలిసింది..”


“నాన్నా! ఈ హ్యాపీ మూమెంట్స్ లో ఓ సెల్ఫీ.. తీసుకుందామా.”


“ హా ఒకే రా” అంటూ ఫ్యామిలీ మొత్తం సేల్ఫీ తీసుకున్నారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.




211 views0 comments

Commentaires


bottom of page