జీవితంలో వెలుగులు నింపిన రాత్రి
- Dhanalakshmi N
- Mar 7, 2022
- 6 min read
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Jivithamlo Velugulu Nimpina Rathri' written by N. Dhanalakshmi
రచన : N. ధనలక్ష్మి
అవును నేను చనిపోవాలి… నేను చనిపోతేనే నా ఫ్యామిలి బాగా ఉంటుంది : వరుణ్
నేను బ్రతకకూడదు. నేను బ్రతికి అవమానాలు ఎదుర్కోలేను. నాకు చావే శరణ్యం : కళ్యాణ్
ఇలా వాళ్ళు ఇద్దరూ ఆలోచనలతో ఆ రాత్రంతా జాగారం చేసారు.. అసలు ఏంటి వాళ్ళ కథ..? వాళ్ళు చనిపోయారా!??? లేదా!????
యువ రచయిత్రి ధనలక్ష్మి గారి కథలో తెలుసుకోండి
ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఇక కథ ప్రారంభిద్దాం
@@@@@@@@@@@@@@@@@#
వరుణ్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. . లక్షల్లో జీతం. . . జాబ్ వచ్చిన వెంటనే స్వాతిని మ్యారేజ్ చేసుకున్నాడు. . వారికి ఒక పాప. పేరు చతుర. . మూడవ తరగతి చదువుతుంది. .
కరోనా వల్ల చాలా మందిని జాబ్ నుంచి తీసివేశారు. ఆలా వరుణ్ కు జాబ్ పోయింది. దాచుకున్న సేవింగ్స్ కూడా ఖర్చు అయిపోయాయి … జాబ్ కోసం చాలానే ట్రై చేసాడు కానీ ఎక్కడా తనకు దొరకలేదు. . .
‘ఈ సొసైటీ లో గౌరవంగా బ్రతకాలి. లేదంటే నన్ను అందరూ చులకనగా చూస్తారు. జాబ్ ఉంది కదా అని కార్ ను కూడా కొన్నాను. EMI కట్టాలి. కారు తీసుకొని వెళ్ళిపోతే నేను సొసైటీ లో ఎలా తిరగగలను?’ అని సూసైడ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు.
.
ఒక సూసైడ్ లెటర్ కూడా రాసుకున్నాడు. ఒక ఎతైన బిల్డింగ్ కి ఎక్కి దూకి చావాలి అనుకున్నాడు కానీ దైర్యం సరిపోలేదు.
ఇలా ఒక వేళ నేను సూసైడ్ చేసుకొని చనిపోతే ఇన్సూరెన్సు డబ్బులు కూడా రావు. నా చావు రోడ్ ప్రమాదంలో జరిగినట్టు జరగాలి అని ఒక పథకం ఆలోచించి ఇంటికి వెళ్ళాడు..
స్వాతి , చతుర ఆడుకుంటున్నారు. . రేపటి నుంచి నేను మీతో ఉండను కదా.. మీతో పాటు ఈ రోజంతా సంతోషంగా గడపాలి అని , తాను రాసిన లెటర్ ని తన భార్యకి కనపడకుండా లాకర్ లో పెట్టి వాళ్ళతో మాటలు కలిపాడు.
స్వాతి వచ్చి “ఏవండీ! మనం బయటకు వెళ్లి చాలా రోజులు అయింది కదా.. అలా సరదాగా పార్క్ కు వెళ్ళి వద్దాము” అని పిలుచుకొని వెళ్ళింది. అక్కడ వాళ్ళ పాప చతుర స్లయిడర్ ని ఎక్కి కింద పడుతుంది అని పట్టుకోవడానికి వెళ్ళితే,
స్వాతి "వరుణ్.. అలాగే చూడండి. మన పాప ఏమీ చేస్తుందో” అని చెపుతుంది. చతుర స్లయిడర్ ఎక్కి ఎన్ని సార్లు కింద పడినా సరే, పైకి లేచి లాస్ట్ కి స్లయిడర్ ఎక్కింది. వరుణ్ అది ఎందుకో చాలా నచ్చి, పాపను దగ్గరకి తీసుకొని కిస్ చేసి, హాగ్ చేసుకుంటాడు. .
తరువాత ఇంటికి వెళ్లిన తర్వాత స్వాతి “ఏవండీ! సూర్య మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’ బాగా ఉందట. నా ఫ్రెండ్ చెప్పింది. మనం చూద్దాం” అని టి. వీ లో మూవీని ప్లే చేస్తుంది. .
మూవీ చూసి చాలా ఎమోషనల్ అవుతారు.
తరువాత డిన్నర్ చేసిన స్వాతి వచ్చి “ ప్లాన్ చెప్పండి వరుణ్! ఎలా చనిపోవాలనుకుంటున్నారో.. అలాగే మా ఇద్దరికి కలిపి ఒక విషం బాటిల్ తెచ్చి ఇవ్వండి.. ఇదే మీరు మాకు ఇచ్చే కానుక.. సారీ! చివరి కానుక” అంటుంది…
వరుణ్ షాక్ అవుతాడు. ‘తనకి ఎలా తెలుసు’ అని.
తాను సూసైడ్ లెటర్ చూపిస్తుంది. . వరుణ్ తల దించుకుంటాడు. .
“ఒక వేళ మీరు చనిపోతే నా పరిస్థితి, పాప భవిష్యత్ ఏమి కావాలి! ఆలోచించారా ?”
“అది కాదు స్వాతి! నేను చనిపోతేనే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఆ వచ్చే డబ్బుతో మీరిద్దరూ చాలా హ్యాపీగా, గౌరవంగా ఉండగలరు” అన్నాడు వరుణ్.
“మీరే లేకపోతే మేము ఎలా హ్యాపీగా ఉంటాము అనుకున్నారు!?? మార్నింగ్ పార్క్ లో మీరు చూసారా కదా.. చతుర ఎలా స్లైడర్ని పట్టుదలగా ఎక్కిందో , అంత ఎందుకు? ఇప్పుడు మనం చూసాం కదా సూర్య మూవీ అది రియల్ స్టోరీ. .
ఎయిర్ డెక్కన్ కెప్టెన్ గోపీనాథం గారి నిజ జీవతగాధ. . . ఆ మూవీ లో మీరే చూసారు కదా.. ఎలా ఎన్ని కష్టాలు వచ్చిన కూడా పట్టుదలగా తన అనుకున్న గమ్యాన్ని చేరాడో..
అలాగే. . మన లైఫ్ కూడా అంతే అండీ! ప్రాబ్లమ్స్ వస్తూ పోతుంటాయి.. ఎన్ని సార్లు మనం కింద పడ్డా పైకి లేవాలండి.. చూడండీ! మీకు జాబ్ దొరికే వరకు నేను జాబ్ చేస్తాను. మన అపార్ట్మెంట్స్ లో ఉన్న పిల్లలకి ట్యూషన్స్ చెప్పాలి అన్నారు. సో నేను ఆ జాబ్ చేస్తాను. ఎంత లేదన్నా నెలకు 8000 రూపాయలు వస్తాయి. . అలాగే నేను చేసే క్రాఫ్ట్ ఆన్లైన్ లో సేల్ చేస్తే ఇంకో కొంచెం అమౌంట్ వస్తుంది” ఆత్మ విశ్వాసంతో చెప్పింది స్వాతి
“సరే అలాగే చేద్దాము!” అన్నాడు వరుణ్.
అనుకున్న విధంగానే స్వాతి ట్యూషన్ చెప్పడం , క్రాఫ్టుని ఆన్లైన్ లో సేల్ చేయడం స్టార్ట్ చేసింది. . ఒక రోజు స్వాతి క్రాఫ్ట్ చేస్తుంటే వరుణ్ వచ్చి తనని ఎత్తుకొని సంతోషంగా తిప్పాడు.
స్వాతిని గట్టిగ హాగ్ చేసుకొని “నాకు ఇంతక ముందు నేను చేసే జాబ్ కన్నా మంచి జాబ్ దొరికింది. శాలరీ కూడా ఎక్కువ. నా ఎక్స్పీరియన్స్ చూసి నాకు టూ ఇయర్స్ లో యూ. ఎస్ వెళ్లే అవకాశం కూడా ఉంది. . ఇదంతా నీ వల్లే బంగారం” అని తనకి స్వీట్స్ తినిపిస్తాడు.
“మరి నాకు డాడీ..” అంటూ చతుర వస్తే తనకి కూడా స్వీట్ తినిపిస్తారు.
“చూసారా అండీ! క్షణం లో మారిపోయే లైఫ్ అండీ.. ఉరికే వచ్చే చిన్న సమస్యలకి ఎందుకు అండీ చచ్చిపోవడం” అని ఏడుస్తుంది స్వాతి.
వరుణ్ “ సారీ బంగారం! ఇంకో సారి ఇలా చేయను!” అని ప్రామిస్ చేస్తాడు.
“స్వాతీ! నీకు ఇష్టం అయితే నువ్వు అనుకున్న మాదిరి ట్యూషన్స్ , క్రాఫ్ట్స్ కంటిన్యూ చేసుకో” అని చెపుతాడు. అలా వరుణ్ లైఫ్ సెట్ అయింది…
########################₹
ఇంక కళ్యాణ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. . ఎప్పుడూ వీకెండ్స్ , ట్రిప్స్ , సినిమాలు ఇలా సరదాగ సాగిపోయే జీవితం. . వాళ్ళ అమ్మానాన్న కు ఒక్కడే కొడుకు ఎలాంటి కష్టాలు లేవు. . . ఆఫీస్ లో కొత్తగా వచ్చిన హాసినిని చూసీ చూడగానే నచ్చి ఇష్టపడ్డాడు.. మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనుకున్నారు ఇద్దరూ.
హాసిని కొద్ది రోజులు తాను వాళ్ళ ఊరికి వెళ్లి వస్తాను అని వెళ్ళింది. . తరువాత నుంచి కళ్యాణ్ ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. . ఫోన్ నెంబర్ మార్చేసింది , అన్ని సోషల్ మీడియా లో తనని బ్లాక్ చేసింది. . తరువాత తాను ఇలా ఎలా ఎందుకు చేసిందో తెలుసుకుందాం అని వాళ్ళ ఊరికి వెళ్లి తనని కలవడానికి ఇంటికి వెళ్ళాడు. .
ఆ రోజు హాసిని ఒకటే ఇంట్లో ఉంది.
ఎందుకు తనని అవాయిడ్ చేస్తుంది అని గట్టిగ అడిగాడు.
" చూడు కళ్యాణ్! బీ ప్రాక్టికల్. నాకు నా బావ తో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఈ సండే నే మ్యారేజ్.
వాటి ఆరెంజ్మెంట్స్ చేయడానికి అమ్మ నాన్న బయటకి వెళ్ళారు. . నేను ఆల్రెడీ మా బావ కు చెప్పాను నా లవ్ అఫైర్స్ గురించి. తాను ఇవన్నీ కామన్ అని లైట్ తీసుకున్నాడు. . నేను ఇంక ఇండియా కి కూడా రాను. అమెరికా లోనే సెటిల్ అవుతున్నా” అని చెప్పి కళ్యాణ్ తో రాష్ గా మాట్లాడి తనని బయటకు పంపివేస్తుంది.
కళ్యాణ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది.
‘అంటే హాసిని నన్ను మోసం చేసిందా!’ బాధపడతాడు.
‘ఇప్పుడు నేను ఆఫీస్ కి ఎలా వెళ్ళగలను? అందరూ నన్ను కామెంట్స్ చేస్తారు. నేను చనిపోతేనే బెస్ట్. అప్పుడే నా వేల్యూ హాసినికి తెలుస్తుంది..’
ఇలా అలోచించి బస్టాండ్ కి వెళ్తాడు. తాను వెళ్ళవలిసిన బస్సు వెళ్ళి పోయి ఉంటుంది.
కళ్యాణ్ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని" నా దరిద్రం! అటు అమ్మాయి, ఇటు నేను వెళ్ళవలసిన బస్సు కూడా మిస్ అని తిట్టుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక గుంపు ఉంటారు. అక్కడికి వెళ్తాడు కళ్యాణ్.
అక్కడ ఒక అతను మైక్ తీసుకొని "అయ్యా! నా పేరు బాలు. ఒక ఆక్సిడెంట్ లో రెండు కాళ్ళు పోయాయి” అని చెపుతూ వుంటే పక్కనున్న వ్యక్తి "అన్నీ ఉన్న మేమే బ్రతక లేక చస్తుంటే నువ్వు ఎందుకు ఇంత పాటు పడుతున్నావు?” అంటు వేళాకోళం చేస్తారు. . .
బాలు “అయ్యా! కాలు లేనివాడు కాదు అవిటి వాడు. బతుకు మీద ఆశ లేనివాడు అవిటివాడు” అని అంటాడు. .
కళ్యాణ్ కి ఎవరో లాగి ఒకటి ఇచ్చినట్టు ఉంటుంది.
బాలు “నాకు ఎవరూ డబ్బు ఉరికే ఇవ్వకండి ! అలా తీసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు” అని చెప్పి అద్భుతంగా డాన్స్ చేస్తాడు. మేజిక్ షో కూడా చేస్తాడు. అక్కడ ఉన్న అందరూ తమకు తోచిన డబ్బు ఇస్తారు. . కళ్యాణ్ కూడా అమౌంట్ ఇస్తాడు. .
కళ్యాణ్ తన మనసులో ‘తను అలాగా ఎందుకు ఆలోచించలేదు?’ అని బాధ పడతాడు. బస్సు ఇంకా రాలేదు. ఒక బెంచి పై కూర్చొని ఉంటారు
ఆ బెంచి పై ఇద్దరు పెద్దవాళ్లు మాట్లాడుకోవడం వింటాడు. .
" రేయ్ ! రామయ్యా.. ఎలా ఉన్నావు? నీ భార్య ఎలా ఉంది రా !?” ఒక పెద్దాయన అడిగాడు.
అందుకు రామయ్య అనే ఆ వ్యక్తి " నేను ఏమి చెప్పను మల్లయ్యా! ఒకడే కొడుకు అని వాడిని కంటికి రెప్పలా పెంచి పెద్ద చేస్తే వాడు ప్రేమ విఫలం అయిందని చచ్చిపోయాడు.. వాడేమో చచ్చిపోయాడు కానీ, నేను, నా భార్య వాడిని తలుచుకొని ప్రతి రోజు చస్తూ ఉన్నాము. . నా భార్య కి పక్షవాతం వచ్చింది. తన కోసం వేరే ఊరిలో పసరు ఇస్తారు అంటే వెళ్ళి వస్తున్నాను” అన్నాడు
వీరి సంభాషణ విన్న కళ్యాణ్ “అమ్మ, నాన్న ఇద్దరు కూడా తనని అలాగే పెంచారు. రేపు నేను చనిపోతే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే కదా!” అని బాధ పడుతూ వుంటే బస్సు వస్తుంది. తాను ఎక్కి కూర్చుంటాడు. .
తన పక్క సీట్ లో ఒక అబ్బాయి వచ్చి కూర్చుంటాడు. . ఆలోచనలో మునిగిన కళ్యాణ్ కి ఎక్కిళ్లు వస్తూ వుంటే తన పక్కనున్న అబ్బాయి వాటర్ ఇస్తాడు. . తనకి థాంక్స్ చెప్పి మాటలు కలుపుతాడు కళ్యాణ్.
ఆ అబ్బాయీ పేరు సూర్య అని, ఆర్మీ లో జాబ్ చేస్తున్నాడు అని, సెలవులకు ఊరికి వచ్చి, ఈ రోజు వెళ్తున్నాడు అని చెపుతాడు.
“మీరు చనిపోతారు అని బాధ , భయం లేదా!?? పైగా నిరంతరం శత్రువులతో పోరాడుతూనే ఉంటారు కదా. .” అని కళ్యాణ్ అడిగితే,
సూర్య నవ్వుతూ " ఎందుకు భయపడాలి సార్. ‘దేశం కోసం నేను చనిపోతున్నా’ అని ఫీలింగ్ ఉంది. అది చాలా గొప్పది సర్. మా నాన్న కూడా ఆర్మీ లో జాబ్ చేసేవారు. ఒక వార్ లో చనిపోయారు. తరువాత రోజు నేను ఆర్మీ లో జాయిన్ అయ్యాను. అయినా ప్రతి మనిషి పుట్టుకకు ఓ కారణం ఉంటుంది. . నా పుట్టకకి దేశ సేవ చేయడం రాసి పెట్టి ఉందేమో! దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని అర్ధాంతరంగా ముగించకూడదు. . “ ” అని చాలా గర్వంగా చెప్పుతాడు.
కళ్యాణ్ తాను ఎంత పెద్ద తప్పు చేయపోయాడో తలుచుకొని బాధ పడతాడు. . ఈ జర్నీ లో తను బ్రతకు విలువ తెలుసుకున్నాడు. . .
తరువాత రోజు ఆఫీస్ కి వెళ్తాడు కళ్యాణ్
తన కొలీగ్ " రేయ్ మామ! హాసిని కి మ్యారేజ్ అంట కదా!?? మన గ్రూప్లో లో ఇన్విటేషన్ సెండ్ చేసింది. . అయ్యో పాపం నువ్వు ఏమై పోతావు రా!??”అని ఒకడు,
"నేను చెప్పా కదరా.. లవ్ చెయ్యడం లాంటివి చెయ్యకు అని” అని ఇంకొకడు..ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
కళ్యాణ్ పెద్దగా నవ్వి “రేయ్ మామ! హాసిని పోతే ఏంట్రా.. నా కోసం రోషిని వస్తుంది. . “ అంటూ తన వర్క్ తను చేస్తుంటే వాళ్ళ కోలీగ్స్ ఆశ్చర్యపోతారు. .
కళ్యాణ్ అమ్మ నుంచి నుంచి వాట్సాప్ కి ఒక ఫోటో వస్తుంది. ఏమిటి అది అని ఓపెన్ చేస్తే ఒక అమ్మాయీ పిక్. .
వెంటనే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి" రేయ్ కన్నా! నీ మరదలురా! తాను డాక్టర్ గ వర్క్ చేస్తుంది. మాకు బాగా నచ్చింది. నువ్వు ఓకే అంటే నిన్ను ఒక ఇంటివాడిని చేస్తాము. ఏమి అంటావు రా” అంది.
కళ్యాణ్ "అమ్మా! మీ ఇష్టమే నా ఇష్టం. . నాకు కూడా తను నచ్చింది. . ఇంతకీ అమ్మాయి పేరు ఏంటమ్మా ?” అని అడిగాడు.
" రోషిని" అని చెప్పి కాల్ కట్ చేసింది కళ్యాణ్ తల్లి . .
కళ్యాణ్ నవ్వుతో రోషిని పిక్ ని చూస్తాడు.
లైఫ్ ఈజ్ షార్ట్. . ఏదీ ఈజీగా రాదు. కష్టపడాలి.
అప్పుడే ఏదైనా మనకు దొరుకుతుంది. . చావు వేటికీ పరిష్కారం కాదు. . కొంత మంది బ్రతకడం కోసమే ప్రతి రోజు పోరాడుతున్నారు. దేవుడు ఇచ్చిన లైఫ్ ని అంత ఈజీగా వదులుకూడదు. .
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
Comments