top of page
Original.png

గ్యాప్ ఇవ్వలేదు.....వచ్చింది అంతే!


ఉద్యోగ ఇంటర్వ్యూలో రిజ్యూమ్‌లోని క్యారియర్ గ్యాప్‌ను ధైర్యంగా ఎదుర్కొంటున్న అభ్యర్థి – జీవిత పోరాటం తర్వాత కొత్త ఆరంభానికి సిద్ధమైన స్ఫూర్తిదాయక దృశ్యం.

Gap Ivvaledu Vachhindi Anthe - Telugu Social Satirical Article | Kotha Viritha

గ్యాప్ ఇవ్వలేదు.....వచ్చింది అంతే! తెలుగు సామాజిక వ్యంగ్య వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 07/08/2026


ఉద్యోగ జీవితంలో వచ్చిన క్యారియర్ గ్యాప్‌ను వైఫల్యంగా చూడకుండా, జీవిత అనుభవంగా చూడాలని చెప్పే హృద్యమైన తెలుగు వ్యాసం. రిజ్యూమ్ కంటే మనిషి ధైర్యం, మళ్లీ ప్రారంభించే సంకల్పమే గొప్పదని గుర్తుచేసే ఆలోచనాత్మక రచన."రిజ్యూమ్‌లో గ్యాప్ కనిపిస్తోంది."అన్న మాట వినగానే, కొంతమంది మొహాల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది.


ఏమైంది?

ఎందుకు పని చేయలేదు?

స్కిల్స్ మర్చిపోయారా?

మళ్లీ పనికి వస్తారా?


అయ్యో సారు,కెరీర్ గ్యాప్ అంటే నేర చరిత్ర కాదు.కావాలనే ఎవ్వరూ ఉద్యోగానికి బ్రేక్ వేయరు.

ఒంట్లో బాలేకో,

ఇంట్లో బాలేకో,

పెళ్లి అనో,

పిల్లలు అనో,

పెద్దల ఆరోగ్యంఅనో

కుటుంబ పరిస్థితులు అనో,

వేరే ఊరికి మారాల్సి వచ్చిందో అనో,

లేదా మానసికంగా కాస్త ఆగి మళ్లీ నిలబడాల్సి వచ్చిందనో...

కారణాలు ఒక్కటి కాదు, వందలు.


వింత ఏంటంటే,సినిమాలో హీరో ఐదేళ్లు జైలుకెళ్లి వచ్చినా క్లైమాక్స్‌లో దేశాన్నే కాపాడేస్తాడు.మనం వావ్ అని చప్పట్లు కొడతాం.కానీ నిజ జీవితంలో ఆరు నెలల క్యారియర్ గ్యాప్ ఉంటే,

"ఈయన పనికొస్తాడా?" అని సందేహిస్తాం.


జీవితం ఐ ఎస్ ఓ సర్టిఫికేట్ కాదు.ప్రతి సంవత్సరం ఒకేలా నడవడానికి.

ఇది ఆడిట్ రిపోర్ట్ కాదు,

ఒక్క డివియేషన్ కూడా ఉండకూడదని.


కొన్నిసార్లు జీవితం

మన ప్లాన్‌లను కాదు,మన ఓర్పును పరీక్షిస్తుంది.

క్యారియర్‌లో గ్యాప్ వచ్చింది అంటే టాలెంట్ పోయిందని కాదు.

అనుభవం తగ్గిందని అంతకన్నా కాదు.

జీవితం అనే యూనివర్సిటీ

కొత్త సబ్జెక్టులు నేర్పిందని అర్థం.

అవకాశం కోసం వచ్చిన వ్యక్తిని గ్యాప్‌తో కొలవకండి.

అతను మళ్లీ లేవడానికి తెచ్చుకున్న ధైర్యంతో కొలవండి.రిజ్యూమ్‌లో కనిపించే గ్యాప్ కంటే,మానవత్వంలో కనిపించే గ్యాప్ చాలా ప్రమాదకరం.


క్యారియర్‌లో గ్యాప్ ఒక విరామం మాత్రమే,

సామర్థ్యానికి కాదు.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


కొత్త విరిత గారి కొన్ని ఇతర రచనలు:


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Radha R
Radha R
5 hours ago
Rated 5 out of 5 stars.

👌

Like
bottom of page