ఏముంది … అంతా నార్మలే!

Emundi Antha Narmale - Telugu Inspirational Article | Kotha Viritha
ఏముంది … అంతా నార్మలే! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 26/09/2026
“అంతా నార్మల్‌గా ఉంది” అనేది బోరింగ్ న్యూస్ కాదు… చాలా సందర్భాల్లో అది గుడ్ న్యూస్ అని గుర్తుచేసే కొత్త విరిత రచన “ఏముంది… అంతా నార్మలే!”
ఈ మధ్య “నార్మల్” అనే మాటకి కూడా ఒక రకమైన అవమాన భావం వచ్చేసింది! రోజంతా ఏదో ఒక సమస్య ఉండాలి. ఎవరితోనో గొడవ ఉండాలి. ఏదో ఒక టెన్షన్ ఉండాలి. లైఫ్‌లో డ్రామా ఉండాలి. అప్పుడే మనం బిజీగా ఉన్నట్టూ, బ్రతుకుతున్నట్టూ అనిపిస్తుంది!
ప్రశాంతంగా ఉన్నావా?
“ఏంటి… ఏదైనా ప్రాబ్లమ్ లేదా?” అంతా సవ్యంగా జరుగుతోందా?
“బోర్‌గా లేదా?”
ఎవరితోనూ గొడవలు లేవా?
“అయితే నీ లైఫ్‌లో మసాలా ఏమీ లేదా?”
నిజమే మరి…ఈ రోజుల్లో సమస్యల్ని కూడా స్టేటస్ సింబల్‌లా చూపించాలి!
కష్టాలు లేకపోతే కథ లేదనుకుంటాం. కన్నీళ్లు లేకపోతే ఎమోషన్ లేదనుకుంటాం. గందరగోళం లేకపోతే జీవితం లేదనుకుంటాం.
కానీ ఒకసారి ఆలోచించండి…ప్రతి రోజు అద్భుతంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు ఏదో ఒక కొత్త ట్విస్ట్ రావాల్సిన అవసరం లేదు. ప్రతి సంబంధంలో గొడవ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఉదయం ఒక కొత్త సమస్యతో మొదలవ్వాల్సిన అవసరం లేదు.
“అంతా నార్మల్‌గా ఉంది” అనేది బోరింగ్ న్యూస్ కాదు… అది చాలా సందర్భాల్లో గుడ్ న్యూస్!
ఆరోగ్యం బాగుంది.
మనసు ప్రశాంతంగా ఉంది.
ఇంట్లో వాళ్లు క్షేమంగా ఉన్నారు. పని జరుగుతోంది.
అవసరాలు తీరుతున్నాయి.
తిన్నది అరుగుతుంది.
రాత్రి నిద్ర పడుతోంది.
ఇంకేం కావాలి? జీవితం ఎప్పుడూ పండగలా ఉండదు. అలాగే ప్రతిరోజూ విషాద గాథ కూడా కాదు. కొన్ని రోజులు ఏమీ జరగకపోవడమే… చాలా మంచి విషయం.
నార్మల్‌గా ఉండటం అసాధారణం కాదు. అసలు ఈ పరుగుల జీవితంలో నార్మల్‌గా ఉండగలగడమే అసలు అసాధారణం!
కాబట్టి ఎవరైనా “ఏంటి సంగతులు" అని అడిగితే
చిరునవ్వుతో చెప్పండి…
“ఏముంది?
అంతా నార్మలే…
అదే నా అదృష్టం! ”
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Excellent write up 👌