top of page
Original.png

సాంకేతిక పరిజ్ఞానం జెన్ జీల ఆయుధం


సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక మార్పు కోసం ఉపయోగిస్తున్న జెన్ జీ యువత

 

Sankethika Parijnanam Gen Z la Ayudham - Telugu Inspirational Article | R C Kumar

సాంకేతిక పరిజ్ఞానం జెన్ జీల ఆయుధం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 13/08/2026


ఈ మధ్యకాలంలో 'జెన్ జీ' అనే పదం బాగా ప్రచారంలోకి వచ్చింది. మరీ ముఖ్యంగా దేశ రాజధానిలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఏ నోట విన్నా జెన్ జీల పాత్ర పై చర్చ మొదలైంది. నేటికి సుమారు అటూ ఇటుగా 14 నుండి 29 సంవత్సరాల వయసు వరకు ఉన్న 37 కోట్ల యువ సమూహామే ఈ జెన్ జీ. ఈ వర్గీకరణ మూలాల్లోకి వెళితే, సామాజిక పరిశోధకులు, జనాభా విశ్లేషకులు మానవ సమూహాల ఆలోచనలు, ప్రవర్తనా రీతులను అర్థం చేసుకోవడానికి నిర్దిష్ట సంవత్సరాల మధ్య జన్మించిన ప్రజలను వేర్వేరు తరాలుగా వర్గీకరించడం జరిగింది.


అందులో భాగంగా ఉద్భవించినదే ఈ 'జెన్ జీ'. 1997 నుండి 2012 సంవత్సరాల మధ్య జన్మించిన వ్యక్తులను సూచించే జెన్ జీ అనే తరం స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా పెరిగిన కాలంలో మొదటి తరహాకు చెందినది. అంతకు ముందు తరం మరియు వీరికి ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అప్పటి తరం ఇంటర్నెట్ నుండి స్మార్ట్ ఫోన్ల వరకు సాంకేతిక విప్లవం ఎదుగుదలను చూశారు.


కానీ జెన్ జీ పుట్టేసరికే హై స్పీడ్ ఫోర్ జి, ఫైవ్ జి ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి. సాంకేతికతతో నిత్యం కనెక్ట్ అయి ఉండటంతో రాజకీయ చైతన్యమే కాకుండా, వాతావరణ మార్పులు, మానసిక ఆరోగ్యం వంటి సామాజిక అంశాలపై కూడా ఈ తరానికి స్పష్టత ఉంటుంది. వీళ్ళని 'జూమర్స్' లేదా 'నేటివ్ డిజిటల్స్' అది కూడా సంభోదిస్తారు.


తమ అభిప్రాయాలను నిర్భయంగా, సూటిగా వ్యక్తం చేయడం జెన్ జీ యువత ప్రత్యేకత. ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా యాప్ లను విరివిగా ఉపయోగిస్తూ టెక్నాలజీ వినియోగంలో వీరు ముందుంటారు. ఆర్థిక మాంద్యాలు, ఉద్యోగాల అభద్రత వంటి వాటిని జాగ్రత్తగా గమనిస్తుంటారు. గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ నివారణ వంటి పర్యావరణ పరిరక్షణ విషయాలపై కూడా దృష్టి పెడతారు. కుల, మత, లింగ బేధాలు లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలని బలంగా నమ్ముతారు.


ఒకే భావజాలం గల ప్రపంచం నలుమూలలా ఉన్న వ్యక్తులతో స్నేహం చేయడం వీరి ప్రత్యేకత. అటువంటి వారితో గ్రూపులుగా ఏర్పడి కమ్యూనిటీలను సృష్టించుకుంటారు. జెన్ జీ యువత దేశ సంస్కృతిని ఆధునిక సాంకేతికతను మేళవించి సరికొత్త జీవనశైలిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో మారుతున్న సామాజిక ట్రెండ్స్ ని వీళ్లే నడిపిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అందించడానికి ఇష్టపడతారు.


జెన్ జీ కావచ్చు మరేదైనా పేరు కావచ్చు యువత దేశానికి వెన్నెముక వంటివారు. భవిష్యత్ తరాన్ని నిర్దేశించేది, నడిపించేది యువతే. నూతన ఆలోచనలు, అంకితభావం, సాంకేతిక పరిజ్ఞానం కలిగి సమాజ మార్పుకు ప్రధాన శక్తిగా నిలిచేది కూడా వారే. అటువంటి యువశక్తిని సరైన మార్గంలో వినియోగించుకోవడం దేశ పురోగతికి ఎంతో కీలకం. యువతకు సరైన అవకాశాలు ఇస్తే వారు దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రపథంలో నిలపగలరు. ఇందుకోసం ప్రభుత్వాలు, సమాజం తగిన చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.


ప్రతిభ గల యువత తమ భవిష్యత్తు కోసం ఇతర దేశాలకు వలస వెళ్ళిపోవడం వల్ల దేశం నష్టపోతుంది. జెన్ జీ యువత వివేకంతో నిర్ణయాలు తీసుకొని తమ శక్తిని సరైన మార్గంలో ఉపయోగిస్తే దేశాభ్యుదయాన్ని సులభంగా సాధించవచ్చు. ఆ దిశగా ప్రోత్సహిస్తూ వారి నడవడికలో గుణాత్మకమైన మార్పు తేవాలంటే ఆది నుండి వారికి నాణ్యమైన విద్య అందిస్తూ నైతిక విలువలను బోధిస్తూ సరైన మార్గదర్శకత్వం చూపాలి. నైపుణ్యాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, స్టార్టప్ ల ప్రోత్సాహానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. యువతను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వాలు తీవ్రమైన రాజకీయ తిరుగుబాట్లు, నిరుద్యోగ సంక్షోభం మరియు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటాయి.


యువత ఆలోచనలు కొంత మేరకు ఆచరణాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో ఇతరులు చెప్పే తప్పుడు మాటలకు ప్రభావితమై ప్రమాదకర ధోరణులకు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది. ఉద్వేగంలో, ఉద్రేకంలో ఉన్న యువతని అవకాశవాదులు తప్పుదారి పట్టించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ దశలో సరైన ఆలోచన కంటే భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి, వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు, కష్టాలు తాత్కాలికం, ప్రాణం అమూల్యం. యువత ఎలాంటి ఉద్వేగంలోనైనా, నిరాశలోనైనా ధైర్యంగా నిలబడాలి.


స్వీయ ఆలోచనా విధానం కలిగి యుక్తాయుక్త విచక్షణతో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. చిన్ననాటి నుండే వారిని ఈ దిశగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా అత్యంత ప్రధానమైనది. పిల్లలకు మంచి సంస్కారాన్ని అందించడం, స్వేచ్ఛతో కూడిన మార్గదర్శకత్వాన్ని చూపడం వారి ప్రధాన బాధ్యత.


'బలమేజీవితం, బలహీనతే మృత్యువు' - స్వామి వివేకానంద 



ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

R C Kumar
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page