ఇంకెంత తింటావే చాలే ఇక చాలే

Inkentha Tintave Chale Ika Chale - Telugu Family Comedy Stories | Penumaka Vasantha
ఇంకెంత తింటావే చాలే ఇక చాలే - తెలుగు కుటుంబ హాస్య కథలు | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 20/11/2026
పెనుమాక వసంత రాసిన “ఇంకెంత తింటావే చాలే ఇక చాలే” ఒక చమత్కారమైన కుటుంబ హాస్య కథ. భామ, పుల్లారావుల దాంపత్య జీవితంలో ఆహారం, అధిక బరువు, కుటుంబ అలవాట్ల చుట్టూ జరిగే సంఘటనలు నవ్విస్తూ సాగుతాయి.
"ఏమండీ కూర్చుని డ్రైవ్ చేయొచ్చుగా?" అన్న భార్య భామతో, "ఎక్కడుందే చోటు? దిక్కుమాలిన ప్రశ్నలతో ఇక ఇంటికి వెళ్ళే దాకా విసిగించమాకు.
'ఊరికే నస, సీటు అంతా ఆక్రమించి'" అని లోపల గొణుక్కున్నాడు.
"ఏంటి మీలో మీరే నసుగుతున్నారు?" "ఏమీ లేదులే..!" అంటూ ఎదురుగా వస్తున్న ఆటోకి డాష్ ఇవ్వబోయి తమాయించుకున్నాడు.
ఆటోలో వాళ్ళు పుల్లారావు దంపతులని చూసి నవ్వుతుంటే... లోపల గుండ్రంగా గుండ్రాయిలా ఉన్న భార్యను తలుచుకుని కుమిలిపోతూ ఇంటికి చేరాడు పుల్లారావు.
చిన్నప్పటి నుండి సన్నగా ఉండటం వల్ల పుల్లారావుగా స్థిరపడ్డాడు. అసలు పేరు బారసాలలో బియ్యంలో రాసింది అందరూ మర్చిపోయారు. పాపం పుల్లారావు భార్య మొదట్లో సన్నగానే ఉండేది.
పిల్లాడిని కడుపుతో ఉన్నప్పుడు తిన్న తిండిని ఇప్పటివరకు ఆపలేదు భామ. డెలివరీ అయి తగ్గుతుంది అనుకుంటే... పిల్లాడికి అన్నప్రాసన దగ్గర నుండి పిల్లాడు తినకపోతే, మిగిలినది తినటం మొదలుపెట్టింది; ఇప్పటివరకు మానలేదు.
దానికితోడు థైరాయిడ్ వచ్చింది. అప్పుడు టూ ఇన్ వన్ ఉండే భామ ఇప్పుడు ఫోర్ ఇన్ వన్ అయింది.
భామ నాన్న అప్పుడు నోరు విప్పి అసలు రహస్యం చెప్పాడు. భామ అమ్మకు కూడా పిల్లలను కడుపుతో ఉన్నప్పుడు వచ్చిన ఒళ్ళు ఇప్పటి వరకు తగ్గలేదని.
ఇంకేమి జీన్స్ కూడా కలిసాయి. 'ఇంకెంత తింటావే చాలే ఇక చాలే, ఇంకేమి కావాలోయ్ ఇంకేమి కావాలోయ్' అనే పాటకు రీమిక్స్ చేసుకుని పాడుకున్నాడు.
ఇక మామగారిలా మందమే ఆనందం అనుకుంటూ ఏడవాలి. వెధవ బతుకు, సినిమాకు వెళితే... సీట్లో భామ పట్టటం లేదని జంటగా వెళ్ళటం మానేశాడు.
బస్సు ఎక్కితే రెండు టికెట్స్ కొడుతున్నాడు కండక్టర్. ఈ మధ్య దేవుడు కనికరించి పల్లె వెలుగు బస్సు ఎక్కుతుంది టికెట్ లేకుండా.
ఆ టికెట్ డబ్బులతో బస్సులో ఒక బస్తా చిప్స్ కొనుక్కుని తింటుంది. ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చి 'తనకు, పిల్లలకు పెడుతూ నేను ఎండిపోతున్నాను.
దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి' అనుకుని స్కూటర్ పార్కు చేసి లోపలికి వెళ్ళేసరికి పిల్లలు వదిలేసిన అన్నం తింటున్న భార్యను చూసి "ఏదీ ఆ అన్నం బొచ్చె ఇలా ఇవ్వు!" అంటూ తీసుకెళ్ళి డస్ట్ బిన్‌లో వేశాడు.
"అయ్యో బియ్యం ధర ఎంత మండిపోతోంది తెలుసుగా? ఏంటి అలా పారేస్తారు?" అంటూ కోప్పడింది. "ఏం పర్లేదు. రేపటి నుండి పగలు గోధుమ రవ్వ ఉడకెయ్యి.
రాత్రికి చపాతీలు చేయి." "పిల్లలకు అన్నం మెతుకు పెట్టకపోతే... మీలాగా అవుతారు" అంది మండిపోతూ. "వాళ్ళకు అన్నం వండి, మనకు గోధుమ రవ్వ వండు" అంటూ కోప్పడ్డాడు.
"మళ్ళీ రేపు మామూలు అవుతాడులే. ఇప్పుడు వచ్చిన తుఫాను ఎఫెక్ట్" అనుకుని ఊరుకుంది భామ.
కాలం పరుగెత్తింది. భామ కూతురు పెళ్లి వరకు బాగానే ఉంది. కడుపుతో ఉండి మళ్ళీ హిస్టరీ రిపీట్. పిల్లాడు పుల్లారావు లాగానే సన్నగా ఉంటాడు.
పిల్లాడికి అమ్మాయి కన్నా తల్లి ఎలా ఉంటుంది ముందు చూసి ఆ తర్వాత పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే... వాడు తనలాంటి కష్టాలు పడకూడదని.
మీకు ఎవరైనా సన్నగా ఉన్న అమ్మాయి ఉంటే... కాస్త పుల్లారావు చెవిన వేయండి పాపం.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.















Comments