top of page
Original.png

మానవ స్పర్శ - పార్ట్ 1

Updated: Mar 7

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #ManavaSparsa, #మానవస్పర్శ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Manava Sparsa - Part 1/2 - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 06/03/2026

మానవ స్పర్శ - పార్ట్ 1/2 తెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


అమెరికాలో ఉన్న ప్రవీణ్ జీవితంలో అంతా డిజిటల్, అంతా ఆటోమేటెడ్. కానీ, ఇండియాలో పల్లెటూరి వాతావరణంలో ఉన్న అతని తల్లిదండ్రులు, వామన రావు, కాంతమ్మల ప్రపంచం అంతా చేతి లెక్కలు, చేతి పనులు, గుడి గంటల చుట్టూ తిరుగుతుండేది.


"అమ్మ, నాన్న! మీ భద్రత కోసమే! ఈ సిస్టమ్స్ వాడుకోండి, ప్లీజ్!" అని ప్రవీణ్ బతిమాలడంతో, చివరికి వామన రావు గారు తమ ఇంటిని ఒక 'స్మార్ట్ హోమ్'గా మార్చడానికి ఒప్పుకున్నారు.


గడప దాటి లోపలికి అడుగు వేయగానే లైట్లు ఆన్ అవ్వడం, రాత్రి 11 దాటితే ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయే స్మార్ట్ డోర్, వంటగదిలో గోడకు అమర్చిన వాయిస్ అసిస్టెంట్ Alexa. ఇల్లు మొత్తం CC కెమెరాలతో అమర్చి, దాని లింక్‌ను ప్రవీణ్ తన మొబైల్‌కు అనుసంధానించుకున్నాడు.

"చూడు కాంతం! మన కాలం పోయింది. ఈ యంత్రాలే రాజులు!" అని వామన రావు గారు తన నుదుటిపై విభూతి రేఖలు సరిచేసుకుంటూ విసుక్కునేవారు.


ఒక ఉదయం, కాంతమ్మ పూజకు సిద్ధమైంది. ఆమెకు రోజూ ఉదయం లలితా సహస్రనామం వినే అలవాటు. పక్కనే ఉన్న అలక్షాను చూసి, భక్తిగా చేతులు జోడించి, "అలక్షా! ఓ అలక్షా! నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివే అనుకుని చెప్తున్నాను... దయచేసి లలితా సహస్ర నామాలు పెట్టు!" అని ప్రాధేయపడింది. వాయిస్ అసిస్టెంట్‌  అలస్కా

వెంటనే, "Playing Lahari Samosalu (లహరి సమోసాలు) on YouTube. Would you like to place the order?" అని ఇంగ్లీష్‌లో అడిగింది. కాంతమ్మకు ఏం అర్థం కాలేదు. "హా, పెట్టు! పెట్టు! ఎంతపెట్టినా పెట్టు!" అని ఉత్సాహంగా చెప్పింది.


ఆ సమయంలో కూరగాయలు తేవడానికి బయటికి వెళ్లిన వామన రావు గారు, గడప దాటి లోపలికి అడుగు వేయగానే హాలులో లైట్లు దానంతట అవే ఆన్ అయ్యాయి. ఆయన ఆ లైట్లను చూసి కంగారుగా వెనక్కి వచ్చి మళ్లీ లోపలికి అడుగు పెట్టారు. మళ్లీ ఆన్ అయ్యాయి. " ఏంటి కాంతం ఎన్ని రోజులు చూసినా ఈ లైట్ల గొడవేంటో నాకు అర్థం కావటం లేదు . ఇంటిలోకి వస్తే వెలుగుతాయా, ఇల్లు దాటితే వెలుగుతాయా? ఏమిటి అంతా మాయగా ఉంది!" అన్నారు.


సరిగ్గా అప్పుడే, బైక్‌పై వచ్చిన డెలివరీ ఏజెంట్, 12 సమోసాల బిల్లు ₹240 పట్టుకుని వచ్చి, "వామన రావు గారి ఇంట్లో సమోసా ఆర్డర్!" అన్నాడు.


వామన రావు గారు డెలివరీ బాయ్‌ని చూసి కళ్లెర్రజేస్తూ, "ఇంత పొద్దున్నే మా ఇంట్లో సమోసా ఆర్డర్ ఎవరు చేశారు? మాకు ఉదయం పూట కాఫీ తప్ప సమోసాలు తినే అలవాటు లేదండీ!" అని విసుక్కున్నారు.


కాంతమ్మ అమాయకంగా, "నేనేనండీ! పక్కన ఉన్న లలితా సహస్ర నామం పెట్టమంటే, ఆ యంత్రం అవేవో లహరి సమోసాలు అని పెట్టింది. అంతా రామాయణంలా ఉంటే, ఏం చేయాలో తెలియక సరే అన్నాను," అని మొహం చిన్నబుచ్చుకుంది.


వామన రావు గారు నవ్వు ఆపుకోలేక, "అలక్షా! నువ్వు మా కోడలిలా కాకుండా, పక్కింటి కోడిపుంజులా తయారయ్యావే!" అని దానిపై కోప్పడ్డారు......

  

===============================================                                   

                 ఇంకా వుంది..

===============================================


వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page