top of page

నర్తనశాల - పార్ట్ 9

#AyyalaSomayajulaSubrahmanyam, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #Narthanasala, #నర్తనశాల, #అజ్ఞాతవాసం, #పురాణం, #Devotional, #TeluguSerialEpisodes

ree

Narthanasala - Part 9 - New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 21/07/2025

నర్తనశాల - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక చివరి భాగం

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాలలో చేరుతారు. భీముడు మల్ల యుద్ధంలో జీమూతుడిని వధిస్తాడు. నర్తన శాలలో జరిగిన భీకర యుద్ధంలో కీచకుడు, భీముని చేతిలో హతమవుతాడు. 


గోగ్రహణానికి వచ్చిన సుశర్మను ఓడిస్తాడు భీముడు. గాండీవం ధరించి యుద్దానికి బయలుదేరుతాడు అర్జునుడు. యుద్ధంలో కౌరవులను ఓడిస్తాడు. తిరిగి బృహన్నల వేషంలో విరాటుని కొలువుకు వెళతాడు. 


మరోవైపు విరాటుడు సుశర్మ మరియు అతని సైనిక పరివారమగు సంశక్తకులను ఓడించి గోవులను తిరిగి సాధించుకొని నలుగురు పాండవులతో కలిసి నగరమునకు తిరిగి వచ్చెను.


 

కొంత సమయమునకు సింహాసనాధీశుడై తన కుమారుని గురించి విచారించెను. అంత అంతఃపురం స్త్రీలు ‘మహారాజా; మీ కుమారుడు బృహన్నల సారథ్యంలో, కౌరవులు అపహరించిన గోవులను రక్షించుటకు యుద్దమునకు వెళ్ళెను.’ అని పలికిరి. 


అది వినిన విరాటుడు మనషులో బాధపడుతూ తన మంత్రులను ఇట్లు ఆజ్ఞాపించెను. 

“ఉత్తరుని సహాయమునకై వెంటనే సైన్యమును సిద్ధం చేసి పంపండి. అచట నా కుమారుడు ఏ విధంగా యున్నాడో?” యని బాధ పడసాగెను. 


అంత కంకుభట్టు చిరునవ్వుతో ఇట్లనెను. “మహారాజా; బృహన్నల సారథిగా వుండగా మీ తనయుడు ముల్లోకములను జయింపగలడు. నామాట విశ్వసింపుము”


సరిగ్గా ఆ సమసములో గోపకులు వచ్చి కౌరవులపై ఉత్తరుని లోకో‌త్తర విజయము మరియు గోసంపద సురక్షితమని తెలిపిరి. ఈ విషయం వినిన విరాటుడు ఆనందంతో పరవశించి రోమాంచితుడయ్యెను. శుభవార్త తెచ్చిన గోపకులకు మంచి వెలలేని బహుమతులు ఇచ్చి

పంపెను. నగరమంతటినీ వెంటనే అలంకరించమని ఆదేశించెను. 


అటుపిమ్మట కుమార్తె ఉత్తర రాకుమారిని మంగళ వాయిద్యములతో, చెలికత్తెలతో, పుణ్యస్త్రీలతో కలిసి వెళ్ళి

ఉత్తరరాకుమారునికి స్వాగతం పలకమని తెలిపెను. 

ఉత్తర రాకుమారుని కొరకై స్వాగత సన్నాహాలు పూర్తయిన పిమ్మట విరాటుడు ఈ సంతోషసమయం తృప్తిగా అనుభవింప దలచుకొని సైరంధ్రిని ఇట్లు ఆజ్ఞాపించెను. ”పాచికలను తీసుకురమ్ము. నాకు కంకుభట్టుతో పాచికలు ఆడవలెనని ఉంది.”


యుధిష్టరడు ఈ విధంగా హెచ్చరించెను. “ఓ రాజా; విజయోత్సాహపు మత్తులో ఒకరు జూదము ఆడరాదు. ”

విరాటుడు ఇటుల సమాధానమిచ్చెను. ” ఈ రోజు అమితమైన ధనసంపదను దానముగా ఇవ్వవలెనని భావిస్తుంటిని. కనుక కొద్దిపాటి ధనమును పాచికలాడుటలో కోల్పోయినను నష్టమేమిటీ?”


ఏమైనను కంకుభట్టు తిరిగి ఇటుల హెచ్చరించెను. “జూదములో మిళితమై ఉన్నట్టి చెడును మీరు గమనించవలెను. పాచికలాటలో ధర్మరాజు తన సర్వస్వమును కోలుపోయిన సంగతి మీరు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొననలెను. ”


విరాటుడు పట్టు బట్టగా ఆట ఆరంభమయ్యెను. పాచికలను అందుకొంటూ “ఈ రోజు నా కుమారుడు ఒంటరిగా అంతమంది కౌరవ వీరులను జయించెను. వారిపై విజయము సాధించెను.” అని గొప్పగా చెప్పనారంభించెను.


ధర్మరాజు ఇట్లనెను. “ఓరాజా; బృహన్నల 

 సారథ్యంలో అదేమీ గొప్ప ఆశ్చర్యకరమైన విషయము కాదు” 


 ఆ పలుకులు మహారాజుకు క్రోధమును కలిగించెను. దానితో అతడు తీవ్రంగా ఇట్లు ప్రతి స్పందించెను. “ఓరీ మూర్ఖా; ఒక నపుంసకుడిని నా వీర పుత్రుడితో పోల్చుటయా? నీకెంతటి దైర్యము. ఇది నాకు గొప్ప అవమానము. నీతో మాకుగల మైత్రీబంధముతో నేను నిన్ను క్షమించుచుంటిని. ఏమైనను నీవ ఇక్కడ కొనసాగదలచినచో అలా పలుకకుండా జాగ్రత్త 

 పడ”మని హెచ్చరించెను. 

ఏమైనను మరల కంకుభట్టు సమాధానమిచ్చెను. “ఓ మహారాజా; బృహన్నల కాకుండా మరెవ్వరునూ భీష్మ ద్రోణ, కృప, అశ్వత్థామ మరియి అనేకమందితో యుద్ధం చేయలేరు. అట్టి బృహన్నల సహాయము పొందిన ఉత్తరుడు ఎందుకు విజయం సాధించలేడు.”

 

దానితో విరాటుని కోపమున విచక్షణ కోలుపోయి ఒక పాచికను కంకుభట్టు ముఖము పైకి విసురుతూఇలా అరిచెను “మరోసారి ధైర్యం చేయవద్దు” అని హెచ్చరించెను. 


ధర్మరాజు ముక్కునుంచి రక్తము కారుతుండగా, అక్కడే నున్న సైరంద్రి( ద్రౌపది): చూచి ఒక పాత్రలో నీరు తెచ్చి ధర్మరాజు రక్తం భూమిపై పడకుండా పట్టుకొనెను. 


మరోవైపు ఉత్తరరాకుమారుడు సంతోషముగా నగరములో ప్రవేశించగానే ప్రజలు అతనికి ఆనందముగా స్వాగతం పలుకుతూ పూలమాలలతో ముంచెత్తిరి. విషయము తెలిసిన 

విరాటుడు ఆనందముతో కుమారుని పిలువ నంపెను. 


అటుపిమ్మట ఉత్తరుడు ఒక్కడే రాజ్యసభలోకి ప్రవేశించెను. తన తండ్రికి ప్రణమాచరించి ధర్మరాజు ముఖము రక్తము మరకలతో ఉండుట, ద్రౌపది అతనికి సేవలు చేయుట కని

పించెను. దానితో అతను కలతతో ఇట్లు విచారించెను. “తండ్రిగారు; కంకుభట్టు గారికి హాని కలిగించి, ఈ దుస్సాహసము, పాపకార్యము చేయుటకు ఎవరు సాహసించిరి?”

విరాటుడు ఇలా సమాధానమిచ్చెను. “ఆ మూర్ఖుని కొట్టినది నేనే. నేను కౌరవులపై నీ విజయములను ప్రశంసిస్తుండగా, అతడు బృహన్నల వలెనే నీవు గెలిచావని అనెను.”


ఉత్తరుడు ఈ విధముగా బదులిచ్చెను. “నాన్నగారూ: మీరు వెంటనే కంకుభట్టు గారికి క్షమాపణలు వేడుకొనండి. లేనిచో తీవ్ర పరిణామాలకు మనము గురికాక తప్పదు. ”


అది విని విరాటుడు తన తప్పును తెలుసుకుని కంకుభట్టును క్షమింపమని వేడుకొనెను. 


“మహారాజా; నేను ఇదివరకే మిమ్ములను క్షమించితిని. ఏమైనను శక్తిమంతులు అవమానము భరించలేరని, అనుచితంగా తీవ్రచర్యలకు పూనుకుందురని నే నెరుగుదును. కానీ నా రక్తము నేలపడినచో ఎట్టి అనుమానము లేకుండా మీరు మీ రాజ్యము సహా నశించి పోవుదురని నేను నా రక్తమును నేల మీద పడనీయలేదు. ” అనెను. 


కొంత సమయమునకు కంకుభట్టు ముఖము నుండి రక్తము కారుట నిలిచిపోయెను. ఆ తరువాత బృహన్నల రాజ్యసభ లోకి ప్రవేశించెను. విరాటునికి, కంకుభట్టునకు ప్రణామము

లు ఆచరించి మౌనముగా నిలిచెను. ఆ సమయములో విరాటమహారాజు మరోసారి పుత్ర వాత్సల్యం కొద్దీ ఉత్తరకుమారుని ప్రశంసింపనారంభించెను. అతను ఇలా పలికెను. 

 “ఉత్రరకుమారా; నీవు అతిరథులైన కౌరవ వీరులతో ఏవిధంగా యుద్దం చేసావో వివరింపుము. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధనాది వంటి అతిరథులతో యుద్దము చేసి వారందరిపై ఏవిధంగా విరుచుకు పడి విజయమును ఎలా సాధించితివి. నేను ఆ వివరాలన్నింటినీ వినదలచితిని. ”


ఉత్తరుడు ఈ విధముగా వివరించెను. “నాన్నగారూ; కౌరవులను నేను జయించలేదు. ఆ అతిరథులకు చూసే సరికి నేను భయముతో పారిపోసాగితిని. కానీ ఒక దైవ సమానమైన పురుషోత్తముడు వచ్చి నన్ను రక్షించెను. అంతే గాకుండా నాలో విశ్వాసమును నింపి, యుద్దము చేసేందుకు అతడు నా రథమును అధిరోహించెను. శక్తిమంతుడైన ఆ పురుషోత్రముడు కౌరవసేన నంతటినీ భ్రమింపచేస్తూ పారిపోతున్నట్టి దుర్యోధనుని అవహేళన చేసెను. చివరకు కౌరవ సేనావాహిని నంతటినీ సమ్మోహితులను చేసి వారి

 విలువైన పట్టు కుచ్చులను తీసుకురమ్మని నాకు పని అప్పగించెను. ఆ తరువాత మేము తిరిగి వచ్చితిమి. ”


విరాటుడు మరల అడిగెను. ’ ఆ పురుషోత్తముడు ఎవరు? నిన్ను, గోవులను రక్షించినందుకు నేనతనిడిని సన్మానింపదలచితిని. ”


ఉత్తరుడు ఈ విధముగా బదులిచ్చెను. “యుద్దానంతరము ఒకటి రెండు రోజుల్లో తిరిగి మన నగరమునకు రాగలనని తెలిపి, అతడు అక్కడనుండి అదృశ్యమయ్యెను. ”

అటుపిమ్మట విరాటుని అనుమతితో బృహన్నల కౌరవుల పట్టుకుచ్చులను ఉత్తరకుమారికి అందించెను వాటిని అందుకొని రాకుమారి ఎంతగానో సంతసించెను. యుద్దము 

ముగిసిన మూడవ రోజున పాండవులు అభ్యంగన స్నానమాచరించి, శ్వేతవస్రాలను ధరించి, సముచిత ఆభరణములతో రాజ్యసభలోకి ప్రవేశించారు. పాండవుల అజ్ఞాత వాసము పూర్తయ్యెను. సభలో మహారాజులకు నిర్దేశించబడిన సింహాసనాలలో వారు ఆసీనులైరి. 


కొంత సమయము పిమ్మట తన నియమిత సమయమునకు విరాటుడు తన విధుల నిర్వహణ కొరకై రాజ్యసభకు విచ్చేసెను. పాండవులు మార్తాండ సూర్యుల వలె అఖండ

 తేజస్సుతో గోచరించిరి. వారట్లు సింహాసనాలపై కూర్చుండను చూచి విరాటమహారాజు ఆగ్రహముతో ధర్మరాజు ని ఉద్దేశించి ఇలా పలికెను. 


“కంకుభట్టూ; ఒక విదూషకుడు రాచవస్త్రాలు ధరించి మహారాజుల కుద్దేశించిన సింహాసనాలపై నిర్భయముగా ఎలా. కూర్చోగలుగుతారు?”


విరాటునితో హాస్యమాడదలచి అర్జునుడు నవ్వుతూ ఇలా బదులిచ్చెను. “మహారాజా; ఈ భూ ప్రపంచమంతటికి చక్రవర్తియైన యుధిష్టర మహారాజుయే ఈ కంకుభట్టు అని 

 మీరు తెలుసుకోలేదు? మానవులందరిలోనూ మిక్కిలి శ్రేష్ఠుడు, ధర్మాత్ముడైన అతనికి ఈ సింహాసనముపై కూర్చుండుటకు అర్హత లేదంటారా?”

విరాటుడు అర్జునుని పలుకులను సందేహిస్తూ ఇట్లు పలికెను. “బృహన్నలా; కంకుభట్టు నిజముగా యుధిష్టరుడైనచో, భీమ, అర్జున, నకుల, సహదేవులు ఎక్కడ? వారి ధర్మపత్ని ద్రౌపది ఎక్కడ?”


అర్జునుడు ఈ విధముగా బదులిచ్చెను. మీ దగ్గర వలలుడే మా అన్నగారు ఇక్కడ కూర్చున్నట్టి భీమసేనుడు. దుష్టకీచకుని గంధర్వుడిని రూపంలో వధించింది ఈతడే. మీ అశ్వశాల సంరక్షకుడు దామగ్రంధి యే నకులుడు. మీ గోవులను సురక్షితముగా సంరక్షిస్తున్నట్టి వాడు సహదేవుడు. నేను అర్జునుడును. సైరంధ్రి మా భార్య ద్రౌపది. ”


పాండవులు తమ వాస్తవ రూపాలను బహిర్గతం చేయుటకు అవకాశముగా తీసుకుంటూ ఉత్తరుడు ఇలా వివరించెను. ”తండ్రీ; నేను పురుషోత్తముడు అని తెలిపినది ఈ అర్జు నుని గురించే. అతడే నన్ను రక్షించుటకు వచ్చి కౌరవులను జయించి మన పరువు ప్రతిష్టలను నిలిపిరి”

 

 ఆ పలుకులను విన్న విరాటుడు, తాను యుధిష్టరుని పట్ల ఎంత అపరాధము చేసెనో. గ్రహించెను. పాండవులను సంతోషపెట్టదలచి అతడు సౌందర్యవతి, సౌశీల్యవతి సుగు

ణాలరాశి యగు తన కూతురు ఉత్తరరాకుమార్తెను అర్జునునికిచ్చి వివాహము చేయ సంబంధించి ప్రస్తావించెను. విరాటుడు పదేపదే ఆప్యాయతతో పాండవులందరినీ ఆలింగనం చేసుకుంటూ తన కూతురుతో వివాహమునకు అంగీకరించమని అర్థించెను. 

అర్జునుడు ఇటుల బదులిచ్చెను. “మహారాజా; ఉత్తరరాకుమార్తెను సంతోషముగా నా కోడలుగా చేసుకొందును. ”


విరాటుడు నిరాశ నిస్పృహతో ఇలా అడిగెను “ అర్జునా; నా కూతురును ఏల వివాహమాడ నంటున్నావు. కారణములేమిటీ?”


అర్జునుడు ఇటుల వివరించెను. “నేను ఉత్తరతో కలిసి ఒక ఏడాది కాలము నివసించితిని. నేను ఆ సమయమున ఆమెను ఎల్లప్పుడునూ నా కుమార్తెగానే చూసితిని. ఏమైనను ఆమె యుక్తవయసురాలైనందున ఆమె గురించి ఎవరూ సందేహపడకుండ, నేను ఆమెను కోడలుగా అంగీకరించి ఆమె పవిత్రతను నిర్దారింపదలచితిని. నేను నిందారో

 పణలకు కళంకమునకు భయపడుదును. కనుక శ్రీకృష్ణుని మేనల్లుడు అభిమన్యుడు ఉత్తర రాకుమార్తెను వివాహమాడవలెనని నా కోరిక..”

 

 విరాటుడు మరియు యుధిష్టరుడు సంతోషంగా అందుకు అంగీకరించిరి. భూమండలములో గల రాజన్యుల కందరికీ ఆహ్వానపత్రికలు పంపిరి. పాండవుల విరాటుని రాజ్యములో గల ఉపప్లావ్య అనే పట్టణం లో నివసించసాగిరి. 


శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, అభిమన్యుడు, సుభద్ర మరియు అనేకమంది ఇతర యదువీరులు అక్కడకు చేరుకొనిరి. 

ద్రుపదుడు, దృష్టద్యమ్నుడు, శిఖండి మొదలగు పాంచాలాధీశులందరును అక్కడకు విచ్చేసిరి. అంగ, వంగ, కళింగ, కాంభోజ, కాశ్మీర తదితర దేశాల రాజన్యులు తమ 

అంతఃపుర స్త్రీలతోనే కలిసి వచ్చిరి. అనేకమంది రాజన్యులు పాండవులకు మద్దతుగా సేనావాహినిలతో కదలి యుద్దానికి సిద్దమన్నట్లు తరలివచ్చిరి. 


విరాటుడు వారందరికీ అత్యున్నతమైన రాజవసతులతో కూడిన విడిది వసతులు ఏర్పాటు చేసెను. అదే సమయములో పాండవుల రథసారథులు పాండవుల రథా

లను ధ్వారకలనుండి తీసుకువచ్చిరి.”ఉత్తర అభిమన్యుల వివాహము విరాటుని రాజభవనములో వైభవముగా జరిపించబడెను. శ్రీకృష్ణభగవానుడు పాండవుల 

అందరికీ అమూల్యమైన కానుకలు అందించెను. వివాహయజ్ఞము జయప్రదముగా ముగిసినది. యుధిష్టరుడు తనకు లభించిన కానుకలను మరియు శ్రీకృష్ణుడు

అందించిన విలువలేని కానుకలను అక్కడ వున్న భ్రాహ్మణ్యమునకు వితరణ చేసెను. 

 ——————————————-శుభంభూయాత్‌—————————————————


============================================================================================

సమాప్తం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

============================================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree




1 comentario


Very good mythological story and quite interesting. Author takes very good care writing Narthanashala, it is a segment of Virataparvam. Loved how you wove the mythological elements into the story, it's truly captivating and I'm eager to read more! ఏ. శ్రీనివాస్

Me gusta
bottom of page