top of page

రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 8


'Raghupathi Raghava Rajaram Episode 8' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar

'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ


కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు లెక్చరర్ రఘుపతి. ఆ యువతిని, గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది ఐన శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు.


స్పృహ వచ్చిన ఆ యువతి- తన పేరు కమల అనీ, తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారనీ చెబుతుంది. కమలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి.


కాలేజీలో అవయవ దానం గురించి కల్యాణి చేసిన ప్రసంగానికి ఆకర్షితుడవుతాడు రాజారామ్. వాళ్ళ మధ్య పరిచయం పెరుగుతుంది. తన గతం గురించి చెబుతుంది కల్యాణి. కల్యాణిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇంట్లో చెబుతాడు రాజారామ్.


కోవిడ్ గురించి గ్రామస్థులకు అవగాహన కల్పిస్తాడు రఘుపతి.


ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 8 చదవండి..


సీతయ్య భార్య గట్టిగా అరుస్తోంది.


"నా తమ్మున్ని జైల్లో పెడితే చేతకాని మొగాడిలా కూర్చున్నారు. ఇప్పుడేమో ఇది ఎక్కడెక్కడో తిరిగి పాడు రోగం అంటించుకొని వస్తే దాన్ని తన్ని తగలేయకుండా యింట్లో వుంచుకుంటారా? నేనూ, నాపిల్లలు చావాలనేనా మీ పన్నాగం. ముందు దాన్ని ఇంటిలోనుండి పంపించేయండి. అది యింటిలో వుంటే నేనూ, నాపిల్లలు చచ్చిపోతాం. ఒక్క క్షణం కూడా అది యింటిలో వుండటానికి వీలులేదు. అది యింటిలో వుంటే యిప్పుడే నేనూ, నాపిల్లలు నూతిలో దూకి చస్తాం."


రాఘవ ఇంటిలోపలికి వెళ్ళాడు.


"ఏమైంది?" అడిగాడు అక్కడున్న సీతయ్యను.


"నిన్న రాత్రి నుండి మా పెద్దమ్మాయి లలితకు జ్వరం. పొద్దుటినుండి దగ్గు కూడా వస్తున్నది. అది చూచి మాఆవిడ బెంబేలెత్తిపోయి లలిత యింట్లో ఉండటానికి వీల్లేదని అంటోంది. ఇప్పటికిప్పుడు దాన్ని ఎక్కడకు పంపించను? ఏం చేయాలో అర్థంకావటం లేదు" దిగులుతో అన్నాడు సీతయ్య.


"పట్నం తీసుకెళ్ళి కోవిద్ పరీక్ష చేయిద్దాం. మీరేమీ కంగారుపడొద్దు." అని రఘుపతికి ఫోన్ చేసి విషయం చెప్పి కారు పంపించమన్నాడు. రఘుపతే కారు తీసుకొని వచ్చాడు.


"అన్నయ్యా నువ్వు వద్దు. నేను డ్రైవ్ చేస్తా. దారిలో రాజా ను తీసుకుని వెళతా. నువ్వు ఊరిలోనే వుండు. ఎవరికి ఏం అవసరమొస్తుందో? నువ్వుంటే ఊరివారికి ధైర్యంగా వుంటుంది" అంటూ రాఘవ, లలితను కారు ఎక్కమన్నాడు.


రఘుపతి కారుదిగి రాఘవతో "జాగ్రత్త" అన్నాడు.


కారు కదులుతుండగా సీతయ్య వచ్చి నీళ్ళు నిండిన కళ్లతో

"రాఘవా నన్ను క్షమించు" అంటూ చేతులెత్తి దండం పెట్టాడు.


కారు కదిలిపోయింది.

రఘుపతి సీతయ్యను "ఏం కాదు. ధైర్యంగా ఉండండి "అని భుజం తట్టి ఓదార్చాడు.


***********************************


రాఘవ కారును నేరుగా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు పోనిచ్చాడు.


కోవిద్ పరీక్ష కోసం లలిత పేరును నమోదు చేయించాడు.


తన సెల్ నంబర్ ఇచ్చాడు.


కొంతసేపటి తరువాత లలితకు మాలిక్యులర్ టెస్ట్, (RT-PCR పరీక్ష) చేసారు.


రిజల్ట్స్ ఒకటి రెండు రోజుల్లో సెల్ కు మెసేజ్ పంపిస్తామని, రెండు వారాలు హొమ్ ఐసోలేషన్ లో ఉండాలని సలహా ఇచ్చారు.


శ్వాస తీసుకోటంలో ఇబ్బంది పడేవారిని మాత్రమే హాస్పిటల్ లో జాయిన్ చేసుకుంటున్నామని మిగిలిన వారు ఇంటి దగ్గరే తగు జాగ్రత్తలతో హొమ్ ఐసోలేషన్ లో ఉండవచ్చని చెప్పారు.


రాజా అక్కడ హౌజ్ సర్జన్ గా చేస్తున్న తన ఫ్రెండ్ అభిజిత్ కు ఫోన్ చేయగా అతను వచ్చాడు. కోవిద్ పాజిటివ్ వస్తే వాడాల్సిన మందుల వివరాలు చెప్పాడు.


"జ్యరం ఉంటే పారాసెటోమోల్‌ 500mg లేదా 650mg ఒక మాత్ర రోజుకు 2 సార్లు,


జలుబు ఉంటే 5 రోజులు సెట్రజిన్‌ ఒక మాత్ర రోజుకు ఒక సారి,


దగ్గు, గొంతు నొప్పివుంటే 5 రోజులు ఆజిత్రల్‌ 500mg - ఒక మాత్ర రోజుకు ఒక సారి,


ఆంటి వైరల్‌ ముందులు 5 రోజులు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ 200mg లేదా డాక్సిసైక్లిన్ (Doxycycline) అనే యాంటీ బయోటిక్ మొదటి రోజు 2 మాత్రలు రెండు సార్లు, 2వ రోజు నుంచి 5వ రోజు వరకు ఒక మాత్ర రెండు సార్లు వేసుకోవాలి.


ఇవికాకుండా విరోచనాలు అయితే స్టారోలాక్‌ DS ఒక మాత్ర రోజుకు రెండు సార్లు,


కడుపులో మంట లేదా కడుపు ఉబ్బరం వుంటే రానీటిడిన్‌ 150mg రోజుకు ఒక మాత్ర రోజుకు ఒకసారి ఉదయం అల్హాహారం ముందు వేసుకోవాలి.


విటమిన్ సి, విటమిన్ డి, మల్టీవిటమిన్ జింక్ టాబిలెట్స్ రోజూ వాడితే మంచిది.


వీటన్నిటిని మించిన మందు మనోధైర్యమే. నాకేం కాదు అని నిబ్బరంగా, ధైర్యంగా వుంటే కోవిద్ ను సులభంగా ఎదుర్కొనవచ్చు" అని చెప్పాడు.


రాజా అతను చెప్పిన మందులన్నీ ఎక్కువ మోతాదులోనే కొనుగోలు చేసాడు.


వూరి వారికి కూడా అవసరానికి ఉంటాయని మందులే కాకుండా ధర్మామీటర్లు, వేలిముద్ర పల్స్ ఆక్సిమీటర్లు కూడా తీసుకున్నాడు.


అభిజిత్ అడిగాడు "వూళ్ళో వాళ్ల పరిస్థితి ఎలా వుంది? కరోనా కేసులు ఏమైనా ఉన్నాయా?"


"ప్రస్తుతానికి అంతా బాగానే వుంది. ఎలాంటి అవసరం ఉన్నా ఎవరూ ఊరు దాటి వెళ్లకూడదనే కఠిన నియమాన్ని పెట్టుకున్నాము.


గ్రామం నుంచి బయటకు.. బయటి నుంచి గ్రామంలోకి ఎలాంటి రాకపోకలు లేకుండా జాగ్రత్త పడుతున్నాము.

బంధుమిత్రులను కూడా ఊరిలోకి రానివ్వడం లేదు.

తమ వారందరికీ ముందే ఈ విషయం తెలియజేశారు.

తప్పనిసరి అవసరాల కోసం బయటకు వెళ్లినా నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నాము.


గ్రామంలో ఉన్న వనరులతోనే ఆహార అవసరాలు తీర్చుకుంటున్నాము. గ్రామస్తులంతా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.


ఇప్పుడు లలితకు కొన్ని లక్షణాలు కనిపించగానే పరీక్ష కోసం తీసుకు వచ్చాము" అన్నాడు రాజా.


"గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్" అని వెళ్లి పోయాడు అభిజిత్.


లలితను తీసుకుని తిరిగి వూరికి చేరుకున్నారు.


లలిత ద్వారా వారి యింటిలో సపరేట్ రూమ్స్ లేవని తెలుసుకుని తమ ఇంటికే కారును పోనిచ్చాడు రాఘవ.


కుటుంబ సభ్యులకు విషయం చెప్పి వారి అంగీకారంతో లలితను ఖాళీగా ఉంచిన ఒక రూం లో ఉంచాడు.


రాజా, సీతయ్య యింటికి వెళ్ళి విషయం చెప్పివచ్చాడు.

విశాల రెండు క్రొత్త చీరలు, నాలుగు నైటీలు, తువ్వాళ్లు, లలితకు అవసరమయిన సామాగ్రినంతా సమకూర్చింది.

కళ్యాణి వచ్చి తనను తాను పరిచయం చేసుకుంది.


కళ్యాణిని చూస్తూనే, "మీరు నాకు తెలుసు. మా కాలేజీకి వచ్చి మీరు అవయవ దానం మీద చక్కగా చెప్పారు. ఆరోజంతా మా స్నేహితులంతా అన్నారు. ఇంత చిన్న వయసులో ఎంత చక్కగా చెప్పిందో అని. నేను కూడా అవయవ దానానికి పేరు ఇచ్చాను" అంది లలిత.


రాఘవ, లలిత బాధ్యత తాను తీసుకుంటానని చిన్నపిల్లలను అటు రాకుండా చూడమని వదినకు చెప్పాడు.


ఇవన్నీ చూస్తున్న లలిత ఒక్కసారిగ ఏడ్చేసింది.


రాఘవ కంగారు పడ్డాడు.


"ఏమైంది? లలితా నీకు భయం లేదు. మేమంతా వున్నాం. కంగారుపడొద్దు. ధైర్యంగా ఉండాలి. అయినా రిజల్ట్స్ ఇంకా రాలేదుగా. పాజిటివ్ గా ఉండు" అన్నాడు.


లలిత కన్నీళ్ళను తుడుచుకుని "మీ ఇంటిలోని వారి ఆదరణ, అప్యాయత చూసి భరించలేని ఆనందంతో ఏడుపు వచ్చింది. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాకోసం అని నాన్న రెండో పెళ్ళి చేసుకున్నాడు.


పిన్నికి పిల్లలు పుట్టే దాకా నన్ను బాగానే చూసింది. తరువాతే ఆమె నా విషయం లో తేడా చూపించేది. చదువు విషయంలో మాత్రం పిన్ని కి ఇష్టంలేకపోయినా నాన్న నాకు అండగా ఉన్నాడు. హైద్రాబాద్ లో యూనివర్సిటీ హాస్టల్ లో వుంటూ అగ్రికల్చరు బి. ఎస్సీ చదువుతున్నాను.


చిన్నప్పటినుండి పిన్ని పోరు పడలేక ఎక్కువుగా నాన్న వెంబడి తిరిగేదాన్ని. నాన్న చేసే వ్యవసాయ పనులను కుతూహలంగా గమనించేదాన్ని. నాకు తెలియకుండానే వ్యవసాయం మీద మక్కువ కలిగింది.


మీకు కూడా తెలిసే వుంటుంది మన వూరిలో ట్రాక్టర్ తో పొలం దున్నగలిగే ఎకైక మహిళను నేనే. ఈ ఇంట్రెస్ట్ తోనే నేను చదువులో కూడా వ్యవసాయ రంగాన్ని ఎన్నుకున్నాను.


పిన్ని తమ్ముడు శేషగిరి ఒకసారి నా మీద చేయి వేస్తే అతని చెంపలు రెండూ వాయించాను. నాజోలికి వస్తే చెప్పు తెగుద్ది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఆ కోపం కూడా వుంది పిన్నికి. అతనిని జైలు పాలు కాకుండా కాపాడ లేదని నాన్న మీద కూడా కోపం.


ఈ మధ్య కాలం లోనే ఫీల్డ్ ట్రిప్ కు రెండు ప్రదేశాలు తిరిగొచ్చాము మా కాలేజీ తరఫున. లాక్ డౌన్ పెడుతున్నారన్న వార్తలు తెలిసి ముందుగానే హాస్టల్ విద్యార్ధులందరినీ ఇళ్ళకు పంపించేశారు. ఇంటికొచ్చాక నేను ఎటూ కదలలేదు. మరి జ్వరం ఎందుకొచ్చిందో అర్థం కావటం లేదు" అన్నది.


రాఘవకు అర్థమయింది, ఫీల్డ్ ట్రిప్ కు వెళ్ళినప్పుడే కోవిద్ అటాక్ అయివుంటుందని. లక్షణాలు బయటపడటానికి కొంతమందికి రెండు వారాల సమయం పడుతుంది.

ఈ విషయం లలితతో అనలేదు.


"భోజనం తీసుకువస్తా ! తిని టాబిలెట్స్ వేసుకుని ప్రశాంతంగా పడుకోండి." అని గుమ్మం ముందునుండి లేచాడు.


రెండు రోజులకి లలితకు పాజిటివ్ అని రాఘవ సెల్ కు మెసేజ్ వచ్చింది.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.


22 views0 comments
bottom of page