top of page

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 10


'Sabhaash Sanjeevi - Episode 10' - New Telugu Web Series Written By Otra Prakash Rao Published In manatelugukathalu.com On 18/02/2024

'శభాష్ సంజీవి - ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక

రచన : ఓట్ర ప్రకాష్ రావు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


‘గుడ్దిగోలా’ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడంవల్ల వచ్చే నష్టం గురించి స్కూల్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి.. దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండుడు.. 


వార్డెన్ విశ్వనాథాన్ని లోబరుచుకుని, సంజీవి మీద దొంగతనం నేరం మోపి, ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు.. అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమౌతాడు సంజీవికి.. 


సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ. సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం. 


తమను బంధించిన చోటునుండి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బాలు, సంజీవి. పిల్లల మంచితనం చూసి, వాళ్ళను వదిలివేస్తారు చండుడి అనుచరులు. 


హెడ్ మాస్టర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు సంజీవి, బాలు. 


బాలు, పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడుతాడు. 


హానికరమైన పానీయాలకి వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఉధృతం చేస్తాడు సంజీవి.. 

‘గుడ్దిగోలా’ అధినేత కాలకేయుడిలో మార్పు వస్తుంది. 


ఇక శభాష్ సంజీవి - ఎపిసోడ్ 10 చదవండి.. 


తమ కుర్చీలలో కూర్చున్నాక “నువ్వు ఏమి అడుగుతావో అడుగు మై డియర్ సంజీవి " అంటూ ఆంగ్లంలో అన్నాడు కాలకేయుడు. 


 ఆ మాటలను తెలుగులో అనువదించి సంజీవికి చెప్పాడు వెంకటరమణ. అతను చెప్పిన మాటలు సంజీవికి అర్థం అయినా లైవ్ టెలికాస్ట్ నందు చాలామంది చూస్తూవుంటారు. అందుకే ప్రతి వాఖ్యమూ అటు తెలుగులో ఇటు ఆంగ్లములోఅనువదించవలచి వచ్చింది. 


"సార్, మీరు ఎంతటి గొప్ప ధనవంతులో మాకు తెలుసు. మీరు ఇంతదూరం ఇక్కడకు వచ్చి నాతో మాట్లాడటం ఆశ్చర్యం కలిగింది. "అన్నాడు సంజీవి. 

 అనువాదకుడిగా పనిచేస్తున్న వెంకటరమణ సంజీవి చెప్పిన మాటలను ఆంగ్లములోనికి అనువదించాడు. 


"ఇంతవరకు నేనొక పెద్ద వ్యాపారవేత్తను. ఇంతవరకు ఎంతోమందిని పిలిపించి మాట్లాడటం, అలా వీలుకాకుంటే, వీడియో కాన్ఫరెన్స్ నందు మాట్లాడటం జరిగేది. నీ గురించి విన్నాను. సమాజంపై ఎవరికీ లేని శ్రద్ద నీలో కలగడం నన్ను ఆలోచింపచేసింది. నేనిప్పుడు పెద్ద వ్యాపారవేత్తగా రాలేదు. నేను మామూలు మనిషిలా ఒక మంచి బాలుడిని చూడటానికి వచ్చాను. "


“మీరు ఈ కంపెనీ ప్రారంభించడానికి ముందు ఏం చేసేవారు సార్" అడిగాడు సంజీవి. 


"నేను ఒకప్పుడు సాధారణ కుటుంబానికి చెందిన వాడిని. ఈ దేశంలో అతితక్కువ మూలధనంతో ఆ కంపెనీ స్థాపించాను. ప్రజలు ఈ పానీయం వైపు ఎక్కువ ఆసక్తి చూపించడం నాకే ఆశ్చర్యం కలిగింది. అంచలంచలుగా నేను అభివృద్ధి చెందాను. ఇప్పుడు కోటీశ్వరుల జాబితాలో నా పేరు వుంది "


"గుడ్డి గోలా పానీయం ఎవరు కనిపెట్టారు సార్ "


"గుడ్డీ గోలా పానీయం ఈ దేశం వారు కనిపెట్టలేదు.. దేశంలో తయారయింది. ఆ దేశంలో బాగా వ్యాపారం జరగడంవలన క్రమక్రమంగా ఇతర దేశాలలో బాగా వ్యాపారం వృద్ధి చెందింది "

"గుడ్డి గోలా పానీయం ఎక్కువగా చదువుకొన్న వారు విద్యార్థులు యువకులు ఇష్టపడవుతున్నారు ఇందులో రహస్యం ఏమిటి సార్ ?"


"చదువుకొన్న వారికి జ్ఞానం అవగాహన పెరుగుతుందంటారు. కానీ చదువు పెరిగింది కానీ వారిలో అవగాహన లోపించింది. అవగాహన లోపించిన ఆ చదువుకున్నవారు ఈ పానీయం కొని త్రాగుతున్నారు. అదే మా వ్యాపారానికి రహస్యం. " అన్నాడు కాలకేయుడు. 


 "గుడ్డి గోలా అని పేరు ఎందుకు పెట్టారు సార్ "


"గుడ్డి గోలా పేరు మన దేశంలో పెట్టిన పేరు కాదు.. ఆ దేశంలో ఆ పేరుకు అధిక శక్తీ అన్న అర్థం వస్తుంది. గుడ్డి అంటే బ్లైండ్(blind) అన్న ఆంగ్ల పదానికి అర్థమని ఈ మధ్యనే తెలిసింది. పానీయానికి నిజమైన పేరు తెలుగు రాష్ట్రాలలో వుంది అని అనుకొన్నాను. అవగాహన లేని గుడ్డి వారు తాగే గుడ్డి గోలా. అందరినీ గుడ్డి వారిని చేసి తాగిస్తోంది. చివరకు వారి జీవితాలకు గుడ్డితనం ప్రసాదిస్తుంది. " అన్నాడు కాలకేయుడు. 


"సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు పరిశోధించి ఎన్ని హెచ్చరికలు చేసినా విద్యార్థులు యువకులు అవగాహన లేకుండా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వము, మంత్రులు ఏం చేస్తున్నారు సార్ "


"సంజీవీ కష్టమైన ప్రశ్న వేశావు. దీనికి సమాధానం చెప్పాలంటే చాల వుంది. మా పానీయం మాత్రమే జంక్ ఫుడ్ నందు వస్తుందనుకొంటున్నావా. మా పానీయంతోపాటు ఎన్నో చిరుతిండ్లు జాబితా వస్తుంది. అవగాహన లోపం వలన వ్యాపారం బాగా సాగుతోంది. ఇక ప్రభుత్వం, మంత్రులు ఏమి చేయలేదని చెబితే నేను అంగీకరించను. పురుషులలో పుణ్యపురుషులు ఉన్నట్లు మంత్రులలో కొంతమంది పుణ్యమంత్రులు వున్నారు. ఈ మంత్రి గారు ఇంతకాలం నాకు శత్రువుగా వున్నారు. ఎలాగైనా గుడ్డి గోలా పానీయాన్ని తయారు చేయడం నిలిపివేయాలని ప్రయత్నించారు. కానీ పాపం ఆయన వలన కాలేదు. అతను నాకు ఇప్పుడు స్నేహితుడుగా నాకు చేయి ఇచ్చాడు ఎందుకంటె.. నేను చెప్పడం కన్నా నీ ప్రశ్నకు సమాధానం ఆయన చెబితే బాగుంటుంది " అన్నాడు కాలకేయుడు. 


“నా ప్రియమైన సంజీవీ, గుడ్డి గోలా పానీయం మన దేశంలో మూసివేయాలని మొదటినుండి గొడవచేస్తున్న మంత్రిని. నాకు అయన శత్రువు. ఆయనకు నేను శత్రువును. పదిహేను రోజులక్రితం ఆయన తన నిర్ణయం చెప్పగానే ఆయన లోని మార్పుకు చేతులెత్తి నమస్కరించాను. ఇప్పుడు మంత్రులలో పరిపాలనాధికారులలో మార్పు వచ్చింది. 


విషతుల్యమైన జంక్ ఫుడ్, కల్తీ ఆహరం వ్యాపారం చేసేవారికి కఠినమైన శిక్షలు తీసుకొని వచ్చే చట్టం త్వరలోనే వస్తుంది. అందుకు కారణం నీవు. ఆ గొప్ప నటుడిపై చేసిన పోరాటం మాలో ఆలోచింపచేసింది. ఆ నటుడు ఒక్క అడుగు దిగి క్షమాపణ కోరుకోవడంతో మాలోనూ ఆలోచనలు మొదలయింది. ఈ దేశం కాపాడవలసిన బాధ్యత మీ తరంలోనే వున్నది. " అంటూ కూర్చొన్నాడు కేంద్ర మంత్రి.

 

“సార్, నన్ను కిడ్నప్ చేసి మీ కంపెనీ తాయారు చేసే ఒక చిన్న కంపెనీలో బంధించారు. అక్కడ గుడ్డి గోలా పానీయం నందు మత్తుమందు కలపడం చూసాను. దీనిపై మీ సమాధానం సార్ "


“జంక్ ఫుడ్ విషతుల్యమైనదని సి ఎస్ ఈ (CSE) లాంటి ప్రభుత్వసంస్థలు ఎన్నడో చెప్పింది. ప్రజలు అధికారులు పట్టించుకోలేదు. చిన్న వ్యాపారస్తులకు ఇదొక అవకాశం గా తీసుకొన్నారు. కల్తీ వ్యాపారం వలన ఎవరు చనిపోయినా పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల వేరే కారణం చూపుతున్నారు. ప్రస్తుతం ఇలాగే జంక్ ఫుడ్ నందు బిస్కేట్స్, చాకోలెట్స్, వాటినందు మత్తుమందు కలుపుతూ విద్యార్థులను యువకులను మత్తులో దింపుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. 


మా నీడన ఉంటున్న చండుడు లాంటి గుంట నక్క మాకు తెలీకుండా డబ్బుకోసం ఇదే గుడ్డి గోలాలో మత్తుమందు కలుపుతూ విద్యార్థులకు అందేలా చేస్తూ వారి భవిష్యత్తు చీకటి మయం చేస్తున్నాడు. చండుడు దుర్మార్గమైన పనివలన మత్తుపానీయం త్రాగి ఈ జిల్లాలోని స్టార్ హోటల్ నందు ముగ్గురు విద్యార్థులు మరణించారు. అందుకు సాక్షిగానున్న బాలూను కిడ్నాప్ చేసాడు. చండుడు తన దొంగ వ్యాపారం కోసం నిన్ను కిడ్నాప్ చేసిన సంగతి నీవు తప్పించుకొని వచ్చాక తెలిసింది. "

 “ఆ చండుడు ఇప్పుడు ఎక్కడున్నాడు సార్”


“నీవడిగిన ప్రశ్నకు మంత్రిగారే సమాధానం చెబుతారు " అన్నాడు కాలకేయుడు.


“ఈ జిల్లాకు టోకు వ్యాపారస్థుడిగా ప్రవేశించిన చండుడు ఆ పానీయంలో మత్తుమందు కలుపుతూ ఎన్నో కోట్లు సంపాదించిన సంగతి నీవు బాలు కలసి వాడి గుట్టును రట్టుచేశాక తెలిసింది. పోలీసులు వాడిమీద చర్య తీసుకొంటున్నారని తెలుసుకొని ఆస్తిని, భార్య బిడ్డలను వదలి దొంగచాటుగా ఈ దేశం వదిలి పారిపోయాడు. నిన్నటి రోజున ఆ చండుడు.. దేశంలో ఉన్నట్లు విజిలెన్సు ద్వారా మాకు సమాచారం వచ్చింది. బాలూ ఇచ్చిన ఫిర్యాదువలన హోటల్ నందు ముగ్గురు మరణానికి చండుడు తయారుచేసిన గుడ్డి గోలా కారణం అంటూ కేసు నమోదుచేసుకొన్నారు. చండుడు ను మన దేశానికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాము వాడికోసం ఒక బృందం ఏర్పాటు చేసాము”


“ఆ బృందంతో వేరే విధంగాప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నేను అనుకొంటున్నాను సార్. " అన్నాడు సంజీవి.


 “వేరే విధంగానా ఎలా? " అంటూ ఆశ్చర్యంగా సంజీవి వైపు చూసాడు మంత్రి.

 

“చండుడు విదేశానికి దొంగ పత్రాలతో వెళ్ళడానికి ఎవరు సహకరించారో ఆ బృందం ద్వారా కనుక్కొని వారికి చాలా కఠినమైన శిక్ష విధించండి సార్. మన దేశంలో చండుడు లాంటి దొంగలు విదేశాలకు పారిపోవడానికి కొంతమంది బాగా సహకరిస్తున్నారు. " అన్నాడు.

 

మంత్రి ఒక్కసారిగా ”శబాష్ “ అంటూ చేతులతో చప్పట్లు కొట్టాడు. “సంజీవి నీవు చెప్పింది మంచి ఆలోచన. రేపే ఆ చండుడు వెళ్ళడానికి సహకరించిన వ్యక్తులను పట్టుకొనడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తాను. ఆ చండుడు ఎప్పుడు వస్తాడో చెప్పలేనుకానీ, వాడు వెళ్ళడానికి సహకరించిన వ్యక్తులకు తొందరలో కఠినమైన శిక్ష విధించేలా చేస్తాను. తొమ్మిదవ తరగతి చదువుతున్న నీలో ఇన్ని ఆలోచనలు ఎలా వస్తున్నాయి "అన్నాడు మంత్రి.

 

“ఆదివారం పోరాటం జరుపుతున్న సమయాన దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి, వాటికై తీసుకొనవలసిన మార్గాలగురించి చర్చించడం వలన తెలిసింది సార్. ”


 "శబాష్ " అంటూ మరోసారి చేతులు తట్టాడు మంత్రి.


“సార్, ఇకమీదట గుడ్డి గోలా పానీయం తయారం చేయడం నిలిపివేస్తారా " కాలకేయుడువైపు చూస్తూ అడిగాడు సంజీవి. 


“ఎట్టి పరిస్థితులలోనూ నిలపను” అన్నాడు కాలకేయుడు.

 

 “సార్.. సార్ మీరు ఇక్కడకు వచ్చి మీరు ఆ కంపెనీ మూసివేస్తారని అందరూ ఊహించుకొన్నారు” 


 “ఎందుకు మూసివేయాలి సంజీవి”


 “అది ఒక విషతుల్యమైన.. ”


"విషతుల్యమైన పానీయం అని అంగీకరిస్తున్నాను. నేను అలాగే తయారు చేయలేను. ఎందుకంటె ఇప్పుడు మంత్రులలో మార్పు వచ్చింది. త్వరలో కంపెనీ మూయడానికి అవకాశం వుంది. అదొక మంచి పానీయంగా తయారు చేయడానికి ప్రభుత్వానికి, మంత్రులకు అభ్యంతరం వుండదుగా. అందరూ మెచ్చుకునేలా ఆరోగ్యవంతమైన పానీయం తయారు చేస్తాను. సి ఎస్ ఈ (CSE) సంస్థ పరిశోధించి ఆ పానీయం ఆరోగ్యకరమైనది ప్రకటించాక ఆ పానీయం మార్కెట్టులోనికి వస్తుంది. ”


సంజీవి రెండుచేతులు జోడించి నమస్కరిస్తూ "మీరు చాలా గొప్పమనసు కలవారు సార్ " అన్నాడు. 


 “ఇంతవరకు నీవు ప్రశ్నలు వేశావు. ఇక నన్ను కొన్ని ప్రశ్నలు వేయమంటావా సంజీవి "అడిగాడు కాలకేయుడు.

 

 “అడగండి సార్ “ అన్నాడు.


 "నేను ఒక్కరి దాహం తీర్చలేని సముద్రం నీటి లాంటి ధనవంతుడ్ని. కానీ నీవు బావి నీరు లాంటి వాడు అందరి దాహం తీర్చే గుణవంతుడు. నేనూ అలా మారాలనుకొంటున్నాను. మానవత్వం లేని ధనవంతుడిగా నడచుకొన్నాను. ఇకపై మానవత్వం వున్నా గుణవంతుడిగా అనడంకన్నానీలాగా నడచుకొనదలచుకొన్నాను సంజీవి. "


 ఒక్కసారిగా అంతగా పొగడగానే ఏమిసమాధానము చెప్పాలో అర్థం కాలేదు 


 “సార్.. " అన్నాడు సంజీవి.

 

 "శరీరానికి మరణం ఒక్కసారి వస్తుంది. మా జీవితం ఎలావుందీ తెలుసా. పేరుకు పెద్ద కోటీశ్వరుడిని కావచ్చు కానీ తప్పుచేసిన ప్రతిసారీ మరణం, అశాంతి చూస్తున్నాం. నాలో మార్పు కలిగాడానికి కారణం మా అబ్బాయి "


 “మీ అబ్బాయా "


 “గుడ్డి గోలా పానీయం ప్రకటనలో నటించిన ఆ హీరో మీద నీవు పోరాటం చేస్తున్నప్పుడు ఆ వార్తలను చదివిన మా అబ్బాయి నిన్ను ‘శబాష్ సంజీవి’ అంటూ మెచ్చుకున్నాడు. ‘ నాన్నా ఒక చిన్న పిల్లవాడు నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. ఎందరో అతనిని శబాష్ సంజీవి అంటూ పొగుడుతున్నారు. ఆ పానీయమునందు ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని తొలగించి మంచి ఆరోగ్యం కలిగించే పానీయం తయారు చేయండి నాన్నా అంటూ వేడుకొన్నాడు "


“మీరేమి చెప్పారు సార్ “


“వెంటనే అంగీకరించాను”


 “CSE లాంటి సంస్థలు ఎన్నో చెప్పినా అంగీకరించలేదు. మీ మనస్సాక్షికి అదొక విషతుల్యమని తెలిసినా మీరు అంగీకరించలేదు. ఇప్పుడు మీ అబ్బాయి చెప్పగానే ఎలా అంగీకరించారు సార్” 


 “మా అబ్బాయి విదేశంలో ఒక పెద్ద ఆసుపత్రిలో చివరి రోజులు గడుపుతున్నాడు వాడు కోరిన కోరికలు రెండే రెండు, మొదటి కోరిక గుడ్డి గోలా పానీయం ఒక ఆరోగ్యమైన పానీయంలా అందరూ అంటే శాస్త్రీయంగా మెచ్చుకునేలా తాయారు చేయమన్నాడు " అంటూ మౌనం వహించాడు.

 

 “రెండవ కోరిక ఏమిటి సార్”


 “ అది నీచేతుల్లో వుంది “ అంటూ సంజీవి వైపు చూసాడు.

 

 “ నా చేతుల్లోనా సార్ “ అనుమానంగా కాలకేయుడివైపు చూసాడు.

 

“మా అబ్బాయి రెండవ కోరికగా ఏమి చెప్పాడంటే.. నాన్నామా తరం వారూ ఇలా అవగాహన లేకుండా ఉండడం ఈ ఆసుపత్రికి వచ్చాక గుర్తించాను. నేనూ జంక్ ఫుడ్ తిని తిని ఆరోగ్యం పూర్తిగా నాశనం చేసుకొని చివరి దశకు వచ్చాను. మీరు ఆ సంజీవిని దత్తత తీసుకొని నా స్థానంలో ఉంచండి. సంజీవిలో గొప్పగుణం వుంది. వాడిని అందరూ శబాష్ సంజీవి అని అంటున్నారు’అన్నాడు. నీవు అంగీకరిస్తే నేను నిన్ను ఇప్పుడే నా కొడుకుగా దత్తత చేసుకొంటాను సంజీవీ. ఈ రోజే ఇదే హెలికాఫ్టర్ లో వెళ్ళిపోదాం. " అన్నాడు కాలకేయుడు. 


కాలకేయడు చెప్పిన మాటలను తెలుగులోనికి అనువాదం చేసిన తరువాత సంజీవిని ఎత్తుకొని వెళ్లి కాలకేయుని ఒడిలో కూర్చొనబెట్టి "శబాష్ సంజీవి" అన్నాడు వెంకటరమణ.

 

 (అయిపోయింది )

========================================================================

సమాప్తం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ ఓట్ర ప్రకాష్ రావు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

========================================================================

ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు:  ఓట్ర ప్రకాష్ రావు

https://www.manatelugukathalu.com/profile/oprao/profile2. నా గురించి   : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు  :  1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి,  2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి,    2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను.   2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను               2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక               2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది             2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి           2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి  ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది       ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు

27 views1 comment
bottom of page