top of page
Original.png

సనాతన ధర్మం వేద విజ్ఞాన మూలం

సనాతన ధర్మం, వేదాలు, వేద విజ్ఞానం, ఉపనిషత్తులు, వేదాంతం, ఓంకారం, ఓం కార మహిమ, వేదవ్యాసుడు, భగవద్గీత, స్మృతులు, అపౌరుషేయ వేదాలు, హిందూ ధర్మం, వేద అధ్యయనం, ఆధ్యాత్మిక జ్ఞానం, వేద సారం, ఉపనిషత్ తత్వం, సనాతన సంప్రదాయం, భారతీయ ఆధ్యాత్మికత, వేద సంస్కృతి, పరబ్రహ్మ తత్వం

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ వ్యాసంలో వేదవ్యాస మహర్షి, వేద మంత్రాలు, ఓంకారం మరియు ఉపనిషత్తుల జ్ఞానాన్ని ప్రతిబింబించే సనాతన ధర్మ ఆధ్యాత్మిక దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ వ్యాసంలో వేదవ్యాస మహర్షి, వేద మంత్రాలు, ఓంకారం మరియు ఉపనిషత్తుల జ్ఞానాన్ని ప్రతిబింబించే సనాతన ధర్మ ఆధ్యాత్మిక దృశ్యం.

 

Sanathana Dharmam Veda Vijnana Mulam - Telugu Article | R C Kumar

సనాతన ధర్మం వేద విజ్ఞాన మూలం - తెలుగు వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 24/06/2026


సనాతన ధర్మం ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఒకటి. దానికి మూలాధారంగా నిలిచిన వేదాలు మానవ జీవితానికి ధర్మం, జ్ఞానం, ఆత్మసాక్షాత్కారం మరియు మోక్షమార్గాన్ని బోధిస్తాయి. ఉపనిషత్తులు వేదాంత సారాన్ని అందిస్తే, భగవద్గీత ఆ జ్ఞానాన్ని సాధారణ మానవునికి సులభంగా అర్థమయ్యేలా అందిస్తుంది. ఈ వ్యాసంలో వేదాల ఆవిర్భావం, వేదవ్యాస మహర్షి పాత్ర, ఓంకారం ప్రాముఖ్యత, స్మృతులు, ఉపనిషత్తులు మరియు భగవద్గీత గొప్పతనాన్ని తెలుసుకుందాం.


సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన ప్రాచీన విజ్ఞాన సర్వస్వాలనే వేదాలు అంటారు. సంస్కృతంలో 'వేదం' అంటే జ్ఞానం అని అర్థం. 'ఉపనిషత్' అంటే గురువు పాదాల చెంత జ్ఞానార్జన కోసం కూర్చోవడం అని అర్థం. వేదాలు మనిషికి జీవన విధానంలో ఆచారాలను, ధర్మాలను నేర్పిస్తే, ఉపనిషత్తులు మనిషికి తాను ఎవరు అనే ఆత్మ తత్త్వాన్ని తెలిపే అంతిమ సత్యాలను బోధిస్తుంది. వేదాంతాలు అనగా వేదాలలోని చివరి భాగాలైన ఉపనిషత్తులు వేదాలలో అంతర్భాగంగానే ఉంటాయి.


వేదాలు అపౌరుషేయాలు :

సనాతనుల విశ్వాసం ప్రకారం వేదాలను ఏ మానవుడూ రాయలేదు. అందువల్లనే వీటిని 'అపౌరుషేయాలు' అంటారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం వేదాలు భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల (శ్వాస) నుంచే వచ్చాయని నమ్ముతారు.

వేదాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. సృష్టి ప్రారంభంలో పరమాత్మ శ్వాస తీసుకొని విడిచినప్పుడు, ఆ దైవిక కంపనాల నుండి ఓంకారం, తద్వారా నిత్యం వెలువడే అనంత శబ్దరాశిగా వేదాలు ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రాచీన మునులు గాఢమైన తపస్సులో ఉన్నప్పుడు దివ్యధ్వనులుగా విన్న జ్ఞానాన్ని (శ్రుతులు) యుగయుగాలుగా కేవలం మౌఖికంగా గురు-శిష్య పరంపరగా ఇతరులకు ఉపదేశించారు. కనుక ఆ శబ్దరాశికి 'శ్రుతులు' (వినబడ్డవి) అనే పేరు ఏర్పడింది.


మహర్షి వేదవ్యాసుడి పాత్ర :

వేల సంవత్సరాల తర్వాత, మహర్షి వేదవ్యాసుడు ఈ అనంతమైన వేద రాశిని 4 భాగాలుగా విభజించి, లిఖితపూర్వకంగా గ్రంథస్తం చేశాడు. వేదాలు క్లిష్టమైనవి, ప్రజలందరికీ అందుబాటులో లేనివి కనుక వేద వ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను అతని శిష్యుడైన రోమహర్షణుడికి  పురాణాలను, వాటిలోని ఇతిహాసాలను మరియు ధర్మశాస్త్రాలను సమగ్రంగా నేర్పాడు. నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, ఈ పురాణ జ్ఞానాన్ని రోమహర్షణుడి  కుమారుడైన సూత మహర్షి (ఉగ్రశ్రవుడు) శౌనకాది మహర్షులకు ప్రవచించడం ద్వారా లోకానికి విస్తరించడం జరిగింది.‌


వేదాలు ఏం చెబుతున్నాయి ?

సనాతన ధర్మానికి వేదాలు అత్యంత ప్రామాణికమైన, పవిత్రమైన మూలాధారాలు. విశ్వం యొక్క సృష్టి, మానవ జీవన విధానం, నైతిక విలువలు, మరియు మోక్ష సాధన గురించి వేదాలు స్పష్టం చేసాయి. వేదాలు కేవలం పూజా విధానాలకే పరిమితం కాలేదు. వీటిలో ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు, ప్రకృతి నియమాలు, యోగం, ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం వంటి ఎన్నో లౌకిక విజ్ఞాన విషయాలు కూడా ఉన్నాయి. సనాతన ధర్మం బహుదేవతారాధనను ప్రోత్సహిస్తున్నట్లు కనిపించినా, అంతిమంగా పరమాత్ముడు ఒక్కడేనని (ఏకేశ్వరవాదం) వేదాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. "సత్యం ఒక్కటే, దానిని పండితులు వివిధ రకాలుగా పిలుస్తారు" అనేది వేద సారాంశం.‌


శాస్త్రీయ దృక్పథం Vs సనాతన ధర్మం :

అయితే వేదాలు పౌరుషేయాలా లేక అపౌరుషేయాలా అనే విషయంలో శాస్త్రీయ దృక్పథం ఏమిటో కూడా చూద్దాం. వసిష్ఠుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, అగస్త్యుడు, గౌతముడు, జమదగ్ని, నారదుడు, దేవరతుడు, పరాశరుడు, అంగీరసుడు, మధుచ్చందుడు మొదలైన పలువురు ఋషులు వివిధ దేశకాలాలలో వాటిని రాయడం జరిగింది. మానవ నాగరికత పురోగమిస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు తాము నేర్చుకుంటున్న కొత్త విషయాలను వీరంతా వేర్వేరు కాలాలలో తమకు ముందరి  కాలంలో చేయబడిన సూత్రీకరణలకు జతపరుస్తూ వచ్చారు. కాబట్టి వేదాలు కూడా పౌరుషేయాలే అని కొందరు పండితులు వాదన. అందరికీ ఆమోదయోగ్యమైన విషయం ఏమిటంటే ఈ విశ్వంలో, ప్రకృతితో మానవ సమాజపు అతి ప్రాచీనమైన అనుభవాలు, అనుభూతుల సారమే వేదాలు. ఒకసారి వాటికి పవిత్రతను ఆపాదించిన తరువాత వాటి సృష్టికర్త భగవంతుడే అని భావించడం మొదలవుతుంది. సాధారంగా అన్ని మతాలూ ఇలాగే తమ పవిత్ర గ్రంథాలు మానవ సృష్టి కావనీ అవి దైవకల్పితాలు, దైవ సృష్టి అనే విశ్వాసాన్ని తమ శిష్యులు, అనుయాయులలో నెలకొల్పుతాయి. కానీ అవన్నీ పౌరుషేయాలే అంటే మానవ కల్పితాలే అని వాదించేవారు లేకపోలేదు. హిందూ సనాతన ధర్మం ప్రకారం వేదాలను ఎవరూ రాయలేదు. వేదాలు భగవంతుని శ్వాసగా పరిగణించబడతాయి కాబట్టి అవి 'అపౌరుషేయాలే'. భాగవత పవిత్ర గ్రంథం చెబుతున్నది కూడా అదే.


ఓంకారం :

సృష్టి ఆవిర్భావ సమయంలో వెలువడిన ఆదిమ నాదం ఓంకారం. సమస్త వేద జ్ఞానం దీని నుంచే ఉద్భవించిందని సనాతనుల నమ్మకం. అందుకే వేదాధ్యయనం, పూజలు ఓంకారంతోనే మొదలవుతాయి. ఓంకారం (ఓం) అనేది సమస్త వేదాలకు ఆది, ఆధారం, సారం. వేదాలు అంతిమంగా చెప్పే పరబ్రహ్మ తత్వానికి ఓంకారం ప్రతీక. ఈ కారణంగా, వైదిక తత్త్వంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. దీనినే బీజ మంత్రము అని కూడా అంటారు. ఈ ఓంకార నాదంలో మూడు అక్షరములు ఉంటాయి: అ.... ఉ....మ. ఓం-కార జప పద్ధతిలో మొదట ‘అ’ కారమును నాభి స్థానము నుండి మొదలై, గొంతు మరియు నోటితో ముగుస్తుంది. ఈ మూడు భాగాలైన అ.... ఉ....మ.. లకు ఎన్నో అర్థాలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి. అ'కార, 'ఉ'కార 'మ'కారాలతో కూడిన ఓంకారం సృష్టి, స్థితి, లయలు మరియు త్రిగుణాలకు ప్రతీక. ‘ఓం’ అనేది భగవంతుని నిరాకార తత్త్వానికి ఉన్న పేరు. అది సకల మంత్రాలకు బీజాక్షరం.


స్మృతులు :

'స్మృతి' అంటే జ్ఞాపకం ఉంచుకుని రాసినది అని అర్థం. వేదార్థాల గురించి గురు ముఖతః తాము విన్న విషయాలను గుర్తుకు తెచ్చుకుని ఋషులు రాసినవే స్మృతులు. వేదాలలోని ధర్మాలు, నియమాలు, ఆచారాలను సమాజానికి అనుగుణంగా ఋషులు గ్రంథస్తం చేశారు. వివిధ రచయితల చేత రాయబడిన ధర్మ శాస్త్రాలు, క్రోడీకరించబడిన న్యాయశాస్త్ర కోశాలు, ధర్మ సంహితలు వంటివన్నీ స్మృతుల కిందికే వస్తాయి. స్మృతులనే ధర్మశాస్త్రాలు అనికూడా అంటారు. మనుస్మృతి, బాదరాయణ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి  వంటివి ఇందుకు ఉదాహరణలు. మొత్తం 18 ప్రధాన స్మృతులు ఉన్నాయని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదాలు మార్చడానికి వీల్లేనివి, కానీ స్మృతులు మాత్రం కాలానికి, సమాజ పరిస్థితులకు తగినట్లుగా ఋషులు మార్పులు చేయడానికి అనువుగా రూపొందించబడ్డాయి.


వేదాధ్యయనం :

నాలుగు వేదాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే అది ఒక జీవితకాలపు ప్రక్రియ. వేదాలను కేవలం పఠనం చేయడానికే సుమారు 2 నెలల సమయం పడుతుంది. కానీ వాటి అర్థాన్ని, అంతరార్థాన్ని మరియు ఆచరణను సాధించడానికి ఒక్కొక్క వేదానికి దాదాపు 6 నుండి 8 సంవత్సరాల కఠినమైన శిక్షణ అవసరం అవుతుంది. ఆ విధంగా నాలుగు వేదాలు, వాటి వేదాంగాలు, ఉపనిషత్తులతో సహా సంపూర్ణంగా అధ్యయనం చేయడానికి 24 నుండి 36 సంవత్సరాల సమయం పడుతుంది. పూర్వకాలంలో ఒక్క వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళని ఏకవేది అని, రెండు వేదాలను చదివి అధ్యయనం చేసిన వాళ్ళను ద్వివేది, మూడు వేదాలను అధ్యయనం చేసిన వాళ్లను త్రివేది, నాలుగు వేదాలలోనూ నిపుణులైన పండితులను 'చతుర్వేది' అని పిలిచేవారు.


భగవద్గీత రూపంలో ఉపనిషత్తుల సారాంశం :

మొత్తం 108 ఉపనిషత్తులలో  ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్నవి 12 మాత్రమే. అందులో శంకరాచార్యులు భాష్యం రాసిన 10 ఉపనిషత్తులు ప్రముఖమైనవి. భగవద్గీతలోని అనేక శ్లోకాలలో ఉపనిషత్ వచనాలు పునరావృతం చేయబడ్డాయి. రాబోయే కలియుగంలో  మానవుల కష్టాన్ని ముందుగానే ఊహించిన కృష్ణుడు వేదాలలోని పరిపూర్ణ జ్ఞాన సారాన్ని సంగ్రహించి, అర్జునుడిని అడ్డుపెట్టుకొని మనందరికీ చెప్పడం జరిగింది. ఉపనిషత్తుల సారంతో కూడిన భగవద్గీత యొక్క గొప్పతనాన్ని వివరించే అద్భుతమైన శ్లోకం - సర్వోపనిషదోగావో.  వేదాలకు నిర్వచనాన్ని ఇచ్చేవి, వేదాలకు కిరీటాల లాంటివి ఉపనిషత్తులు. అలాంటి  ఉపనిషత్తులన్నింటినీ ఆవులతో, పాలను గీతతో పోల్చి ఆ గీతాజ్ఞానమే వేదాలు మరియు ఉపనిషత్తుల సారాన్ని ఇస్తుందని చెప్పడమే ఆ శ్లోకం ఉద్దేశం.  అత్యున్నత జ్ఞాన భాండాగారాలైన ఉపనిషత్తుల నిగూఢార్థాలను సామాన్యులు నేరుగా గ్రహించడం కష్టం కనుకనే జగద్గురువైన శ్రీకృష్ణుడు ఉపనిషత్తుల సారాన్నంతటినీ క్రోడీకరించి, అర్జునుడిని నెపంగా పెట్టుకుని మానవాళికి భగవద్గీత రూపంలో సులభ శైలిలో అందించాడు.


పరోక్షంగా సూచించడం ఏమిటంటే భగవద్గీతను సంపూర్ణంగా అధ్యయనం చేసి, ఆచరించే వారికి ఇక వేదాలను, ఉపనిషత్తులను చదివే అవసరం ఉండదు.


శుభమస్తు 



ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page