సెన్సేషనల్ న్యూస్ - పార్ట్ 2
- Sudha Vishwam Akondi

- May 26
- 2 min read
తెలుగు సామాజిక కథ, సుధావిశ్వం కథలు, భావోద్వేగ తెలుగు కథ

Sensational News- Part 2/3 - Telugu Emotional Story | Sudhavishwam Akondi
సెన్సేషనల్ న్యూస్ - పార్ట్ 2/3 - తెలుగు భావోద్వేగ కథ | సుధావిశ్వం ఆకొండి
Published In manatelugukathalu.com On 26/05/2026
జరిగిన కథ : మిత్రులు ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకుంటారు. అందుకోసం అన్నీ సమకూర్చుకుని, మంచి సెన్సేషనల్ న్యూస్ తో స్టార్ట్ చేద్దామని పార్కులోకి వెళ్లి చూస్తే ఏదైనా మంచి న్యూస్ దొరుకుతుందని వెళితే, ఒక ముసలి వ్యక్తి కనిపించి తన గోడు వెళ్లబోసుకుంటాడు.
ఇక సెన్సేషనల్ న్యూస్ - పార్ట్ 2 చదవండి.
"నా పేరు కొమరయ్య! నేను ఒక ప్రైవేటు కాలేజీలో అటెండర్‌గా పనిచేశాను బాబూ! నా భార్య చనిపోయింది. పేరుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఇక్కడే ఉండేవాడు. పూణేలో జాబ్ చూసుకుని వెళ్లిపోయాడు. కూతురు బెంగళూరులో ఉంటుంది. ఇద్దరినీ ఇంజినీరింగ్ చదివించాను. సంపాదన అంతా వాళ్ల చదువుల కోసమే పెట్టాను. ఇప్పుడు వాళ్లు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలతో హాయిగా ఉన్నారు. నన్ను చూసుకోవడం వాళ్లకు బరువు అయిపోయింది. అందుకే ఇలా రోడ్డున పడ్డాను!" అని అంటూ కళ్లు తుడుచుకున్నాడు ఆ వృద్ధుడు.
మిత్రులు ఇద్దరికీ చాలా బాధ కలిగింది. కన్నతండ్రిని అలా రోడ్డుపైన పడేసిన ఆ కసాయి పిల్లలను తిట్టుకున్నారు.
"మీకున్న కనికరం కూడా నా పిల్లలకు లేదు బాబూ!" అన్నాడు ఆయన.
"మీరు కోర్టులో కేసు వేయండి! ఆడపిల్ల అయినా మగ పిల్లవాడు అయినా పేరెంట్స్‌ను చూసుకునే బాధ్యత ఉంటుంది. మెయింటెనెన్స్ కోసం కేసు వేస్తే ఇద్దరూ దిగి వస్తారు" అన్నాడు ధర్మవీర్.
"అలా చేయండి బాబూ! మీ వల్ల నా బతుకు హాయిగా గడుస్తుంది" అన్నాడు ఆశగా
"ముందుగా మీ పిల్లల ఫోన్ నంబర్లు ఇవ్వండి. వాళ్లతో ముందు మాట్లాడి, హెచ్చరిస్తాను. అప్పటికీ వాళ్లు వినకపోతే కేసు ఫైల్ చేయిద్దాం!" అన్నాడు సాలోచనగా రఘువీర్.
"మంచి మాటలు చెబితే వినరు వాళ్లు. మీరు అడిగితే, నా గురించి చెడ్డగా చెప్పి, నన్ను చెడ్డవాడిగా చిత్రీకరిస్తారు. తండ్రి అని ఏమాత్రం గౌరవం లేదు వాళ్లకు" అన్నాడు ఆ వృద్ధుడు.
"మీరేం భయపడకండి. వాళ్ల సంగతి మేం చూసుకుంటాం! వాళ్లతో మాట్లాడి మీకు డబ్బులు ఇప్పిస్తాం!" అన్నాడు ధర్మవీర్.
సంతోషించాడు వృద్ధుడు. తన సెల్ ఫోన్‌లో ఉన్న పిల్లల నంబర్లు ఇచ్చాడు ధర్మవీర్‌కి.
ముందుగా కొడుకు నంబర్‌కి కాల్ చేశాడు. వరుసగా చేస్తూనే ఉన్నాడు. నాలుగైదు సార్లు చేశాక, అటువైపు ఫోన్‌లో 'హలో' అని వినిపించింది.
"మీ తండ్రిని ఇలా రోడ్డుపైన పడేస్తారా? కన్న తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత విస్మరించి మీ సుఖం చూసుకుంటే ఎలా? ఇంత కసాయితనమా?..." అని ఆ కొడుకును మాటలతో వాయించాడు ధర్మవీర్..
"ఇక చాలు! ఆపుతావా? నీకు అంతగా జాలి ఉంటే నువ్వు తీసుకెళ్లి చూసుకో!" అని ఠక్కున ఫోన్ పెట్టేసి, ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాడు ఆ కొడుకు.
కూతురు ఫోన్‌కి ఎన్నిసార్లు చేసినా ఎవ్వరూ మాట్లాడలేదు.
"మాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది. అక్కడికి తీసుకుని వెళతాం! ప్రస్తుతానికి అక్కడే ఉండండి...." అని చెబుతున్న రఘువీర్ మాటలకు మధ్యలోనే అడ్డువచ్చిన ఆ వృద్ధుడు ఇలా అన్నాడు.
"నా పిల్లల దగ్గర నుంచి డబ్బు ఇప్పిస్తారని అనుకుంటే, వృద్ధాశ్రమంలో ఉండమంటారేంటయ్యా?" అన్నాడు.
"అంతవరకూ రోడ్డుపై ఎలా ఉంటారు? అందుకని అక్కడ ఉండమని చెప్పాను"
అతని స్టోరీని అతడు చెబుతూ ఉండగానే వీడియో షూట్ చేశారు. అది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో బాగానే వైరల్ అయింది. అందరూ ఆ వృద్ధుడి పిల్లల్ని చేతనైనంత తిట్లు తిట్టారు.
సుధావిశ్వం ఆకొండి గారి కొన్ని ఇతర రచనలు:
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.













Comments