స్వాతి

Swathi - Telugu Social Story | Penumaka Vasantha
స్వాతి - తెలుగు సామాజిక కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 13/09/2026
సినిమా రంగంలోకి అనుకోకుండా అడుగుపెట్టిన స్వాతి అగ్ర కథానాయికగా ఎదిగింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఆమెకు ప్రేమ, పెళ్లి, కుటుంబ ఒత్తిడి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.తన చిన్ననాటి స్నేహితుడి నిరాకరణతో బాధపడిన స్వాతికి రష్యన్ యువకుడు ఇవాన్ పరిచయమయ్యాడు.తల్లి రాజకీయ ఆశయాల కోసం కుదిర్చిన పెళ్లిని తిరస్కరించి, తన మనసుకు నచ్చిన వ్యక్తిని ఎంచుకున్న స్వాతి కథే ఈ ఆసక్తికరమైన సామాజిక ప్రేమకథ.
ఆ ఊరిలో సినిమా షూటింగ్ జరుగుతుందంటే... స్వాతి పరిగెత్తుకుంటూ వెళ్లి చూసింది. అందరితో పాటు హీరో డాన్స్ చేస్తుంటే.. తను జనాల్లో దూరి చూసింది. లంగా ఓణీలో సాదాసీదాగా ఉన్న ఈ స్వాతి పెద్ద కళ్లతో ఎంతో అందంగా కనిపించింది. కెమెరామెన్ రాంబాబును దగ్గరకు పిలిచి, "అదిగో అక్కడున్న జనాల్లో ఉన్న ఆ అమ్మాయికి ఫోకస్ చెయ్యి" అన్నాడు స్వాతిని చూపిస్తూ డైరెక్టర్ అనిల్. "సరే సర్" అంటూ స్వాతికి ఫోటోలు తీశాడు.
ఆ తర్వాత ఆ ఫోటోలు చూసి, "ఈ సినిమాలో ఈ అమ్మాయికి హీరోయిన్ అవకాశం ఇవ్వాలి" అన్నాడు డైరెక్టర్. దానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరని ఆరా తీశాడు. స్వాతికి అమ్మ ఉంది. పేరు చీటీపాట అనంతమ్మ. నాన్న లేడు. ఈ అనంతమ్మ డ్వాక్రా గ్రూపులు నడుపుతుంది.
"మరి ఆమె ఒప్పుకుంటుందా? వాళ్ళ పిల్లను హీరోయిన్ చేయటానికి" అన్నాడు డైరెక్టర్. "అడుగుదాం సారు!" అన్నాడు నిర్మాత. అనంతమ్మను పిలిచి డైరెక్టర్ మాట్లాడాడు.
"ఏమ్మా..! మీ అమ్మాయిని మా 'బడి పంతులు' సినిమాలో హీరోయిన్ వేషం ఇస్తాం. మరి మీ పిల్లను మా సినిమాలో చేయిస్తావా?"
"ఈ ఊళ్ళో షూటింగ్ చేస్తే.. నేనే పక్కన ఉండి చేయిస్తాను. అంతేగానీ పట్నం పంపను. అక్కడ సినిమా దొంగనాయాళ్ళు హీరోయిన్లను మోసం చేస్తారంటా" అంది అనంతమ్మ.
"ఇక్కడే జరుగుతుంది సినిమా షూటింగ్ అంతా. తర్వాత కొంత భాగం హైదరాబాదులో తీయాలి. నువ్వు నీ పిల్ల పక్కనే ఉండు పోనీ. మంచి అవకాశం పోనియొద్దు" అన్నాడు నిర్మాత.
"సరే అట్లే కానివ్వండి!" డబ్బు మీద ఆశతో అంది.
స్వాతికి సినిమాల పిచ్చి ఉండటం వల్ల ఆ సినిమాలో అద్భుతమైన పాత్ర చేసింది. సినిమా బాగా ఆడింది. అనంతమ్మ చీటీ పాటలు పడటం ఆపేసి హైదరాబాద్ చేరింది. ఇక స్వాతి వెనక్కి చూసుకోకుండా పెద్ద హీరోయిన్ అయింది. ఒకసారి స్వాతిని తీసుకుని సొంత ఊరుకు వచ్చింది అనంతమ్మ. అక్కడ అందరూ ఎంతో అభిమానం చూపించారు స్వాతి పైన.
అందరూ స్వాతిని, "మహేష్ బాబు సినిమాలో బుక్ అయ్యావంటా! మేము హైదరాబాదు వస్తే మమ్మల్ని షూటింగు చూడటానికి రానిస్తావా?" అని అడిగారు.
"తప్పకుండా రండి, నేను మిమ్మల్ని షూటింగ్ చూసేట్లు చేస్తాను" అంది స్వాతి.
ఊరిలోని వారు హైదరాబాదులో సినిమా షూటింగ్ ఉంటే చూడటానికి వెళ్ళారు. వాళ్ళు గేట్ దగ్గర ఆగి స్వాతికి కాల్ చేస్తే.. వాచ్‌మెన్‌కు చెప్పింది, "వాళ్ళు మా ఊరి వాళ్ళు, లోనికి పంపించు" అని.
వాళ్ళు వచ్చి షూటింగ్ చూశారు. వాళ్ళను మహేష్ బాబుకు పరిచయం చేసింది. వాళ్లలో స్వాతి చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ హరి ఉన్నాడు. హరి కళ్ళు మెరిసాయి. హరితో మాట్లాడదామని ఉన్నా.. షూటింగ్ బిజీలో ఉండి ఆ నైట్ అమెరికా వెళ్ళింది.
ముప్పైకి దగ్గర పడింది స్వాతి. అనంతమ్మ స్వాతికి సంబంధాలు చూడటం మొదలు పెట్టింది. కానీ ఎవరు స్వాతిని చేసుకోవటానికి ముందుకు రాలేదు. సినిమాల్లో వాళ్ళు మంచివాళ్ళు కాదని రిజెక్ట్ చేశారు. స్వాతికి హరి కళ్ళలో మెదిలాడు. ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళినపుడు హరిని కలిసి, "పెళ్లి చేసుకుందామా హరి!" అని అడిగింది.
"స్వాతి, నిన్ను చేసుకోలేను. మా ఇంట్లో ఒప్పుకోరు. సినిమా వాళ్ళంటే వాళ్ళకు మంచి అభిప్రాయం లేదు. అయినా నాకు పెళ్లి కుదిరింది" అన్నాడు.
ఇక పెళ్లి మీద ఆసక్తి తగ్గింది స్వాతికి. కొంతమంది స్వాతిని పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చారు కానీ వాళ్ళది తన మీద ప్రేమ కాదు, తన వెనుక ఉన్న డబ్బు అని గ్రహించింది. కొన్నాళ్ళు మెడిటేషన్ కోసమని సద్గురు ఆశ్రమంలో చేరింది. అక్కడ ఎంతో సింపుల్‌గా ఉన్న స్వాతిని చూసి ఒక రష్యన్ అతను ఇవాన్ ప్రేమించాడు. రెండు నెలల తర్వాత ఆశ్రమం నుండి బయటకు వస్తుంటే... ఇవాన్ కనిపించాడు.
ఇవాన్ తను రష్యా వెళ్తున్నట్లు చెప్పాడు. తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు. స్వాతికి కూడా ఇవాన్ అంటే మంచి అభిప్రాయం కలిగింది. తర్వాత శివరాత్రికి ఆశ్రమానికి స్వాతి వెళ్ళింది. అక్కడ కలిశాడు ఇవాన్. ఇద్దరూ మెడిటేషన్ చేశారు. రష్యా వెళుతూ ఇవాన్, "నిన్ను మిస్ చేస్తున్నా. మనిద్దరం మ్యారేజ్ చేసుకుందామా" అన్నాడు.
"నాకు కొంచెం టైమ్ ఇవ్వు ఇవాన్" అంది.
"ఇట్స్ ఓకే..!" అంటూ నవ్వుతూ వెళ్ళాడు.
ఇంటికి వచ్చి తల్లికి ఈ విషయం చెప్పింది.
"నువ్వు ఆ రష్యన్ పిల్లాడిని చేసుకోవటానికి వీలు లేదు. మన ఊరి ఎమ్మెల్యే బావమరిదితో నీ పెళ్ళి ఫిక్స్ చేశాను. ఈ పెళ్లి అయితే... ఈ సారి ఎలెక్షన్లో నువ్వు నిలబడవచ్చు. గెలిస్తే మంత్రి పదవి ఇస్తానన్నాడు ఎమ్మెల్యే. ముహూర్తం కూడా పెట్టించాను. నువ్వు ఇపుడు ఆ రష్యా వాడిని చేసుకుంటే... నా పరువు పోతుంది."
"అమ్మా..! ఇప్పటివరకు నువ్వు ఆడినట్లు ఆడాను. ఇక నా వల్ల కాదు. ఆ ఎమ్మెల్యే బావమరిది మన ఊరు వెళ్ళినపుడు ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు! వాడికి లేని వ్యసనం లేదు. నేను చేసుకోను" అని తెగేసి చెప్పింది స్వాతి.
ఇక లాభం లేదని స్వాతి ఉన్న రూమ్‌కు తాళం పెట్టింది అనంతమ్మ. వెంటనే ఫోన్ చేసి ఇవాన్‌కు చెప్పింది స్వాతి. ఇవాన్ వచ్చి స్వాతిని రూమ్ నుండి విడిపించి మ్యారేజ్ చేసుకున్నాడు. ఇవాన్‌తో కలిసి రష్యాకు సంతోషంగా వెళ్ళింది స్వాతి.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.












Comments