top of page
Original.png

అందరూ గొప్పే..!

2 minutes ago
3 min read

అనీష్ తన పాత టెడ్డి బేర్‌ను హత్తుకోగా, పక్కన చెక్క ఏనుగు, కుందేలు, సిపాయి, కీలుగుఱ్ఱం బొమ్మలు ఉన్న దృశ్యం.

Andharu Goppe - Telugu Childrens Moral Story | Penumaka Vasantha

అందరూ గొప్పే..! - తెలుగు పిల్లల నీతి కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 17/09/2026


అందరూ గొప్పే..! అనేది పిల్లలకు మంచి విలువలను నేర్పించే చక్కని తెలుగు నీతి కథ.

కొత్తగా వచ్చిన చెక్క బొమ్మలు పాత టెడ్డి బేర్‌ను చిన్నచూపు చూడటంతో కథలో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

సిపాయి బొమ్మ చెప్పిన మాటల ద్వారా ప్రతి ఒక్కరి విలువను, సమయం మారినప్పుడు వచ్చే గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు.

ఎవరినీ తక్కువగా చూడకూడదనే సందేశాన్ని అందించే ఈ కథను చదివి పిల్లలు మంచి పాఠాన్ని నేర్చుకోవచ్చు.


"ఏమండీ, మన అబ్బాయి బాగా అల్లరి చేస్తున్నాడు. ఏమన్నా బొమ్మలు కొంటే ఆడుకుంటాడు, నేను మీకు వంట చేయటానికి వీలవుతుంది. లేదంటే నన్ను ఆడించమని ఒకటే గోల చేస్తున్నాడు."


"అబ్బా..! ఇపుడు ఉన్న బొమ్మలు చాలవా? ఇంకా ఎన్ని కొనాలి?" అని భార్యపై విసుక్కున్నాడు సూర్య.


ఇంతలో నిద్ర లేచి బయటకు వచ్చిన అనీష్, "మమ్మీ! నాకు కలలోకి రాత్రి కుందేలు బొమ్మ, ఏనుగు బొమ్మ వచ్చాయి. అవి కొనిపెట్టు" అన్నాడు.


"ఏమండీ, చెక్క బొమ్మలు ఉంటాయి. వాటిని కొంటే వీడు వాటిని ఏం చేసినా పగలవు" అంటూ ఒక సలహా ఇచ్చింది ఆమని.


"సరే, సాయంత్రం ఎగ్జిబిషన్ పెట్టారు. దాంట్లో చూద్దాం. నేను ఆఫీసు నుండి వచ్చేసరికి రెడీగా ఉండండి" అంటూ వెళ్ళాడు సూర్య.


ఈవెనింగ్ అనీష్, సూర్య, ఆమని ఎగ్జిబిషన్‌కు వెళ్ళారు. అన్ని తిరుగుతూ ఉంటే... కొండపల్లి బొమ్మల షాప్ కనపడటంతో అనీష్ లోపలికి వెళదామని గొడవ చేస్తే తీసుకువెళ్ళారు.


అక్కడ చెక్క ఏనుగు బొమ్మ, కుందేలు బొమ్మ కనపడ్డాయి. వాటిని చూసి అరిచాడు అనీష్, "డాడీ, అవిగో నేను అడిగే బొమ్మలు."


వెళ్ళి చూస్తే.. చెక్క ఏనుగు, కుందేలు బొమ్మలు ముద్దుగా ఉన్నాయి. అవి కొన్నాడు సూర్య. అక్కడ సిపాయి బొమ్మ కనపడితే, "డాడీ..! ఇది కూడా కావాలి" అన్నాడు.


"ఇంకేమీ అడగకు" అనేలోపు కీలుగుర్రం బొమ్మ కనపడితే.. "ఇది ఒక్కటి చాలు!" అన్నాడు ముద్దుముద్దుగా అనీష్.


"ఏమండీ, చాలు ఈ నాల్గు బొమ్మలు. ఇక్కడే ఉంటే అన్ని కొనమంటాడు, పదండి!" అంటూ అనీష్‌ను తీసుకుని ముందుకు నడిచింది ఆమని.


నాల్గు రోజులు ఆ బొమ్మలతో ఆడుకున్నాడు. అంతకు ముందు ఆడుకున్న పెద్ద ఎలుగుబంటి టెడ్డి బేర్‌ను మూలపడేసాడు. దాంతో ఎలుగుబంటి టెడ్డి బేర్‌కి అనీష్ మీద కోపం వచ్చింది.


దానికి ఏనుగు బొమ్మను చూడగానే కుళ్ళు పుట్టింది. ఏనుగు టెడ్డి బేర్‌తో, "చూసావా మేము ఎంత గొప్పనో? నీ దగ్గర ఏముంది ఒక్క దూది తప్ప? మేము చెక్కతో చేయబడ్డాం. మాకు డిమాండు ఎక్కువ. మేము రాగానే నిన్ను మూలాన పెట్టాడు కదా!" అంటూ ఎక్కిరించింది.


కుందేలు బొమ్మ కూడా ఎలుగుబంటిని చూసి జాలి పడింది. "ఊరుకో ఏనుగు మామా! టెడ్డి బేర్ విలువ దానిదే..! దాన్ని పెద్ద ధనవంతులు కొనుక్కుని షోకేసులో లేదా తమ పక్కన బెడ్ దగ్గర పెట్టుకుంటారు. ఇక ఏమనకు, ఇప్పటికే చూడు బిక్కమొహం వేసింది" అంది నవ్వుతూ.


కీలుగుఱ్ఱం, "మీ అందరి కన్నా నేనే గొప్ప. నామీద కూచుంటే అనీష్ ఎంత హాయిగా నవ్వుతూ ఊగుతూ ఉంటాడో! మిమ్ముల్ని చూసి ఆడుకోవటమే, నామీద ఎక్కి స్వారీ చేస్తాడు తెలుసా?" అంది గర్వంగా.


వీళ్ల మాటలకు ఇంకా కుమిలిపోయి బాధ పడింది టెడ్డి బేర్.


సిపాయి బొమ్మ వెళ్ళి ఎలుగుబంటి దగ్గర కాపలాగా నిలబడి, "ఎవరు గొప్పలు వాళ్ళవే. మనం రాకముందు అనీష్ ఈ టెడ్డి బేర్‌తో ఆడుకున్నాడు. మనం ఇపుడు వచ్చిన తర్వాత కొత్తగా ఉండటం వల్ల మనతో ఆడుతున్నాడు. కొన్నాళ్ళకు మనం పాతబడతాం, అపుడు ఈ ఎలుగుబంటితో ఆడుతాడు. అపుడు మనల్ని చూసి ఈ టెడ్డి బేర్ ఇట్లాగే వెక్కిరిస్తే మనకు బాధ పుడుతుంది" అంటూ చెక్క బొమ్మల్ని అదిలించి వెళ్ళి ఎలుగుబంటి టెడ్డి బేర్‌ను హగ్ చేసుకుంది సిపాయి బొమ్మ.


ఇంతలో అక్కడికి వచ్చిన అనీష్ టెడ్డి బేర్‌ను హత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు. అపుడు టెడ్డి బేర్ కుందేలు, ఏనుగు, గుర్రం బొమ్మల వైపు చూసి కుదిరిందా తిక్క? అన్నట్లు చూసింది.


అందుకే ఎవరి టైమ్ వచ్చినపుడు వాళ్ళే గొప్ప. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు.


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:




పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page