top of page

అణువణువున జ్వలించిన ఓ హృదయాన---ఎపిసోడ్ 14


'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 14' - New Telugu Web Series Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 14' తెలుగు ధారావాహిక చివరి భాగం

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ:


అశ్వథ్, మంగళ భార్యాభర్తలు. అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.


అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.


భర్త దగ్గర పవన్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తుంది మంగళ. ముఖాన్ని చూసి ఖైదీల మనస్తత్వాన్ని అంచనా వేయలేమని భార్యతో అంటాడు అశ్వథ్.


తల్లిని చూడాలంటూ పుట్టింటికి బయలుదేరుతుంది.


తాను లాయర్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు, అందుకోసం కొద్దిరోజులు తన గురువుగారి వద్ద జూనియర్ గా చేరబోతున్నట్లు చెబుతుంది. భర్తతో తాను రాసి పెట్టి వచ్చిన ఉత్తరం చదవమంటుంది మంగళ.


పవన్ కేస్ టేకప్ చేయబోతున్నట్లు అందులో రాసి ఉంటుంది మంగళ. పవన్ అరెస్ట్ కి కారణమైన శ్రీనిత్యను కలుస్తుంది. మంగళకు సహకరిస్తానని శ్రీనిత్య చెబుతుంది. మంగళ ఇంటికి వచ్చిన అశ్వథ్ జరిగిన విషయం చెప్పమంటాడు.


తనకు మత్తు మందు ఇచ్చి లొంగదీసుకోవాలని కొందరు ప్రయత్నించిన సందర్భంలో పవన్ తనకు కాపాడిన విషయం అశ్వథ్ తో చెబుతుంది మంగళ. పవన్ ని తన ఇంటికి పిలిపించి మాట్లాడుతాడు అశ్వథ్.


ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన---14 చదవండి.


ఎట్టకేలకు దించిన తలను పైకెత్తి చూసాడు పవన్ కుమార్. అశ్వథ్ నవ్వు ముఖం కనిపించిందతడకి.


“అంతేకాదు. మీ పైన ప్రయోగించిన కఠినమైన ఐ. పి. సి. సెక్షన్లనూ మంగళ స్వీకరించలేక పోతూంది. సెక్షన్ 376 సెక్షన్ ప్రకారం మీరు మైనారిటీ తీరని బాలికపై అత్యా చారం చేసారు. ఐ. పీ. సీ. 363 అండ్ 373 సెక్షన్ల ప్రకారం కిడ్నాప్ చేసారు. అబ్డక్షన్ చేసారు. సెక్షన్ 498 ప్రకారం మానసిక శారీరక వేధింపులకు పాల్పడ్డారు. వీటిలో కొన్ని అతిగా లేక ఉద్దేశ్య పూర్వకంగా బనాయించి ఉండవచ్చు. కాని- అన్నీ తప్పుడు కేసులని వాదించడం సబబు కానేరదూ కదా!" అశ్వథ్ ఇంకా నవ్వుతూనే తానుగా వివరించాడు.


పవన్ కుమార్ కాసాపాగి మాటల్ని కూడదీసుకుని స్పందించాడు- “మీరడిగారు కాబట్టి చెప్తున్నాను సార్! ఇటువంటి కేసులు మన దేశం మొత్తం మీద- 3515 ఉన్నాయి సార్. కాని ఇటువంటి కేసులతో నాకు ఎటువంటి సంబంధమూ లేదండి. - ఒక్కటి తప్ప- శ్రీనిత్యతో శారీరకంగా సంపర్కించడం తప్ప-- ఇక గ్రహపాటో మరేమిటో నాకు తెలియదు గాని- అంతా నా యిష్టం ప్రకారమే జరగలేదండి“

“అంటే- ఆడదాని పట్ల నీకు వాంఛ కలగదంటావు. ఋషి పుంగవుడి మల్లే విషయ వాంఛలనుండి తొలగి పోగలనంటావు. అంతేనా!"


“నో సార్! నేనలా అనడం లేదు. శ్రీనిత్యలోని స్త్రీత్వం నిండుగా వికసించి ఉండటాన ఆమె మైనర్ గార్ల్ అన్న ఆలోచన నాకెప్పుడూ కలగలేదు. లేత వయసులో మైనారిటీ తీరకముందే ఒక అమ్మాయికి అంతటి పొంగులూరే అంగసౌష్ఠవం కలగాలంటే రెండే కారణాలుంటా యి సార్. ఒకటి- అనువంశిక శరీరతత్వం- శ్రీనిత్య తల్లి విదేశీ స్త్రీ- రెండవది- బొటాక్స్ వంటి హార్మోన్ ఇంజెక్షన్ ప్రభావం. మరొక వాస్తవం కూడా ఉందిసార్. దయచేసి గుర్తించడానికి ప్రయత్నించండి.!"


“చెప్పు పవన్. వాస్తవాలను గుర్తించడానికి నేనెన్నడూ వెనుకాడను"


“ థేంక్స్ సార్. ఉన్నదున్నట్లు చెప్తున్నాను. మంగళాదేవి గారి భర్తగా మీముందుంచుతున్నాను. నేనుగా నేనెప్పుడూ శ్రీనిత్యకు చేరువు కావడానికి ప్రయత్నించలేదు. ఆమె ఉంటున్నదేమో ఎదురు కట్టిడంలో. కాని నాతో మాటలు పెంచుకోవడానికి ఏదో ఒక నెపంతో నా రూము వైపు వచ్చి పలకరించేది. పుస్తకాలు అడిగి తీసుకు వెళ్ళేది. వాలు చూపులతో కాటేసేది. దాదాపు నేను శారీరకంగానే కాక ఎమోషనల్ గా ప్రవోక్ చేయబడ్డాననే చెప్పాలి”


ఎలా-అన్నట్టు చూసి ట్రేతో వచ్చిన పనావిడ నుండి తను ఒక కప్పు టీ తీసుకుని రెండు బిస్కట్లు కూడా తీసుకుని-మిగతావి తీసుకోమని పవన్ కుమార్ వేపు చూపు సారించి చూసాడు.


అమితమైన భావావేశంతో గొంతుముడి పొడిబారిపోయి ఉందేమో- అతడు మొదట ట్రేనుండి మంచినీళ్ల గ్లాసు అందుకుని గడగడా తాగేసాడు. ఆ తరవాత రెండు బిస్కట్లు టీ కప్పునీ తీసుకున్నాడు.


అంతా అయింతర్వాత తన ముతక జుబ్బాతో మూతి తుడుచుకుని చెప్పసాగాడు- "నేను నిజంగా శ్రీనిత్యను వారించాను. మనస్ఫూర్తిగా వారించాను. ఎందుకంటే నేను క్రమక్రమంగా చీకటి గోతులో పడిపోతున్నానన్నభావం నా స్ఫురణకు రాసాగింది. ఆమె బాడీ స్రక్చర్ నుండి యెక్కువ కాలం కళ్ళుతిప్పుకోవడం కష్టమనిపించింది”


“నచ్చిందంటున్నావు. మరెందుకు వారించడానికి ప్రయిత్నించానంటున్నావు?”


“అదే సార్ నా జీవితంలో క్రూసియల్ పాయింట్. అప్పటికి మా ఇంటి పరిస్థితులు దారుణంగా తయారయాయి. నాకప్పుడు స్త్రీల గురించి ఆలోచించేంత తీరికా ఓపికా లేనే లేదు, సార్. ఫోమ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడం- జీతం అందుకోవడం- అదే రోజు ఇంటికి కొంత మొత్తాన్ని పంపించడం.


ఇంకా చెప్పాలంటే మనసు ఊరుకోక తిన్నగా వెళ్ళి వాళ్ళ పెద్దమ్మగారి వద్దకు వెళ్లి కూడా చెప్పాను శ్రీనిత్యను అదుపులో ఉంచమని“


అశ్వథ్ ఆశ్చర్యంగా నిజంగానా అన్నట్టు చూసాడు.


పవన్ తలూపుతూ- “ఇది నిరూపించలేను కదా సార్! మరొకటి కూడా చెప్పాలి సార్- నాకు ఊళ్ళో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు సార్. మా అమ్మేమో మెంటలీ అస్థిరత్వానికి లోనైన హార్ట్ పేషెంటు. నాన్నగారేమో కుప్పలుగా పేరుకు పోయిన అప్పులతో తెగ అవస్థలు పడుతుంటారు. నేను కాలేజీ చదువుమానుకోవడానికి ఇదే సార్ ముఖ్య కారణం. నాది మీడియమ్ ఆఫ్ ఇన్స్టకషన్ తెలుగు కాబట్టి కొన్ని ప్రబంధ కావ్యాలు చదివే అవకాశం కలిగినందున శ్రీనిత్య గురించి నాకొకటి తోచేది సార్“


చెప్పమన్నట్టు తల ఊపాడు అశ్వథ్.


”ప్రతి అమ్మాయికీ వయసు ఆరునుంచి పదిలోపల ఉన్నప్పుడు గాంధర్వుడు రాజ్యమేలుతాడంటారు. కాని— శ్రీనిత్య నెత్తిపైన గాంధర్వుడు కాకుండా కాముడు రాజ్యమేలేడు సార్. అది వంశ పారంపర్య విదేశీ సంతతికి చెందిన కారణం కావచ్చు— లేదా మరేదైనా కారణం కావచ్చు--“


అశ్వథ్ మళ్లీ తలూపుతూ ఉండిపోయి టీ తాగడం పూర్తి చేసి కాస్తంత ముందుకు వంగి అన్నాడు-- “అసలు విషయానికి వచ్చే ముందు- నిన్ను జైలుకి పంపించిన పరిస్థితుల గురించి చర్చించి ఆరా తీసేముందు నేనిప్పుడు ఒకటి అడుగుతాను. నొచ్చుకోకుండా తడబడకుండా చెప్తావా!"


తలూపాడు పవన్ కుమార్- అలాగే సార్-అంటూ-


”మంగళ యవ్వనవతి సౌందర్యవతి. నీకు చేరువుగా ఉండాలని ప్రయత్నించేది, పదే పదే నీతో మాటలు కలపాలని ఆరాటపడేది. నీకెప్పుడూ ఆమె పైన మనసు పోలేదా! చలనం కలగలేదా!"


అప్పుడు పవన్ కాసేపాగి కను బొమలెగరేసి చెప్పసాగాడు- “నాకు మంగళాదేవి గారితో ఎక్కువగా పరిచయం లేకపోయినా-- నేను మంగళాదేవిగారిని చాలా రోజుల్నించి చూస్తున్నాను. ఆమె పట్ల నాకున్నగౌరవ భావం యెప్పుడూ తగ్గలేదు. ఇక విషయానికి వస్తే గర్భగుడిలోని దైవవిగ్రహాన్ని దూరం నుంచే చూస్తాం. దూరం నుంచే ప్రణమిల్లి నమస్కరిస్తాం. దైవవిగ్రహానికి దగ్గరగా వెళ్ళడానికి సాహసం చేయం. ఇకపై నా మాటపైన నమ్మకం ఉంచేదీ లేనిదీ మీఇష్టం. నేను బయల్దేరుతానండి. మీ తల్లిగారు చెప్పినట్టు, మేడపైకి వెళ్లి అవన్నీశుభ్రం చేయాలి కదండీ!" అంటూ కదలబోయాడు.

“ఆగు! ఇంతవరకూ నీకు కావల్సిన సమాచారం నీకు అందించనే లేదు. నీ కాలేజీ మేట్ మంగళాదేవికి ఒక విచిత్రమైన ఆనవాయితీ ఉంది. మంచి గాని మంచిది కానిది గాని చెప్పేటప్పుడు మనలా చర్చలద్వారా తెలియ జేయదు. పద్యం-కవిత-గేయం-ఇత్యాది ప్రక్రి యల ద్వారా చెప్తుంది. నీకెప్పుడూ అన్యాయం జరగదంది. ఎవరూ నీకు అన్యాయం చేయరంది. చేయలేరంది. దానికి ఆమె నాకు మెసేజ్ ద్వారా వివరిస్తూ సంస్కృత శ్లోకంతో చెప్పింది. విను-ఆసక్తికరంగా ఉంటుంది.


’వణే రణే శత్రు జలాగ్ని మధ్యే-మహార్ణవే పర్వత మస్తకేవా-సుప్తం ప్రమత్తం విషయ స్థితం వా-రక్తన్తి పుణ్యాని పురాకృతాని--‘


అంటే దీని అర్థం-దట్టమైన అరణ్యాలలో,యుధ్ధ భూమిలో శత్రువుల మధ్య, నీటిలో నిప్పులో విషమయ స్థితిలో కూడా-అంటే అన్నిరకాల వ్యతిరేక పరిస్థితులు యెదురైనప్పుడు కూడా-మనల్ని రక్షించేది పూర్వ జన్న పుణ్య కర్మలే! ఇక ముందుకు పోతే పూర్వ జన్మల సంగతేమిటి-ఈ జన్మలో కూడా నువ్వు పెక్కు పుణ్య కర్మలు చేసావంటుంది మంగళ. వాటి ప్రభావం ఊరకే పోదంటుంది. కాబట్టి నీకు మంచే జరుగుతుంది గాని చెడు జరగనే జరగదంటుంది. ఎలాగంటావా? ఒకటి తరవాత ఒకటి నీకు చెప్తూ పోతాను. విను.


మొదటిది- ఇప్పుడు మీ చెల్లెళ్లిద్దరూ మీ ఊళ్ళో లేరు. మంగళ వెళ్లి ఇద్దర్నీ వాళ్లింటికి తిసుకు వచ్చేసింది”


ఆ మాట విన్నంతనే పవన్ కుమార్ ఉన్నపాటున లేచి నిల్చున్నాడు. "నిజంగానా సార్!"అతడలా ఆశ్చర్యపోతూ కళ్లమ్మట కన్నీరు నింపు కోవడం చూసి అశ్వథ్ అదుపు చేసాడు.


“నేను ముందే చెప్పాగా ఒకటి తరవాత ఒకటిగా చెప్తానని. నువ్వు ముందు కుదురుగా వెళ్ళి కూర్చో! వాళ్లిద్దర్నీ వాళ్ళకు అనువైన షార్ట్ టైమ్ కోర్సులో చేర్పిస్తానంది. కోర్సు పూర్తి చేసుకున్న తరవాత,పనిలో పనిగా ఇంటర్న్ షిప్పు కూడా తీసుకున్న తరవాత వాళ్ళకు జాబ్ దొరికేటట్టు గాని,స్వంత షాప్ పెట్టుకోవడానికి గాని యేర్పాటు చేస్తానంది. మీ నాన్నగారికి అక్కడేవో తోటలున్నాయటగా-అంచేత ఆయన్ను ఇక్కడకు తీసుకు రాలేదు. ఇప్పుడు నిన్ను రాపిడికి లోను చేస్తూన్న విష యం మీ తల్లిగారి ఆరోగ్యం గురించి. ఇద్దరు చెల్లెళ్లూ ఇక్కడకు వచ్చేస్తే అమ్మనెవరు చూస్తారు- అదే కదూ నిన్ను కలతపెడ్తున్న అంశం.


దానికి కూడా మంగళ మంచి యేర్పాటే చేసింది. అదేమంటే—అక్కడ రిటైర్ అయిన కేరళ నర్సమ్మ ఉంది. ఇకపైన మీ తల్లిగారి మెడికల్ వ్యవహారాలూ పీరియాడికల్ చెకప్ లూ ఆమే చూసుకుంటుంది. ఆమెకివ్వాల్సిన జీత భత్యాలు గట్రా మంగళ ఆన్ లైన్ పే-మెంట్సు చేస్తుంది. దీనికోసం నువ్వేమీ దిగులు చెందకు. ఇక రెండవది,అతి ముఖ్యమైనది- ఇప్పుడు మైనారిటీ తీరి మెజారిటీ అందుకున్న శ్రీనిత్య నుండి నీకనుకూలంగా అఫిడెవట్ తీసుకుంది. మంగళతో ముఖాముఖి యేమేమి చెప్పిందో అదే వెనుకంజ వేయకుండా వ్రాసిచ్చింది.


ఆ తరవాత వాళ్ల గురువుగారు వేంకట్రావు గారితో వెళ్లి జోగయ్య మొదటి భార్య శ్రీనిత్య పెద్దమ్మను నయానా భయానా ఒప్పించి-పాప పుణ్యాల సెంటిమెంటల్ ప్రస్తావనలతో తమ వేపు తిప్పుకుని ఆమె వద్దనుండి కూడా అఫెడెవిట్ తీసుకుంది. శ్రీనిత్య విషయంలో నువ్వామెను హెచ్చిరించిన వైనం ఆమె సీదాగా ఒప్పుకుంది. అంతేకాదు-మరొక వైనం కూడా అందించింది. శ్రీనిత్య ఆమెతో ఖరాకండీగా చెప్పిందట- నిన్ను తప్ప మరొకరిని వివాహం చేసుకోనని.


ఇద్దరూ మేజిస్ట్రేట్ ముందు సంతకం చేసి అక్కడికక్కడే సమర్పించారు,ఇంతకు ముందే మంగళ కోరికపైన నీ ప్రొఫైల్ ఫైలుని నేను రివ్యూ చేసాను. నీకనుకూలమైన అంశాలను ముందే గుర్తు పెట్టి ఉంచాను. ఇక మిగిలిందల్లా ఒక్కటే ఉంది. కోర్టువారి ముందుంటుంది”ఆతృత ఆపుకోలేక- “అదేంవిటి సార్?” అని లేచి వచ్చాడు పవన్.


"నీకు నిజంగానే శ్రీనిత్య మైనర్ గార్ల్ అని తెలియదని-అది తెలియకుండానే ఆమెతో సంపర్కం పెట్టుకున్నట్టు జడ్జిగారు నమ్మడం-ఈ వాస్తవం గాని జడ్జిగారు నమ్మితే రెండు జరగవచ్చు. నిన్ను విడుదల చేయవచ్చు. లేదా కొద్దిపాటి శిక్ష వేసి నీకు కొత్త జీవితం ఇవ్వవచ్చు”


ఆ చివరి మాట విన్నంతనే పవన్ కుమార్ కాసేపు మిన్నకుండిపోయి,ఆ తరవాత తనను తను నిబ్పరపర్చుకుంటూ అన్నాడు- “పర్వాలేదు సార్! నేరం నాపైన పూర్తిగా లేదని గుర్తించిన తరవాత నాకెంతటి శిక్ష పడ్డా పరవాలేదు. ఐతే నాకొక చిన్న అనుమానం సార్. నిజానికి చిన్నఅనుమానం కాదు సార్. పెద్ద అనుమానమే సార్. శ్రీనిత్య తండ్రి మామూలు మనిషి కాడు సార్. గ్యాంగస్టర్. కిరాతకుడు. దానికి తోడు-శ్రీనిత్య తల్లి-అతడి కుడి భుజం-అతడి విదేశీ భార్య. ఇవన్నీ చూస్తూ ఊరకే ఉంటారా సార్!"


"నాకు తెలుసు నువ్విది అడుగుతావని. ఇప్పుడు వాళ్ల గురించి చెప్తాను,ఉక్కిరి బిక్కిరి కాకుండా విను. వాళ్లిప్పుడు యెక్కడున్నార నుకుంటున్నావు? ఇద్దరూ ఇంట్లో లేరు. కటకటాల వెనుక ఉన్నారు”


నమ్మలేనట్టు నివ్వెరపోతూ చూస్తూ అడిగాడు పవన్- “అదెలా సార్!"


అశ్వథ్ సాభిప్రాయంగా తలూపి అన్నాడు- “నువ్వన్నావుగా వాళ్లు మామూలు మనుషులు కారని. కాబట్టి-వాళ్లకెదురుగా బుక్ చేసిన కేసులు కూడా మామూలు కేసులు కావు. వాళ్లకు అంతర్జాతీయ మాఫియా గ్యాంగులతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. లావా దేవీలు లేని షెల్ కంపెనీలు ఆరంభించి మనీ ల్యాండరింగుకి కూడా పాల్పడుతున్నారని కూడా తెలిసింది. మొన్ననే భార్యాభర్త లిద్దరూ హాంకాంగ్ వెళ్లి చట్టవిరోధ కార్య కలాపాలు ముగించుకుని ఎయిర్ పోర్టులో దిగేటప్పటికి ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్ వాళ్లు సి బి ఐ వాళ్లు జాయింట్ రైడ్ చేసి పట్టుకున్నారు. ఎంతటి బలమైన మీసాలు మెలితిరిగిన ఢిల్లీ లాయర్లను యెంగెజ్ చేసినా వాళ్లింత త్వరలో బయటకు రాలేరు. నౌ ఈజిట్ క్లియర్ పవన్ కుమార్?“


పవన్ కుమార్ మాట్లాడ లేదు. సంతోషంతో అతడికి ఊపిరి అందుకోవడం కూడా ఇబ్బంది కరంగా ఉంది. నడచి వెళ్లి అశ్వథ్ రెండు చేతులూ అంది పుచ్చుకుని కళ్ళకు అద్దుకుని— “క్షమించండి సార్. నేనిప్పుడు యేమీ చేయలేని మూడ్ లో ఉన్నా ను. నీరసంగా కూడా ఉంది. మీరు గాని అనుమతిస్తే నేనిప్పుడు బ్యారెక్స్ వెళ్లిపోతాను” అంటూ ఇంటి గుమ్మం వేపు నడిచాడు. అప్పుడు వెనుకనుండి అశ్వథ్ పిలిచాడు. అతడాగి వెనక్కి తిరిగి చూసాడు.


“థేంక్స్ పవన్!"


అతడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసు కుని అయోమయంగా చూపులు సారించి చూసాడు. “ఎందుకు సార్?”


"మంగళను నాకు భద్రంగా అప్పగించినందుకు“


అతడేమీ మాట్లాడకుండా దించుకున్న తల యెత్తకుండా గుమ్మం దాటి మెట్లు దిగి రోడ్డుపైకి వెళ్లిపోయాడు.

=======================================================================

*****సమాప్తం*****

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ వారి తరఫున, రచయిత శ్రీ పాండ్రంకి సుబ్రమణి గారి తరఫున అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.

=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.


39 views0 comments

コメント


bottom of page