top of page

గోపాలుని రాకకై....


'Gopaluni Rakakai' New Telugu Poetry Written By Neeraja Hari Prabhala


రచన….నీరజ హరి ప్రభల

ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం శుభాకాంక్షలతో 🌷🌷

నా కవిత....అందమైన వెన్నెల రాతిరిలో

పట్టు పరదాల మాటున

తెల్లని హంసతూలికా తల్పము మీద

నీ నాధుని ప్రణయ కౌగిలి లో

ఆదమరిచి శయనించిన ఓ నీలా !

తొలి పొద్దు పొడుస్తున్నది,

గోపకాంతలు నీకై వేచియున్నారు.

మగత వీడి , కనులు తెరిచి ,

నీ సఖుని కూడి ఒక పరి రావోయీ!.

విశాలమైన స్వామి వక్ష స్థలం పైన

అరమోడ్పు కన్ను లతో సుందర మైన

నీ మోము ను త్రాన్చినపుడు ,

పొడవైన నీలి కురుల చేత

స్వామి నగుమోము కప్పబడెను కదా!

సుందరీ ! నీ వలపు పాశములో చిక్కి

బందీ అయిన నీ ప్రియ సఖుని మోహన రూపము

కనులారా కాంచుటకై వేయి కనులతో

వ్రేపల్లె వేచి యున్నది,

తాపము వీడి సఖుని కూడి రావోయీ !

గోపకాంతల మేలు కొలుపులకు తటిల్లున త్రృళ్ళి పడి,

సఖుని సందిట వీడి లజ్జా వదనయై వడివడిగా రాగా,

కెంపెక్కిన నీ నును సిగ్గుల మోమును తిలకించి

గోపకాంతలు పరవశించిరి కదా! గోపాలుని రాకకై ఆలమంద వేచియున్నది,

నల్లనయ్య తో వేవేగ రావోయీ !

----నీరజ హరి.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

అమ్మ మనస్సు

స్త్రీ

అవమానం - ఆరులక్షల వడ్డాణం

జీవితాన్ని నిలబెట్టినా - పడగొట్టినా డబ్బే

సరాగాల సంసారం

జీవనజ్యోతి

ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు?

గురుపూజోత్సవం(05/09/2021)

తెలుగు భాషా దినోత్సవం(29/08/2021) (( కవిత)

మనసులోని మాట

సంక్రాంతి లక్ష్మి

మహిళా దినోత్సవం

అంతా శివమయం

ప్రేమానురాగ దేవత

పుస్తకమే నా నేస్తం ( కవిత)

కడలి (కవిత )

కలసి వుంటే కలదు సుఖం

పున్నమి వెన్నెల రేడు ( కవిత )


రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏

72 views0 comments
bottom of page