కథలు మరియు సీరియల్స్ పోటీలు


విజయదశమి 2022 కథల పోటీలు మరియు ఉగాది 2023 సీరియల్స్ పోటీలు

Vijayadasami 2022 Stories Competition and Ugadi 2023 Serial Episodes competition By manatelugukathalu.com




విషయ సూచిక :


1. విజయదశమి 2022 కథల పోటీలు

2. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు

3. విజయదశమి 2022 నవ్వించండి - జోకుల పోటీలు

4. రచయితలకు సన్మానం మరియు బిరుదు ప్రదానం

5. పాపులర్ రైటర్ 2022 అవార్డు

6 . NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )

7 . ఉగాది 2022 కథల పోటీ ఫలితాలు



1 . విజయదశమి 2022 కథల పోటీలు

సంక్రాంతి 2021, విజయదశమి 2021 మరియు ఉగాది 2022 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విభాగం లో ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా రచయితలకు/రచయిత్రులకు గౌరవ పారితోషకం తో పాటు E - ప్రశంసా పత్రాలు అందజేశాము.

ఇప్పుడు విజయదశమి 2022 కథల పోటీని ప్రకటిస్తున్నాము.


విజయదశమి 2022 కథల పోటీ బహుమతుల వివరాలు :


ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-
ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.

నిబంధనలు :


*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.


*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.


*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.

*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.

మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.


*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.


* మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.

కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 15 /09 /2022


*ఫలితాలు 09/10/ /2022 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.


*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.


*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.


ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.


*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.

*NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విభాగం లో ఎంపికైన కథలు మాత్రమే విజయదశమి 2022 బహుమతులకు అర్హమవుతాయి.

బహుమతులను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దు చేయడానికి, మార్పులు చేయడానికి మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉన్నాయి.


2 . సంక్రాంతి 2023 సీరియల్ నవలల పోటీలు

సంక్రాంతి 2023 సీరియల్ నవలల పోటీ బహుమతుల వివరాలు :


ఏకైక ప్రథమ బహుమతి రూ: 15000 /-
ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 1000 /-

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.

నిబంధనలు :

సీరియల్ నవల కనీసం పది భాగాలుగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు.

ప్రతి భాగంలో సుమారు 8౦౦ పదాలు ఉండాలి.

వారానికి ఒక ఎపిసోడ్ ప్రచురింపబడుతుంది.

మొత్తం నవల ఒకేసారి పంపాలి.

రచయితలు తామే ఎన్ని వారాలు ప్రచురించాలనుకుంటున్నారో అన్ని భాగాలుగా విభజించి పంపాలి.

మరుసటి భాగం కోసం పాఠకులు ఎదురు చూసేలా రాయాలి.

20/12/2122 తేదీ నాటికి అన్ని ఎపిసోడ్ ల ప్రచురణ పూర్తి అయ్యేటట్లు పంపాలి.


*కాపీ నవలలు, ఇదివరకే ప్రచురింపబడ్డ నవలలు, అనువాద నవలలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న నవలలు పంపరాదు.

మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.


*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ నవలలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.

*ఒకరు ఎన్ని సీరియల్ నవలలైనా పంపవచ్చును.


*వెంటనే మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.



* మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



పి.డి.ఎఫ్ రూపంలో పంపే నవలలు పరిశీలింపబడవు.



*ఫలితాలు 16/01/2023 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.


*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.


*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.


గమనిక: ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.

మనతెలుగుకథలు.కామ్ లో ఒకసారి ప్రచురింపబడ్డ కథలు, నవలలు ఎట్టి పరిస్థితులలోను తొలగింప బడవు.

ఇందుకు సమ్మతించేవారే తమ రచనలను పంపవచ్చు.


*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.

బహుమతులను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దు చేయడానికి, మార్పులు చేయడానికి మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉన్నాయి.


3. విజయదశమి 2022 నవ్వించండి - జోకుల పోటీలు

ప్రతి నెలా అత్యధికంగా జోకులు పంపినవారికి Rs 116/- పారితోషికంగా అందజేస్తాము.

20/09/2022 నాటికి ఎక్కువ జోకులు ప్రచురింపబడ్డ వారికి Rs 1000/- బహుమతిగా అందజేస్తాము.

జోక్స్ ప్రచురించినట్లుగా ఇంటిమేషన్ ఇవ్వడం సాధ్యం కాదు.

మీ జోకుల్నిwww.manatelugukathalu.com విసిట్ చేసి ప్రచురింపబడ్డదీ, లేనిదీ తెలుసుకోవచ్చు.

ఈ విషయంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపబడవు.

సాధారణంగా జోక్స్ ని మూడు రోజుల్లోగా ప్రచురిస్తాము.

అన్ని జోక్స్ నూ ఒకే పోస్ట్ లో అప్డేట్ చెయ్యడం జరుగుతుంది.



4. రచయితలకు సన్మానం మరియు బిరుదు ప్రదానం

మాకు రెగ్యులర్ గా కథలు పంపిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ, పాఠకులను అలరిస్తూ ఉన్న మా అభిమాన రచయితలను సన్మానించి, సత్కరించాలని భావిస్తున్నాము.

నిబంధనలు/ఇతర వివరాలు

*16 /10 /2021 నుండి 30/06/2022 మధ్య కాలంలో మనతెలుగుకథలు.కామ్ లో కనీసం 10 రచనలైనా ప్రచురింపబడి ఉండాలి.

*ఉగాది కథల పోటీలో బహుమతులు పొంది ఉండాలన్న నిబంధన లేదు.

*క్రింద ఇవ్వబడ్డ బిరుదుల్లో మీకు ఇష్టమైన రెండు బిరుదులను ఎంచుకోండి.

*ఒకే విభాగానికి పోటీ ఏర్పడినప్పుడు న్యాయ నిర్ణేతల అభిప్రాయం ప్రకారం ఆయా రచయితలను సంప్రదించి నిర్ణయం తీసుకొనబడుతుంది.

*ఈ బిరుదు ప్రదానం/సన్మాన కార్యక్రమం లో ఏ విధమైన నగదు బహుమతి ఇవ్వబడదు.

*రచయితలను సన్మానించి, బిరుదు బహూకరించిన సర్టిఫికెట్ ఇచ్చి, జ్ఞాపిక (మొమెంటో) ఇవ్వబడుతుంది.

*అలాగే మీ వద్ద నుండి ఏ విధమైన చందా వసూలు చేయబడదు.

*మనతెలుగు.కామ్ రచయితలను ఒకే వేదిక పైకి తీసుకొని రావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

*ఈ క్రింది వాటిలో రెండు బిరుదులు ఎంపిక చేసుకొని, వీలు చూసుకొని 15/07/2022 లోగా story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.

1 . ఉత్తమ రచయిత 2022

2 . ఉత్తమ రచయిత్రి 2022

3 . ఉత్తమ అభ్యుదయ రచయిత 2022

4 . ఉత్తమ అభ్యుదయ రచయిత్రి 2022

5 . ఉత్తమ నవతరం రచయిత 2022

6 . ఉత్తమ నవతరం రచయిత్రి 2022

7 . ఉత్తమ ఆధునిక రచయిత 2022

8 . ఉత్తమ ఆధునిక రచయిత్రి 2022

9 . ఉత్తమ ఈ తరం రచయిత 2022

10 . ఉత్తమ ఈ తరం రచయిత్రి 2022

11 . ఉత్తమ సీనియర్ రచయిత 2022

12 . ఉత్తమ సీనియర్ రచయిత్రి 2022

13 . మెగా రైటర్ (మేల్ ) 2022

14 . మెగా రైటర్ (ఫిమేల్ ) 2022

*సన్మాన కార్యక్రమం జూలై 2022 చివరివారంలో హైదరాబాద్/నెల్లూరు లలో ఆయా రచయితలను సంప్రదించి ఏర్పాటు చేయడం జరుగుతుంది.

*కార్యక్రమం, అప్పటి కోవిడ్ నిబంధనలను అనుసరించి ఉంటుంది.

*రచయితలు ఈ కార్యక్రమం లో మార్పులు సూచించవచ్చును.


5. పాపులర్ రైటర్ 2022 అవార్డు

ప్రారంభించిన నాటి నుండి పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్న మనతెలుగుకథలు.కామ్ వారు ఇప్పుడు పాపులర్ రచయిత/రచయిత్రి 2022 అవార్డు అందిస్తున్నారు.

ఈ అవార్డు పూర్తిగా పాఠకుల ఆదరణను బట్టి ఉంటుంది.

15/10/2021 తో మా విజయదశమి కథల పోటీ ముగిసింది.

కాబట్టి 16 /10 /2021 నుండి 15 /09 /2022 వరకు ప్రచురింప బడే కథలనుండి ఈ అవార్డు ఎంపిక చెయ్యబడుతుంది.

ఈ అవార్డును ఒక రచయిత/రచయిత్రి మొత్తం రచనలను పరిగణించి ప్రకటించడం జరుగుతుంది.

1. మనతెలుగుకథలు.కామ్ వెబ్ సైట్ www.manatelugukathalu.com

2. మనతెలుగుకథలు.కామ్ పోడ్ కాస్ట్ https://linktr.ee/manatelugukathalu

3. మనతెలుగుకథలు.కామ్ యూ ట్యూబ్ ఛానల్ https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఈ మూడింటిలో కలిపి, రచయిత/రచయిత్రుల మొత్తం రచనలకు కలిపి పాఠకుల జనాదరణ ఎంత వుందో పరిగణించి అవార్డు ను బహుకరించడం జరుగుతుంది.

పాఠకుల జనాదరణ శాస్త్రీయ పద్ధతిలో పరిశీలింప బడుతుంది

పాఠకులు కథను కేవలం క్లిక్ చెయ్యడం కాకుండా, చదవడానికి ఎంత సమయం కేటాయించారు, కొత్తగా ఎంతమంది సబ్స్క్రయిబ్ చేశారు అనే విషయాలు పరిగణిస్తాము.

మా ప్రియమైన రచయితలు/రచయిత్రులు వ్యూస్ పెంచడం కోసం అశాస్త్రీయ పద్ధతులు వాడరని ఆశిస్తున్నాము.

అవార్డు విజేతకు 1౦౦౦౦/-బహుమతి ఉంటుంది.

5 కన్సోలేషన్ బహుమతులు ఒక్కొక్కటి 5౦౦/- ఇవ్వబడతాయి.

ఈ అవార్డు కోసం విడిగా రచనలు పంపవలసిన అవసరం లేదు.

16/10/2021 నుండి ప్రచురింప బడే కథలన్నీ ఈ అవార్డు కు పరిశీలింప బడతాయి.

ఈ అవార్డు కు ఇతర బహుమతులతో సంబంధం లేదు.

రచయిత/రచయిత్రులు ఇదివరకే ప్రకటించిన ఉగాది బహుమతులు, వారం వారం బహుమతులు, భవిష్యత్తులో ప్రకటించబోయే బహుమతులు ఎప్పటిలాగే గెలుచుకోవచ్చు.

మాకువచ్చిన అన్ని కథలనూ పోడ్కాస్ట్ చెయ్యడం/యూట్యూబ్ లో ఉంచడం చేయలేము.

రచయితలు/రచయిత్రులు తమ కథలను పంపేటప్పుడు కథ, వింటే కూడా అర్ధమయ్యే విధంగా రాయవలసిందిగా కోరుతున్నాము.



6 . NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )

రచయితల, పాఠకుల ఆదరణ పొంది, ఇతరులకు ఇన్స్పిరేషన్ కలిగించిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 15/09/2022 వరకు పొడిగించాలని నిర్ణయించాము. ఇందులో ఎంపికైన కథలు మాత్రమే విజయదశమి 2022 కథల పోటీకి అర్హమవుతాయి.


7 . ఉగాది కథల పోటీ ఫలితాలు

మంచి కథలు ఎక్కువగా రావడంతో మూడు తృతీయ బహుమతులు ఇస్తున్నాము.

అదనంగా 6 విశిష్ట(ప్రత్యేక) బహుమతులు ఇస్తున్నాము. బహుమతులు పొందిన కథల వివరాలు ( కథ పేరు పైన క్లిక్ చేస్తే ఆ కథను చేరుకుంటారు)

విశిష్ట (ప్రత్యేక) బహుమతి Rs 500 /- పొందిన కథల వివరాలు.



సందెపొద్దు గూటిలోకి B. లక్ష్మీ శర్మ

ఈ అవార్డు నాది కాదు M R V సత్యనారాయణ


అమ్మ అంబ ఐతే అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

పుణ్య దంపతులు జీడిగుంట శ్రీనివాసరావు

పచ్చని ప్రేమ పెండేకంటి లావణ్య కుమారి


జీవిత సత్యం సీత మండలీక


నూతన రచయితల విభాగంలో ప్రత్యేక ప్రథమ బహుమతి పొందిన కథ

మొబైల్ ఆటవస్తువు గాదే అల్లు సాయిరాం


తృతీయ బహుమతి Rs 1000/ పొందిన కథలు

తిండీ - తిప్పలు దాసు రాధిక

నిన్నా మెున్నటి పూవు భాగవతుల భారతి

మూడో సర్టిఫికెట్‌ వసుంధర


ద్వితీయ బహుమతి Rs 2000/ - పొందిన కథ

విద్యుల్లత బివిడి ప్రసాదరావు


ప్రథమ బహుమతి Rs 5000/ - పొందిన కథ

సత్యనారాయణ స్వామి వ్రతం లంకా శంకర నారాయణ


నవ్వించండి - జోకుల పోటీలు బహుమతి Rs 1116/- విజేత


ఓట్ర ప్రకాశ రావు


Link: https://www.manatelugukathalu.com/post/jokes-1-telugu-jokes


విజేతలందరికీ మా అభినందనలు.


8 . మరిన్ని ముచ్చట్లు

ప్రతి రచయితకు వారి కథల తాలూకు లింక్ లను మెయిల్ ద్వారా, వాట్స్ అప్ ద్వారా పంపుతున్నాము. కానీ కొంతమంది రచయితలు ఆ లింక్ లను ఎవరికీ షేర్ చెయ్యక పోవడం వలన తక్కువ మంది మాత్రమే వారి కథలను చదువుతున్నారు.

మంచి కథ వ్రాయడమే కాదు. ఆ కథ ఎక్కువ మంది చదివేలా అందరం ప్రయత్నించాలి. అలాగే మీ కథలకు కామెంట్ చెయ్యడం, లైక్స్ పెట్టడం తెలియని వారికి నేర్పించండి.

మరి కొంతమంది ఇతరుల రచనలను అసలు టచ్ చేయడం లేదు. తోటి రచయితల రచనలను చదివి ప్రోత్సహించండి.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.



https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


ధన్యవాదాలు.

మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం




595 views4 comments