top of page
Original.png

పరుగో పరుగు

16 hours ago
4 min read

భర్త ఆపరేషన్ కోసం మహిళల నడక పోటీలో పాల్గొని విజయం సాధిస్తున్న తులసమ్మ – పరుగో పరుగు తెలుగు కథ.

Parugo Parugu - Telugu Family Story | Penumaka Vasantha

పరుగో పరుగు - తెలుగు కుటుంబ కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 04/10/2026


పరుగో పరుగు పెనుమాక వసంత రచించిన హృదయాన్ని కదిలించే తెలుగు కుటుంబ కథ. భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి తులసమ్మ ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, ఆమె చూపిన ధైర్యం, పట్టుదల ఈ కథలో ప్రధానాంశాలు. ప్రేమ కోసం మనిషి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలడని ఈ కథ తెలియజేస్తుంది. తల్లి ప్రేమ, భార్య త్యాగం, ఆత్మవిశ్వాసం విలువను తెలిపే ఈ స్ఫూర్తిదాయక కథను పూర్తిగా చదవండి.


పొలంలో పని చేస్తున్న తులసమ్మకు కొడుకు హరి పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు—

"అమ్మా! నాన్న ఎడ్ల బండి మీద నుండి కింద పడ్డాడు."


"అయ్యో! ఏడ పడ్డాడు?" అంటూ చేతిలోని కొడవలి అక్కడే పడేసి, కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళింది.


బయట నులక మంచంపై పడుకుని ఉన్నాడు రామయ్య. "ఎందయ్యా..! ఏమైంది?" అంటూ మంచం దగ్గరికి వెళ్ళింది.


"కొత్త ఎద్దులు కొన్నాంగా! అవి నాకు ఇంకా అలవాటు అవ్వక అదిలిస్తుంటే పైకి ఎగిరాయి. నేను బండి నుండి కింద పడ్డాను" ములుగుతూ అన్నాడు.


ఇంతలో పెద్ద కొడుకు ఆటో తీసుకుని వచ్చాడు. అందరూ కలిసి ఎత్తి ఆటోలో కూర్చోబెట్టి, పది మైళ్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు.


ఆటోలో చోటు లేక తను నడిచి వస్తానని చెప్పి, తులసమ్మ నడవటం మొదలుపెట్టింది. వీళ్లు వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసరికి పరుగున వచ్చింది. డాక్టర్లు స్కానింగ్ చేయాలని చెప్పారు. చేతిలో డబ్బులు లేవు.


"పట్నంలో తెలిసిన బంగారం షాపులో ఈ పుస్తెలు తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురా" అంటూ కొడుకు రంగ చేతికి ఇచ్చింది. మెడ చుట్టూ కొంగు కప్పుకుంది తులసమ్మ.


డాక్టర్లు రామయ్యను పరిశీలించి, "నడుము కింద భాగం చచ్చుబడింది. త్వరగా ఆపరేషన్ చేయాలి. దానికి లక్ష రూపాయలు కావాలి" అని చెప్పారు.


పుస్తెలతాడు అమ్మగా వచ్చిన డబ్బులతో స్కానింగ్, మందులకు కట్టింది. ఇప్పటికిప్పుడు ఇల్లు, పొలం అమ్మాలంటే ఎవరూ కొనేవాళ్లు లేరు. అయినా ఇంటి మీద అప్పు ఉంది. ఏం చేయాలో తెలియక తులసమ్మ జుట్టు పీక్కుంది.


ఇంతలో ఏదో రిక్షా బండిలో అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంటే విన్నది. "సిటీలో పరుగు పందేలు జరుగుతున్నాయి. ఇది మదర్స్ డే సందర్భంగా మహిళలకు జరపబడుతున్న పందేలు.


రేపు ఉదయం ఇక్కడ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో పందేలు జరుగును. ఎవరైనా ఆడవారు వచ్చి పాల్గొనవచ్చు. గెలిచిన వారికి యాభై వేల రూపాయలు ఇస్తారు" అనేది విన్నది.


'ఎట్లాగైనా ఈ పోటీలో పాల్గొని గెలిచి భర్తకు వైద్యం చేయించాలి. చిన్నప్పటి నుండి ఎంత దూరమైనా నడవటం అలవాటు తులసమ్మకు. ఇప్పుడు అదే నడకతో పందెం గెలవాలి.


ఆయన నిలబడితే కానీ ఇల్లు గడవదు. ఇది ఎవరికీ చెప్పకుండా వెళ్ళి డబ్బు గెలుచుకోవాలి' అనుకుంది. ఇంతలో రామయ్య పిలవటంతో లోపలికి వెళ్ళింది తులసమ్మ.


కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య. "ఇప్పుడిప్పుడే కాస్త సంపాదించి డబ్బులు కూడబెడదామనుకుంటే... ఎందుకు ఇట్లా అయింది తులసి?"


"ఏదోలే! నువ్వు మాకు దక్కావు అయ్యా! అంతే చాలు. ఇక బెంగ పెట్టుకోమాక" అంటూ మొగుడిని ఓదార్చింది.


మరసటి రోజు పొద్దున్నే కొడుకులను రామయ్య దగ్గర ఉంచి, "గుడికి వెళ్ళి వస్తాను, ఇప్పుడే వస్తాను" అంటూ బయలుదేరింది.


"తొందరగా రా అమ్మా..!" అన్నారు కొడుకులు. తలూపి బయటకు వచ్చి జూనియర్ కాలేజీ దగ్గరకు వెళ్ళింది.


లోపల ఎంతో మంది ఆడవాళ్లు ఫారాలు నింపుతూ ఉన్నారు. అందరూ డ్రెస్సులు వేసుకుని ఉన్నారు. తనను తాను చూసుకుంది తులసమ్మ; ముతక చీరలో ఉంది. తనని ఫారం పూర్తి చేయమంటే, "నాకు తెల్వదు. మీరు పూర్తి చేస్తే నేను వేలిముద్ర పెడతాను" అంది.


ఫారం పూర్తి చేయగానే 50వ నంబరు ఉన్న ఒక బ్యాడ్జ్ తులసమ్మ మెడలో వేసారు. "అందరూ కాలేజీ చుట్టూ ఉన్న రెండు కిలోమీటర్ల దూరాన్ని స్పీడుగా నడిచి ముందుకు వచ్చి, మళ్ళీ వెనకకు వెళ్ళి అక్కడ జెండా స్టేజీపై కూర్చున్న వాళ్ళకి ఇవ్వాలి.


ఇలా మూడు రౌండ్లలో ఎవరు నడకలో ముందుకు వస్తారో వాళ్ళకి నగదు బహుమతి" అని మైకులో చెప్తున్నారు.


తులసమ్మ చీరను మడిచి గోచికట్టు కట్టింది. అందరూ ఆమెను వింతగా చూస్తున్నారు. విజిల్ వినబడగానే అందరూ స్పీడుగా నడక మొదలుపెట్టారు. ఆమెకు అదేమీ కనపడటం లేదు.

ఎదురుగా తన భర్త హాస్పిటల్లో ఉన్నదాన్ని ఊహించుకుని నడకలో వేగం పెంచింది.


భర్తకు బాగై పొలం పనులు చేస్తున్నట్టుగా ఆలోచిస్తూ అందరితో పాటు స్పీడుగా నడవటం మొదలెట్టింది. ఫస్ట్ రౌండ్లో కొంచెం వెనకపడింది, రెండవ రౌండ్లో కొంచెం ముందుకు వచ్చింది. చివరకు అందరికన్నా ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న జెండాను అక్కడ స్టేజిపై ఉన్న మహిళా MLA కి ఇచ్చింది. అందరూ క్లాప్స్ కొట్టారు.


తర్వాత కప్ మరియు డబ్బులు ఇచ్చారు. తులసమ్మను మాట్లాడమంటే— "నాకు చదువు లేదు. నేను ఈ పోటీకి ఎందుకు వచ్చానంటే... మా పెనిమిటి హాస్పిటల్లో ఉన్నాడు.


ఆయనకు వైద్యం చేయించడానికి డబ్బులు అవసరమైనాయి, అందుకే వచ్చాను" అంది.


అక్కడ ఉన్న ఇంకొక జిల్లా మంత్రి, "నిజంగా నువ్వు గ్రేట్ తులసమ్మ! ఇంకా మీ ఆయన ఆపరేషన్‌కు ఎంత కావాలి డబ్బులు?" అంటే... "ఇంకో యాభై వేలు కావాలి సారు" అంది.


"ఆ హాస్పిటల్ పేరు చెప్పు. ఆ డాక్టరుతో మాట్లాడి మిగతా డబ్బులు కడతాను."


"ధన్యవాదాలు సార్! నేను హాస్పిటల్ కాడికి పోవాలి, ఇప్పటికే ఆలస్యం అయినాది" అంటూ మళ్ళీ పరుగున హాస్పిటల్ చేరుకుంది. వెళ్ళి ఆ డబ్బు అక్కడ కౌంటర్లో ఇచ్చి, "మొదలు పెట్టండి మా ఆయనకు ఆపరేషన్" అంది.


"మీ ఆయనకు ఆపరేషన్ జరుగుతుంది, నువ్వు కంగారు పడకు. మంత్రి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు" అంటూ కౌంటర్లో వాళ్లు చెప్పారు.


'అమ్మయ్య' అనుకుంటూ అక్కడ కుర్చీలో కూలబడింది. కొడుకు టిఫిన్ తెచ్చి ఇచ్చాడు.


"అమ్మా, నువ్వు యాడికి పోయినావు?"


"యాడికీ లేదులే..!" అంటూ టీవీ వైపు చూస్తే, తను నడుస్తున్నది కనపడింది.


"అమ్మా! నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసులే. నువ్వు నాన్న ఆపరేషన్ డబ్బుల కోసం పరుగు పోటీలకు వెళ్లావు కదూ?" అంటూ నవ్వాడు కొడుకు హరి.


ఇంతలో డాక్టర్ వచ్చి, "తులసమ్మ! మీ ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇంకో నెలలో నడుస్తాడు" అనగానే, "మీరు దేవుళ్ళు సారు..!" అంటూ చేతులు జోడించింది తులసమ్మ.


"నువ్వు ఇక డబ్బులు కట్టక్కర్లేదు, మంత్రి డబ్బులు పంపించారు. నీ ఆయనను బతికించుకోవటానికి నువ్వు చేసిన త్యాగం ఊరికే పోలేదు" అంటూ తులసమ్మను మెచ్చుకున్నాడు డాక్టర్. తులసమ్మ కళ్లలో ఆనందం తొణికిసలాడింది.


***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:




పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page