top of page

ప్రేమ తీరాలు - పార్ట్ 11

Updated: Oct 23

#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

ree

Prema Theeralu - Part 11 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 17/10/2025

ప్రేమ తీరాలు - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంజినీరింగ్‌ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమించి, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటాడు. వారికి కపర్ధి అనే బాబు పుడతాడు. కరుణాకర్ రాధను పెళ్లి చేసుకుంటాడు. కాలక్రమేణా లలిత–కరుణాకర్ మధ్య దూరం వస్తుంది.ఫణి అనారోగ్యానికి గురవుతాడు; బ్రెయిన్ ట్యూమర్‌గా తేలుతుంది. ఆపరేషన్ ఖర్చు ఇరవై లక్షలు అవుతుందని డాక్టర్లు చెబుతారు. మేనేజర్ కిరణ్ సహాయంతో ఫణి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. కానీ, కిరణ్–లలిత మధ్య పరిచయం సరితకు, రాధకు అనుమానంగా కనిపిస్తుంది. మార్ఫింగ్ ఫోటోలతో లలితను చెడుగా చూపి, ఫణిని మానసికంగా మభ్యపెడుతుంది సరిత.



ఇక ప్రేమ తీరాలు పార్ట్ 10 చదవండి. 


“ఏంటి నా ఇంటికి వచ్చి నన్ను దబాయింపుగా మాట్లాడుతున్నావు? ఆయనకు మాట్లాడాలనిపిస్తే నాతో మాట్లాడుతారు. మధ్యలో నీ పెత్తనం ఏమిటి? ఏమండి, ఏంటిది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేసినా ఎత్తలేదు. కనీసం ఒకసారి చెప్పాలనిపించలేదా మీకు? కిరణ్ కూడా చాలా సార్లు ఫోన్ చేసాడట. మీరు ఎత్తలేదు అంటున్నాడు,” అని గయ్యిమని లేచింది లలిత, తన భర్త మీద కోపంతో.


“ఏం నీకు చెప్పాలా? చెబితే గాని ఇంట్లో ఉండనివ్వవా? నీకు నేను చెప్పాల్సిన అవసరంలేదు. ముందీ పేపర్ల మీద సంతకం పెట్టు, తర్వాత సంగతి మాట్లాడుతా,” అని లలిత ముఖం మీదకు పేపర్లను విసిరేశాడు ఫణి.


“ఏం మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? ఈ పేపర్లు ఏంటి? సంతకాలు ఏంటి?” అని పేపర్లను తీసుకుని చూసిన లలిత, ‘విడాకుల నోటీసు’ అని రాసి ఉండటం చూసి కాళ్ల కింద భూమి పగిలిపోతున్నట్టయింది.


 పరుగున పేపర్లు పట్టుకుని ఫణి దగ్గరకు వచ్చి, “ఏమండి, మనం విడాకులు తీసుకోవడం అంటే ఏమిటి? ఎవరో మీ మనసు మార్చేస్తున్నారు. ఇన్నాళ్ల మన కాపురంలో గొడవలు లేవు, తిట్టుకోవడం లేదు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు?” అని భర్త చేతులు పట్టుకుని అడిగింది లలిత.


“నీతో మాట్లాడటం కూడా మా బావకు ఇష్టం లేదు. నేనే బలవంతంగా తీసుకువచ్చాను. అసలు నీ ముఖం కూడా చూడనన్నాడు. మర్యాదగా సంతకం పెట్టి ఇవ్వు, బావను తీసుకుని వెళ్తాను,” అని లలిత చేతులనుండి ఫణిని విడదీస్తూ అంది సరిత.


“ఏయ్, ఎవ్వరివే నువ్వు! మా భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నావు. నీ మొగుడు వదిలేశాడు చాలక నా మొగుడు వెంటపడుతున్నావు. మా పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నావు! నువ్వు తల బండకేసి కొట్టుకున్నా కూడా నేను సంతకం పెట్టను!” అని సరిత చెంప మీద లలిత గట్టిగా కొట్టింది ఆవేశంతో.


ఫణి ఆగ్రహంతో, “నీకు ఎంత ధైర్యం! నా ముందే నా మరదలిని కొడతావా! ఉండు, నీ పని చెబుతా!” అంటూ లలిత మీదకి వచ్చాడు.


“నాయనా ఫణి! ఎందుకింత ఆవేశం? ఎన్నడూ లేనిది లలిత మీద చెయ్యెత్తుతున్నావు. ఏమైంది?” అని సావిత్రమ్మ గొడవ విని లోపలికి వచ్చింది.


లలిత ఏడుస్తూ, “పిన్ని, వీళ్ళు విడాకులు అంటున్నారు. నేను ఏ పాపం చేసానో చెప్పండి,” అని బోరుమంది.


సావిత్రమ్మ షాక్ అయి, “ఫణి, చెప్పాపెట్టకుండా ఈ నిర్ణయం ఏమిటి? ఒక బాబుకు తండ్రివి నువ్వు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడమేంటి?” అని ప్రశ్నించింది.


సరిత చల్లగా, “ఆంటీ, ఫణి మా బావ. ఈ లలిత చేసిన దుర్మార్గం వల్ల ఆయనకు జీవితం మీద విరక్తి వచ్చింది. ఆత్మహత్యకు ప్రయత్నించినవాడిని నేనే కాపాడాను. ఇప్పుడు ఆయనకు ఈమె ముఖం కూడా చూడలేడు. మీకు ఈ విషయంలో జోక్యం అవసరం లేదు,” అంది.


తర్వాత ఫోన్‌లో మార్ఫింగ్ వీడియో చూపించింది. సావిత్రమ్మ, లలిత ఇద్దరూ అవాక్కయ్యారు. వీడియో చూసి సావిత్రమ్మ ముఖం తారుమారయింది.


“ఇది నిజం కాదు! ఈ వీడియో అబద్ధం! పిన్ని, నేను మీ కూతురిలా ఉన్నాను. నాకు కిరణ్ అన్నయ్య లాంటివాడు. ఈవాళ్ళు నన్ను చెడుగా చూపించడానికి కుట్ర పన్నుతున్నారు!” అని లలిత కన్నీళ్లు కారుస్తూ సావిత్రమ్మ కాళ్లు పట్టుకుంది.



ree

కానీ ఫణి తీరే మారిపోయింది.“చాలు లలిత. నువ్వంటే అసహ్యం వేస్తుంది. నువ్వు అలా చేస్తావనుకోలేదు. ఇప్పుడు నిన్ను నమ్మడం నాకు అసాధ్యం,” అని గట్టిగా అన్నాడు.


సరిత చీదరించి, “మరి బావా, ఇంకెందుకు ఆలస్యం! సంతకం చేయకపోతే కోర్టు నుండి సమన్లు పంపిద్దాం,” అంది.


సావిత్రమ్మ కూడా చివరికి, “చాలు లలిత! ఇక ఈ ఇంట్లో ఉండకు. రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయి,” అంది.


సరిత దుర్ముఖంతో, “బాబు కూడా నీకే పుట్టాడా ఏమో!” అన్న వెంటనే, లలిత ఆగ్రహంతో సరిత గొంతు పట్టుకుంది. ఫణి వచ్చి లలిత చెంప పగలగొట్టాడు.


“ఇక చాలు! నీ కొడుకుతో ఇక్కడినుండి వెళ్ళిపో. మళ్లీ నా కళ్ళకు కనిపించవద్దు!” అని కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించి వెళ్ళిపోయాడు.


సరిత హేళనగా, “ఇప్పటికి అర్థమైందనుకుంటాను నీకు!” అంటూ నవ్వుకుంటూ బయటకి వెళ్లింది.


లలిత పిచ్చిదానిలా ఏడుస్తూ, ఇల్లంతా తిరిగింది. కొడుకు కపర్ధి స్కూల్‌ నుండి వచ్చి, “అమ్మా, ఆకలేస్తుంది,” అన్నాడు. అతన్ని గుండెలకదుముకుని మళ్లీ విలపించింది.

తనతో ఏమి జరిగిందో ఆ బాలుడికి చెప్పలేకపోయింది. చివరికి, “ఇక్కడ ఉంటే ఎవరో చెప్పేస్తారు,” అని నిర్ణయించి, చిన్న ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి, బాబు చేత పట్టుకుని వెళ్ళిపోయింది — ఎవరికి తెలియనంత దూరంగా.


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 

ree



1 Comment



@kpj6968

•22 hours ago

Katha chalaa baagundi

Like
bottom of page