top of page
Original.png

రాజు గారి రెండో భార్య!

17 hours ago
2 min read

ఇద్దరు రాణుల మధ్య నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న కల్పిత తెలుగు రాజు, చర్చించుకుంటున్న సభికులు — రాజు గారి రెండో భార్య వ్యంగ్య రచన.
ఒకరంటే ఇష్టమని చెప్పడం, మరొకరంటే ఇష్టం లేదని చెప్పడమేనా?

Raju Gari Rendo Bharya - Telugu Inspirational Article | Kotha Viritha

రాజు గారి రెండో భార్య! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 01/11/2026


నచ్చకపోవడం కూడా ఒక స్వతంత్ర అభిప్రాయమే అని అంగీకరించడానికి మాత్రం చాలాసార్లు ఇష్టపడము!

ఇలాంటి మనస్తత్వాన్ని సరదాగా ప్రశ్నిస్తూ, చివర్లో రాజు గారి రెండో భార్య ఉదాహరణతో నవ్వించే కొత్త విరిత గారి వ్యంగ్య రచన “రాజు గారి రెండో భార్య!”



నీకు ఒక రాజకీయ నాయకుడు ఇష్టం లేదు అంటే, ఇంకొక నాయకుడు ఇష్టం అనే అర్థం కదా!


నీకు వాడు నచ్చలేదు అంటే, ఇంకొకడు నచ్చాడనే కదా!

నీకు ఈ పని చేయాలనిపించడం లేదు  అంటే, వేరే పని చేయాలనిపిస్తోందనే కదా!


మనిషి “వద్దు” అన్న ప్రతిసారీ… దాని వెనకాల ఇంకో “కావాలి” దాక్కునే ఉంటుంది.

చాయ్ వద్దంటే కాఫీ కావాలి…

కాఫీ వద్దంటే చల్లని పానీయం కావాలి!


ఒక ఉద్యోగం నచ్చలేదంటే… ఇంకో ఉద్యోగమే కలల ఉద్యోగమని ఊహించేస్తాం.

ఒక మనిషితో మాట్లాడటం ఇష్టం లేదంటే… ఇంకొకరితో గంటలకొద్దీ మాట్లాడతారని అనుకుంటాం.


“నాకు రాజకీయాలు నచ్చవు” అన్నా… వెంటనే “అయితే ఎవరి వైపు?” అని అడిగే సమాజం మనది.


ఎవరినైనా విమర్శిస్తే… “మరి నువ్వు ఎవరిని సమర్థిస్తున్నావు?” అనేది వెంటనే వచ్చే ప్రశ్న!


నచ్చనిదాన్ని తిరస్కరించడానికి… ఇంకొక నచ్చినదాన్ని చూపించాల్సిందే అన్నట్టు ఉంటుంది.


“నాకు అది వద్దు” అన్నా కూడా…

 “మరి ఏది కావాలి?” అని వెంటపడతాం.


అసలు నచ్చకపోవడం కూడా ఒక అభిప్రాయమే అని ఒప్పుకోవడానికి మాత్రం మన అహంకారం ఒప్పుకోదు.


ఇక రాజు గారికి రెండో భార్య చాలా ఇష్టం అంట!

అంటే మొదటి భార్య అంతగా ఇష్టం లేదని అర్థం చేసుకోవడం మన జన్మహక్కే కదా!


***

కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక








మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page