top of page
Original.png

శబరిమలై దీక్ష ప్రాముఖ్యత

3 hours ago
4 min read

శబరిమలై అయ్యప్ప దీక్షలో 41 రోజుల మండల వ్రతం పాటిస్తూ ఇరుముడితో 18 పవిత్ర మెట్లు ఎక్కుతున్న భక్తుడు

Sabarimalai Deeksha Pramukyatha - Telugu Spiritual Article | R C Kumar

శబరిమలై దీక్ష ప్రాముఖ్యత - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 09/11/2026


శబరిమలై అయ్యప్ప దీక్ష భక్తి, నియమ నిష్ఠలు, ఇంద్రియ నిగ్రహం, ఆత్మశుద్ధికి ప్రతీకగా భావిస్తారు. 41 రోజుల మండల వ్రతం నుంచి ఇరుముడి, పదునెట్టాంబడి, “తత్వమసి” వరకు ఈ పవిత్ర దీక్షలోని ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలుసుకుందాం.


పురాణ గాథ ప్రకారం మహిషాసురుడి సోదరియైన మహిషి అనే రాక్షసిని సంహరించడానికి శివకేశవుల తేజస్సుతో మణికంఠుడు అయ్యప్పగా జన్మించాడు.


రాక్షస సంహారం అనంతరం అయ్యప్ప స్వామి శబరిగిరులలో తపస్సు చేసి అక్కడే అంతర్ధానమయ్యాడు.


శబరిమలై దీక్ష తీసుకోవడం అనేది కోట్లాది మంది భక్తులకు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు; అది అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికమైన విశ్వాసం.


ఇంద్రియ నిగ్రహం, నిస్వార్థ భక్తి మరియు భగవంతునితో అనుసంధానమయ్యే అవకాశం ఉన్న ఒక అద్భుతమైన ప్రక్రియ.


పరమ పవిత్రమైన శబరిమలై అయ్యప్ప దీక్ష సాధారణంగా ప్రతి ఏటా కార్తీక మాసం మొదటి రోజున (దాదాపుగా నవంబర్ మధ్యలో) ప్రారంభమై మకర సంక్రాంతి వరకు జరుగుతుంది.


భక్తులు అత్యంత నిష్టతో గురుస్వామి లేదా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో తులసి లేక రుద్రాక్ష మాల ధారణతో ప్రారంభించి, 41 రోజుల పాటు కఠినమైన ఈ వ్రతాన్ని కొనసాగిస్తారు.


పూర్వం శబరిమల యాత్ర ఇప్పటిలాగా సులభంగా ఉండేది కాదు. దట్టమైన అడవులు, క్రూర జంతువులతో నిండిన 18 కొండలను దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చేది.


అడవిలో ఒంటరిగా వెళ్తే జంతువుల బారిన పడే ప్రమాదం ఉండటం వల్ల, భక్తులంతా గురుస్వామి ఆధ్వర్యంలో ఒక బృందంగా ఏర్పడి ప్రయాణం చేసే సంప్రదాయం మొదలైంది.


అడవిలో క్రూర జంతువుల కంటికి కనపడకుండా ఉండేందుకు, వన్యప్రాణులను ఆకర్షించని నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులను ధరించడం ఆనవాయితీగా మారింది.


41 రోజుల పాటు కఠినమైన బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, నేలపై నిద్రించడం వంటి నియమాల ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకుంటారు స్వాములు.


శబరిమల కొండలు ఎక్కడానికి, కఠినమైన ప్రయాణానికి అవసరమైన మానసిక స్థైర్యాన్ని, శారీరక దృఢత్వాన్ని ఈ దీక్ష అందిస్తుంది.


కుల, మత, వర్ణ భేదాలు లేకుండా అందరూ ఒకే రకమైన నల్లని దుస్తులు ధరించి, ఒకే రకమైన మాల వేసుకుని 'స్వామి శరణం', 'స్వామియే శరణం అయ్యప్ప' అంటారు.


ఈ నలభై ఒక్క రోజులను "మండల కాలం" లేదా "మండల వ్రతం" అంటారు. మానవ శరీరం, మనస్సు పూర్తి స్థాయిలో పరివర్తన చెందడానికి ఒక మండల కాలం పడుతుందని భక్తుల నమ్మకం.


అందుకే ఈ 41 రోజులు బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, చన్నీటి స్నానం, పాదరక్షలు లేకుండా నడవడం, నిత్య పూజలు వంటి నియమాలను పాటిస్తారు.


ఈ మండల కాలంలో సాధన చేసిన ఇంద్రియ నిగ్రహాన్ని తర్వాత కాలంలో కూడా కొనసాగించగలిగితే అనేక లౌకిక, అలౌకిక ప్రయోజనాలు కలుగుతాయి.


ఇరుముడిని తలపైనే పెట్టుకోవడం వెనుక ఎంతో ఆధ్యాత్మిక, వైజ్ఞానిక మరియు మానసిక ప్రాధాన్యత దాగి ఉంది.


మలయాళంలో 'ఇరు' అంటే రెండు, 'ముడి' అంటే మూట అని అర్థం. ముందు ముడి, వెనుక ముడితో దానిని తలపై మోయడం అనేది జీవాత్మ-పరమాత్మల అనుసంధానానికి ప్రతీక.


ముందు ముడిలో ఉండే నెయ్యి కొబ్బరికాయ జీవాత్మకు (భక్తుడికి), లోపల ఉండే నెయ్యి పరమాత్మకు (అయ్యప్పకు) సంకేతం.


ఆలయంలోని అత్యంత పవిత్రమైన 'పదునెట్టాంబడి' అనబడే 18 పవిత్ర మెట్లు ఎక్కాలంటే తలపై ఇరుముడి ఉండటం తప్పనిసరి. ఇరుముడి లేని భక్తులను ఈ మెట్లు ఎక్కడానికి అనుమతించరు.


ఇరుముడిని తలపై మోస్తూ, పద్దెనిమిది మెట్లు ఎక్కి మందిరానికి వచ్చే భక్తుడికి ప్రధాన గర్భగుడి ముందు ఆలయ ద్వారం పైభాగంలో "తత్వమసి" అనే వాక్యం మొదటగా దర్శనమిస్తుంది.


దాని అర్థాన్ని గ్రహించి ఆచరిస్తే శబరిమల యాత్రకు పరిపూర్ణత కలుగుతుంది. 'తత్' (అది), 'త్వం' (నీవు), 'అసి' (ఉన్నావు) అనే మూడు సంస్కృత పదాల కలయిక ఇది. ఛాందోగ్య ఉపనిషత్తులోని ఈ వాక్యం 'అది నువ్వే' లేదా "ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు" అనే అర్థాన్ని తెలియజేస్తుంది. మానవుడిలోనే ఉండే దైవత్వాన్ని గుర్తుచేయడమే దీని ముఖ్య ఉద్దేశం.


నువ్వు కొండలు, కోనలు దాటి ఏ పరమాత్మను చూడటానికి ఇక్కడికి వచ్చావో, ఆ దైవత్వం మరెక్కడో లేదు, అది "నీలోనే అంతర్యామిగా, ఆత్మ స్వరూపంగా ఉంది" అని ఈ వాక్యం భక్తులకు బోధిస్తుంది.


ఈ పరమ సత్యాన్నే మన సనాతన ధర్మం, వేదాంతం మరియు ఎందరో మహర్షులు, యోగులు ఘోషించారు. అందువల్లనే అయ్యప్ప స్వాములు ఒకరినొకరు చూసుకున్నప్పుడు కూడా ఎదుటివారిలో దైవాన్ని దర్శిస్తూ "స్వామి" అని పిలుచుకుంటారు.


దీక్ష తీసుకోని సామాన్య ప్రజలను కూడా 'స్వామి' అనే పిలుస్తారు.

స్వామి శరణం 🙏


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y








ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

R C Kumar
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page