top of page

ఆత్మీయ వెన్నెల సదస్సు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Athmiya Vennela Sadassu' New Telugu Story Written By Neeraja Hari Prabhala

రచన….నీరజ హరి ప్రభల


నిత్యం శునకరాజములు రోడ్డు మీద వాహన చోదకులకు అడ్డు వస్తూ పాదచారుల చేత 'ఛీ, ఛా ' అనిపించుకుంటూ , "మీలాగా మాకూ స్వేఛ్ఛగా తిరిగే హక్కు లేదా? మాకు కూడా యూనియన్ సంఘాలు, ఇన్సూరెన్సులు ఉంటే మీకు బుద్ధి చెప్పి మాకు రక్షణ కల్పించుకునేవాళ్ళం." అని మనసులో ఎప్పుడూ ఘోషిస్తూ ఉండేవి.

వాటి మొర ఆలకించినట్లుగా కరోనా సమయం , లాక్ డౌన్ సందర్భంగా పట్టపగలే నగరం ఎటువంటి వాహన శబ్దములు లేకుండా నిశ్శబ్దంగా ఉండి , జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా ఉంది. ఇదే తరుణమని యదేఛ్ఛగా రాజమార్గంగా పాదాచారియై స్వేఛ్ఛగా, హాయిగా శునకరాజములు సంచరిస్తున్నాయి. పైగా ప్రస్తుతం మనుషులకు అవసరమైనట్టుగా వాటికి మాస్కులు, ఎక్కడ కన్నా వెళ్లొచ్చేందుకు పాస్ లు, టెస్టులు, క్వారంటైన్ లు అవసరం లేదు . అందువలన అవి యదేఛ్ఛగా ,స్వేఛ్ఛగా, హాయిగా సంచరిస్తున్నాయి.

రాత్రి 11గంటలయ్యింది. నగరం నిద్రాదేవి ఒడిలో ప్రశాంతంగా సేద తీరుతున్నట్టుగా నిశ్శబ్దంగా ఉంది. వంటింట్లో పని పూర్తయి నేను నిద్రకు ఉపక్రమించబోతుండగా హఠాత్తుగా కాలభైరవుల అరుపు. నేను తృళ్ళిపడి తలుపు తీసి బాల్కనీ లోకి వచ్చి చూస్తే 10 కాలభైరవులు మా గేటు తీసుకుని తాపీగా లోపలికి వస్తున్నాయి. (డిన్నర్ పూర్తి చేసినట్లు ఉన్నాయి) . డ్రస్ కోడ్ ఇలా ఉండాలని ముందే నిర్ణయించుకున్నట్టుగా తెలుపు, నలుపు , ఆ రెండు రంగుల మిశ్రమంతో చుక్కల డిజైన్ల తో చాలా ముచ్చటగా, అందంగా ముస్తాబై వయ్యారంగా కొన్ని , హుందాగా కొన్ని ఉన్నాయి. మా కాలభైరవులు ఇద్దరూ ఎదురు వెళ్ళి స్వాగతించారు.

కొబ్బరి, మామిడి,జామ, దానిమ్మ,ఉసిరి మొ..ఫల వృక్షాలు, మందార, మల్లె‌, జాజి‌, సంపంగి‌‌, పారిజాతాలు మొ..సుగంధ పుష్పాలతో, పచ్చని ప్రకృతి అందాలతో శోభిల్లుతూ వెండి వెన్నెల పిండారబోసినట్టుంది మా తోట.

సోమవారం, కార్తీక పౌర్ణమి. మంచి ముహూర్తము, ఉసిరి చెట్ల క్రింద ఆత్మీయ సదస్సు విశేషం అనుకున్నాయేమో అన్నీ తమ తమ ఉన్నతాసనాల మీద ఆశీనులయ్యాయి. అందులో 'జూలీ ' అనే అందమైన శునకము సిగ్గు పడుతూ లేచి నుంచుని తనను తాను పరిచయం చేసుకుని షి యీస్ రోజీ, హీ యీస్ టామీ, హి యీస్ జాన్ అని వరుసగా అందరినీ పరిచయం చేసింది. అన్నీ ఒకళ్ళకొకళ్ళు హగ్ చేసుకుని, ముద్దు పెట్టుకున్నాయి..

ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ , మ్యూజిక్ కన్సర్ట్స్ కాబోలు వరుసగా సోలో గా మొదలుపెట్టి క్రమేపీ గళం పెంచుతున్నాయి. పుట్టుకతోనే గొంతులో యాంప్లిఫైర్ని అమర్చుకున్నాయి కనుక వాటికి మైక్ , దాని సెట్టింగులతో పనిలేదు. పైగా ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. శబ్ద తరంగాలు ఆకాశాన్ని మిన్నంటుతున్నాయి.

నా అలికిడికి వాటికి అంతరాయం కలిగినట్టుంది, నన్ను మింగేద్దామన్నంత కోపంగా గుర్రుగా చూస్తున్నాయి. "మా సంభాషణలు వింటావా! క్రిందకు రా! నీ పని చెబుతాం " అన్నట్లు ఉన్న వాటి భావనను గ్రహించి "అయ్" అని అదిలించే పని విరమించి బెడ్ మీదకు వచ్చి పడుకున్నాను.

సోలో అయ్యి గ్రూప్ సింగింగ్ మొదలు పెట్టి కంటిన్యూస్ గా బ్రృందగానం చేస్తున్నాయి. వాటిలో వాటికి ఎంత ఐకమత్యమో ! 'అలాగే వింటూ పడుకుందామా ' అనుకుంటే ఒకటి కాదాయే ! 10 కాలభైరవులు వివిధ శ్రుతులతో తారాస్థాయి గానం. వినలేకపోతున్నాను.

'క్రిందకు వెళ్లి అదిలిద్దామా ' అనుకున్నా !' అమ్మో! అవన్నీ నా మీదకు దండయాత్ర చేస్తే బ్రతికి ఉంటానన్న గారెంటీ లేదు. ఒకవేళ బ్రతికున్నా అర్థరాత్రి హాస్పిటల్ చుట్టూ తిరిగి బొడ్డు చుట్టూ 32 ఇంజక్షన్లు చేయించుకోవాలి. పైగా కరోనా సమయంలో ఏ హాస్పిటల్ లోనూ ఇలాంటి వాటికి వెంటనే చేర్చుకోరు. ఒకవేళ బ్రతిమలాడో, బామాలో చేరినా కరోనా టెస్టులు, 2వారాల క్వారంటైన్ నరకము తప్పదు. అసలే చలికాలం, గాయాలు మానవు ' అని భయపడి లోపలికి వచ్చాను. పగలయితే ఏదో ఒక పని చేసుకోవచ్చు. అది అర్థరాత్రి. ఏపనీ చేయలేను. అలాగని వాటి గానాన్ని ఆస్వాదించలేను. నాపరిస్థితి 'ముందు నుయ్యి, వెనక గొయ్యి లాగా 'ఉంది.

సోఫాలో కూర్చుని వాల్ క్లాక్ వంక చూస్తూ ఒంటరిగా గడిపాను. పాట కచేరి పూర్తయింది. తెల్లవారుజామున 4.30 అయ్యింది. విండో లోంచి చూశాను.ఇహ కాన్ఫరెన్స్, మ్యూజిక్ కన్సర్ట్ అయింది కాబోలు. అన్నీ కలిసి షేక్ హాండ్ ఇచ్చుకుని బయటకు వెళుతున్నాయి. తలుపు తీసి ధైర్యంగా బాల్కనీ లోకి వచ్చిన నన్ను చూసి' ధాంక్స్' అన్నట్టు ఒక లుక్ ఇచ్చి," ఇహ నీవు కార్తీక దీపారాధన, నక్షత్ర దర్శనం చేసుకుని తరించు" అని చెప్పి వెళ్ళాయి.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మనసులోని మాటరచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏


64 views0 comments

Comments


bottom of page