top of page
Original.png

చీకటి వెలుగులు

ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.


Chikati Velugulu - Telugu Inspirational Story | Jeedigunta Srinivasa Rao

చీకటి వెలుగులు - తెలుగు ప్రేరణాత్మక కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 27/04/2026

చీకటి వచ్చినప్పుడు…వెలుగు కూడా దగ్గరలోనే ఉంటుంది.

“చీకటి వెలుగులు” కథలోఉగాది పచ్చడి జీవితం గురించి గొప్ప సత్యాన్ని చెబుతుంది.


సుబ్రహ్మణ్యం గారు, ఆయన భార్య పద్మావతి హైదరాబాద్‌లోని తమ పాత ఇంట్లో ఉంటున్నారు. ఆయన ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఒక్కతే ఆడపిల్ల, అమెరికాలో ఉద్యోగం. 


"ఒక్క పిల్లవి ఎందుకమ్మా పరాయి దేశంలో ఉద్యోగం, ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు కదా?" అని ఎంత చెప్పినా వినకుండా, “రెండేళ్లు అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చేస్తాను” అని ఒప్పించి వెళ్ళిపోయింది.


"ఏమండీ! అలా పడుకుని ఉండకపోతే కొద్దిగా పెరటిలోకి వెళ్లి వేపపువ్వు కోసుకొని వచ్చి గుమ్మానికి మామిడాకులు కట్టండి, రేపు ఉగాది గుర్తుందా?" అంది పద్మావతి. 


భార్య అరుపులకి ఆలోచనలో నుంచి బయటకు వచ్చి, "ఏం ఉగాదో... ఉన్న ఒక్క పిల్ల పరాయి దేశంలో ఉంది, మనకా వృద్ధాప్యం తరుముకు వస్తోంది, చిన్నప్పుడు ఉన్న హుషారు ఇప్పుడు ఎక్కడ ఉంటుంది?" అన్నాడు.


"అలా అని నిరుత్సాహం పడితే ఎలా అండి? ఇదిగో ఈ కాఫీ తాగితే మీకు ఉత్సాహం వస్తుంది. పక్కింటి అబ్బాయికి చెప్పాను మీకు వేపపువ్వు కోయడంలో సహాయం చెయ్యమని, అతనిని తీసుకుని వెళ్ళండి" అంది. 


"అతను ఎందుకే? చిన్నప్పుడు వినాయక చవితి వస్తోంది అంటే నేను చెట్ల మీదే ఉండేవాడిని పత్రి కోసం" అన్నాడు. 


"మంచం మీద నుంచి లేవడానికే ఆపసోపాలు పడతారు, ఇక చెట్టు ఏం ఎక్కుతారు? ముందు చీకటి పడేలోపు మామిడి ఆకులు, వేపపువ్వు, కొన్ని తమలపాకులు కోసుకుని రండి, తెల్లారితే ఎవరైనా కోసుకుపోతారు" అంది.


"సంక్రాంతికి వస్తాను అంది నీ కూతురు, రాలేదు. పోనీ ఉగాదికి రమ్మంటే ‘అమెరికాలో పరిస్థితులు బాగుండలేదు, ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఇప్పుడు రాలేను’ అంది. ఏమిటో పండగ వస్తోందంటే చాలు అదో రకమైన వెలితి, పిల్ల మనతో లేదని. పండగంటే సందడి ఉండాలి కదా!" అంటూ సంచి పట్టుకుని లేచి పెరటిలోకి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం.


ఈసారి ఉగాదికి కూడా కూతురు రాదని అనుకుంటున్న సమయంలో, "నాన్నా! నేను లావణ్యని మాట్లాడుతున్నాను. దుబాయ్ నుంచి ఇంకో నాలుగు గంటలలో హైదరాబాద్‌లో ఉంటాను, మీరు ఎయిర్‌పోర్ట్‌కి రండి" అంది. 


"అదేమిటే, వారం క్రితం అడిగితే రాలేను అన్నావు?" అన్నాడు కంగారుగా. 


"వచ్చిన తర్వాత మాట్లాడుతాను, మీరు తెల్లవారి మూడు గంటలకు ఎయిర్‌పోర్ట్‌కి రండి" అని పెట్టేసింది.


"ఇదిగో, నీ కూతురు వస్తోంది రేపు ఉదయం. నేను తెల్లారి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి" అన్నాడు భార్యతో. 


"పోనీలెండి, మీ కోరిక నెరవేరిందిగా! మీరు ఒక్కరే ఏం వెళ్తారు, నేను కూడా వస్తాను ఎయిర్‌పోర్ట్‌కి" అంది కూతురు వస్తోంది అన్న సంతోషంలో.

“ఇంకా నాలుగు గంటలైనా అమ్మాయి బయటకు రాలేదు ఏమిటే” అన్నాడు అరైవల్ గేట్ వంక చూస్తూ. 


"లగేజీ రాలేదేమో, అదిగో అమ్మాయి వస్తోంది! మీరు వెళ్లి ట్రాలీని పట్టుకోండి" అంటూ హడావుడి చేస్తోంది పద్మావతి.


కూతురు రెండు ట్రాలీలు తోసుకుంటూ వస్తుండటం చూసి ఒక ట్రాలీ అందుకుని, "బాగున్నావా తల్లి? ప్రయాణం బాగా జరిగిందా?" అని అడిగాడు. 


డీలా పడిపోయిన ముఖంతో, కళ్ళ కింద నల్లటి చారలతో ఉన్న కూతురిని చూసి, "ఏమై ఉంటుంది?" అనుకున్నాడు.


ఇంటికి రాగానే "ఏమైందమ్మా?" అని ఆత్రుతగా అడిగాడు.

లావణ్య ఏడుస్తూ.. "నాన్న, అక్కడ లే-ఆఫ్స్ (Layoffs) జరిగాయి. నా ఉద్యోగం పోయింది. వీసా సమస్యలు కూడా రావడంతో అంతా వదిలేసి వచ్చేశాను. నా కెరీర్ ముగిసిపోయింది నాన్న" అని కుప్పకూలిపోయింది.


​కన్న కూతురు పడుతున్న బాధ చూసి సుబ్రహ్మణ్యం గారి మనసు వికలమైంది, కానీ ఆయన ధైర్యం కోల్పోలేదు.

"చదువుకున్న దానివి, ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుంది. ఈ రోజు ఉగాది, ఈ రోజు ఆనందంగా ఉంటే ఏడాది అంతా ఆనందంగా ఉంటారు. జరిగింది మర్చిపోయి, చక్కగా పండుగ చేసుకో" అన్నాడు. 


"వద్దు నాన్నా, నా మనసు బాగా దెబ్బతింది, ఇంట్లో ఏ సంబరమూ వద్దు" అని లావణ్య గదిలోనే ఉండిపోయింది. 


సుబ్రహ్మణ్యం గారు భార్య తయారు చేసిన ఉగాది పచ్చడిని కూతురు గదిలోకి తీసుకెళ్లారు.


​"ఇదిగోమ్మా.. ఉగాది ప్రసాదం తీసుకో" అని అందించారు.


ఆమె అయిష్టంగానే ఒక చెంచా నోట్లో పెట్టుకుంది. చేదుగా ఉండటంతో ముఖం ముడుచుకుంది.


​అప్పుడు సుబ్రహ్మణ్యం గారు పక్కన కూర్చుని ఇలా అన్నారు:


"లావణ్య, ఈ పచ్చడిలో ముందుగా తగిలేది వేపపువ్వు చేదు, మామిడి వగరు మాత్రమే. కానీ మనం దాన్ని పారేయం కదా? ఎందుకంటే ఆ చేదు వెంటే తీపి ఉంది, ఆ వగరు వెంటే ఉప్పు-కారం ఉన్నాయి. నీ జీవితంలో ఇప్పుడు ఉద్యోగం పోవడం అనేది ఒక 'చేదు' అనుభవం మాత్రమే. కానీ ఉగాది అంటేనే కొత్త సంవత్సరం, కొత్త ఆరంభం. పచ్చడిలో రుచులు ఎలా మారుతాయో, నీ కాలం కూడా మారుతుంది. రేపు నీ జీవితంలో కూడా తీపి మొదలవుతుంది, నమ్ము" అన్నాడు.


తండ్రి మాటలు ఆమెలో నిరాశను కొంతమేర తొలగించినా, ఏదో తెలియని బాధ మిగిలే ఉంది. భారంగా లేచి దేవుడి గదిలోకి వెళ్లి దణ్ణం పెట్టుకుని హాలులోకి వచ్చి కూర్చుంది.

సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టే, ఆ ఉగాది తర్వాత ఆమెకు కాలం కలిసిరావడం మొదలైంది. ఒక నెల తర్వాత, ఆమెకు ఒక ప్రముఖ కంపెనీ నుండి వర్క్ ఆఫర్ వచ్చింది. అదే సమయంలో, లావణ్య గురించి తెలిసిన బంధువులు ఒక మంచి సంబంధం తెచ్చారు.


అతని పేరు మహాదేవ్. అతను కూడా అమెరికాలోనే సెటిల్ అయిన హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్. అతనికి లావణ్య చదువు, ఆమె వ్యక్తిత్వం బాగా నచ్చాయి. అన్నింటికంటే ముఖ్యం, ఆమె ఉద్యోగం కోల్పోయి తిరిగి పుంజుకున్న తీరు చూసి అతను మరింత ఇంప్రెస్ అయ్యాడు.


అతి తక్కువ కాలంలోనే లావణ్య, మహాదేవ్ వివాహం ఘనంగా జరిగింది. మళ్ళీ లావణ్య భర్తతో అమెరికా వెళ్లే రోజు రానే వచ్చింది.


​విమానాశ్రయంలో తండ్రికి వీడ్కోలు చెబుతూ.. "నాన్న, ఆ రోజు మీరు ఇచ్చిన ఉగాది పచ్చడి నా కళ్లు తెరిపించింది. చేదు అనేది కేవలం ఒక రుచి మాత్రమే అని, అది జీవితం కాదని నాకు అర్థమైంది," అని కృతజ్ఞతతో తండ్రి పాదాలకు నమస్కరించింది.


​సుబ్రహ్మణ్యం గారు చిరునవ్వుతో కూతురిని దీవించి పంపారు. ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూస్తూ, ఆయన మనసులో ఒక్కటే అనుకున్నారు - "ఎదురుదెబ్బలే జీవితం కాదు, ఎదురు నిలవడమే అసలైన ఉగాది!"


  శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):





జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@tvvmuralimachiraju

•11 minutes ago

This story is excellent

Like
bottom of page