కష్టం బ్రదర్...
- Kotha Viritha

- 2 days ago
- 2 min read

Kashtam Brother - Telugu Inspirational Article | Kotha Viritha
కష్టం బ్రదర్ - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 01/08/2026
కొంతమందికి అధికారం అంటే బాధ్యత కాదు, ఆదేశాలు ఇవ్వడానికి వచ్చిన లైసెన్స్.
"ఇది చేయి... "
"అది పూర్తి చేయి... "
"ఇప్పుడే కావాలి... "
అనే మాటలే వారి రోజువారీ వ్యాయామం.
వాళ్ల చుట్టూ ఇంకో జాతి ఉంటుంది.
"అవును సార్... "
"సూపర్ సార్... "
"మీరు చెప్పిందే ఫైనల్ సార్... "
అంటూ మాటలతో చెప్పులు పాలిష్ చేసే వాళ్లు.
పని చేసినా చెప్పాలి,
పని చేయకపోయినా చెప్పాలి.
వచ్చినా చెప్పాలి, వెళ్లినా చెప్పాలి.
నవ్వినా చెప్పాలి, నిట్టూర్చినా చెప్పాలి.
ఎందుకంటే కొందరికి పని కంటే అప్‌డేట్‌లే ఎక్కువ ఇష్టం.
మరి కొందరికి పని చేయడం కంటే ఆదేశాలు పాటించడం, పొగడ్తలు పాడటమే కెరీర్ ప్లాన్.
గౌరవం సంపాదించాలి,
భయం కాదు.
విలువ పెంచుకోవాలి,
వెన్నుపోటు ప్రశంసలతో కాదు.
ఎందుకంటే నిజమైన నాయకత్వం మాటలు వినిపించుకోవడంలో కాదు,
మనుషులను గెలుచుకోవడంలో ఉంటుంది.
అలా కాకుండా, చేసే ప్రతి పని చెప్పి చేయాలి, బయటకి వెళితే చెప్పులేసుకెళ్లాలి అంటే కష్టం బ్రదర్!
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
కొత్త విరిత గారి కొన్ని ఇతర రచనలు:
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.










👌 👌 👌 👌 👌