ప్రత్యేక ఆఫర్!
- Kotha Viritha

- Aug 2
- 2 min read

Prathyeka Offer - Telugu Inspirational Article | Kotha Viritha
ప్రత్యేక ఆఫర్! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 02/08/2026
"ప్రత్యేక ఆఫర్!" అనే ఈ వ్యంగ్య రచనలో రచయిత్రి కొత్త విరిత నేటి సమాజంలోని ఒక చేదు వాస్తవాన్ని చమత్కారంగా ఆవిష్కరించారు. అవసరమైన సమయంలో చేయూత ఇవ్వడం కంటే, ఉచితంగా సలహాలు ఇవ్వడంలో ముందుండే మనుషుల మనస్తత్వాన్ని హాస్యంతో పాటు ఘాటైన వ్యంగ్యంతో చిత్రించారు. సహాయం చేయడానికి హృదయం అవసరమని, కానీ సలహా ఇవ్వడానికి మాటలు చాలని గుర్తు చేస్తూ ప్రతి పాఠకుడిని ఆలోచింపజేసే సామాజిక రచన ఇది.
ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ...
సలహాలు పూర్తిగా ఉచితం!
ఒక్కటి అడిగితే పది సలహాలు... ఎలాంటి పరిమితి లేదు!
"ఏమైనా అవసరం ఉంటే చెప్పు" అని ఎంతో ప్రేమగా అడుగుతారు. నిజంగా అవసరం చెప్పగానే...
సలహా కేంద్రం షట్టర్ పైకెళ్తుంది.
డబ్బు కావాలంటే ఆర్థిక నిర్వహణపై క్లాస్.
ఉద్యోగం కావాలంటే మోటివేషన్ సెమినార్.
బాధలో ఉంటే జీవిత తత్వాల ఉపన్యాసం.
మునిగిపోతున్న వాడికి చేయి అందించడం కష్టం...
కానీ ఈత ఎలా కొట్టాలో చెప్పడానికి మాత్రం క్యూలు కడతారు.
ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టడానికి వెనుకాడతారు. కానీ "ఆహారమే పరబ్రహ్మ" అని చెప్పడానికి మాత్రం ముందుంటారు.
సహాయం చేయడానికి మనసు కావాలి. సలహా ఇవ్వడానికి నోరు ఉంటే చాలు.
అందుకే, మన సమాజంలో సలహా కేంద్రాలు ప్రతి వీధిలో కనిపిస్తాయి.
కానీ సహాయ కేంద్రాలు మాత్రం వెతికినా దొరకవు.
ముఖ్య గమనిక:
మా "సలహా కేంద్రం"లో సలహాలు ఎప్పుడూ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ...
సహాయం?క్షమించండి, ఆ సర్వీస్ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన రోజే మా సలహా కేంద్రం మూతపడే ప్రమాదం ఉంది కాబట్టి!
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
కొత్త విరిత గారి కొన్ని ఇతర రచనలు:
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.










సలహల కేంద్రాలు సహాయ కేంద్రాలు సూపర్.
Excellent write up