ఆయుధం
ఆయుధం, కొత్త విరిత, ప్రతి వృత్తికి గౌరవం, సామాజిక వ్యాసం, తెలుగు వ్యాసం, జీవన విలువలు, రైతు, పారిశుద్ధ్య కార్మికుడు, కూలీ, మనతెలుగుకథలు

Ayudham - Telugu Inspirational Article | Kotha Viritha
ఆయుధం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 31/07/2026
చేతిలో ఉన్న పరికరాన్ని చూసి మనిషి విలువను నిర్ణయించడం సమాజంలో బలంగా పాతుకుపోయిన అలవాటు. ల్యాప్‌టాప్‌కు గౌరవం, స్టెతస్కోప్‌కు మర్యాద, తుపాకీకి సెల్యూట్ ఇస్తూ... చీపురు, నాగలి, పార, సుత్తి పట్టిన చేతులను మాత్రం చిన్నచూపు చూస్తున్నాం. కొత్త విరిత రచించిన "ఆయుధం" వ్యాసం ప్రతి వృత్తి సమాజానికి సమానంగా అవసరమని, నిజమైన గౌరవం పరికరానికి కాదు, దానితో సేవ చేసే మనిషికేనని బలమైన సందేశాన్ని అందిస్తుంది.
మన సమాజంలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది.
చేతిలో ల్యాప్‌టాప్ ఉంటే "పెద్ద ఉద్యోగం" అంటాం.
చేతిలో స్టెతస్కోప్ ఉంటే గౌరవంగా నిలబడతాం.
లాఠీ కనిపిస్తే భయపడతాం.
తుపాకీ కనిపిస్తే సెల్యూట్ చేస్తాం.
కానీ చేతిలో చీపురు కనిపిస్తే? పార కనిపిస్తే?
నాగలి కనిపిస్తే? సుత్తి కనిపిస్తే?
వాటిని పట్టుకున్న మనిషిని కాదు, ఆ పనినే చిన్నచూపు చూస్తాం.
రాముడికి కోదండం ఎలా గుర్తింపో, హనుమంతునికి గద ఎలా శక్తికి ప్రతీకో, విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎలా ధర్మరక్షణకు సంకేతమో... అలాగే ప్రతి మనిషికీ తన వృత్తికి తగిన ఒక ఆయుధం ఉంటుంది.
సైనికుడికి తుపాకీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ల్యాప్‌టాప్, వైద్యుడికి స్టెతస్కోప్, పోలీసుకు లాఠీ, ఉపాధ్యాయుడికి చాక్, డ్రైవర్‌కు స్టీరింగ్, రైతుకు నాగలి, పారిశుద్ధ్య కార్మికుడికి చీపురు, కూలీకి పార, సుత్తి.
వీటిలో ఏ ఆయుధమూ తక్కువ కాదు. కానీ మన చూపులే వాటికి విలువలు కేటాయిస్తాయి.
వింత ఏమిటంటే, చీపురు పట్టినవాడు ఒక్కరోజు పనికి రాకపోతే చెత్తలో జీవించలేం. రైతు నాగలి ఆపేస్తే అన్నం దొరకదు. డ్రైవర్ స్టీరింగ్ వదిలేస్తే ప్రయాణం ఆగిపోతుంది.
కూలీ సుత్తి, పార పక్కన పెడితే భవనాలు లేవవు...
అయినా గౌరవం మాత్రం చేతిలో ఉన్న పరికరానికి ఇస్తాం. సమాజాన్ని నిలబెట్టే చేతులకు కాదు!
ఆయుధం మనిషిని గొప్పవాడిని చేయదు, ఆ ఆయుధంతో సమాజానికి చేసే సేవే అతని గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఆయుధాలను కాదు వాటిని పట్టుకున్న చేతులను గౌరవించడం నేర్చుకుందాం.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
కొత్త విరిత గారి కొన్ని ఇతర రచనలు:
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.











Excellent
Excellent write up 👌 👌 👌 👌 👌