పర్సెంట్‌కే పరేషాన్..!
- Kotha Viritha
- 1 day ago
- 2 min read

Percent Ke Pareshan - Telugu Social Satirical Article | Kotha Viritha
పర్సెంట్‌కే పరేషాన్..! - తెలుగు సామాజిక వ్యంగ్య వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 06/08/2026
"99% సేఫ్", "99.99% ఖచ్చితత్వం", "99% మంది సంతృప్తి"… ఇలాంటి ప్రకటనలు నేటి జీవితంలో ప్రతిరోజూ మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఆ మిగిలిన 1% గురించి ఎప్పుడైనా ఆలోచించామా? రచయిత్రి కొత్త విరిత తన ప్రత్యేక వ్యంగ్య శైలిలో 'పర్సెంట్‌కే పరేషాన్..!' అనే ఈ చిన్న రచన ద్వారా ప్రకటనల ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాన్ని హాస్యంతో, చమత్కారంతో మన ముందుకు తీసుకొచ్చారు.
ఈ మధ్య మనుషులు నిజాల కంటే పర్సెంట్లనే ఎక్కువ నమ్ముతున్నారు.
"99.99% క్రిములను చంపేస్తుంది" అంటారు... మరి మిగిలిన 0.01% ఏం చేస్తుంది? " మేమే అసలు బ్యాచ్" అని పార్టీ చేసుకుంటుందా?
"99.99% జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది" అంటారు... మరి బాత్రూం డ్రెయిన్‌లో కనిపిస్తున్నవి పక్కింటి వాళ్ల వెంట్రుకలా?
"99% సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్" అంటారు... ఆ 1% వల్లే జీవితాంతం ఇ ఎం ఐ లు కడతారు.
"99% మందికి ఉపయోగపడింది,సేఫ్" అంటారు... పొరపాటున ఆ ఒక్క శాతం నువ్వే అయితే? రివ్యూ రాసేది కూడా నువ్వే మరి.
"99% ఖచ్చితత్వం" అంటారు... పరీక్షలో ఒక మార్క్ తక్కువ వస్తే పాస్‌ని ఫెయిల్ చేస్తుంది అదే 1%.
అందుకే... పర్సెంట్ వినగానే పరవశించకండి. మిగిలిన పర్సెంట్ ఎక్కడ దాక్కుందో కూడా అడగండి.
ఎందుకంటే... జీవితాన్ని మార్చేది చాలాసార్లు 99% కాదు... అందరూ పట్టించుకోని ఆ 1% మాత్రమే!
కొత్త విరిత
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
కొత్త విరిత గారి కొన్ని ఇతర రచనలు:
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






