top of page

వాన రాకడ ప్రాణం పోకడ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Vana Rakada Pranam Pokada' New Telugu Story Written By Nallabati Raghavendra Rao


రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు


సుయోధన్... తాతగారి అదుపాజ్ఞలలో పెరిగాడు.


బాల్యం నుండి తాతగారి పెంపకంలో చాలా సాంప్రదాయాలు తెలుసుకుంటూ.... చాలా గ్రంథాలు కూడా చదువుతూ పెరిగాడు. అతనికి పరిశోధన తత్వం మాత్రం కొంచెం ఎక్కువగా ఉండేది. తాత గారు చెప్పిన ప్రతి దానికి తల ఊపేవాడు కాదు. అది ఎంత వరకు కరెక్టు అన్నది చాలా వివరంగా అడిగి తెలుసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే పాటించాలి అని అనుకునేవాడు.


అతను ఒకరు చెప్పింది వినకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలకు పెద్ద పీట వేస్తూ ముందుకెళ్లడం తాతగారికి కూడా కొంత నచ్చుబాటు అయ్యింది.


ఒకరోజు సుయోధన తాత గారి దగ్గరకు వచ్చి


" తాతగారు.. మీరు మొన్న చెప్పారు.. 'ప్రాణం పోకడ వర్షం రాకడ ఎవరికీ తెలియదు' అని ... ఎందుకో దాని మీద నాకు సదభి ప్రాయం లేదు." అంటూ తన మనసులోని మాట చెప్పాడు తాత దగ్గర కూర్చుంటూ సుయోధన్.


తాతగారు మాట్లాడలేదు.


సుయోధన్ ఇంకా ఇలా చెప్పడం మొదలెట్టాడు


''అవునండి తాతగారు...ఇప్పుడు పిల్లల్ని ఎప్పు డు కావాలంటే అప్పుడు.. ఆ ముహూర్తానికి పుట్టిస్తున్నారు.... ఒకలా చెప్పాలంటే...మనిషి కి తానే ప్రాణం పోసి కావలసిన గర్భంలో పెట్టి పుట్టిస్తున్నాడు.

అలాగే చనిపోయే మనిషిని కూడా కృత్రిమశ్వాస, కృత్రిమ గుండె తదితర సాధనాల ద్వారా ఎక్కువ కాలం బ్రతికేలా చేయగలుగుతున్నారు... అందుకని 'ప్రాణం పోకడ విషయ''... పక్కన పెట్టండి..ఇక రెండవది...వర్షం రాకడ విషయం చూద్దాం... ఇప్పుడు ఇదంతా కూడా మన గుప్పిట్లో ఉంది.

శాస్త్ర పరిజ్ఞానం పెరిగిపోయి... కావలసినచోట.. కావలసినప్పుడు క్యుములోనింబస్ ద్వారా వర్షా లు రాబట్ట గలుగుతున్నాము... అసలు... వర్షం ఎప్పుడు పడబోతున్నదో.....ఎన్నాళ్ళు ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతున్నాడు మనిషి... అట్లాగే వరదలు కూడా ఎప్పుడు వస్తాయో ముందుగా పసిగట్టి... కరెక్ట్ గా చెప్పగలిగి.. మనిషి తానే మరోబ్రహ్మ అయిపోయాడు.


అందుచేత తాతగారు.. ఈ శాస్త్రాలు కట్టిపెట్టాలి. మీరు చెప్పింది విత్డ్రా చేసుకోవాలి... చేసుకుంటారా.? ".. ప్రశ్నించాడు మనవడు సుయోధన్.


తాతగారు నవ్వారు...."పిచ్చి మనవడా... ఇప్పుడే ప్రపంచమంతా నీ చేతుల్లోకి వచ్చేసినట్టు భ్రమ పడుతున్నావు... ఏంకాదురా! నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా... నువ్వు అన్నట్టు ప్రాణం పోకడ గురించి కానీ.. ఈ వర్షాల రాకడ గురించి కానీ ఎంత శాస్త్ర పరిజ్ఞానం పెంపొందించుకున్న... ఆది సముద్రంలో నీటిబొట్టు అంతకాదు రా"..

ప్రశాంతంగా అన్నారు తాతగారు.


తాతగారు చెప్పేది వినకుండా సుయోధన మళ్లీ ఇలా అన్నాడు..


" నో.. నేను ఒప్పుకోను తాతగారు.. ఈ విషయంలో మీతో ఏకీభవించను. ఈ విషయంలో మీతో పందెం కూడా కాయడానికి సిద్ధంగా ఉన్నాను.."


" పందెమా... కాస్త వివరంగా చెప్పు".. ఆత్రుతగా అడిగారు సుయోధన్ తాతగారు.


సుయోధన్ తన పందెం గురించి వివరంగా చెబుతూ..."తాతగారు.. మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువ వర్షం ఎక్కడ పడబోతుందో ముందుగానే నేను వివిధ మాధ్యమాలు ద్వారా తెలుసుకుని అక్కడికి వెళ్లి... అక్కడ వర్షంలో రోడ్లమీద తడిసి ముద్దయి నాట్యం చేస్తూ ఆ వీడియో తీసి మీకు పంపిస్తాను.. అప్పుడైనా మీరు వర్షం రాకడ ముందుగానే నేను కనిపెట్ట గలిగాను అని... వర్షాన్ని కాలికింద చెప్పులా చేసుకో గలిగానని... నాతో ఏకీభవిస్తారా?? ఏకీభవించి తీరాలి... తప్పదు''


అంటూ పోటీగా మాట్లాడాడు..సుయోధన్....


దాంతో తాతగారు తన మనవడితో ఇలా అన్నారు...


" అది నీ తరం కాదురా మనవడా... ఒక వీధిలో వర్షం ఉంటే మరొక వీధిలో వర్షం పడదు... ఇంకా వివరంగా చెప్పమంటావా... ఒక్కోసారి పెద్దగా మబ్బుపట్టి ఒక్క చినుకు పడదు.. అలాగే ఒక్కో సారి పెద్ద వర్షం కురిసి ఒక్కనిమిషంలో ఆగిపో వచ్చు... ఇంకా.. విను.. చెప్పా పెట్టకుండా సెకండ్ లో అతి భయంకరమైన వర్షం రావచ్చు!!!!


అలాంటి వాతావరణ పరిస్థితులతో నువ్వు సృష్టి తో పోటీ పడడం పూర్తి అవివేకంరా. సృష్టిని శాసిం చగలిగే అంత గొప్ప వాడివా నువ్వు?. పిచ్చి ఆలోచనలో ఉన్నావురా... నోరు మూసుకొని ఇంట్లో అలా ఉండు... వెధవ ప్రయత్నాలు ప్రయోగాలు చేయకురా.... ప్రస్తుతం తడిసి ముద్దయ్యా వంటే తలపోటు, రొంప, జ్వరం వస్తుంది.".. అంటూ నాలుగు చీవాట్లు పెట్టారు సుయోధన్ ని... అతని తాతగారు.


సుయోధన్ ఏ మాత్రం అంగీకరించలేదు


" లేదు తాతయ్య గారు... మీ మాటలతో నాలో పౌరుషం ఇప్పుడు ఇంకా బాగా పెరిగిపోతుంది. నా ఫ్రెండ్స్ రెండు రాష్ట్రాల్లో ఉన్నారు... ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశానికి వెళ్లి.... అక్కడి నుంచి వాట్సాప్ లో మీకు నేను ఫోటో పంపిస్తాను.

.. వీడియో పంపిస్తాను.. అప్పుడైనా మీ మనవడు ఘనాపాటి అని మెచ్చుకొని దండ వేసి తీరాలి"... సుయోధన్ .... చాలా పట్టుదలగా మాట్లాడాడు.


" ఏంట్రా కొంపతీసి ఇప్పుడు ఈ భారీ వర్షంలోనే తడిచి వెళ్ళిపోతావా?'' భయపడుతూ అడిగారు తాతగారు .


" మీరు నన్ను రెచ్చగొట్టారు.. తప్పదు వెళ్తాను.'' అంటూ పైకి లేచాడు సుయోధన్ .


''..ఇదిగో ఫోన్ చేస్తున్నాను మా ఫ్రెండ్ కి... కృష్ణా జిల్లా కొందూరు మండలం అంతా అత్యధిక వర్షపాతం అట ఈ సంవత్సరం!! నేను ఆ వూరు ఎంచుకుంటాను... అక్కడ మా ఫ్రెండ్ అభిజిత్ ఉన్నాడు.. వాడితో మాట్లాడి .. ఇప్పుడే ఈ వర్షంలోనే అక్కడికి వెళ్లిపోతాను.... ఇదిగో ఫోన్ చేస్తు న్నాను....'' అంటూ..సుయోధన్ ఫోన్ చేశాడు తన ఫ్రెండ్ అభిజిత్కు.


"ఆ... ఆ.... అరే ఒరే అభిజిత్ నేనురా సుయోధన్ మాట్లాడుతున్నాను.. బాగున్నావా.. మీ మండలం లో ఇప్పుడు వర్షపాతం ఎంత నమోదయిందిరా.." అంటూఆతృతగా అడిగాడు సుయోధన్.


" 180 సెంటీమీటర్లు రాష్ట్రం మొత్తం మీద ఇది అధికం.. ఏ.. అలా అడుగుతున్నావ్!!?".. చెప్పాడు విషయం అర్థంకాక అభిజిత్.. అటునుండి సెల్ ఫోన్ లో .


"చెప్తా.. అక్కడకొచ్చి చెప్తా. ఇప్పుడే ఈ వర్షంలోనే తడిసి ముద్దయి నేను ఎలాగోలా మీ ఊరు వస్తా ను నిన్ను కలుస్తా... అక్కడ మీ ఇంటి ఎదురుగా రోడ్డు మీద నేను భరతనాట్యం చేస్తాను రా .. ఈ పెద్ద భయంకరమైన వర్షంలో... అప్పుడు నువ్వు వీడియో తీయాలి ... ఓకేనా..."... గట్టిగా అరిచినట్టు అన్నాడు..సుయోధన్.


" ఏరా నీకేమైనా పిచ్చి పట్టిందా.?".. ప్రశ్నించాడు స్నేహితుడు అభిజిత్.


" పిచ్చే ..మదపిచ్చి.. తాతతో పందెం కట్టానురా వివరాలన్నీ వచ్చాక చెప్తాగా వర్షాన్ని అలాగే ఉంచు తగ్గనివ్వకు.". అంటూ బయలుదేరి పోయాడు సుయోధన్.

***

సుయోధన్... వేగంగా బయటకు వచ్చి ఎవరికీ చెప్పకుండా వర్షంలో తడిసి ముద్దయి.. బస్టాండ్ కి వెళ్లి బస్సు ఎక్కాడు.


చాలాసేపటికి కొందూరు మండలం లో దిగాడు.


దిగేసరికి ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇప్పటి వరకు భయంకరమైన వర్షం వచ్చి ఇప్పుడే పూర్తి గా తగ్గిపోయిందని... అతని ఫ్రెండ్ అభిజిత్ చెప్పాడు.


అభిజిత్ తన ఫ్రెండ్ సుయోధన్ ని ఇంట్లోకి తీసుకెళ్లి టీవీ ఆన్ చేశాడు...ఆ ప్రాంతంలో... ఈ సంవత్సరం అత్యధికంగా180 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైందని... ఇంత అత్యధిక వర్షపా తం రాష్ట్రంలో ఎక్కడలేదని చెప్పిందే చెప్తున్నాడు టీవీలో.. స్క్రోలింగ్ కూడా వచ్చిందే వస్తోంది. మరి ఇప్పుడు ఆ వర్షం ఏది?? ఆ మండలంలో ఎక్కడ చినుకులు కూడా పడటం లేదు... ఏమిటీ వింత... ఏమిటీ విచిత్రం????


అక్కడి పరిస్థితి అర్థం కాలేదు సుయోధన్కు.


వెంటనే సుయోధన్ ఫోన్ రింగ్ అయింది ..తాత నుండి. ఏం చెప్పాలి.. తన వర్షం వీడియో కోసం ఎదురుచూస్తున్న తాతకు విషయం ఏమని చెప్పా లి. ఈ విషయం చెప్తే ఎగతాళి చేసి ఎక్కిరిస్తాడు. ఇక తను ఓడిపోయినట్లే... కాదు కాదు. ఒప్పుకో కూడదు... అంతే వెంటనే ఆ ఆలోచనతో ఫోన్ కట్ చేశాడు సుయోధన్.

***

కృష్ణాజిల్లాలోని బాపులపాడు... వీరుల్లపాడు


100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. అక్క డకు అదీ అధికమే.. ఆయా ప్రాంతాల్లో కూడా తనకు కొలీగ్స్ ఉన్నారు... ఫోన్ చేశాడు సుయో ధన్... అక్కడి ఫ్రెండ్స్ కు...


"వర్షం మనిషి నడవడానికి వీలులేనంత భారీగా కురుస్తుందని... ఎలాగోలా చాలా అర్జెంటుగా వచ్చి ఇక్కడ రోడ్డుమీద భరతనాట్యం చేస్తూ వీడియో తీసి.. మీ తాతగారికి పంపు” అని.... మెసేజ్ పెట్టారు కొద్దిగా విషయం అర్థం చేసుకున్న అక్కడి ఫ్రెండ్స్.


సుయోధన్ ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి సరైన వాహన సౌకర్యం లేకపోయినప్పటికీ.... కొంత దూరం ఆటో మీద.. కొంత దూరం ఎడ్లబండి మీద ..కొంత దూరం నడిచి.... ఆ భయంకర వర్షం లో తడిసి తడిసి ముద్దయిపోతూ.... చిట్టచివరికి తన ఫ్రెండ్స్ ని సమీపించాడు.... కానీ ఫలితం శూన్యం.... తను వెళ్ళేసరికి అక్కడ కూడా వర్షం బాగా తగ్గిపోయింది...నిరాశ...నిరాశ ..నిస్పృహ!తన మీద పగపట్టినట్టు వాతావరణ అసమానత లు ఏమిటో అతనికి అర్థం కాలేదు..మళ్లీ తాత నుండి ఫోన్ రింగ్ అయ్యింది... ఈసారి ఫోన్ ఆన్ చేసాడు సుయోధన్ కోపంగా....


అటునుండి తాతగారు ఇలా మాట్లాడుతున్నారు.


" ఒరేయ్ మనవడా సుయోధన్.... ఈ తాత తో నీకు పంతం ఏమిటిరా... అమ్మానాన్నకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయావట... నువ్వు ఇక్కడ నుండి బయలుదేరే సరికి ఇక్కడ మబ్బు లేదు ఒక్క చినుకు లేదు. కానీ... ఇప్పుడు ఇక్కడ వర్షం బాగా పెరిగిపోయింది రా.. ఈదురుగాలులు.... చెట్లు కూడా పడిపోతున్నాయిరా... నువ్వు వెళ్లే టప్పుడు బాగానే ఉన్నా.... ఇప్పుడు వాతావర ణం పూర్తిగా సడన్ గా ఎందుకు ఇలా మారిపో యిందో.... నాకైతే అర్థం కావడం లేదు. టీవీ లో కూడా మన ప్రాంతంలో వర్షం పడుతుంది అని చెప్పలేదు .. అలాంటిది సడన్ గా భయంకర మైన.. అతి భయంకరమైన వర్షం పడుతుందిరా..


నాక్కూడా ఉన్నట్టుండి ఆరోగ్యంలో మార్పు వచ్చిందిరా.... ఒళ్ళు బాగా వేడెక్కింది. రొంప.. జలుబు.. దగ్గు.... ఊపిరి కూడా ఆడడం లేదు. నువ్వే నెగ్గావని ఒప్పుకుంటున్నానురా..వచ్చేయ్ త్వరగా వచ్చేయ్రా... నిన్ను చూడాలని ఉంది."... అంటూ చాలా ఆప్యాయంగా మరింత ఆత్రంగా.... ఫోన్ లో చెప్పారు సుయోధన్..తాతగారు.


" పర్వాలేదు తాతగారు.. మీరు కంగారు పడకండి. నాన్న ఉన్నారుగా... మన ఫ్యామిలీ డాక్టర్ ప్రకాశం గారు మిమ్మల్ని బాగానే చూస్తున్నారుగా...మొన్న నే పూర్తి బాడీ హెల్త్ చెకప్ చేసినప్పుడు కూడా... మీకు ఇంకా పది సంవత్సరాల వరకు తిరుగు లేదని కూడా చెప్పారు... ఆ సర్టిఫికెట్ నేనే తెచ్చి మీకు ఇచ్చాను కదా. ఎందుకలా కంగారు పడతారు..వాతావరణాన్ని బట్టి మీలాంటి పెద్ద వయసు వారికి చిన్నచిన్న సమస్యలు వస్తాయి. కంగారు పడకండి. నేను రేపు వస్తాను. ఈ లోపున మీకు ఫొటోస్, వీడియోస్ వస్తాయి ...చూడండి"....


జవాబు కోసం ఎదురు చూడకుండా సెల్ ఆఫ్ చేశాడు ...సుయోధన్......


***


సుయోధన్ లో పట్టుదల పెరిగి పోయింది. తను ఎక్కడ కాలు పెడితే అక్కడ వర్షం ఆగిపోవడం


లేదా తగ్గిపోవడం... సుయోధన్ కు అంతు చిక్క లేదు. ఇంటర్నెట్ ఆన్ చేసి సెల్లో ఇంకా ఎక్కడె క్కడ అధిక వర్షపాతం నమోదు అయిందో చూశాడు.ఆ మరునాడు ....


అదే జిల్లాలో గంపలగూడెం, నూజివీడు ఇంకా రెడ్డిగూడెం మండవల్లి ... ఆయా ప్రాంతాలలో 70,

80 మిల్లీమీటర్ల గా నమోదవడం గుర్తించాడు.వెంటనే ఆయా ప్రదేశాలకు.. చేరిపోయాడు. కానీ అధికవర్షం కురుస్తున్న ఆయా ప్రదేశాలలో..... వీడియో తీద్దాం అనేసరికి సడన్గా పూర్తి వర్షం తగ్గి పోయేది.ఇది.... కలయా.... నిజమా !!!! సుయోధన్.. తన తాతగారు చెప్పినట్టు తను సృష్టితోనే పోరాటం చేస్తున్నందుకు కొంచెం సిగ్గు పడ్డాడు కూడా.. వర్షం పడాలని శతవిధాల... వాన దేవుడా... అంటూ.. ఆకాశంవైపు చూస్తూ దండాలు పెట్టాడు. బొబ్బలు పెట్టాడు..పెడబొబ్బలు పెట్టాడు...మళ్లీ సెల్ రింగ్ అయింది.... ఈసారి మాట్లాడింది సుయోధన్ తండ్రి... ప్రహ్లాదరావు.. ఆయన మాట్లాడుతూ
" హలో... బాబు.. వర్షంలో చెప్పకుండా ప్రయాణం ఏమిట్రా... ఇక్కడ మీ తాతగారు పరిస్థితి అసలు బాగోలేదు.. నిన్న ఆయన నీకు ఫోన్ కూడా చేశా రట.. వెంటనే వచ్చేయ్ అన్నారట. డాక్టర్ గారు తాతగారి విషయం గంటల మీద వ్యవహారం అంటున్నారు...'' .... అన్నాడు భయంగా.ఇంకా మాట్లాడుతూ... సుయోధన్...


సడన్ గా ఆయన సీరియస్ కండిషన్లోకి వెళ్లిపో యారు... గట్టి మనిషి.. ఉన్నట్టుండి ఎందుకు ఇలాగ అయిందో నాకు మాత్రం అర్థం కాలేదు. నాకు చాలా భయంగా ఉంది రా. నువ్వు ఎంత దూరం లో ఉన్నావో నాకు తెలియదు... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడకు వచ్చేయ్.

నువ్వు నాదగ్గర ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది.

విషయం ఇంకా వివరంగా నీకు చెప్పాలంటే ఫోన్లో నాకు నోరు రావడం లేదు.... అర్థం చేసుకో."

సెల్ ఆఫ్ చేశాడు సుయోధన్...తండ్రి.. ప్రహ్లాద రావు.సుయోధన్ గుండెలో... బండ పడినట్లయింది.


అతను మనసులో ఇలా అనుకుంటున్నాడు." నేను చేసింది పిచ్చి పనా? ఈ ప్రపంచంలోఎవరు కూడా "వర్షం" తో పోటీపడి ఉండరు. అలాంటిది నేను చదువుకొని కూడా మూర్ఖుడిలా ప్రవర్తిం చాను...అక్కడ.. తాత " ప్రాణం "... ఇక్కడ " " వర్షం "...... రెండూ నామీద పగపట్టాయి.... నిజమే దేవుడితో పోరాటం చేస్తున్నట్లు ఉంది నా పరిస్థితి... కండి షన్ చేజారి పోతేనే కానీ నాన్న అంతలా చెప్పరు".


అంటూ సుయోధన్ ఆలోచనా తరంగాలు 300 మిల్లీ మీటర్లు వర్షపాతం లా.. పెరిగిపోతున్నాయి..కాసేపయ్యాక .. ధైర్యం తెచ్చుకొని మళ్లీ తనే సెల్ ఆన్ చేసాడు." నాన్న.. తాత గారికి ఏమీ కావడానికి వీల్లేదు. అవసరమైతే పెద్ద డాక్టర్ ని రప్పించమని మన ఫ్యామిలీ డాక్టర్ కు చెప్పండి.... తాతగారు తో నేను చాలా విషయాలు మాట్లాడాలి...మా ఇద్దరి మధ్య సరదా పోటీ మీకు తెలిసే ఉంటుంది.. మీరు, అమ్మ అందుబాటులో లేరని చెప్పకుండా వచ్చాను... సరే ఏది ఏమైనా తాత గారు క్షేమంగా ఉండాలి.. నేను వచ్చి ఆయన కాళ్ళ మీదపడి.... ఒక అడవి మృగంలా పెద్ద వాళ్ళతో ప్రవర్తించినందుకు.. తాతగారికి క్షమా పణలు చెప్పుకోవాలి."అలా సుయోధన్ మాట్లాడుతూ ఉండగా అవతల నుండి వేరే కంఠం వినబడింది." బాబు... ఇప్పుడు నువ్వు చెప్పింది అంతా మీ నాన్నగారు వింటున్నారు అనుకుంటున్నావ్ ఏమో. కాదు.. మాట్లాడేది మీ నాన్నగారు కాదు. నేను.. నేను మీ పక్కింటి సత్యనారాయణ ఆచార్యులు గారి ని... నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను బాబు.మీ తాతగారు మనకిక లేరు బాబు"అవతల నుండి మాట్లాడిన సత్యనారాయణ ఆచా ర్యులు గారి మాటలు విన్న సుయోధన్ బెంబేలెత్తి పోయాడు."నో .. అలా జరగడానికి వీలు లేదు.. తాతగారి ప్రాణం పోవడానికి వీల్లేదు...'... ఏడుస్తూ అరిచి నట్టు అన్నాడు..సుయోధన్.పక్కింటి ఆచార్యులు గారు మాట్లాడుతూ.....

"నువ్వు ఎంత దూరంలో ఉన్నావో నాకు తెలియదు కానీ... వర్షం రాకడ ప్రాణం పోకడ ఎవరు చెప్పలేరు స్వామి... మనం వీల్లేదు అంటే కుదరదు..నిన్నటి ఉదయం వరకు మీ తాతగారు చాలా బాగున్నారు. మేము ఇద్దరం కలిసి నడుచు కుంటూ దేవాలయంలో పురాణం వినడానికి కూడా వెళ్ళాము.


అక్కడ చింతామణి శాస్త్రిగారు చెప్పిన పురాణం లో జోకులు విని మీ తాతగారు పడీపడీ నవ్వడం నాకు ఇప్పటికీ గుర్తుంది...


" పొట్టచెక్కలయ్యేలా అంతలా నవ్వకండి చాలా ప్రమాదం ఒక్కోసారి" ....అని నేను సరదాగా అన్నాను. దానికి ఆయన ఏమన్నారో తెలుసా...


" వర్షం రాకడ ప్రాణం పోకడ మన చేతుల్లో లేవు ఆచార్యులుగారు"... అని నాతో అంటూ ఇంకా పడి పడి పడి నవ్వారు. ఆయన చెప్పింది అక్షర సత్యం అయినప్పటికీ... ఆయన విషయంలోనే ఇప్పుడు ఇలా జరుగుతుందని..అలాంటి గట్టి మనిషి ఈరోజు ఇలా ప్రాణాలు కోల్పోతారని ఎవరూ ఊహించలేదు బాబు...


మీ తాతగారి ప్రాణాలు పోయి..గంట అయ్యింది. బాధలో ఉన్న మీ నాన్నగారు నీతో వివరంగా ఏమీ చెప్పలేక నువ్వు మాట్లాడుతున్నప్పుడు సెల్ నాకిచ్చి ఇక్కడి విషయం చెప్పమన్నారు. ఇక్కడ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టారు. మనవడిగా నువ్వు ముఖ్యం గా ఉండాలి కనుక ఎంత కుండ పోత వర్షం వస్తున్నాసరే... నువ్వు వీలైనంత తొందరగా రావడం మంచిది బాబు. ఇక్కడ కూడా వర్షం చాలా భయంకరంగా ఉంది అయినా కార్యక్ర మాలు చేయడం తప్పదుగా" ..అని అంటూ.....

అక్కడ సత్యనారాయణ ఆచార్యులు గారు ఫోన్ పెట్టేసారు....


ఇక్కడ సుయోధన్ చేతి నుండి నోకియా సెల్ ఫోన్ జారీ క్రింద వర్షపు ప్రవాహం లో పడి కొట్టుకు పోతుంది... అలా పోతూనే ఉంది!!!


* సమాప్తం *

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.


రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం....


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు77 views0 comments
bottom of page