top of page
Original.png

ఎట్ల రా సామి!

Jul 27
2 min read

Updated: Aug 1

ఎట్ల రా సామి, కొత్త విరిత, మధ్యతరగతి జీవితం, ఉద్యోగ జీవితం, కుటుంబ బాధ్యతలు, జీవిత సత్యాలు, తెలుగు వ్యాసం, ప్రేరణాత్మక వ్యాసం

కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, లోన్ల మధ్య మౌనంగా పోరాడుతున్న మధ్యతరగతి మనిషి దృశ్యం

Etla Ra Samee - Telugu Inspirational Article | Kotha Viritha

ఎట్ల రా సామి తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 27/07/2026


మధ్యతరగతి మనిషి జీవితంలో ప్రతి రోజు ఒక పోరాటమే. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, లోన్లు, కలలు, అవసరాలు... వీటి మధ్య తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా మర్చిపోతాడు. "ఎట్ల రా సామి!" అనే ఈ ఆలోచింపజేసే వ్యాసంలో కొత్త విరిత మధ్యతరగతి కుటుంబ పురుషుడి మౌన వేదనను హాస్యం కలిపిన వాస్తవిక శైలిలో అద్భుతంగా చిత్రించారు.


మధ్యతరగతి మనిషి పెళ్లి చేసుకున్నాడంటే చాలు… అతను ఇక మనిషి కాదు, డబ్బు సంపాదించే యంత్రం. అబ్బాయి కదా సంపాదన మాండటరీ మరి.


"డబ్బు సంపాదించు..." అంటారు.

"కుటుంబంతో సమయం గడపు..." అంటారు.రెండూ ఒకేసారి ఎలా అని మాత్రం ఎవరూ చెప్పరు.


ఊరు వదిలి ఇంకో నగరానికి వెళ్తే..." ఇంటి గురించి పట్టించుకోవడం లేదు" అంటారు.

ఇంట్లోనే ఉంటే,"ఇంత జీతంతో ఎలా బతుకుతావ్?" అంటారు.

పగలంతా ఆఫీసులో చావు బతుకుల మధ్య పని చేయాలి. రాత్రికి వీడియో కాల్‌లో నవ్వుతూ "అన్నీ బాగున్నాయి" అనాలి.


ఏడిస్తే బలహీనుడు.

నవ్వితే బాధలే లేనివాడు.

అతని నిద్రకంటే లోన్లు ముఖ్యం.

అతని ఆరోగ్యంకంటే బాధ్యత ముఖ్యం.

అతని కోరికలకంటే అందరి అవసరాలే ముఖ్యం.


చివరికి సమాజం ఇచ్చే సలహా మాత్రం ఒకటే,

"సంపాదించాలన్నా ఇప్పుడే..."

"సంసారం చేయాలన్నా ఇప్పుడే..."


కానీ... రెండూ ఒకేసారి చేయడానికి మరో జీవితాన్ని మాత్రం ఎవరూ ఇవ్వరు, ఎట్ల రా సామి!


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


 కొత్త విరిత గారి కొన్ని ఇతర రచనలు:


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Alshad Sk
Alshad Sk
Jul 28
Rated 5 out of 5 stars.

Good

Like

Rated 5 out of 5 stars.

Nice

Like
bottom of page