top of page
Original.png

సాంఖ్యయోగ సారం – మొదటి భాగం

Updated: Jun 11

సాంఖ్యయోగం, భగవద్గీత రెండవ అధ్యాయం, Bhagavad Gita Chapter 2, Sankhya Yoga Telugu, శ్రీకృష్ణుడు అర్జునుడు, ఆత్మ తత్వం, కర్మయోగం, ధర్మం, గీతా సారం, తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం, Bhagavad Gita Telugu, Hindu Philosophy, Spiritual Knowledge Telugu, Krishna Teachings, Gita Wisdom

కురుక్షేత్ర యుద్ధభూమిలో విషాదంతో కూర్చున్న అర్జునుడికి రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు ఆత్మ తత్వాన్ని బోధిస్తున్న దృశ్యం. నేపథ్యంలో యుద్ధ సైన్యాలు, ప్రకాశవంతమైన దివ్య కాంతి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచించే ఆత్మ రూపకం కనిపిస్తూ సాంఖ్యయోగ బోధనల గాంభీర్యాన్ని ప్రతిబింబిస్తోంది.
కురుక్షేత్ర యుద్ధభూమిలో విషాదంతో కూర్చున్న అర్జునుడికి రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు ఆత్మ తత్వాన్ని బోధిస్తున్న దృశ్యం. నేపథ్యంలో యుద్ధ సైన్యాలు, ప్రకాశవంతమైన దివ్య కాంతి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచించే ఆత్మ రూపకం కనిపిస్తూ సాంఖ్యయోగ బోధనల గాంభీర్యాన్ని ప్రతిబింబిస్తోంది.

 

Sankhyayoga Saram - Part 1 - Telugu Article | R C Kumar

సాంఖ్యయోగ సారం – మొదటి భాగం - తెలుగు వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 08/06/2026


భగవద్గీతలోని రెండవ అధ్యాయం సాంఖ్యయోగం గీతా తత్వశాస్త్రానికి మూలస్తంభంగా పరిగణించబడుతుంది. అర్జునుడి విషాదాన్ని తొలగిస్తూ, ఆత్మ యొక్క శాశ్వతత్వం, శరీర నశ్వరత్వం, ధర్మబద్ధమైన కర్తవ్య నిర్వహణ, కర్మఫలాలపై అనాసక్తి వంటి గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలను శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో బోధిస్తారు.

ఈ వ్యాసంలో సాంఖ్యయోగంలోని ముఖ్యాంశాలను సులభమైన భాషలో విశ్లేషిస్తూ, ఆత్మ-దేహ భేదం, పుట్టుక-మరణాల సహజత్వం, క్షత్రియ ధర్మం, కర్తవ్యపాలన, సమత్వ భావన వంటి అంశాలను వివరించారు. ఆధునిక జీవితంలో ఎదురయ్యే కష్టాలు, భయాలు, అనిశ్చితులను అధిగమించడానికి గీతా బోధనలు ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయో ఈ రచన స్పష్టంగా తెలియజేస్తుంది.


భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం, భగవద్గీత సారాంశాన్ని, అంతిమ తత్వ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. గీత యొక్క అసలైన బోధన ఈ అధ్యాయం నుంచే ప్రారంభమవుతుంది. ఆత్మ మరియు దేహం - ఈ రెండింటి మధ్య గల భేదాన్ని, వాస్తవికతను గ్రహించడమే సాంఖ్యయోగం. ఆత్మ స్వరూపాన్ని, సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయం ఉపయోగపడుతుంది. శరీరం వేరు, అందులో ఉండే ఆత్మ వేరు అని విడమరిచి చెప్పడమే సాంఖ్యయోగం. ఇది జ్ఞానం, తార్కిక విశ్లేషణ ద్వారా పరమార్థాన్ని (ఆత్మజ్ఞానాన్ని) తెలుసుకునే మార్గం. 'సాంఖ్య' అంటే విశ్లేషణ లేదా జ్ఞానం, 'యోగం' అంటే ఆత్మసాక్షాత్కారం పొందే మార్గం. ఆధ్యాత్మిక ప్రయాణంలో అది మొదటి అడుగు.


మొదటి అధ్యాయంలో అర్జునుడు తాను యుద్ధం చేయకపోవడానికి కారణాలు చెప్పి చేతులెత్తేయడం, గాండీవాన్ని కింద పడేసి రథం వెనుక కూర్చోవడం జరుగుతుంది. అర్జునుడు విషాదంతో కలవరపడిపోయి "నాకు ఏది మంచో, ఏది చెడో తెలియడం లేదు; నీవు తప్ప నాకు వేరే గతి లేదు" అంటూ దిశానిర్దేశం చేయవలసిందిగా కృష్ణ భగవానుడిని ప్రార్థించి చతికిలపడ్డాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశం ఈ సాంఖ్యయోగంతోనే ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయంలో అర్జునుణ్ణి విషాద యోగం నుంచి బయటపడేసి, జ్ఞానయోగం, కర్మయోగాలకు దగ్గరగా చేర్చే ప్రయత్నం చేస్తాడు కృష్ణ పరమాత్మ. అతనిలో మార్పు తీసుకువచ్చే ప్రక్రియ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తాను ఉన్న ఈ సందిగ్ధ పరిస్థితిలో ఏమి చేయాలో చెప్పమని అర్జునుడు ప్రార్థిస్తాడు.


శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పడం ద్వారా దివ్య జ్ఞానాన్ని వివరించడంతో ప్రారంభిస్తాడు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా అర్జునుడిని ప్రాపంచిక స్థాయిలో ఉత్తేజితపరిచిన శ్రీకృష్ణుడు, తదుపరి క్షత్రియ ధర్మం, కర్మయోగం, కర్మఫలాలపై అనాసక్తి గురించి లోతుగా వివరిస్తాడు. తుచ్ఛమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి, యుద్ధానికి నడుం బిగించమని ప్రోత్సహిస్తాడు కృష్ణ భగవానుడు. "ఓ పరంతపా!" అంటే శత్రువులను జయించేవాడా అని సంబోధిస్తూ, "నీకు క్లైబ్యం ఎందుకు?" అని ప్రశ్నిస్తారు. క్లైబ్యం అంటే చేతకానితనం, పౌరుషం లేకపోవడం, పిరికితనం లేదా అధైర్యం. యుద్ధరంగంలో నీరుగారిపోవడం అనేది చాలా నీచమైన లక్షణం. అందుకే కృష్ణుడు దానిని 'క్లైబ్యం' అనే ఘాటైన మాటతో వర్ణించాడు. అర్జునుడిలో పిరికితనం ఆవహించినందుకు కృష్ణుడు ఆయన్ని చూసి ఒకరకంగా ఎగతాళి చేస్తూనే, అదే సమయంలో 'ఉత్తిష్ఠ' అంటూ ప్రోత్సహించారు.


ఒక దశలో అర్జునుడు "ఈ శోకాన్ని పోగొట్టే ఉపాయమేదీ తోచడం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన రాజ్యాన్ని గెలుచుకున్నా, లేదా దేవలోకానికి ఆధిపత్యం పొందినా, ఈ శోకం మాత్రం పోదు" అని కృష్ణుడితో మొరపెట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు "నీవు తెలివిగా, ప్రజ్ఞతో కూడిన పండితుడిలా మాట్లాడుతున్నావు కానీ దేనికైతే శోకింపకూడదో దానికే శోకిస్తున్నావు. నిజమైన పండితులు గతాసూన్ (చనిపోయిన వారి గురించి) గానీ, అగతాసూన్ (బ్రతికున్న వారి గురించి) గానీ శోకింపరు" అంటారు. ఎందుకు శోకింపరు అంటే, మనం ఎదిగేకొద్దీ శరీరంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. బాల్యం, కౌమారం, యౌవనం, ముసలితనం అనే దశలను దాటుకుంటూ వెళుతుంది ఈ శరీరం. కానీ జీవాత్మలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు; వరుసగా శరీరంలోని అన్ని దశల గుండా జీవాత్మ సాగిపోతుంది. అదేవిధంగా మరణ సమయంలో, జీవాత్మ ఆ దేహాన్ని వదిలి మరొక దేహంలోకి ప్రవేశిస్తుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియే కాబట్టి పండితులు, వివేకవంతులు దీనిని చూసి మోహానికి, శోకానికి గురికారని ఉపదేశించారు.


ఈ విషయాన్ని మరింత బలపరుస్తూ కృష్ణ పరమాత్మ ఉదాహరణ సహితంగా ఇలా అంటారు: "ఎలాగైతే మనిషి చిరిగిపోయిన పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను ధరిస్తాడో, అదేవిధంగా జీవాత్మ కూడా పాతబడిన, శిథిలమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది." కృష్ణుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే పుట్టుక, మరణం అనేది ప్రకృతి సహజమైన విషయం. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. పునరపి జననం పునరపి మరణం అనేది అనివార్యం. 'పరిహార్తుం న శక్యతే' - త్రిమూర్తులు కూడా దీనిని మార్చలేరు. కాబట్టి అనివార్యమైన దాని కోసం నువ్వు ఎందుకు శోకిస్తున్నావు అని అర్జునుణ్ణి ప్రశ్నిస్తారు. ఆత్మ శాశ్వతమైనది మరియు అనంతమైనది. అది ఎప్పటికీ ఉంటుందని తెలిస్తే మనకు సమస్యలు, కష్టాలు వచ్చినా భయం కలగదు. ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాం; మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక భావం పెరుగుతుంది.

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మన బంధాలు, ఉద్యోగం, సంపద ఇవన్నీ శాశ్వతం అనుకుంటాం కానీ, ఏదో ఒకనాడు అవన్నీ నశించిపోయేవే. ఇక్కడ పొందినవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్లవలసిందే అన్న స్పృహ ప్రతి ఒక్కరికీ ఉండాలి.


అర్జునుడు క్షత్రియుడు. ధర్మ పరిరక్షణ కోసం యుద్ధం చేయడమనేది అతని ప్రథమ కర్తవ్యం. కర్తవ్య విస్మరణ చేసిన అర్జునుడికి కర్తవ్య పాలన యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, సమాజంలో ధర్మాన్ని పరిరక్షించడం, ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడటం మరియు శాంతిభద్రతలను నిలబెట్టడం అనేవి క్షాత్ర ధర్మమని గుర్తుచేశారు. ఏ వర్ణానికి చెందిన వారైనా వారి వారి స్వధర్మాలను పాటించాలని మన సనాతన ధర్మం కూడా చెబుతుంది. తదుపరి కృష్ణ పరమాత్మ ద్వంద్వాల గురించి చెబుతూ సుఖ-దుఃఖాలను, లాభ-నష్టాలను మరియు జయాపజయాలను సమానంగా తీసుకుంటూ, కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయమని అర్జునుడిని ప్రోత్సహించారు. ఈ విధంగా బాధ్యతలను నిర్వర్తించడం వల్ల అతడికి ఎన్నటికీ పాపం అంటదన్న హామీ ఇచ్చారు. శత్రువులను చంపడం వల్ల పాపం తగులుతుందని అర్జునుడు భయం వ్యక్తం చేశాడు; ఆ భయాన్ని శ్రీకృష్ణుడు పోగొట్టాడు. కర్మ ఫలాలపై దృష్టి పెట్టకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశం చేస్తూ, తామరాకుపై నీటి బొట్టులా, ఎవరైతే తమ కర్మలన్నిటినీ మమకారం లేకుండా భగవదర్పితంగా చేస్తారో వారికి పాపం అంటదని సూచించారు.


కృష్ణార్పణం  




ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page