top of page

సు...ధీర ఎపిసోడ్ 11

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Su... Dheera Episode 11' New Telugu Web Series


Written By BVD Prasada Rao


రచన: బివిడి ప్రసాదరావు


గత ఎపిసోడ్ లో…

ఫోన్ చేసి ధీరని రమ్మంటుంది సు.

సు కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని చెబుతాడు ధీర.

ఇక చదవండి...


చెప్పుతున్న ధీరకి టక్కున అడ్డై..

"నీది.. వయస్సుకు మించిన మెచ్యూరిటీ. ఐ లైక్ ఇట్." చెప్పేసింది సు.


"అదేమి కాదు.. నీ మీది నా అభిప్రాయం నన్ను స్టేబుల్ పరుస్తుంది." చెప్పాడు ధీర.

"టీ టైం.." అంటూ లేచింది సు.


ఫ్రిజ్ లోని రెండు నారింజల్ని తీసింది. వాటి రసాలతో జ్యూస్ చేసి.. రెండు గ్లాసుల్లో సర్దింది. వాటిని ఒక ప్లేట్ లో పెట్టింది. కప్ బోర్డ్ లోంచి బిస్కెట్ల ప్యాకెట్టు తీసి.. నాలుగేసి బిస్కెట్లు చొప్పున ఆ ప్లేట్ లో సర్దింది.


ధీర చెంతకి వచ్చింది సు. తన చేతిలోని ప్లేట్ ని టీపాయ్ మీద పెట్టింది.

"తీసుకో" అంది సు. తను నాలుగు బిస్కెట్లును తీసుకుంది.


ధీర రెండు బిస్కెట్లు తీసుకున్నాడు.

"నీది కంప్యూటర్స్ లో డిగ్రీయా." అడిగింది సు.

"బిటెక్ లో." చెప్పాడు ధీర.

చిన్నగా నవ్వింది సు.


"నీ కుటుంబం ఏమిటి." అడిగింది సు.

"యాక్చువల్ గా.. నాది రాజమండ్రి. జాబ్ వలన హైదరాబాద్ వచ్చాను. నాతో పాటు అమ్మా నాన్నలని తీసుకొచ్చేశాను. నేను ఒక్కడ్నే వాళ్ల సంతానం." చెప్పుతున్నాడు ధీర.

"బిస్కెట్స్ తింటూ మాట్లాడు." నవ్వింది సు.


"అమ్మ నాన్నల తరుపు వారంతా రాజమండ్రి చుట్టు పక్కల ఉన్నారు. నాన్న బట్టలు వ్యాపారం చేసేవారు. అతనిది అంతంత బిజినెస్.. నేనే మానిపించేశాను. రెండు అద్దెలు ఎందుకు.. దూరాలు ఎందుకు.. నా వద్ద హాయిగా ఉండ మన్నాను." చెప్పుతున్నాడు ధీర బిస్కెట్లు తింటూ.


ఒక జ్యూస్ గ్లాసు తీసుకుంది సు.


"రాజమండ్రిలో మాకే ఆస్తులు లేవు. నేను ఇక్కడ.. ఇప్పుడు మేము ఉంటున్న ప్లాట్ ని.. బ్యాంక్ ఇచ్చిన అప్పుతో కొనుక్కున్నాను. ఇంత కంటే నా గురించి మరేమీ లేదు." చెప్పాడు ధీర.


ఖాళీ గ్లాస్ ని టీపాయ్ మీద పెట్టింది సు.

ధీర జ్యూస్ ఉన్న గ్లాస్ ని తీసుకున్నాడు.

అతడు జ్యూస్ తాగే వరకు ఆగింది సు.

ధీర ఖాళీ గ్లాస్ ని టీపాయ్ మీద పెట్టేక..


"నేను.. నీ వాళ్లకి తెలుసా.. ఐ మీన్.. నా ప్రొగ్రామ్స్.. నీ పేరెంట్స్ చూస్తుంటారా." అడిగింది సు.


"వాళ్ల కాలక్షేపమే టివి.. నీవీ చూస్తుంటారు." చెప్పాడు ధీర.


ఆగి.. చిన్నగా నవ్వుతూ.. "నా గురించి ఏమనుకుంటారు." అడిగింది సు.


"అంత పర్టిక్యూలర్ గా.. నీ గురించి.. వాళ్ల నుండి.. నేనేమీ ఆలకించ లేదు.. బట్.. నీ ప్రొగ్రామ్స్ ఐతే చూస్తుంటారు." చెప్పాడు ధీర.


ఆ వెంటనే.. "ఈ మధ్య నీ కొత్త సీరియల్ చూస్తున్నారు.. వాళ్లు చూస్తుండడం నేను చూశాను." చెప్పాడు ధీర.


నవ్వేసింది సు.

తర్వాత.. "మరి.. నేను.. నీకు తెలుసు అని.. వాళ్లకి తెలుసా." అడిగేసింది సు.

"తెలియదు." చెప్పాడు ధీర.


"నన్ను పరిచయం చేయగలవా వాళ్లకి." టక్కున అడిగింది సు.

"అయ్యో.. ఎందుకు చెయ్యను.. నా వరకు అది గ్రేట్ థింగ్ కూడా.. ఒక సెలబ్రటీ నాకు తెలుసు అంటే.. నాకే గర్వం." చెప్పాడు ధీర గొప్పగా.


ఆ వెంబడే.. "వాళ్లని తీసుకురావచ్చా." అడిగేశాడు ధీర.

"వద్దు." టఫ్ న చెప్పింది సు.


"మా ఇంటికి నువ్వు వస్తావా." అడిగాడు ధీర ఆశగా.

"లేదు." చెప్పింది సు సాదాగా.

"మరి.. ఎలా." అన్నాడు ధీర.


"నేను నీకు తెలుసు.. అని వాళ్లతో.. నువ్వు చెప్పు." చెప్పింది సు.

"చెప్పడమా.. మొత్తం నీ గురించి చెప్పుతాను.." చెప్పుతున్నాడు ధీర.


అడ్డై.. "వద్దు. నా కుటుంబం గురించి చెప్పొద్దు. అది నీకే చెప్పాను. అంతే." అంది సు.


"అవునవును. నీ గురించి ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు నువ్వు. నేనూ ఎవరికీ చెప్పను గాక చెప్పను." చెప్పాడు ధీర.


"అంతేమీ వద్దు.. నా పర్మిషన్ లేనిదే.. ఎవరికీ చెప్పొద్దు.. ప్లీజ్." అంది సు.

"అయ్యో.. నీ మాటని ఆర్డర్ గానే భావిస్తాను. సరేనా." అన్నాడు ధీర.


ఆ వెంటనే.. "అన్నట్టు ఒక మాట.. నీ పేరు సు.. తెర మీదిది అన్నావు. మరి నీ అసలు పేరు ఏమిటి." అడిగేశాడు ధీర.


"చెప్పాలా.. చెప్తాను. సమయం రానీ.. నీకు మాత్రమే చెప్తాను." నవ్వింది సు.

ధీర మరేమీ అనలేదు. మురిసిపోయాడు.


"నీకు నేను తెలుసు అని. నాతో నువ్వు కలిసి.. మాట్లాడే చనువు నీకు ఉందని.. నీ పేరంట్స్ కి చెప్పు.. అప్పుడు వాళ్లు నా గురించి ఏమంటారో విని.. నాకు చెప్పాలి." చెప్పింది సు నవ్వుతూనే.


"అలా ఎందుకు." అడిగాడు ధీర.

"ప్లీజ్." అంది సు.

"సరే." అన్నాడు ధీర.

"సరే.. ఇక వెళ్లు. చాలా సేపు ఇక్కడే ఉండి పోయావు." చెప్పింది సు.


ధీర లేచాడు. ఇంటికి బయలు దేరాడు.. తన బైక్ తో.

మైన్ గేట్ తలుపు మూసేసింది సు.

టీపాయ్ మీదివి సర్దుతూ..

'హండ్రేడ్ పర్శంట్.. పొందికైన వాడు' అనుకుంది ధీర గురించి.


సు డిన్నర్ చేస్తుండగా.. తన ఫోన్ మోగింది.

సమయం ఎయిట్ పియం.

ఫోన్ తీసుకుంది. ఆ కాల్.. యాడ్ ఏజన్సీ నుండి.

కాల్ కలిపి.. "యస్." అంది సు.

"సు గారా." అటు నుండి ప్రశ్న.

"య. చెప్పండి." సు అంది.


"మేడమ్.. నేను శేఖర్ ని. యాడ్ ఏజన్సీ మేనేజర్ ని." చెప్పాడు శేఖర్.

"యస్ ప్లీజ్" అంది సు.

"మేడమ్.. మీ ఫేవర్ కావాలి." అడిగాడు శేఖర్.

"చెప్పండి." అంది సు.


"మేడమ్.. డింగరి క్లాత్ స్టోర్స్ వారికి మేము.. 'పబ్లిక్ ఫేషన్ షో' ఒకటి కండెక్ట్ చేయబోతున్నాం. దానికై.. మిమ్మల్ని.. ముఖ్య అతిథిగా.. వెల్కం చేస్తున్నాం." చెప్పాడు శేఖర్.


"అవునా. ఎప్పుడు." అడిగింది సు.

చెప్పాడు శేఖర్.


ఆ వెంబడే.. "మేడమ్.. పెద్ద మొత్తమే మీకు అంద చేయిస్తాం. అలాగే ఒక కాస్ట్లీ మోడ్రన్ డిజైన్డ్ డ్రస్ ని మీకు స్పాన్సర్ చేయిస్తాం." చెప్పాడు శేఖర్.


"అప్పటికి.. వీలు చూసి.. చెప్తాను." చెప్పింది సు.

"ప్లీజ్ మేడమ్.. మీరే కావాలి. రావాలి." చకచకా కోరాడు శేఖర్.


"ఎంత సమయం నేను ఉండ వలసి ఉంటుంది." అడిగింది సు.

"ఓ ఫైవ్ అవ్వర్స్ కాన్సెప్టుగా డిజైన్ చేశాం మేడమ్. టైం.. సార్ఫ సిక్సో క్లాక్ కి స్టార్ట్ చేసేస్తాం మేడమ్" చెప్పాడు శేఖర్.


"అవునా. ఓకే. ఐ విల్ ట్రై." అనేసింది సు.

"త్రీ ఛానల్స్ లో లైవ్ కూడా ఉంటుంది మేడమ్." చెప్పాడు శేఖర్.


"చెప్తాను గా." నవ్వుతూ అంది సు.

"మిమ్మల్ని ఎప్పుడు కలవమంటారు. డ్రస్ డిజైనర్ ని తీసుకొని.. పేపర్స్ తో నేను వస్తాను." చెప్పాడు శేఖర్.


"ఈ నెంబర్ కి కాల్ చేస్తాను." అంది సు.

"దయచేసి ఒప్పుకోవాలి మీరు." బతిమలాటలా అన్నాడు శేఖర్.


"రేపే మీకు కాల్ చేస్తాను. సరేనా." అంది సు.

"థాంక్స్ మేడమ్." అన్నాడు శేఖర్.

సు కాల్ కట్ చేసేసింది.

అదే సమయంన..

ధీర ఇంట్లో..


హాలులో.. తన తల్లిదండ్రుల చెంత కూర్చొని ఉన్నాడు ధీర.

తన గదిని విడిచి.. వచ్చి.. తమతో కూర్చున్న కొడుకుతో.. కాస్తా విడ్డూరంగా..

"ఏంట్రా.. చాన్నాళ్లకి మాతో కూర్చుంటున్నావు." అడిగాడు వెంకటరావు.


"ఎందుకో మీతో కలిసి.. టివి చూడాలని ఇలా వచ్చేశా." చెప్పాడు ధీర నవ్వుతూ.

సావిత్రి, వెంకటరావులు.. సు హిరోయిన్ గా నటిస్తున్న సీరియల్ ఎపిసోడ్ ని టివిలో చూస్తున్నారు.


"హిరోయిన్ నటన బాగుంటుంది కదూ." అన్నాడు ధీర సడన్ గా.

"అవున్రా. బాగుంది.. అన్నట్టు నువ్వూ ఈ సీరియల్ చూస్తున్నావా." అడిగింది సావిత్రి.

"అవునమ్మా. ఫాలో అవుతున్నాను." చెప్పాడు ధీర టక్కున.


"ఈ అమ్మాయి మాత్రం.. అటు యాంక్రింగ్ లో.. ఇటు యాక్టింగ్ లో.. భలే పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆల్ రౌండర్ అనిపించుకుంటుంది." అన్నాడు వెంకటరావు.

గొప్పై పోతున్నాడు ధీర. ముసి ముసిగా నవ్వుకున్నాడు.


ఆ వెంటనే.. "మరందుకే.. ఈమెకి గొప్ప ఫాలోయింగ్ వస్తుంది. ఇప్పుడు ఈమె నెంబర్ ఒన్ తో.. ఊపైన టాక్ లో ఉంది." చెప్పాడు ధీర.

సావిత్రి ఏమీ అనలేదు.


కానీ.. వెంకటరావు.. "ఈమె గురించి నీకు బాగా తెలిసినట్టు ఉందే." అనేశాడు.

అప్పటికి.. ఏమీ మాట్లాడ లేదు ధీర. కానీ లోలోపల లోతైన పొంగుతో మురిసి పోతున్నాడు.

అప్పుడే సావిత్రి.. "ఈ అమ్మాయి సీరియల్ లో రీతి గా ఉంటుంది. అబ్బా.. ఆ యాంకరింగ్ అప్పుడు.. ఈ అమ్మాయి డ్రస్ లు కాస్తా ఎబ్బెట్టు పరుస్తుంటాయి. చాలా ఓవర్ గా చేస్తుంటుంది." అంది.


అంతే.. టక్కున.. "అదేమిటమ్మా. ఏ పాత్రకి తగ్గట్టు.. ఆ పాత్రని ప్రదర్శించాలి కదా. అప్పుడే ఆ పాత్రలు మనల్ని అలరిస్తాయి." అనేశాడు ధీర.


ఆ వెంబడే.. "నటనతో మెప్పించడం అంత ఈజీ కాదమ్మా. అది ఓ ఆర్ట్. పైగా.. అది అందరికీ అబ్బేది కానే కాదు." చెప్పాడు ధీర.

ఆ తల్లిదండ్రులు మొహాలు చూసుకున్నారు.


"మంచి ఎక్స్పర్ట్ లా ఎన్లైజ్ చేస్తున్నావే." అన్నాడు వెంకటరావు.

అ వెంటనే.. "కాదా మరి.. ఆ గదిలో పడి.. ఆ టివి లో.. ఆ లాప్టాప్ లో.. ఆ ఫోన్ లో.. చూస్తున్నవి ఊరకనే పోతాయా." అంది సావిత్రి.

కాస్తా ఆగాడు ధీర.


టివిలో యాడ్స్ ఆగి.. తిరిగి సీరియల్ మొదలైంది.

అప్పుడే ధీర ఏదో చెప్పబోగా..


"ఒరే. టివి చూడనీయరా. మంచి పట్టుగా సాగుతుంది సీరియల్." అంది సావిత్రి.

"అది.. చూశావా.. ఆ పక్కా నటనలే.. ఎలా ఆకట్టుకుంటున్నావో.. ఎలా తమ ముందు కూర్చుండ పెట్టుకుంటున్నావో. థటీజ్ పవర్ ఆఫ్ ద యాక్టింగ్." అనేశాడు ధీర.

"ప్లీజ్ రా. చూడనీయరా. హిరోయిన్ ఏం చేస్తుందో.. వాళ్లని ఎలా మారుస్తుందో.." అంటున్నాడు వెంకటరావు.


ఆ వెంబడే.. "అది. ధటీజ్ హిరోయిన్.. అబ్బబ్బా.. వాటే పెర్పార్మెన్స్." అనేశాడు ధీర.

ఆ తల్లిదండ్రులు మాట్లాడలేదు.

వాళ్లనే చూస్తున్నాడు ధీర.

ఆ ఇద్దరూ టివినే చూస్తూ ఉన్నారు.


మూడు నిముషాల్లో.. ఆ సీరియల్.. 'రేపటి కొనసాగింపు'కి ఆగిపోయింది.

యాడ్స్ మొదలయ్యాయి.


"అబ్బా. హిరోయిన్ ప్రొబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయగలదో మరి. రేపటి వరకు ఆగాలా." అనేశాడు వెంకటరావు ఆ ఆలోచనలోనే ఉంటూ.

"హిరోయిన్ సంయమనంతో చూపుతున్న తీరు బాగుంది. మెప్పు అందుకునే నటన ఈ అమ్మాయిది." అనేసింది సావిత్రి.. భర్త మాదిరినే.


ధీర అందుకున్నాడు.. "చూశారా.. మీరే ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు. అది ఆమె టాలెంట్. అందుకే ఆమె ఆడియన్స్ ఫేవరెట్." చెప్పాడు గొప్పగా.

అప్పుడు సమయం తొమ్మిది పియం.

సు ఇంట్లో..

నిద్రపోతుంది చక్కగా.


కనుకనే.. డిన్నర్ కి కదులుతూ.. ధీర పంపిన వాట్సాప్ మెసేజ్ సంగతి తనకి తెలియదు.

'నువ్వు మా వాళ్లని తెగ ఆకట్టేసుకున్నావు. నువ్వు అంటే మా వాళ్లకి చాలా లైక్.' అని ధీర మెసేజ్ పెట్టాడు.


మర్నాడు.. నిద్ర లేచేక.. ధీర మెసేజ్ ని చూసింది సు.

'అవునా. సరే.. మరింత అబ్జర్వ్ చేయవా ప్లీజ్.' రిప్లై ఇచ్చింది సు.

ఆ మెసేజ్ ధీర ఫోన్ లోకి వచ్చేటప్పటికి.. అతడు ఇంకా నిద్ర లేవలేదు.

ధీర నిద్ర లేచేక.. ఆ మెసేజ్ చూశాడు.


ఆది వారం కావడంతో.. ఆఫీసుకు వెళ్లే పని లేదు కనుక.. గదిని వీడి.. హాలులో కూర్చున్నాడు.. బ్రేక్ఫాస్ట్ అయ్యేక.

టివి ఆన్ చేశాడు ధీర.


వెంకటరావు న్యూస్ పేపర్ ని టీపాయ్ మీద పడేసి.. టివి వైపు దృష్టి మార్చాడు.

ధీర ఛానల్స్ మారుస్తూ.. ఒక ఛానల్ వద్ద ఆగాడు.

సు ప్రొగ్రాం వస్తుంది.


"ఇది పాతదే కదరా. గతంలో వచ్చిన ఆ స్పెషల్ ప్రొగ్రామే కదా." అన్నాడు వెంకటరావు.

ధీర ఏమీ అనలేదు.

కిచన్ నుండి ఉప్మా ప్లేట్ తో వచ్చి.. సోఫాలో కూర్చుంటూ..

"ఛానల్ మార్చరా." అంది సావిత్రి.

"ఇది చూద్దాం." అన్నాడు ధీర.


"అలా ఐతే.. నువ్వు గదిలోకి పోయి.. నీ టివి వేసుకో రాదూ. మేము ఈ టైంలో చూస్తున్న ప్రొగ్రాం ఇప్పుడు వస్తుంది." చెప్పాడు వెంకటరావు.

"లేదు. ఇది చూద్దాం. సు ప్రొగ్రామ్స్ ఎన్ని మార్లు ఐనా చూడగలం." చెప్పాడు ధీర.

"అదేమిట్రా.." వెంకటరావు ఏదో అనబోతుండగా..

"ఏమిట్రా.. ఈవిడంటే ఇంత పిచ్చి." అనేసింది సావిత్రి.


"పిచ్చి కాదు.. అభిమానం." చెప్పాడు ధీర

"అభిమానం ఉంటే.. ఒకటి రెండు మార్లు కానీ.. పట్టి పట్టి చూడ్డం ఏమిట్రా." అన్నాడు వెంకటరావు.


"ఈమెకి ఉన్న క్రేజీ వలనే.. పాతవైనా.. ఈమెవి.. ఛానల్స్ వారు కూడా మళ్లీ మళ్లీ చూపుతున్నారు. థటీజ్ సు." అన్నాడు ధీర.


"అవునవును.. వాళ్లు పదే పదే చూపడం.. నువ్వు మళ్లీ మళ్లీ చూడడం.. నేను చూస్తున్నాను. వద్దురా. తగదురా." అంది సావిత్రి నొచ్చుకుంటున్నట్టు.


ధీర ఏమీ అనక ముందే..

"వదిలేయవే.. వీడు ఈ అమ్మాయి మోజులో.. వ్యామోహంలో.." అంటూన్న వెంకటరావుకి..

అడ్డై.. "నాన్నా.. ఏమేమో అనేయకు. ఈ అమ్మాయి అంటే నాకు అభిమానం. అంతే." చెప్పాడు ధీర.

(కొనసాగుతుంది..)

***


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


322 views0 comments

Comments


bottom of page