కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link

'Su... Dheera Episode 9' New Telugu Web Series
Written By BVD Prasada Rao
రచన: బివిడి ప్రసాదరావు
గత ఎపిసోడ్ లో…
సు కి జ్వరం వచ్చి హాస్పిటల్ లో చేరుతుంది.
అక్కడికి వస్తాడు ధీర.
డిశ్చార్జ్ అయి ఇంటికి బయలుదేరుతుంది సు.
ఆమె వెనుకే బైక్ లో బయలుదేరుతాడు ధీర.
ఇక చదవండి...
సు ఇంట్లో...
"బ్రేక్ఫాస్ట్ ఏమిటి" అడిగాడు ధీర.
"నాకు వద్దు." చెప్పింది సు.
"నాకు కావాలి." అన్నాడు ధీర.
"ఐతే వెళ్లు. లేదా తెప్పించుకో." అంది సు.
ధీర.. "సర్లే. వాటర్ కావాలి." అన్నాడు.
సు ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తీసి.. ధీరకి ఇచ్చింది.
ఆ వెంబడే.. తన రూం లోకి వెళ్తూ.. "ఈ హాలులో ఉండు. నేను రిప్రెష్ కాగానే తిరిగి వస్తాను." చెప్పింది సు.
పాపు గంట తర్వాత..
సు వచ్చింది.
హాలులో.. సోఫాలో కూర్చుంది.
పక్కగా ఉన్న సింగిల్ సోఫాలో ధీర ఉన్నాడు.
"టేబ్లెట్ వేసుకోవాలిగా" చెప్పాడు ధీర.
"వేసుకున్నాను." చెప్పింది సు.
"ఫ్రిడ్జ్ లో పళ్లు ఉంటే.. జాస్ ఇవ్వనా." అడిగాడు ధీర.
"ఇప్పుడు అక్కర లేదు." చెప్పింది సు.
"అరె. చాన్నాళ్లుగా చూస్తున్నా.. నువ్వు చాలా సూటిగా.. ముక్క ముక్కలుగా మాట్లాడుతుంటావు.. మరి తెర మీద మాత్రం లొడలొడా మాట్లాడతావు. పైగా.. చలాకీగా.. చిలిపిగా మూవ్ అవుతావు." అన్నాడు ధీర.
"చెప్పాగా.. తెర మీదిలా.. బయట నేను కానని." అంది సు.
"చిత్రమే. నాకు అదే.. అలానైతే నచ్చుతుంది." చెప్పాడు ధీర.
"అందుకు నన్ను తెర మీదే చూసుకో.. ఇష్ట పడుకో." చెప్పింది సు. చిన్నగా నవ్వింది కూడా.
"లేదు లేదు. నిత్యం నువ్వు నా కళ్ల ముందు.. కాదు కాదు.. నీ చెంతనే నేను పడి ఉండాలని కోరుకుంటున్నాను." చెప్పాడు ధీర.
"సరి పోయింది. తెర మీద కిక్ ని నువ్వు తప్పక మిస్ అవుతావు." చెప్పింది సు.
"నేను ఎన్నెన్నో అనుకున్నాను. నీ గ్లామర్.. నీ హ్యూమర్.. నీ బూమర్.." చెప్పుతున్నాడు ధీర.
"చాలు చాలు. ఆపు." అడ్డు పడి అంది సు.
ధీర చెప్పడం ఆపాడు.
సు అతడ్నే చూస్తుంది.
"అభిమానించడం మంచిదే. కానీ అది ఎదుట వారిని హైరానా పర్చకూడదు. అలాగే తనని తాను దిగజార్చుకొనేలా మారకూడదు." చెప్పింది సు.
"నువ్వు అంటే.. అభిమానం కంటే నాకు ఏదో ఇష్టం." చెప్పాడు ధీర.
"ఏ రాయి ఐతే ఏం.. ఇంచు మించు దెబ్బ తగలడానికి." అనేసింది సు.
ధీర కంగారయ్యాడు.
"ప్రస్తుతం.. నీ మనసుని.. నీ యవ్వనం డామినేట్ చేస్తుంది. నేచురల్. మరి నీ ఏజ్ అట్టింది. వద్దు.. గాడీ తప్పకు. బాధ్యతగా వ్యవహరించుకో." చెప్పింది సు.
"అబ్బో నీది ఆరింద వయస్సు మరి. నీతులు చెప్పకు." టప్పున అనేశాడు ధీర.
"కాకపోవచ్చు. అటు ఇటుగా నీ ఏజ్ గ్రూపు దాన్నే. కానీ.. నా అనుభవాలతో.. చెప్పుతున్నాను. వినుకో. నిన్ను నీవు మల్చుకో. అది నీ గతికి.. నీ వాళ్ల స్థితికి మంచిది." చెప్పగలిగింది సు.
ధీర చిన్నగా కదిలాడు.
"నీ సంగతి బట్టి చెప్పుతున్నాను.. తెర పైవి చూసి.. భ్రమించ వద్దు.. చలించ వద్దు. వాటి మీది కవ్వింతలు నా అవకాశాలకి పెట్టుబడులు. స్టార్ట్.. కట్.. ల మధ్యవి నా అవసరాలు.. తెర బయట.. తెర మీద కనిపించేలా.. నేను కాదు.." చెప్పుతుంది సు.
ధీర వింటున్నాడు.
"నాకు ఒక ఆశయం ఉంది.. ఒక తీరు ఉంది.. ఒక రీతి ఉంది. నమ్ము. నీతులు కాదు కానీ.. ఎవరి హద్దు లో వారు నడవడం.. వేరొకరికి అడ్డు కాకపోవడం.. ఆమోద యోగ్యం.. వారి వారి శ్రేయస్కరం కూడా." చెప్పడం కొనసాగిస్తుంది సు.
ధీర అయోమయంలోనే ఉన్నాడు.
"నిన్ను నిరుత్సాహ పరుస్తున్నానని అనుకోకు.. అలాగే నేను నీ నుండి తప్పించుకోవడం కాదు.. అనుభవాలతో.. నన్ను నేను మల్చుకున్న నేను.. నీకు చెప్పుతున్నాను. దయచేసి నా మాటలు పెడ చెవిన పెట్టకు." చెప్పడం ఆపింది సు.
సునే చూస్తున్నాడు ధీర.
సు లేచింది. ఫ్రిడ్జ్ లోంచి అరటి పండు తీసుకుంది. తొక్క ఒల్చుకుంటూ దాని గుజ్జుని చిన్న చిన్నగా కొరుక్కుంటూ తింటుంది.
"పళ్లు ఉన్నాయి. కావాలనుకుంటే ఇస్తాను." చెప్పింది ధీరతో సు.
"నువ్వు చెప్పడం ఐందా" అడిగాడు ధీర.
చిత్రంగా ధీరని చూస్తుంది సు.
"నేను తెలివైన వాడిని కాకపోయినా.. తెలివిలోనే ఉన్నాను. ఐ మీన్.. స్పృహలోనే ఉన్నాను. నేను నిన్ను ఇష్ట పడుతున్నాను.. అంటే.. ప్రేమిస్తున్నాను అని కాదు.. నిన్ను ఆరాధిస్తున్నాను.." చెప్పుతున్నాడు ధీర.
సు అరటి తొక్కని డెస్ట్ బిన్ లో పడేసి.. వచ్చి.. తిరిగి కూర్చుంది.
"తెర మీది నిన్ను.. నా దరి నిన్ను.. చూస్తున్నాను. అక్కడ నువ్వు.. ఇక్కడ నువ్వు.. ఒకరిలా కాక పోయినా.. నువ్వు నికరంగా గొప్పగా అగుపిస్తున్నావు.. అనిపిస్తున్నావు.." చెప్పుతున్నాడు ధీర.
సు ఆలకిస్తుంది.. ఆలోచిస్తుంది.
"నువ్వు నా చూపున పడ్డ లగాయితు.. నువ్వు అంటే.. పదాలు తెలియడం లేదు.. నా భావాలు చెప్పలేక పోతున్నాను. కానీ.. సింపుల్ గా చెప్తాను. నువ్వు ఐతే.. నాకు ప్రాణం అవుతున్నావు.. అంతకు మించి కూడా అనిపిస్తున్నావు.." చెప్పుతున్నాడు ధీర.
సు గింజుకుంటుంది.. 'ధీరని మార్చగలనా' అనుకుంటుంది.
"నీ తీరుకి.. నీ రీతికి నేను అడ్డు కాను.. రాను కూడా. దయచేసి నన్ను నీ చెంత పడి ఉండని.. బ్రతికేస్తాను." చెప్పాడు ధీర.
సర్రున అంది సు.. "వాట్ డు యు మీన్."
ధీర వెంటనే చెప్పలేక పోయినా.. నెమ్మదించి చెప్పాడు.. "ఐ మీన్.. లైక్.. దేవత.. భక్తుడు లా."
"ఛుఫ్. అవకాశం కల్పిస్తుంటే.. రేగుతున్నావు. పిచ్చిగా వాగుతున్నావు." అంది సు.
"లేదు. పచ్చిగా చెప్పుతున్నాను. నిజంగా చెప్పుతున్నాను. నువ్వు నమ్మాలి. అందుకైనా నువ్వు.. నాకు నీ చెంతన చోటు ఇవ్వాలి." చెప్పాడు ధీర.
చిర్రెక్కిపోతున్నా.. ఇంకా తమాయించుకుంటుంది సు.
ఆ సమయంలోనే.. "నీ ఇంటి పని వాడిగానైనా.. నీ చేరువున నన్ను తిరగనీవు." అనేశాడు ధీర.
"ఇనఫ్. లే. వెళ్లు." అనేసింది సు.
"అదేమిటి.. నీ గురించి చెప్పేక.. అది నాకు నచ్చక పోతే.. నేనే నీ నుండి తప్పుకుంటాను అన్నాను కదా.. కానీ నీ గురించి విన్నది.. నాకు నచ్చింది. మరి నేను ఎందుకు తప్పుకోవాలి." అడిగేశాడు ధీర.
తడబాటు పడింది సు.
"లాజిక్ లు వద్దు.. నా గురించింది నువ్వు నచ్చావా.. కహానీలు వద్దు. చాలించు." అంది సు విసుగ్గా.
"నన్ను నువ్వు రీడ్ చేయలేక పోయావు. అందుకే నన్ను పిచ్చోడిలా.. లేదా.. లవ్ మాన్ గా అనుకుంటున్నావు. కానీ.. నా నుండి ఆలోచించు.. నేను తెలుస్తాను.." చెప్పుతున్నాడు ధీర.
"ఏమిటి నీ నుండి ఆలోచించేది." గబుక్కున అడిగింది సు.
"నన్ను ఒక పిచ్చోడని.. నేను నిన్ను లవ్ చేస్తున్నానని.. నాది యవ్వనం సోదని.. హు. ఇలా.. నా మీద.. కేవలం నీ భ్రమలే. నిజానికి నేను నీ ఆరాధకుడ్ని లైక్ భక్తుడులా.." చెప్పుతున్నాడు ధీర.
ధీరనే చూస్తూ ఉండి పోయింది సు.
"నువ్వు అనుమతిస్తే.. నిత్యం నీ చెంతనే నిన్ను చూస్తూ.. ఆరాధిస్తూ.. ఉండి పోవాలని తలుస్తున్నాను.. అంతే కానీ.. సారీ ఇలా చెప్పుతున్నందుకు.. నేను నిన్ను.. మరెందుకూ కోరుకోవడం లేదు." ఆగాడు ధీర.
అప్పుడే సు ఏదో అనబోయింది.
అంతలోనే.. "నిన్ను కన్వెన్సింగ్ చేయగలనని.. చేసుకోవాలని.. నీ ఎదుట పడ్డాను. ప్రత్యక్షంగా నీతో ఉండాలని అనుకున్నాను.. నాదే తప్పు.. ఆ తెర మీది.. లేదా.. ఆ ఫోటోలు లోని.. నిన్ను చూస్తూ.. ఆరాధిస్తూనే.. నా మానానా నేను ఉండలేక పోయాను. ఎదుట పడి చులనయ్యాను. గాడ్ ముందుకి డివోటీ రావడం తప్పే.. ఛ." లేచాడు ధీర.
సు అతడ్నే చూస్తుంది.
ధీర వెళ్లబోతూ.. ఆగి..
"నీ ఆరోగ్యం జాగ్రత్త. టేక్ కేర్. ఇవేమీ మనసున పెట్టుకోకు. నువ్వు సదా.. లేదా నీ వీలు బట్టి.. తెరపై నువ్వు కనిపించు.. నన్ను అలరించు." అనేసి.. బయటికి వెళ్లి పోయాడు ధీర.
సు షాక్ లోనే ఉంది.
ధీర తన ఇంటికి బయలుదేరాడు తన బైక్ తో.
చాలా సేపటికి సు తేరుకుంది. నెమ్మదిగా తెములు కుంది.
'ఛ.. ఆపవలసింది.' అనుకుంది ధీర గురించి.
భారంగా కదిలి మైన్ గేట్ మూసింది.
ఆకలి అనిపించగా.. ఆపిల్ తింది.
మంచం మీద పడింది.
ధీర నే తలుస్తుంది సు.
ఆ తోవలోనే సు కి కునుకు పట్టింది.
సుకి మెలుకువ వచ్చే సరికి.. సాయంకాలం.. ఐదు దాటేసింది.
ఆకలి కావడంతో.. ఆన్లైన్ లో స్నేక్స్ తెప్పించుకుంది.
వాటిని తింటుంది.
సుని.. ధీర ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి.
తన నటనానుభవంతో నాటకీయతని పసిగట్టే స్థాయిని చేరిన సుకి.. ధీర వాటంలోని నిక్కచ్ఛితనం అగుపించింది.
తర్జన భర్జనలకి పోక.. తమాయించుకుంటూ.. ధీరకి కోరి ఫోన్ చేసింది సు.
ధీర ఫోనెత్తాడు. "చెప్పు" అన్నాడు.
"ఎక్కడ" అడిగింది సు.
"ఇంట్లోనే." చెప్పాడు ధీర.
"రా.. మాట్లాడాలి." చెప్పింది సు.
ధీర ఒప్పుకున్నాడు.
కాల్ కట్ చేసి.. సు వెళ్లి.. రిప్రెష్ అయ్యింది.
అర గంట తర్వాత.. డోర్ బెల్ తో వెళ్లి.. మైన్ డోర్ తీసింది.
ధీరని లోనికి రమ్మనమంది.
ఇద్దరూ హాలులో.. సోఫాల్లో.. కూర్చున్నారు.
"లంచ్ తీసుకున్నావా." అడిగాడు ధీర.
"లేదు. ఫ్రూట్ తిన్న." చెప్పింది సు.
"ప్చ్. ఏం సరిపోతుంది. లంచ్ చేయవలసింది." అన్నాడు ధీర.
"పండు తిన్నాక.. నిద్ర పట్టేసింది. లేచి.. స్నేక్స్ తెప్పించుకున్న." సు చెప్పింది. తనకి ఇప్పుడు.. ధీరతో సరళంగా మాట్లాడాలనిపిస్తుంది.
"నువ్వు లంచ్ చేశావా." అడిగింది సు.
"లేదు. టీ తాగాను. మంచం మీద పడుకున్నాను. కానీ నిద్ర పట్టలేదు." చెప్పాడు ధీర.
"నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు." అంది సు సడన్ గా.
ధీర 'కారణం' అడగ లేదు.
"నీలాంటి వారు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. మరి ఇలాంటి అభిమానమూ ఉంటుందా." అంది సు.
అప్పటికీ ధీర మాట్లాడ లేదు.
"నా పర్షనల్ వివరాలు తొక్కి పెట్టేశాను. కానీ.. ఇప్పుడు.. నీకు అవి.. షేర్ చేయాలని నాకు ఉంది." చెప్పింది సు.
"ఐతే చెప్పేసి.. అవీ వింటాను. నాకు నచ్చకపోతే.. మాటిచ్చినట్టు.. నేను నీ నుండి తప్పుకుంటాను. నిన్ను దూరం నుండే ఆరాధించుకుంటాను." అనేశాడు ధీర.
ఆగి.. ఒక నిముషం తర్వాత...
"అప్పుడు నేను ఐదవ తరగతి చదువుతున్నాను. ఆ రోజు.. నాన్న చెప్పాపెట్టక.. నన్ను వదిలి ఎటో పోయాడు. తర్వాత తెలిసింది తను మా వీధిలో సీతమ్మని లేపుకు పోయాడని.. నేను ఒంటరి అయ్యాను.." చెప్పుతున్న సుకి అడ్డై..
"మీ అమ్మ" అడిగాడు ధీర.
"నేను మూడవ తరగతిలో ఉండగా చనిపోయింది. నాకు తోబుట్టులు లేరు.." చెప్పుతుంది సు.
"మరి బంధువులు" అడిగాడు ధీర.
"లేరు. అమ్మ కూడా నాన్నతో లేచి వచ్చేసిన బాపతు. దాంతో.. అమ్మా నాన్నల కుటుంబాలు మాకు అప్పుడే దూరమైపోయాయి." చెప్పడం ఆపింది సు.
ధీర ఏమీ అడగలేదు.
"అమ్మ ట్యూషన్స్ చెప్పేది.. నాన్న ఓ బట్టల షాపులో పని చేసేవాడు." తిరిగి చెప్పుతుంది సు.
ధీర వింటున్నాడు.
"నాన్నపోయక.. నన్ను పట్టించుకొనేవారే లేరు." ఆగింది సు.
ధీర మాట్లాడలేదు.
"నేను పనులకి వెళ్లాను. సంపాదన తక్కువ. దాంతో ఇంటి అద్దె కట్టలేక పోతే.. ఆ ఇంటి వారు నన్ను గెంటేశారు. గుడి గట్టుల మీద రాత్రులు పడుకుండే దాన్ని. తర్వాత్తర్వాత చాలా అగచాట్లు పడ్డాను." మళ్లీ ఆగింది సు.
ధీర కదుల్తూ.. సర్దుకున్నాడు.
"ఆ ఊరిలో కాక.. రైలు ఎక్కి మొండిగా ఈ హైదరాబాద్ వచ్చేశాను. పనులకై మేస్త్రీలని పట్టుకొని తిరిగాను. నేను ఆ పనులు చేసుకుంటూ ఉండగా.. నేను చూడ్డానికి బాగుంటానని.. నన్ను గ్రూప్ ఆర్టిస్ట్ గా పెట్టుకున్నారు ఒక సినిమా కంపెనీ వాళ్లు." మళ్లీ ఆగింది సు.
ఆమెనే చూస్తున్నాడు ధీర.
"వయస్సు రావడంతో.. నేను పొందిగ్గా అగుపడుతున్నానని.. నాకు చిన్న చిన్న కేరెక్టర్స్ సినిమాల్లో ఇచ్చారు. తర్వాత్తర్వాత.. నా చొరవతో.. పట్టుతో.. టివి ఛానల్స్ వైపు అడుగులు వేశాను. నా లక్కే మరి.. నాకు పోను పోను అవకాశాలు కుదిరాయి.. అలా ఇక్కడ వరకు చేరాను." ఆగింది సు.
ధీర ఏమీ అనలేదు.
"నాకు ఎదురైన అనుభవాలే నాకు పాఠాలయ్యాయి. ఎలా మెసులుకోవాలో తెలిపాయి. నన్ను నేను మలుచుకుంటూ.. ఎక్కడా.. ఎప్పుడూ ఆత్మాభిమానాన్ని మభ్య పెట్టక.. నన్ను నేను దిగజార్చుకోకుండా.. నిలదొక్కుకున్నాను.. ఇలా నిలుచున్నాను." సు చెప్పడం ఆపేసింది.
ధీర మాట్లాడ లేదు.. కానీ.. ఆగకుండా చప్పట్లు మాత్రం చరిచాడు.
సు కళ్లల్లోని మెరుపుని అతడు అప్పుడే మరింత క్లీయర్ గా గమనించాడు.
"నేనింత వరకు నా గురించి ఎవరికీ చెప్పలేదు. నువ్వు ఏమిటో అర్ధం అయ్యాకే.. ఎందుకో చెప్పాలనిపించింది. చెప్పేశాను." అంది సు.
"గతం గతః.. ప్రస్తుతాన్ని సరిపుచ్చుకోవాలి.. ఫూచర్ ని తీర్చిదిద్దుకుంటుండాలి." చెప్పాడు ధీర.
ఆలకించింది సు. చిన్నగా నవ్వుకుంది. లేచి లైట్లు వేసింది.
సు వచ్చి కూర్చున్నాక.. "నీ మీద నాకు ఇప్పుడు మరింత.. ఉ.. ఏ పదం వాడాలి.. ఆ.. మమత.. యస్.. మమత పెరిగింది." చెప్పాడు ధీర.
"సర్లే.. నేనేం నీ మూలంగా హర్ట్ కానులే.. ఇకపై.. తోచిందే మాట్లాడేసి." చెప్పింది సు.
ధీర చిన్నగా నవ్వేడు.
తర్వాత.. ధీరే.. "నువ్వు సరైనా ఫుడ్ తీసుకో లేదు.. త్వరగా తిను.. డిన్నర్ తేనా." అడిగాడు.
"లేదు.. నేను ఆర్డర్ పెట్టుకుంటా.. మరి నువ్వు.. చీకటి పడుతుంది. వెళ్లు." అంది సు మెల్లిగా.
"సరే. మళ్లీ.." నసిగాడు ధీర.
"ఫోన్ చేస్తాగా." చెప్పింది సు నవ్వుతూ.
ధీర బయలుదేరాడు ఇంటికి.. తన బైక్ తో.
మైన్ డోర్ మూసుకుంది సు.
(కొనసాగుతుంది..)
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Comentários