top of page

సు...ధీర ఎపిసోడ్ 8

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link


'Su... Dheera Episode 8' New Telugu Web Series


Written By BVD Prasada Rao


రచన: బివిడి ప్రసాదరావు


గత ఎపిసోడ్ లో…


షూటింగ్ లో ఒక సెలెబ్రిటీ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో కోపం తెచ్చుకుంటుంది సు. షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సు తనని ధీర ఫాలో చేస్తూ ఉండటం గమనిస్తుంది.

ఇక చదవండి...ఎ ఛానల్ నుండి శ్రీధర్.. సు అనుమతించగా.. షూటింగ్ స్పాట్ కి వచ్చాడు.

అప్పటికి షూటింగ్ పేకప్ కాగా.. సు తన కారులో ఉంది.

శ్రీధర్ ని చూసి.. కారు దిగింది సు.

ఆమె కోరిక మేరకు ఇద్దరూ అక్కడి మర్రి చెట్టు కింద నీడలో.. రాతి దిమ్మల మీద కూర్చున్నారు.

"చెప్పండి" అంది సు.

"మిస్ సు.. ఉగాది స్పెషల్ ప్రొగ్రాం బాగా రేటింగ్ చూపింది. అందుకు మీ కంట్రిబ్యూషనే కారణం. సో.. మీతో మేము ఒక 'వీక్ ఎండ్స్ ప్రొగ్రాం' ప్లాన్ చేశాం. మీ డేట్స్ కావాలి. అందుకు మీ వీలు.. మీ పేమెంట్స్ చెప్పండి." అడిగాడు సరళంగా శ్రీధర్.

"సంతోషం. కానీ.. నాకు ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. ఇలాంటి అప్పుడు ఆఫర్ ఇస్తున్నారు. ఎలా చెయ్యాలో.. ఏం చెప్పాలో తోచకుంది." చెప్పింది సు.

"ప్లీజ్. దీపం ఉండగానే సర్దు కోవాలి. మీకు తెలియనది కాదు. ఎడ్జెస్ట్ చేసుకోండి." చెప్పాడు శ్రీధర్.

"నిజమే.. మీరన్నది కరెక్టు. వదులుకోలేను.. అలాని.. ఒప్పుకోలేను." తంటాలు పడుతుంది సు.

శ్రీధర్ ఏమీ అనలేదు. ఆమెనే చూస్తున్నాడు.

"వీక్ ఎండ్స్ అంటే.. వారం కి రెండు ఎపిసోడ్లా." అడిగింది సు.

"అవును. ప్రతి శనివారం.. ఆదివారం ల్లో.. ప్రైమ్ టైం స్లాట్స్ లో.. ప్రసారం చేస్తాం. ఈచ్ ఎపిసోడ్ ఒన్ ఆవర్." చెప్పాడు శ్రీధర్.

"వీక్లీ ఒన్స్.. రెండు రోజులు ఇవ్వండి. రెండు ఎపిసోడ్స్ షూటింగ్ ఐపోతుంది." ఆ వెంటనే చెప్పాడు.

సు ఆలోచించింది. నెమ్మదిగా కదిలింది.

"వారంకి రెండు రోజులు కాదు.. నాదో మాట" అంది సు.

'ఏమిటా' అన్నట్టు సు ని చూస్తున్నాడు శ్రీధర్.

"వారంకి రెండు ఎపిసోడ్ షూటింగ్స్ ఐతే .. మీకు ఇలా ఇస్తాను. అది ఉదయం ఎయిట్ టు మర్నాడు ఉదయం సిక్స్ వరకు. ఈ టైమ్స్ మధ్యలో.. రెండు ఎపిసోడ్ షూటింగ్స్ పెట్టుకోండి." చెప్పింది సు.

శ్రీధర్ ఆలోచించాడు.

"టైటవుతుంది మిస్ సు." అనేశాడు.

"నా వీలుని కూడా దృష్టిలో పెట్టుకోండి." చెప్పేసింది సు.

చిన్నపాటి తర్జన భర్జనల పిమ్మట.. శ్రీధర్ ఒప్పేసుకున్నాడు సు ప్రతిపాదనని.

"మీ అమౌంట్ తెలియచేయండి." అడిగాడు శ్రీధర్.

"మీ ఆఫర్ చెప్పండి." నవ్వింది సు.

శ్రీధర్ మాట్లాడ లేదు. చిన్నగా నవ్వేశాడు.

"మీరు నాకు ఇచ్చి ఉన్నారు గా." అంది సు.

"అది స్పెషల్ ప్రొగ్రాం మిస్ సు." చెప్పాడు శ్రీధర్.

"పైగా.. ఇది కంటిన్యూ ప్రొగ్రాం." అన్నాడు ఆ వెంటనే.

సు కాల యాపన లేకుండా తన డిమాండ్ చెప్పి.. "ఇది ఇప్పుడు సింగిల్ ఎపిసోడ్ కి నేను తీసుకుంటున్నది. పైగా ఆ ఎపిసోడ్ అర గంటే. బట్ మీది గంట ఎపిసోడ్ అంటున్నారు. సో.." అంటూ ఆగింది.

"అంటే డబుల్ అంటారు." నవ్వేడు శ్రీధర్.

సు ఏమీ మాట్లాడడం లేదు.

ఆ గ్యాప్ లో.. శ్రీధర్ చకచకా లెక్కలు కట్టుకొని..

"మిస్ సు.. నెలలో ఎనిమిది ఎపిసోడ్స్.. సో.. ప్యాక్ లా ఆఫర్ చేస్తున్నాను." అంటూ.. తన ఆఫర్ వ్యాల్యూ చెప్పాడు.

సు కొద్ది సేపే ఆగి.. "లేదు.. ఎపిసోడ్ లెక్కనే చెల్లించండి. అదీ ఒన్ అవర్ కనుక.. డబుల్ ఇవ్వగలిగితేనే నాకు సమ్మతం." అనేసింది.

"మరింతా సూటితనమా" అన్నాడు శ్రీధర్.

సు చిన్నగా నవ్వేసింది.

"సరే.. కానీయండి." అనేశాడు శ్రీధర్.

"థాంక్యూ. మీ వైపు పార్మాలిటీస్ మొదలెట్టండి. పేపర్స్ వర్క్ కాగానే.. నేను డేట్స్ మీకు తెలియ పరుస్తాను." చెప్పింది సు.

శ్రీధర్ వెళ్లి పోయాడు.

సు ఇంటికి బయలు దేరింది తన కారుతో.

డిన్నర్ తర్వాత.. తన చిన్న పుస్తకం తీసి చూసుకుంది. తర్వాత నిద్రకి మంచం ఎక్కింది.

రెండు రోజుల తర్వాత..

తలవని తలంపుగా.. బి ఛానల్ వారు వచ్చి.. సుని షూటింగ్ స్పాట్ లో కలిశారు. అంతకు ముందు.. తనని కలవడానికి సు వారికి టైమిచ్చుంది.

బి ఛానల్ వారు.. తమ 'కుదిరితే నవ్వేసి' అనే కొత్త ప్రొగ్రాంకి యాంకర్ గా సుని కోరి.. ఆమె డిమాండ్ కి ఒప్పేసుకొని.. నియమించుకున్నారు.

తమ ఛానల్ నుండి ఉగాది నాడు టెలీకాస్ట్ చేసిన సు స్పెషల్ ప్రొగ్రాం మజాని వాళ్లు ఇంకా కేష్ చేసుకోవాలనే మోజులో ఉన్నారు.

సు ఆ ప్రొగ్రాం ఒప్పుకున్న తర్వాత.. తన సింగిల్ ఎపిసోడ్ కమిట్మెంట్స్ ని చాకౌట్ చేసుకుంది.

వాటిలో చాలా వాటిని.. ఆయా ప్రొడ్యూసర్స్.. డైరక్టర్స్ ని బతిమలాడి.. ఒప్పించ గలిగింది.. మరియు ఆయా వాటికి తన వారిని నియమించుకోగలిగింది.

ఇక తనే కావాలని పట్టు పట్టే వారికి మాత్రం.. డేట్స్ వీలు వెంబడిగా సర్దుబాటు చేసుకుంది.

ప్రస్తుతం తను సింగిల్ ఎపిసోడ్స్ కి ఒప్పుకోవడం లేదు.

దాంతో.. సు నే కోరుకునే కొంత మంది ప్రొడక్షన్స్ వారు.. సు తో సీరియల్స్.. లేదా వీక్లీ ప్రొగ్రామ్స్.. లేదా వెబ్ సీరీస్ లు తీసే ప్లాన్లు చేపట్టారు.

ఏమైనా.. సు చేతి నిండా పనులు.. సు బ్యాంక్ అకౌంటులు కళకళలు.. జోరు జోరుగా కొనసాగుతున్నాయి.

వీటికి తోడు.. తోటి వారి ఛీత్కారాలు.. చిర్రుబుర్రులు తత్సమానంగానే సుకి పరోక్షంగా చేరుతున్నాయి.

ఐనా.. సు దేనికీ పొంగడం లేదు.. కుంగడం లేదు..

తన రీతిన తాను ఉంది.

అలాగే.. ధీర తన తీరున తను.. సు తపనలో తపిస్తున్నాడు.. మెసేజ్ లతోనే సరి పెట్టుకుంటున్నాడు. సు కి ఇబ్బంది పర్చకుంటా మెసులుతున్నాడు.

కాలచక్రం తన పని తాను చేసుకుపోతుంది.

పక్షం రోజులు గడిచే సరికి..

సు ఒప్పుకున్న ప్రొగ్రాం షూటింగ్ లన్నీ చకచకా కొనసాగడమే కాదు..

సు సీరియల్.. ఎ ఛానల్ వారి ప్రొగ్రాం.. బి ఛానల్ వారి ప్రొగ్రాం ఎపిసోడ్స్ మొదలయ్యాయి.. వాటికి ఆడియన్స్ ఆదరణ ఇబ్బడిముబ్బడిగా లభిస్తుంది.

సు ఛార్మీ ప్రకాశిస్తుంటే.. మరిన్ని కొత్త ఛాన్సులు సు దరి చేరుతున్నాయి.

కొద్ది మంది ప్రొడక్షన్స్ వారు.. సు నుండి రిజర్వ్డ్ డేట్స్ భారీగా మొత్తాల్ని అడ్వాన్స్ లుగా పే చేసి.. మరీ అట్టి పెట్టుకున్నారు కూడా.

కాలం కలిసి వచ్చిన సమయాన్న సు ఉంది. రోజంతా షూటింగ్స్ తో.. తన తోటి వారిని హైరాన పర్చే స్ధాయిన ఉంది.

ఉదయం..

సమయం ఏడవుతుంది..

అనుదీప్ చేస్తున్న ఫోన్ కాల్ ని గమనించిన రజని.. కాస్తా విడ్డూరం ఐంది.

'నా కెందుకు అబ్బా.. కాల్ చేస్తున్నాడు. వీడు పరమ అవకాశ వాది. నాతో ఏ పని అబ్బా వీడికి.' అనుకుంటూనే..

అనుదీప్ కాల్ కి కనెక్టు ఐంది రజని.

"హలో" అంది.

"రజనీ.. నీకు తెలుసా.. సు హాస్పిటల్ లో చేరింది." చెప్పాడు అనుదీప్.

రజనికి తెలుసు.. కానీ.. "అలానా" అనేసింది.

"అవును. రాత్రి లగాయితు సుకి జ్వరం.. దగ్గు ట." అన్నాడు అనుదీప్.

"నీకు ఎలా తెలిసింది" అడిగింది రజని.

"బి ఛానల్ వాళ్లు నాకు చెప్పారు. ఈ రోజు వాళ్ల షూటింగ్ ఉందట. సు రాలేనని చెప్పి.. వాయిదా కోరిందట. రాబోవు రెండు ఎపిసోడ్స్ అవుట్ పుట్ వారి వద్ద ఉందట. దాంతో వాళ్లు సరే అన్నారట." చెప్పాడు అనుదీప్.

రజని ఏమీ అనలేదు. కానీ తనకి ఈ విషయాలు తెలుసు. రాత్రే.. హాస్పిటల్ నుండి.. తనకి ఫోన్ చేసి.. సు చెప్పింది. ఐనా ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఊరుకుంది రజని.

కానీ.. అనుదీప్ తో.. "నువ్వు హాస్పిటిల్ కి వెళ్తున్నావా" అని మాత్రం అంది.

"అబ్బే. రోజులు బాగాలేవ్. అది ఏ కరోనా ఐతే." అన్నాడు అనుదీప్.

"సు.. ఏ పని అని వదులుతుంది. ఓపెనింగ్స్ నీ వదలదు. ఆ జనం లోకి వెళ్లి వస్తుంది. ఎక్కడ ఏం అంటుకుందో." అన్నాడు అనుదీప్ ఆ వెంబడే.

"అవునవును. అంతంతే. నేను అందుకే సు ని కలవడానికి వెళ్లడం లేదు" నీళ్లు నమిలేసింది రజని.

"అదే మంచిది. సర్లే.. నీకెలా ఉన్నాయి ఛాన్స్ లు." అడిగాడు అనుదీప్.

"ఏవో ఉన్నాయిలే." అంది రజని. కానీ.. సు తనకి ఇచ్చిన.. సు ఒప్పుకొని వదిలేసుకున్న సింగిల్ ఎపిసోడ్ వర్క్స్ గురించి మాత్రం చెప్పలేదు.

"ఉంటా" అంటూ రజని ఆ కాల్ ని కట్ చేసేసింది ఆ వెంటనే.

సమయం.. ఎయిట్ దర్డీ ఏయ్..

తను ఉంటున్న హాస్పిటల్ రూంలోకి వచ్చిన ధీర ని చూస్తూనే.. ఆశ్చర్య పోయింది సు.

"ఎలా వచ్చావు. ఎలా తెలిసింది." తడబడుతుంది సు.

సు కి దగ్గరగా వచ్చాడు ధీర.

చిత్రంగా.. ధీరనే చూస్తుంది సు.

"ఎలా ఉంది" అడిగాడు ధీర. అతడు ఆందోళనలో ఉన్నాడు.

"నేను బాగానే ఉన్నాను. డాక్టర్ చూశారు. రిపోర్ట్స్ రావాలి." చెప్పి..

"నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది." అడిగింది.

"చెప్పాగా.. నేను నీ నీడని అని." చెప్పాడు ధీర.

"చాల్లే. చోద్యంగా మాట్లాడకు." విసురుగా అంది సు.

"రాత్రి నువ్వు ఇంటికి పోక.. హాస్పిటల్ కి వెళ్లడం నేను చూశాను. అప్పుడు తొమ్మిది దాటడంతో.. విజిటర్స్ ని హాస్పిటల్ వారు అనుమతించ లేదు. ఎంత బతిమిలాడినా కాదన్నారు. ఉదయం ఎనిమిది తర్వాత రమ్మన్నారు." చెప్పాడు ధీర.

"బడాయి కాకపోతే ఏమిటి ఇది.. ఎందుకు నీకు." అనేసింది సు.

"నీకు ఏమైంది" అడిగాడు ధీర.

"నీ సొద నీదేనా" విసుక్కుంది సు.

తనని దీనంగా చూస్తున్న ధీరని చూస్తూనే.. "షూటింగ్ లో ఉండగా కాస్తా జ్వరంలా అనిపించింది. అది కాస్తా పెరుగుతూ వచ్చింది. తోడుగా కాస్తా కాఫ్ మొదలైంది. షూటింగ్ కానిచ్చేసి.. నేరుగా హాస్పిటల్ కి వచ్చి చేరిపోయాను." చెప్పింది సు.

"ఇలాంటప్పుడే తోడు అవసరం.. ఒంటరితనం కుదరదు." అన్నాడు ధీర.

"నా ఆరోగ్య విషయంలో నాకు జాగ్రత్తే. ఐనా తప్పదు అప్పుడప్పుడు." అంది సు.

"రాత్రి వచ్చి చేరడమే మేలైంది. రాత్రి ఇంజెక్షన్.. మందులతో.. బాగా నయమయ్యింది." చెప్పింది కూడా.

"ఏమైనా తాగావా" అడిగాడు ధీర.

"బ్రష్ కాలేదు" చెప్పింది సు. "ఆ కిట్ తేలేదు" అంది వెంటనే.

"ఇప్పుడే వస్తాను" అంటూ ధీర బయటికి వెళ్లి.. నిముషాల్లో బ్రష్.. టూత్ పేస్ట్ వగైరాలతో తిరిగి వచ్చాడు.

"నీకు ఎందుకు. నర్స్ వస్తే తెమ్మని చెప్తాను." చెప్పింది సు.

"సర్లే. నేను తెచ్చాగా. లేచి చేసుకో." అన్నాడు ధీర.

ఆ వెంబడే.. "వేడి కాఫీ తేనా." అడిగాడు.

"హాస్పిటల్ వాళ్లు ఇస్తారులే. ఒక సారి ఇలానే చేరాను. బిల్లు పే చేస్తే.. అన్నీ వాళ్లే చూసుకుంటారు." చెప్పింది సు.

"కావచ్చు. నేను ఇప్పుడు ఉన్నానుగా. చెప్పు.. తేనా." అన్నాడు ధీర భయం భయంగానే.

ఎందుకో నవ్వింది సు. "కాఫీ తే" చెప్పింది.

ధీర తిరిగి బయటికి వెళ్లాడు. కాఫీ.. బిస్కెట్ ప్యాకట్ తెచ్చాడు.

సు వాటిని తీసుకుంది.

అర్ధ గంట తర్వాత..

రౌండ్స్ కి వచ్చిన డాక్టర్.. "మేడమ్.. రిపోర్ట్స్ వచ్చాయి. చూశాను. అంతా నార్మలే. లాస్ట్ టైంలానే.. పని ట్రేస్ మూలంగానే ఇలా సఫర్ ఐయ్యారు. ఇచ్చిన టేబిలెట్స్ ఒక రోజు తప్పక వాడండి. సరిపోతుంది. కానీ లిక్విడ్స్ బాగా తీసుకోవాలి.. లైక్.. పళ్ల జూస్ ల్లాంటివి" చెప్పాడు.

"ఐతే ఇంటికి వెళ్లి పోవచ్చా డాక్టర్" అడిగాడు అక్కడే ఉన్న ధీర.

"మీ ఇష్టం. డిచ్ఛార్జ్ చేసేయనా మేడమ్." సుని చూస్తూ అడిగాడు డాక్టర్.

"చేసేయండి డాక్టర్. వర్క్ కి ఆటంకం కాకూడదు." చెప్పింది సు.

"నో. ఈ రోజుకి రెస్ట్ లో ఉండండి. తప్పదు." చెప్పాడు డాక్టర్.

సు మాట్లాడలేదు.

ధీర మాత్రం కలగ చేసుకొని.. "డిచ్ఛార్జ్ చేసేయండి డాక్టర్. ఇంట్లో.. రెస్ట్ లో ఉండేలా చూస్తాను." చెప్పాడు.

'ఎవరు మీరు' అన్నట్టు ధీరని చూశాడు డాక్టర్.

అది గుర్తించిన సు.. "డిచ్ఛార్జ్ చేయండి డాక్టర్." అనేసింది.

డాక్టర్ వెళ్లి పోయాడు.

అర గంట తర్వాత.. బిల్లు కట్టబోయే ధీరకి అడ్డు చెప్పి.. తన కార్డు తో బిల్లు చెల్లించేసి.. ఇంటికి బయలు దేరింది సు.

తన కారుని చేరేక.. ధీర్ కి.. "థాంక్స్" చెప్పింది సు,

"నేను వస్తాను." చెప్పాడు ధీర.

"ఇంటికా. వద్దు. నా ఇంటిలోకి పని వారిని తప్పా.. ఎవరినీ అనుమతించను." చెప్పింది సు.

"నన్ను ఒక పని వాడ్ని అనుకోవచ్చు." టక్కున చెప్పాడు ధీర.

"హే. పిచ్చిగా వాగకు." అనేసింది సు.

"నీకు సేవ చేసుకొనే వీలు ఇవ్వు." దీనంగా అడిగాడు ధీర.

అతడిని ఎగాదిగా చూసిన సు.. "వద్దంటున్నానా" అంది.

"ప్లీజ్.. నా మూలంగా నీకే ఇబ్బంది రాదు. నమ్ము." అన్నాడు ధీర.

"దీన్నేమంటారు. ఇది ఇబ్బంది కాదా." చెప్పేసింది సు.

ధీర తల దించుకున్నాడు.

సు అతడి వాలకం చూడలేక తల తిప్పుకుంది.

"నాకు ఫోన్ చేసి.. నన్ను రప్పించుకొని.. నాకు నీ గురించి చెప్తానన్నావు. కానీ రోజులు గడుస్తున్నా ఇంత వరకు నాకు ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వడం లేదు. ఇప్పుడైనా.. ఇలా.. మనం కలుద్దాం. మాట్లాడుకుందాం. నువ్వే చెప్పావు. నీ గురించి చెప్పుతానని. అది ఇప్పుడు చేయవచ్చుగా." అన్నాడు ధీర.

సు ఎందుకో కాస్తా తగ్గింది.

ధీరని ఇలాగైనా.. నెమ్మది పర్చాలని తలచింది.

"సరే. రా. నీకు బైక్ ఉందిగా." అడిగింది.

"ఉంది. నీ వెనుకే వస్తా. పద." అన్నాడు ధీర.

సు కారు ఎక్కి.. స్టార్ట్ చేసి.. ఇంటికి కదిలింది.

ధీర ఫాలో అవుతున్నాడు తన బైక్ మీద.

(కొనసాగుతుంది..)

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.312 views0 comments

Commentaires


bottom of page