top of page

సు...ధీర ఎపిసోడ్ 10

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Su... Dheera Episode 10' New Telugu Web Series


Written By BVD Prasada Rao


రచన: బివిడి ప్రసాదరావు


గత ఎపిసోడ్ లో…

సు ఇంటికి వెళతాడు ధీర.

ఆమెను ఆరాధిస్తూ ఉండిపోతానని చెబుతాడు.

తన గతం ధీరకు చెప్పడం ప్రారంభిస్తుంది సు.

ఇక చదవండి...


నిద్ర లేచిన సు.. తన దిన చర్యని చేపట్టింది.

తను జిమ్ లో ఉండగా..

ధీర ఫోన్ చేశాడు.

"హలో." అంది సు.

"ఎలా ఉంది." అడిగాడు ధీర.

"అంతా నార్మల్." చెప్పింది సు నవ్వుతూ.

"ఐనా.. ఈ రోజూ రెస్టులో ఉండు." చెప్పాడు ధీర.


"లేదు.. షూటింగ్ కి వెళ్తాను. ప్రస్తుతం జిమ్ లో ఉన్నా." చెప్పింది సు చక్కగా.

"అవునా.. టేక్ కేర్." అన్నాడు ధీర.


"ఓకే. థాంక్యూ." అంది సు.

కాల్ కట్ చేసి.. తిరిగి ఎక్సర్ సైజ్ లు కొనసాగిస్తుంది.

ఏడు కాగా.. సు ఇంటికి తిరిగి బయలుదేరింది తన కారుతో.


గేట్ వద్ద.. వాచ్ మాన్ నుండి తన ఇంటి తాళం కీ తీసుకొని.. ఇంట్లోకి వచ్చి.. సీరియల్ షూటింగ్ కి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయాన..

తన ఫోన్ రింగివ్వగా.. ఆ కాల్ కి కనెక్ట్ ఐంది సు.


"తెలిసింది.. ఎలా ఉన్నారు.. జ్వరం తగ్గిందా." అడిగాడు సీరియల్ ప్రొడ్యూసర్.

"నిన్నటికి కాస్తా ఇబ్బందయ్యింది. ఇప్పుడు బాగున్నాను. మీ షూటింగ్ కే బయలుదేరుతున్నాను." చెప్పింది సు.

"అవునా.. సరేనమ్మా." అనేశాడు ప్రొడ్యూసర్.

రోజులు గడుస్తున్నాయి.


సు వర్క్ షూటింగ్స్ జరజరా జరిగి పోతున్నాయి.

పైగా ఆ మధ్యన.. మరో రెండు.. సు కొత్త సీరియల్స్ మొదలయ్యాయి.

వాటి ప్రొమోస్ రిలీజయ్యి.. అవి చక్కని ట్రెడింగ్ తో అలరిస్తున్నాయి.

ఈ మధ్య ఒక ఛానల్ లో.. సు లైవ్ ఇంటర్వ్యూ ప్రసారమై.. చాలా మంది ఆడియన్స్ ని మెప్పించింది కూడా.


ఆ ఇంటర్వ్యూ లో..

"మేడమ్ మీ పేరు సు.. ఏమిటి" అన్న ప్రశ్నకి..

"నా తెర మీది నేమ్ అది." క్లుప్తంగా జవాబు ఇచ్చింది సు.

"మీ అసలు పేరు." అన్న ప్రశ్నకి జవాబు దాట వేసింది.


అలాగే.. తన కుటుంబ ప్రస్తావనకి.. సు నిశ్చలంగా.. "అది పూర్తిగా నా వ్యక్తిగతం." అంటూ జవాబు ఇచ్చి.. ఆగి పోయింది.

మరి కొన్ని రోజుల తర్వాత..


తన పని ఒత్తిళ్లులో ఉన్న సు కి.. సాంకేతిక కారణాల వలన.. షూటింగ్ ముందుగానే పేకప్ కావడంతో.. మధ్యాహ్నం లగాయితు.. మర్నాడు వరకు ఖాళీ దొరికింది.

సు ఇంటికి వచ్చేసింది.


ఫోన్ కాల్స్.. ఫోన్ మెసేజ్ లతో.. ధీర కి టచ్ లో ఉన్న సు.. సడన్ గా 'ధీరతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాలి' అనిపించింది.

దాంతో వెంటనే ధీరకి ఫోన్ చేసేసింది.

"చెప్పు." అన్నాడు ధీర.

"ఎక్కడ." అడిగింది సు.


"ఆఫీస్ లో." చెప్పాడు ధీర.

"నాకు షూటింగ్ పని లేదు. ఇంటి లోనే ఉన్నాను.. రాగలవా." అడిగింది సు.

"అర గంటలో వచ్చేస్తా." చెప్పాడు ధీర.


కానీ అర గంట లోపే వచ్చేశాడు.

ఇద్దరూ.. హాలులో.. ఎదురెదురు సోఫాల్లో కూర్చుని ఉన్నారు.


"ఆ గడ్డం ఏమిటి.. డల్ గా కనిపిస్తున్నావు. ఏమయ్యింది." అడిగింది సు.

సరిగ్గా జవాబు ఇవ్వలేదు ధీర.


"నిన్నే.. సరిగ్గా చెప్పు." కసిరింది సు.

"ఇంట్లో.. నాకు.. పెళ్లి సంబంధాలు.. చూస్తున్నారు." చెప్పాడు ధీర.


"అవునా.. ఐతే ఏం." అడిగింది సు.

"నాకు పెళ్లి వద్దు." చెప్పాడు ధీర.


"అచ్ఛా. ఐతే ఒంటరిగా ఉంటావా.. ఉండగలవా." నవ్వింది సు.

"ఏం..నువ్వు ఉంటున్నావుగా." టక్కున అన్నాడు ధీర

"భలే. నేను ఒంటరి అనుకోవడం లేదే." చెప్పింది సు.

"అదేమిటి.. పెళ్లి లేక ఒంటరిగా ఉంటున్నావుగా." అన్నాడు ధీర.


"లేదే.. నేను పెళ్లి చేసుకోనని కానీ.. నాకు పెళ్లి వద్దని కానీ.. నేనేమీ చెప్పింది లేదే." చెప్పింది సు.

"అంటే.. నువ్వు పెళ్లి చేసుకుంటావా." గజిబిజి అవుతున్నాడు ధీర.

"వై నాట్." సు నవ్వుతుంది.


"ఆర్ యూ సీరియస్" అన్నాడు ధీర.

"పక్కా." అంది సు.


"ఎవర్ని." అడిగేశాడు ధీర.

"నచ్చేవాడ్ని" వెంటనే చెప్పేసింది సు.

సునే చూస్తూ ఉండి పోయాడు ధీర.


"ఏమిటా చూపు." అంది సు.

"లక్కీ ఫెలో." అన్నాడు ధీర.


"ఎవరు." టక్కున అడిగింది సు.

"నిన్ను పెళ్లి చేసుకోబోయే వాడు." చెప్పాడు ధీర.

"ఏమో." తేలిగ్గా అంది సు.


"అదేమిటి." విస్మయమయ్యాడు ధీర.

"అది అతడి నడతతో ఉంటుంది." చెప్పింది సు నవ్వుతూనే.


"ఏదీ సూటిగా చెప్పవేం." ధీర ఉడుక్కుంటున్నాడు.

"అది నీ అభిప్రాయం.. బట్.. నేను అల్వేజ్ ఒకేలా ఉంటున్నా.. ఉంటా." చెప్పింది సు.

"సర్లే.. నీ తోవ నీది.. నా తోవ నాది." అన్నాడు ధీర.

"నీ తోవ ఏమిటో." గమ్మత్తుగా అడిగింది సు.

"నిన్ను ఆరాధిస్తూ ఉండడమే." చెప్పాడు ధీర.


"అందుకు పెళ్లి చేసుకోకుండా ఉండడం ఎందుకో." నవ్వుతూనే అడిగింది సు.

ధీర మాత్రం ఆగి.. "అలా ఐతేనే.. నేను స్వేచ్ఛగా.. ఐ మీన్.. నాకు నచ్చినట్టు.. ఉండగలననుకుంటున్నాను." చెప్పాడు.


"నీది చిత్రమైన పిలాసిఫీ." అంది సు.

దీర ఏమీ అనలేదు.


"ఆకలి అవుతుంది. లంచ్ పెడతాను." చెప్పింది సు.

"వండేవా." ఆశ్చర్యమయ్యాడు ధీర.


"అంత లేదు. నాకు సరైన వంట రానే రాదు. ఏదో కొద్ది పాటిని చేసుకుంటా. అంతే." చెప్పింది సు.


"ఆర్డర్ చేయనా." అడిగాడు ధీర.

"లేదు. నేను పెడతా." చెప్పింది సు.


"ప్లీజ్." అన్నాడు ధీర.

"నో. నీకు ఏం కావాలి. చెప్పు." అంది సు.

నిరుత్సాహమయ్యాడు ధీర.

నవ్వింది సు.


"నీ ఇష్టం. ఏదైనా పర్వాలేదు." చెప్పేశాడు ధీర.

"సరే.. థాంక్యూ." అంటూనే లంచ్ ఆర్డర్ పెట్టేసింది సు.

తర్వాత..


"మీ పేరెంట్స్ ని బాధ పెట్టకు." అంది.

"అబ్బే.. లేదే.. వాళ్లని చక్కగా చూసుకుంటున్నాను." చెప్పాడు ధీర.


"వాళ్ల మాటా వినాలిగా. వాళ్లు నీ పెళ్లిని కోరుకుంటున్నారుగా." చెప్పింది సు.

అప్పుడే.. రజని నుండి సుకి ఫోన్ వచ్చింది.

ఆ ఫోన్ కాల్ కలిపి.. "చెప్పు." అంది సు.


"అనుదీప్ చెప్పాడు. ఆదివారం జరగనున్న సినిమా ఆడియో పంక్షన్ కి నువ్వు వీలు కాదన్నావట ఆ ప్రొడక్షన్ వారితో. అప్పుడు వాళ్లు అనుదీప్ ని వాకబు చేశారట. కో యాంకర్ గా అతడు నన్ను రమ్మంటున్నాడే." చెప్పింది రజని.


"అవునా.. గురుడు.. ఒంటరిగా లైవ్ పెర్ఫాం చేయలేడుగా." నవ్వింది సు.

"నాకు డైరక్ట్ ఛాన్స్ కావాలే. నీకు తెలుసుగా. స్టేజ్ మీద నేను సింగిల్ గా మేనేజ్ చేయగలనని." చెప్పింది రజని.


"ఐతే నేనిప్పుడు ఏం చేయాలి." అడిగింది సు.

"ఆ ప్రొడక్షన్ వారితో మాట్లాడి.. నాకు సోలో యాంకరింగ్ ఇప్పించవే." అడిగేసింది రజని.


"వాళ్లు ఆల్రడీ అనుదీప్ తో మాట్లాడేశారుగా." అంది సు.

అప్పుడే మైన్ డోర్ బెల్ మోగింది.


సు లేవబోయింది.

ధీర సైగలతో ఆపి.. వెళ్లి.. ఆ డోర్ తీశాడు.


లంచ్ ఆర్డర్ డెలివరీ అవుతుంది.

సు మాత్రం రజనితో మాట్లాడుతుంది.


"అనుదీప్ తనకి ముట్టిందాంట్లోనే.. నాకు సర్దుతాడట." చెప్పుతుంది రజని.

"నా చెయ్యి దాటిపోయింది. ఇప్పుడు నేనేమీ చెయ్యలేనే." చెప్పేసింది సు.


"అంతేనా." అంది రజని.

"అంతేగా." చెప్పింది సు.


ఆ కాల్ కట్ కాగానే..

అటు..


'రెండు చేతుల సంపాదన వచ్చి పడుతోంది. పొగరు బలిసింది.' అనుకుంది రజని.. సు గురించి.

ఇటు..


"లంచ్ రడీ" అన్నాడు ధీర.. డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ ని సర్దేసి.

సు కదిలింది.

లంచ్ చేస్తూ..


"ఆ.. చెప్పు.. మీ తల్లిదండ్రులన్ని ఇబ్బంది పెట్టకు. నీ పెళ్లిని వాళ్లు కోరుకుంటున్నారు.. నేచురల్." అంది సు.


ధీర అన్నంలో పప్పు కలుపుకుంటూ.. "నాకు ఏ ప్రతిబందకాలు వద్దు. సింగిల్ గా ఉంటే.. నా తృప్తి నాకు చక్కగా అందుతుంది." చెప్పాడు.


"అయ్యో.. నీ తృప్తికై వాళ్లని వదిలేస్తావా ఏమిటి." గందికగా అడిగింది సు.


"అబ్బే.. లేదు లేదు. వాళ్లకి దరిగా లేకుండా కూడా.. తల్లిదండ్రులని చక్కగా సాకుతూ ఉండ వచ్చు.. అదే.. భార్యని దూరం పెట్టి సాగలేను.. ఏదీ సాగించలేను గా." చెప్పాడు ధీర.


సు అతడ్నే చూస్తుంది.

ధీర అన్నంలో సాంబార్ కలుపుకుంటున్నాడు.


"అనుకోలేదు కానీ.. నువ్వు కానోడివే." అంది సు.

ధీర తలెత్తాడు. సుని చూశాడు.


"కాంప్లిమెంటా.. కామెంటా." అడిగాడు.

నవ్వుతూనే.. సు పెరుగు కప్పుని దగ్గరగా లాక్కుంది. స్పూన్ తో పెరుగు తింటుంది.

"అదేమిటి.. అన్నంలో కలుపుకు తింటే మంచిది." చెప్పాడు ధీర.

"నాకు ఇలానే ఇష్టం." చెప్పింది సు.


లంచ్ తర్వాత..

డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి.. వేస్టుని కవర్ లో వేసి.. దానిని డస్ట్ బిన్ లో పెట్టింది సు. అందుకు చిన్న చిన్నగా ధీర సాయ పడ్డాడు.


ఆ పిమ్మట..

ఆ ఇద్దరూ.. తిరిగి హాలులోని సోఫాల్లోకి వచ్చి.. కూర్చున్నారు.

"రోజూ నీ లంచ్ ఎలా." అడిగింది సు.


"ఇంటికి వెళ్తా." చెప్పాడు ధీర.

"మరిప్పుడు కాలేదుగా. ఇంట్లో చూస్తారుగా." అంది సు.


"ఇటు రాక ముందు.. ఆఫీస్ లో పర్మిషన్ తీసుకున్నా.. అలాగే.. ఇంటికి ఫోన్ చేసి.. లంచ్ కి రాకపోవచ్చు అని చెప్పా." చెప్పాడు ధీర.


ఆ వెంబడే.. "అదే ఇంట్లో భార్య ఉంటే కుదురుతుందా." అన్నాడు.

సు ఒక్క మారుగా.. తన ఐబ్రోస్ ని చకచకా ఎగర వేసింది.. ధీరనే చూస్తూ.

తర్వాత.. "నువ్వు ఘటికుడువే." అంది సు.


"ఏమో.. కానీ.. తల్లిదండ్రులని మేనేజ్ చేసేలా.. భార్యని మేనేజ్ చేయలేంగా." అన్నాడు ధీర.

"అవునా.. మరి.. భర్తని మేనేజ్ చేయగలమా." అడిగింది సు.

"అంటే.." ఆయోమయమయ్యాడు ధీర.


"మరి.. అదే.. మగాడు.. భార్యని మేనేజ్ చేయలేకపోతే.. ఆడది.. భర్తని మేనేజ్ చేయగలదా." అడిగింది సు నవ్వుతూనే.

వెంటనే మాట్లాడలేక పోయాడు ధీర.


"అదేనోయ్.. నా పెళ్లితో వచ్చే భర్తని.. నేను ఎలా మేనేజ్ చేయగలను." అడిగింది సు.


తల గొక్కుంటూ.. సు నే చూస్తూ.. ధీర ఉండి పోయాడు.

"అర్ధమయ్యిందా.." సాగతీస్తుంది సు.


"అర్ధమయ్యింది.. నిజమే.. నీకూ వీలు కాదు." అనేశాడు ధీర.

"నాకే కాదు.. నీకూ వీలు కాదు." టక్కున చెప్పేసింది సు.

గింజుకుంటున్నాడు ధీర.


"నీకు పెళ్లి కాకపోయినా.. నాకు భర్త ఉండగా.. మనం ఇలా మూవ్ కాలేంగా.. ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా.. జరిగేది అదేగా." అంది సు.


"అవును.. నిజమేగా.. అమ్మో.. అలా కారాదు." గుణుస్తున్నాడు ధీర.

"ఏంటీ.. ఐతే.. నీకై.. నేను పెళ్లి మానుకోవాలా." చకచకా అంది సు.

ధీర మాట్లాడ లేదు.


"మాట్లాడు.. చెప్పు." అంది సు.

అర నిముషం తర్వాత.. "భయమవుతుంది." చెప్పాడు ధీర.


"మరే.. నేను భయపడుతున్నాను. నాకై నువ్వు పెళ్లి వద్దనుకుంటున్నావు.. మరి.. నీకై నేను పెళ్లి మానుకోవాలా." అంది సు.. ధీరనే చూస్తూ.


సునే చూస్తున్న ధీర నిజంగానే వణికి పోతున్నాడు.


"చూడూ.. తెర మీది నా గ్లామర్ స్థిరమైనది కాదు.. అలానే.. తెర మీద అగుపించిన నాపై ఏర్పడిన నీ అభిమానం చివరి వరకు స్థిరమైనదా. నేను తెర మీద కనబడినంత వరకే.. నాపై అభిమానం కురుస్తుంది.. నేను నిత్యం తెర మీద ఆగుపించలేను.. ఏదో రోజు నేను తెర మీది నించి తప్పుకోక తప్పదు.. నాకు తెలుసు.. తర్వాత.. ఎవరి పనులు వారివి.. ఈ మోజులు.. ఈ అభిమానాలు.. తుష్ పట్.. యోచించు." చెప్పి.. ధీరనే చూస్తూ ఉండి పోయింది సు.


ధీర.. వెంటనే మాట్లాడలేక పోయినా.. త్వరగానే తెములుకున్నాడు. ఒక్కమారుగా తలని విదిలించుకున్నాడు.


"నిన్ను నేను తెర మీదే కాదు.. తెర బయటా చూస్తున్నాను.. నువ్వు అక్కడ.. ఇక్కడ నాకు బాగా నచ్చావు.. నచ్చుతున్నావు. నీ మీది నా అభిమానం.. స్థిరమైనది.. ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగా కూడా.. నీ మీది నా అభిమానం.. స్థిరంగా ఉంటుంది.. స్థిరంగా ఉంచుతాను." చెప్పాడు.


"అయితే నువ్వు పెళ్లికి ఒప్పుకోవచ్చుగా." అనేసింది సు.

"లేదు. కుదరదు." అనేశాడు ధీర.


"అదేమిటి. ప్రత్యక్షంగాను.. పరోక్షంగాను.. నన్ను నీవు అభిమానించగలవని చెప్పావుగా." కాస్తా కంగారయ్యింది సు.


"అవును.. నీ మీది నా అభిమానాన్ని.. నా తల్లిదండ్రులకే సర్ద లేక పోతున్నాను. అటు వంటిది మరొకరికి పంచాలా.. కుదరదు." టఫ్ న చెప్పాడు ధీర.


విస్మయంగా ధీరనే చూస్తుంది సు.

అప్పుడే ధీర.. "నీ మీది నా అభిమానం అంతటిది.. అది పూర్తిగా నీ సొత్తు మాత్రమే." చెప్పాడు.


సు ఇంకా తేరుకోలేక పోతుంది.

ధీర కాంగా.. సు నే చూస్తూ ఉండిపోయాడు.


కొద్ది సేపు తర్వాత.. "నువ్వు నాకు అర్ధం అవుతున్నా.. నువ్వు నాకు అందడం లేదు. నా ప్రతి యత్నంకి గండి కొడుతున్నావు." అంది సు మెల్లిగా.


"నువ్వు చెప్పింది.. నీ ఆలోచన.. నాకు అర్ధం కావడం లేదు." అన్నాడు ధీర.


"నిజమే. మనం ఒకరికి ఒకరం తెలుస్తున్నాం. కానీ.. మనం ఒకరికి ఒకరం అనుసరించుకో లేకపోతున్నాం." చెప్పింది సు నిరుత్సాహంగా.


"అంత ఢీలా ఐపోయావేమిటి.. నా వలన ఇబ్బందవుతున్నావా." అడిగాడు ధీర.

తల అడ్డంగా ఊపిందే తప్పా.. ఏమీ చెప్పలేక పోయింది సు.


"డోన్ట్ వర్రీ.. ఇన్ ద మీన్ వైల్.. డోన్ట్ థింక్ అదర్వైజ్.. ప్లీజ్." చెప్పాడు ధీర నొచ్చుకుంటూ.

"ఛఛ.. అట్టిదేమీ లేదు.. కాదు." చెప్పింది సు.


ఆ వెంబడే.. "తెలుస్తుంది.. నీది నటన కాదు.. నీ జెన్యూన్ అగుపిస్తుంది.. 'నిన్ను హర్ట్ చేయగలనా'.. అనిపిస్తుంది." చెప్పింది సు.


"ప్లీజ్.. వద్దు.. నీ రిఫ్యూజ్ ని తట్టుకోలేను.. అలాగని.. నేను నిన్ను హైరానా పెట్ట లేను.. పెట్టను కూడా.. నాకై మాత్రం అతిగా ఏమీ ఆలోచించకు.. నీకు తోచింది.. లేదా.. నీకు కావలసింది నువ్వు చేసుకో.. కోరుకో.." చెప్పుతున్నాడు ధీర.


ఆలకిస్తుంది సు.

(కొనసాగుతుంది..)

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.



313 views0 comments

Comments


bottom of page