top of page

వర్షిణి - డాటర్ ఆఫ్ సూర్య

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Varshini Daughter Of Surya' New Telugu Story Written By N. Dhanalakshmi

రచన: N. ధనలక్ష్మి


కాంతం, సూర్యల గారాల పట్టి వర్షిణి. వర్షిణి పుట్టినప్పుడు విపరీతమైన వర్షం. పైగా ‘వర్షిణి బతకడం కష్టం’ అన్నారు డాక్టర్లు… కానీ వాటినన్నిటిని దాటుకొని తమ బిడ్డ ఈ లోకాన్ని చూసింది అని ‘వర్షిణి’ అని పేరు పెట్టుకున్నారు.


వర్షిణి చిన్నప్పటి నుంచి అన్నిటిలో చురుగ్గా ఉండేది. ప్రతిరోజు నిద్రపోయే ముందు స్కూళ్లో ఏమి జరిగిందో, తన ఫ్రెండ్స్ తో ఏయే ఆటలు అడిందో.. ఇలా ప్రతిదీ చెప్పేది. అలా జీవితం సాఫీగా సాగిపోతోంది. ఓ సాయంత్రం వర్షిణి పుట్టినరోజని, సరదాగా షికారుకు వెళ్ళి వస్తున్నారు. ఆ రోజు కూడా వాన పడుతోంది.


“నాన్నా! ఎందుకు నా ప్రతి పుట్టిన రోజున వర్షం పడుతుంది?"


" బంగారు తల్లీ.. నువ్వంటే వానకు చాలా ఇష్టం. పైగా ఈ రోజు నీ బర్త్ డే కదా.. నిన్ను బ్లెస్ చేయడానికి వాన పడు”తోందని నవ్వుతూ సూర్య చెప్తుండగా సడెన్ గా ఓ లారీ ఢీకొంది..

అంతే! సూర్య ఫ్యామిలీ మొత్తం రక్తపు మడుగులో పడిపోయింది...


సూర్య, కాంతం ఇద్దరూ చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు కానీ, జరిగిన ప్రమాదంలో వర్షిణికి

కళ్ళు పోయాయి...


యాక్సిడెంట్ అయిన కొద్ది రోజులకు వర్షిణికి మెలుకువ వచ్చింది.. కానీ తనకు ఏమీ కనపడలేదు. మొత్తం చీకటి… భయంతో ‘నాన్నా!’ అని గట్టిగా అరిచింది.


"బంగారు తల్లీ! భయపడకమ్మా! నాన్న ఇక్కడే ఉన్నారు.."


"నాన్నా! ఏమైంది నాకు.... నాకెందుకు మీరు కనపడడం లేదు… చెప్పండి నాన్నా… చెప్పండి"


“యాక్సిడెంట్ లో నీకు కళ్ళు పోయాయి రా కన్నా..! ఏమీ కాదు. భయపడకు రా … ఈ నాన్న తోడుండగా నీకేమీ కాదు... "


“నాన్నా…!” అంటు వెక్కి వెక్కి ఏడ్చింది.


“వర్షిణి ఈ సూర్య కూతురు… ధైర్యానికి మరో పేరు. ఏడవకు” అని కన్నీరు తుడిచి తనని హత్తుకొని ఓదార్చారు...


ఆ రోజు నుండి వర్షిణికి సూర్య అండ దండ గా ఉన్నారు.. తనని తాను అన్నిటికీ తట్టుకునేలా చేసేందుకు ఎన్నో నిజ జీవిత కథలను చెప్పేవారు..


ఓ రోజు స్కూల్ కి వెళ్ళే రూట్, ఇంటికి వచ్చే రూట్ ఎలా గుర్తుకు పెట్టుకోవాలో, ఎన్ని స్టెప్స్ వేస్తే చేరుకోవచ్చో.. ఇలాంటివి అన్నిటినీ నేర్పించారు..


“ఎందుకండీ! మనం ఉండగా తను ఒంటరిగా వెళ్ళి రావడం? అసలే కళ్ళు లేని పిల్ల! తనకు ఏదైనా జరగరానిది జరిగితే మనం తట్టుకోగలమా…”


“కాంతం! కన్నతల్లివి నువ్వే నీ బిడ్డను చూసి జాలి పడితే ఎలా?... మనం తోడు ఉంటాము కానీ ఎంతవరకు!? మనం జీవితమంతా తన వెంట వెళ్ళలేము. తను ఒంటరిగా జీవించడం నేర్చుకోవాలి. మన బిడ్డను చూసి ఎవరూ కూడా జాలి పడకూడదు. అర్థం అయిందా…”


“తల్లి.. ప్రేమతో ఆలోచిస్తే, తండ్రి బాధ్యతగా ఆలోచిస్తారని మరొకసారి రుజువు అయింది అండీ.. నా ప్రేమతో తనని పిరికిదానిలా తయారు చేసేదానిని… ఇంకోసారి మన బిడ్డను చూసి జాలి పడను… మీలాగే నేను కూడా సపోర్ట్ చేస్తాను… మన బిడ్డ అందరికన్నా ధైర్యవంతురాలిగా ఉండాలి..”


వర్షిణి ని కరాటే లో చేర్పించారు. వర్షిణి కూడా అన్నిటినీ ఎంతో శ్రద్ధతో నేర్చుకుంది. బ్రెయిలీ కూడా నేర్చుకుంది.. పాఠాలను కూడా రికార్డ్ చేసుకొని వాటిని వాయిస్ లోకి మార్చుకొని తనకి అర్ధం అయ్యే బ్రెయిలీ లో రాసుకునేది...


సూర్య కూడా వర్షిణి కోసం తను కూడా నిద్రాహారాలు మానుకొని, బ్రెయిలీ నేర్చుకొని, తనకు నోట్స్ రాసే వాటిలో సాయం చేసేవారు..


అలా వర్షిణి టెన్త్ లో జిల్లా ఫస్ట్ వచ్చింది… తరువాత ఇంటర్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది.....


"కన్నా! ఇంటర్ అయిపోయింది… నెక్స్ట్ ఏమి చేయాలి అనుకుంటున్నావు?” అని అడిగారు సూర్య.


"నాన్నా! డాక్టర్లు, లాయర్స్, ఇంజనీర్లు కావాలంటే వారికి టీచర్ అవసరం… రేపటి తరాన్ని ముందుకు నడిపించాలి అంటే అది టీచర్స్ ఒక్కరి వల్లే సాధ్యపడుతుంది. నేను టీచర్ కావాలని అనుకుంటున్నా” అని చెప్పింది.


“శభాష్ కన్నా! నువ్వు ఏది అనుకుంటే అది చేయి… నా సపోర్ట్ ఉంటుంది” అని చెప్పారు…


“తల్లీ! మనకి దేవుని దయ వల్ల డబ్బుకు ఇబ్బంది లేదు .. మనం ఓ స్కూల్ ఓపెన్ చేద్దాం. అది కూడా పేద పిల్లల కోసం” అని వర్షిణి చదువు పూర్తి అయ్యే లోపు స్కూల్ ని కట్టించారు సూర్య...


వర్షిణి కూడా తన చదువు కంప్లీట్ అవ్వగానే స్కూల్ బాధ్యత తీసుకొని చక్కగా నిర్వహిస్తోంది..

పిల్లలందరికీ వర్షిణి అన్నా, తను చెప్పే టీచింగ్ అన్నా ఎంతో ఇష్టం..... ఆ స్కూల్ నుండి ఎంతో మంది పిల్లలు మంచి మార్కులతో పాస్ ఆవ్వడమే కాకుండా, వివిధ పోటీలలో గెలుపొందేవారు... వీటికి కారణం ‘తమ టీచర్ వర్షిణి మేడమ్’ అని చెప్పేవారు...


వర్షిణి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం తనకు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డును ప్రకటించింది.. అవార్డు ఇవ్వబోతున్న మినిస్టర్ గారి అంగీకారంతో, అవార్డును తన తండ్రి సూర్య చేతుల మీదుగా అందుకుంది...


" నేను చూపు కోల్పోయినప్పుడు నా వెంట ఉండి ధైర్యం చెప్పారు మా నాన్న... నన్ను నేను గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి కారణం మా నాన్న… ఆయనే లేకపోతే నేను అనే దానిని లేను ... ఐ యాం ప్రౌడ్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ సూర్య..” అని చెప్పింది ...



ఇది విన్న వర్షిణి అమ్మానాన్నల కంట్లో ఆనంద భాష్పాలు...


ఈ మీటింగ్ కి ఆ జిల్లా కలెక్టర్ అథర్వ కూడా వచ్చారు. వర్షిణి యొక్క ఆత్మస్థైర్యం, ఉన్నత భావాలు, తన ఆశయాలు ఆయనకు బాగా నచ్చాయి. తన కాబోయే భాగ్యస్వామిని ఎలా ఉండాలని కోరుకున్నాడో అలాంటివన్నీ వర్షిణిలో పుష్కలంగా ఉన్నాయి. పైగా వర్షిణిని చూసిన వెంటనే తన మనసుకు చాలా నచ్చింది... పెళ్ళంటూ చేసుకుంటే వర్షిణినే చేసుకోవాలనుకున్నారు.


మీటింగ్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు కూడా వర్షం పడింది.


“చూసావా తల్లీ! నీ విజయానికి వర్షం కూడా ఆనందపడుతూ నిన్ను ఆశీర్వదిస్తోంది”


“అవును నాన్నా!”


ఆ వర్షంలో తడుస్తూ కాసేపు సరదాగా ఆడుకొని ఫోటోలు తీసుకున్నారు ఆనందంతో...


మరుసటి రోజు కలెక్టర్ అథర్వ తల్లిదండ్రులతో సహ వచ్చి తన మనసులో మాట చెప్పారు...


"బాబూ అథర్వా ఏ తండ్రి అయిన తన బంగారు తల్లిని తనకన్న బాగా చూసుకునే మరో అతని చేతిలో పెట్టాలి అనుకుంటాడు… నిన్ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసినట్టు ఉంది.. కానీ వర్షిణికి కూడా నువ్వు నచ్చాలి బాబు...."


" అప్పటికే స్కూల్ నుండి వచ్చిన వర్షిణి ఈ మాటలు అన్నీ వింది..


అథర్వ గారూ! మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ..” అంటూ ఆగిపోయింది...


“ ఏమిటో నేను చెప్పనా.... పెళ్ళి అయిన తరువాత మీ ఇంటి పేరు మారకూడదు ... అంటే ఈ వర్షిణి ఎప్పటికీ ‘వర్షిణి సూర్య’ లాగే ఉండాలి తప్ప ‘వర్షిణి అథర్వ’ లా మారదు అని కదా…”


“మీకెలా తెలుసు???”


“మనసుకు నచ్చిన అమ్మాయి గురించి ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా” అని నవ్వాడు...


వర్షిణి కూడా సిగ్గు పడుతూ తన అంగీకారం తెలిపింది ..


అలా ఓ మంచి రోజు అథర్వ,వర్షిణి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది....

వీరి వివాహాన్ని చూసి సంతోషపడుతున్నట్టు చిరుజల్లులు పడ్డాయి ఆ మండపం చుట్టూ...

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.





24 views0 comments

Comments


bottom of page