top of page

హమ్మ నా అత్తో

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Hamma na attho' New Telugu Story Written By Bhagavathula Bharathi

రచన: భాగవతుల భారతి


"నాలుగింట శని పాపి, సప్తమంలో రాహువూ కలహకారకుడు, గురువేమో నీచంలో పడ్డాడూ, నీచభంగ రాజయోగం అనుకోండి, ఎటునుండి చూసినా. అబ్బే ఏం బాగుండలేదండీ! "

నాలుకబయటపెట్టి పెదవులు చప్పరిస్తూ, ఇంకా ఏవేవో చెబుతూనే, వాటికి తను తీసుకోవలసిన జాగ్రత్తలూ, మెలకువలూ ,చెప్పిందే చెప్పి ,దక్షిణ పుచ్చుకున్నారు ,కరటక శాస్త్రిగారు.

పర్వత వర్ధనమ్మకి మాత్రం గుండెల్లో రైళ్ళు పరుగెత్తటం మెుదలయింది.

ఎన్నేళ్ళ నుండో, పర్వత వర్ధనమ్మ కుటుంబానికి మంచీ చెడూ, ఆ శాస్త్రి గారే చెబుతారు.

పిల్లలు అవన్నీ చాదస్తాలే! అని విసుక్కుంటూనే తల్లి మాట జవదాటక కాస్తో కూస్తో, ఆచరిస్తూనే ఉన్నారు.

భర్త పోయాక ఇంకా ఎక్కువైంది పర్వత వర్ధనమ్మ లో , భయంతో కూడిన చాదస్థంతో కూడిన,

జాగ్రత్తతో కూడిన, బాధ్యత తో కూడిన....అదో లాంటి భావం

ఈకలుపీకేసిన కోడిలా, చీకేసిన తాటి టెంకలాముఖం పెట్టుకుని ,గబగబా ఇంటికొచ్చి,చెప్పులు ఎడాపెడా విప్పేసి,

"బామ్మా! హాండ్ వాష్ ,లెగ్ వాష్ చేసుకోలా పప్పి షేమ్ షేమ్" అని మనుమడు అంటున్నా పట్టించుకోకుండా మంచంమీద పడిపోయింది.పర్వత వర్ధనమ్మ .

అత్తగారి వాలకం చూసిన కోడలు శాంత ఆమె గదివంకే మిఱ్ఱీ మిఱ్ఱీ చూస్తూ...

ఏం మాట్లాడితే ఏం తంటానో అనుకంటూ అటూఇటూ తిరుగుతోంది.

తల్లి ముఖం వేలాడేసుకుని ఉండటంచూసి "అమ్మా! ఏమయిందీ "అడిగాడు శంకర్ .

"జాతకాలు చెప్పే శాస్త్రిగార్ని కలిసివస్తున్నానురా! ఇది 1 వతారీఖు కదా వచ్చేనెల 4 వ తారీఖు వరకూ మీ గ్రహస్థితి సరిగాలేదు,మీకు కీడు జరగవచ్చూ... మీరుఎవరిజోలికీ వెళ్ళవద్దు. సర్వఅవయవాలూ అదుపులో ఉంచుకోవాలీ, నోరుకూడా అన్నం తింటానికే తెరవాలీ, అని చెప్పాడురా!"అని చెప్పిన పర్వత వర్ధనమ్మ .....

"అదంతా మూఢనమ్మకమమ్మా,నమ్మకూ" అని కొడుకు అంటున్నా వినకుండా, గదిలో మంచం ఎక్కేసి, నోరు మాత్రం అదుపులోఉంచుకోక,కోడలి మీద నోటి పెత్తనం చెలాయిస్తూ ,వేలెడు పనికూడా ముట్టుకోకుండా,

"అమ్మో! నన్ను జాగ్రత్తగా ఉండాలన్నారు కాలు కింద పెట్టకూడదన్నారు… ఏమే! ఇదికావాలీ.. అదికావాలీ.. " అని కోడల్ని సేవలపేరుతో హింసించేస్తోంది వర్ధనమ్మ. విషయం తెలుసుకుని అదేదో

విషాద వార్త విన్నట్లుగా హుటాహుటిన,వర్ధనమ్మని చూడటానికి కూతురు లక్ష్మి వచ్చింది.

ఇక ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ రెండు రోజుల గడిపేసారు.

“1 వ తారీఖు వచ్చేసిందే, ఇంక ఫరవాలేదు.ఇంకేముందీ. అమ్మా! మన ఇంటికి వెడదాం

రా!" తీసుకుపోయింది లక్ష్మి.

వెళ్ళిన మరునాడు బాతురూంలో దభేలున చప్పుడైంది, ఇంట్లో అందరి గుండెలూ గుభేలుమన్నాయ్.

వెళ్ళిచూస్తే లక్ష్మి కాలుజారి పడిఉంది .డాక్టర్ కి చూపించారు.

"ఈమెకు కాలు విరిగింది, తలకూ దెబ్బ బలంగానే తగిలింది, బెడ్ రెస్ట్ ఇవ్వాలి" అన్నాడు డాక్టర్. ఇక కూతురికి సేవలు చేస్తోంది పర్వత వర్ధనమ్మ .

"అత్తయ్యగారూ! కరటక శాస్త్రి గారు మీకు కీడు అన్నారు. కీడు మీ కూతురికి సేవ చేసే రూపంలో వచ్చిందేమోనండీ "అని అల్లుడు మేలమాడితే...

"భలే వారుఅల్లుడూ! ఇంకానయం! అక్కడుండగా కోడలు కాలుజారి పడలేదు, ఇంటెడు చాకిరీ నెత్తిమీద పడేది, అయ్యో! నా కూతురికేగా ఈ మాత్రం సాయం చేయలేనా? "అంది.

అత్తా నిన్ను కాకెత్తుకెళ్ళా !నీ అత్త బుద్ది పోనిచ్చుకోలేదుకదా! కూతురికి చేస్తే సాయమూ, కోడలికి చేస్తే అది చాకిరీనా? అని అల్లుడు ముక్కుమీద వేలేసుకున్నాడు.

//////////////

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


90 views1 comment
bottom of page