top of page

ప్రేమ తీరాలు - పార్ట్ 14

#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

ree

Prema Theeralu - Part 14 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 04/11/2025

ప్రేమ తీరాలు - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఇంజినీరింగ్‌ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమించి, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటాడు. వారికి కపర్ధి అనే బాబు పుడతాడు. కరుణాకర్ రాధను పెళ్లి చేసుకుంటాడు. కాలక్రమేణా లలిత–కరుణాకర్ మధ్య దూరం వస్తుంది. ఫణి అనారోగ్యానికి గురవుతాడు; బ్రెయిన్ ట్యూమర్‌గా తేలుతుంది. ఆపరేషన్ ఖర్చు ఇరవై లక్షలు అవుతుందని డాక్టర్లు చెబుతారు. మేనేజర్ కిరణ్ సహాయంతో ఫణి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. మార్ఫింగ్ ఫోటోలతో లలితను చెడుగా చూపి, ఫణిని మానసికంగా మభ్యపెడుతుంది సరిత. బాబును తీసుకుని లలిత ఇంటినుండి వెళ్ళిపోతుంది. భార్య మాటలు నమ్మినట్లు నటించి, ఫణి ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు కరుణాకర్. ఇద్దరూ కలిసి సరిత చేసిన మోసం బయట పెట్టాలనుకుంటారు. 

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 ప్రేమ తీరాలు పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ప్రేమతీరాలు పార్ట్ 14 చదవండి.


“బావా... ఇదిగో చూడు, మన పెళ్లికోసం నీకు నాకు బట్టలు తెచ్చాను. ఎలా ఉన్నాయో చూసి చెప్పు, నేనిప్పుడే వస్తాను,” మురిపెంగా చెబుతూ బాత్రూమ్‌కి వెళ్ళింది సరిత.


ఫణి పక్కనే బట్టలు, ఫోన్‌ పెడుతూ ఉన్నాడు. సరిగ్గా సరిత బాత్రూమ్‌లోకి వెళ్ళినప్పుడు, ఫోన్‌ సైలెంట్‌లో ఉందేమో, వైబ్రేషన్‌ వస్తుండడంతో ఫోన్‌ వైపు చూసాడు. రాధ ఫోన్‌ చేస్తోంది. ఇదే అదనుగా అనుకుని ఫోన్‌ ఎత్తి, అచ్చం సరిత మాట్లాడుతున్నట్టుగా గొంతు సవరించుకుని మాట్లాడాడు.


“హలో రాధ... ఏంటీ ఫోన్‌ చేసావు? ఇంటికి చేరుకున్నావా నువ్వు?” అడిగాడు ఫణి.


“ఇంకాలేదు సరిత... చాలా రద్దీగా ఉంది. ఆటోలో కూర్చున్నాను. ఆ ఏమన్నాడు నీ బావా? ఇంటికి వెళ్ళి నువ్వు తీసుకున్న డ్రెస్సులు చూపెట్టావా?” అడిగింది రాధ.


“ఇంకా దారిలోనే ఉన్నాను. ఏమంటాడులే రాధ... పెళ్లికి ఒప్పుకున్నాడు సంతోషంగా. నాకదే చాలు. కానీ పెళ్లి తొందరగా జరిగిపోతే బాగుండును. నేను పన్నిన పన్నాగం ఎప్పుడు బయటపడుతుందోనని భయంగా ఉంది రాధ,” అన్నాడు ఫణి.


“నీ పిచ్చి కాకపోతే బయటపడడానికి ఏముంది? ఎవరు చెబుతారు? నీకు నాకు తప్పా ఎవరికి తెలియదు. మనం చేసిన గ్రాఫిక్స్‌ బలే ఉపయోగమయ్యాయి కదా! నిజంగా అవి లలిత, కిరణ్‌ అనిపించేట్టుగా ఉన్నాయి. ఎవరికీ అనుమానం రాలేదు. అసలు నీకు ఇది అంతా ఎవరు చెప్పారు ఇలా చెయ్యొచ్చని? పాపం, అనవసరంగా ఆ కిరణ్‌ బలైపోయాడు. పోనిలే... మొత్తానికి నీ బావను నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది సరిత. ఇల్లు వచ్చేసింది, మళ్ళీ కలుద్దాం,” ఫోన్‌ పెట్టేస్తూ అంది.


“అబ్బా! ఎంత మోసం! స్వంత ఆడపడుచనీ చూడకుండా ఎన్ని నిందలు వేశారు లలిత మీద! పాపం ఏ పాపం తెలియని కిరణ్‌ను వాడుకున్నారు. రేపు అతనికి పెళ్లి కావాలంటే ఎంత ఇబ్బంది. ఛీ ఛీ... ఆడవాళ్లలో ఇంత దుర్మార్గులు ఉంటారని మొదటిసారి చూస్తున్నాను,” అనుకున్నాడు ఫణి.


మొత్తానికి దొంగలు దొరికారు. రాధ మాట్లాడింది మొత్తం రికార్డ్‌ చేసానని తెలియదు వీళ్లకు. ఇక సరిత.. నీ పని అయిపోయింది. నిన్ను కటకటాల వెనక్కి పంపించకుండా ఊరుకుంటే, మేము అనుభవించిన బాధకు అర్థం లేదు. అనుకుంటూ సరిత వచ్చేలోపు తను రికార్డ్‌ చేసిందంతా తన ఫోన్‌లోకి పంపించుకుని, సరిత ఫోన్‌ నుండి డిలీట్‌ చేశాడు. వెంటనే కరుణాకర్‌, కిరణ్‌, రమలకు పంపించాడు.


“ఏంటి బావా! అంత ఆనందంగా ఉన్నావు? డ్రెస్సులు నచ్చాయా ఏంటి? బావా, ఈరోజు నేను మన పెళ్లి బట్టలు తెచ్చాను. రేపు మనిద్దరం వెళ్ళి మంగళసూత్రం, రింగులు తెచ్చుకుందాం. అలాగే నీకు నచ్చిన నగలు నాకు కొనివ్వాలి సరేనా?” గోముగా ఫణి పక్కన కూర్చొని అతని భుజం మీద తల ఆనించి అడిగింది సరిత.


ఫణికి సరిత తాకుతుంటే తేళ్లు జెర్రెలు పాకుతున్నట్టుగా అనిపించింది. ఇబ్బందిగా కదులుతూ, “సరిత, నేను అర్జెంటుగా వెళ్ళాలి,” అని పక్కకు నెట్టి లేచిపోయాడు.


“పో బావా... నేను రాగానే నీకేదో ఒకటి గుర్తుకు వస్తుంది. ఇంకా ఎంతలే... మన పెళ్లి అయ్యేవరకే కదా! తరువాత ఎలాగూ నువ్వొద్దన్నా నేను వదిలిపెట్టను గదా,” గిలిగింతలు పెట్టుతూ అంది.


“అవును... ఎలాగూ నువ్వుకున్నది తప్పదుగా. తొందరెందుకు? నాలుగురోజులు ఆగావు అంటే నీకెలాగూ తప్పదు — జీవితఖైదు,” అంటూ వెళ్ళాడు ఫణి.


ఉలిక్కిపడింది సరిత. “ఏయ్ బావా, ఏమిటి నాకు జీవితఖైదు అన్నావు? ఏంటది?” అడ్డంగా తిరిగి అడిగింది.


“భయపడినావా సరిత? జీవితఖైదు అంటే — నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు స్వేచ్ఛగా ఉండలేవు కదా, అందుకే అలా అన్నాను అంతే. ఏం అంత కంగారుపడుతున్నావు? నువ్వేమైనా తప్పుచేసావా? జైలు గుర్తుకు వచ్చిందా?” అని ద్వందార్థంగా మాట్లాడాడు ఫణి.


“అమ్మయ్యా! అదా... నేనింకేమిటో అనుకున్నాను. నేను కోరుకున్నది ఇదే. ఎప్పటికైనా నా మొగుడు నాకే సొంతం. బావా, నిన్నెలా వదిలేస్తాననుకున్నావు?” ఫణి వెళ్ళిన వైపే చూస్తూ అనుకుంది తృప్తిగా.

***


వీడియో చూసిన కరుణాకర్‌ మండిపోయాడు భార్య మీద. “తనను కావాలనే పెళ్లి చేసుకుని నా చెల్లెలి జీవితాన్ని నవ్వులపాలు చెయ్యాలనుకుందా? అంత మోసం! ‘లోగుట్టు పెరమాళ్లకెరుక’ అన్నట్టు మనసులో ఇంత కుళ్లు పెట్టుకుని నాటకం ఆడిందా? ఛీ ఛీ! ఇలాంటి వాళ్లను క్షమించడం అంటే మంచివాళ్లకు అన్యాయం చేసినట్టే. ఫణితో మాట్లాడి వీళ్లకు తగిన శిక్షపడేలా చెయ్యాలి,” అన్నాడు.


“ఎంత నాటకమాడారు! అమాయకురాలైన లలితను బాధపెట్టారు. వీళ్లు వదిలినా నేను వదలను. నా స్నేహితుడు రవి పోలీసు ఆఫీసర్‌. అతనికి చెబుతాను. వీళ్లకు తగిన శాస్తి చేయించాలి,” అన్నాడు కరుణాకర్‌.


“లలిత... ఇది విన్నావా? ఫణి పంపించాడు. రాధ, సరిత కలిసి పన్నిన కుట్రే ఇది! అసలు నీ వదిన కావాలనే నీ అన్నయ్యను పెళ్లి చేసుకుందేమోననిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే సరిత తన స్నేహితురాలితో కలిసి నీ జీవితంతో ఆడుకున్నారు. ఇక వీళ్లను వదలను. మా వారితో చెప్పి కేసు పెట్టిస్తాను. ముప్పుతిప్పలు పెట్టిస్తాను చూడు,” అంది రమ కసిగా.


“నిజమే రమ! నాకు కూడా అదే అనిపిస్తోంది. మా వదిన వాలకం చూస్తుంటే... నేను ఎంత సంతోషపడ్డానో మా అన్నయ్య పెళ్లి చేసుకున్నప్పుడు! నాకు పుట్టింటి ఆదరణ లభిస్తుందనుకున్నా — అది మూడునాళ్ల ముచ్చటే అయింది. మా అన్నయ్యనే నాకాకుండా చేసింది. పోనీ అనుకుంటే నా జీవితానికే ఎసరు పెడుతుందనుకోలేదు. పసివాడిని తండ్రి ప్రేమకు దూరం చేసింది. తనకే పిల్లలుంటే తెలిసేది — కన్న ప్రేమ!” బాధతో అంది లలిత.


“లలిత... మనం రేపే బయలుదేరి మీ వారి దగ్గరకు వెళదాం. సరిత పొంగిపోతుందట — రెండురోజుల్లో పెళ్లికూతురు ముస్తాబులో ఉంటానని. మనను చూడగానే సరిత, రాధ షాక్‌ తగిలి మూర్చపోవాల్సిందే. బట్టలు సర్దుకో లలిత!” అంది రమ.


“రమ... నువ్వు చేసిన సహాయానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? సమయానికి నువ్వు ఆదుకోకపోతే నేనెవరి దగ్గరకు వెళ్ళేదాన్ని? నా బాబుకు ఏ కష్టం తెలియకుండా ఇన్ని రోజులు గడిచిపోయాయి. ప్రతి ఒక్కరికీ నీలాంటి స్నేహితురాలు ఒక్కరున్నా చాలు!” రమను కౌగిలించుకుంది లలిత.


“ఆపవే నీ పొగడ్తలు! ఇందులో నేను చేసిందేముంది లలిత? నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నీకు నేనున్నానన్న నమ్మకంతోనే వచ్చావు. అలాంటి నీకు నేను కష్టం కలిగిస్తానా? నువ్వు ఉండదలచుకుంటే ఇంకెక్కడో తలదాచుకోవచ్చు. కానీ నాకోసం వచ్చావు చూడు — అది నాకు బాగా నచ్చింది లలిత,” స్నేహితురాలి మీద వాత్సల్యం కురిపిస్తూ అంది రమ.


“ఏమండి! తొందరగా తయారుకండి. ఈరోజు సరిత పెళ్లి మరిచిపోయారా? దగ్గరుండి మనమే చెయ్యాలనుకున్నాం. పదండి త్వరగా!” తను రెడీ అయ్యి భర్తను తొందరపెట్టింది రాధ. 


“అవును, ‘ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి’ అన్నట్టు నీకే తొందరెక్కువుంది,” అనుకున్నాడు మనసులో కరుణాకర్‌.


“అవును కదా! ఈరోజు అసలు జరుగవలసిన పెళ్లి నీకు, సరితకు మరపురాని రోజు అవుతుందేమో! ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరికి శిక్షపడేలా చెయ్యాలో వేచి చూస్తుంటాడు సమయానికి. పద... మనం వెళ్ళితే గానీ పనులు జరుగవు. అక్కడ అందరూ మనకోసం ఎదురు చూస్తుంటారు,” అన్నాడు రెండర్థాల మాటలతో.


“అవునండి! తప్పు చేసిన వాళ్లకు మంచి శిక్షవేస్తాడు ఆ దేవుడు. లలిత తప్పు చేసింది గనుకనే భర్తకు దూరమైంది. మంచితనంతో తన బావ లలిత మెడలో తాళికట్టినా చూస్తూ ఊరుకుంది కాబట్టే, మళ్ళీ తన బావ తనకు దక్కేలా చేసాడు,” కారులో వెళ్తూ అంది రాధ.


“సరిత చాలా మంచిపనులు చేస్తుందా ఏమిటి? లోకంలో సరితలాంటివాళ్లు ఉంటే లలితలాంటి వాళ్ల జీవితాలు తారుమారవుతాయి. సరితకు తోడు నువ్వూ అలాగే మంచిపనులు చేస్తూ ఉంటావు కదా రాధ?” నవ్వుతూ అడిగాడు కరుణాకర్‌.


“అబ్బా! ఎంత బాగా అర్థం చేసుకున్నారు నన్ను! అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం,” భర్త భుజం మీద తల వాల్చుకుంటూ అంది రాధ.


=================================================================================

                                                       ఇంకా వుంది..


      ప్రేమతీరాలు - పార్ట్ 15 (చివరి భాగం) త్వరలో

=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 

ree



Comments


bottom of page