top of page
Original_edited.jpg

ప్రేమ తీరాలు - పార్ట్ 15

  • Writer: Lakshmi Sarma B
    Lakshmi Sarma B
  • 7 days ago
  • 6 min read

#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

ree

Prema Theeralu - Part 15 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 11/11/2025

ప్రేమ తీరాలు - పార్ట్ 15 - తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఇంజినీరింగ్‌ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమించి, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటాడు. వారికి కపర్ధి అనే బాబు పుడతాడు. కరుణాకర్ రాధను పెళ్లి చేసుకుంటాడు. కాలక్రమేణా లలిత–కరుణాకర్ మధ్య దూరం వస్తుంది. ఫణి అనారోగ్యానికి గురవుతాడు; బ్రెయిన్ ట్యూమర్‌గా తేలుతుంది. ఆపరేషన్ ఖర్చు ఇరవై లక్షలు అవుతుందని డాక్టర్లు చెబుతారు. మేనేజర్ కిరణ్ సహాయంతో ఫణి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. మార్ఫింగ్ ఫోటోలతో లలితను చెడుగా చూపి, ఫణిని మానసికంగా మభ్యపెడుతుంది సరిత. బాబును తీసుకుని లలిత ఇంటినుండి వెళ్ళిపోతుంది. భార్య మాటలు నమ్మినట్లు నటించి, ఫణి ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు కరుణాకర్. ఇద్దరూ కలిసి సరిత చేసిన మోసం బయట పెట్టాలనుకుంటారు. సరితతో రాధలాగా మాట్లాడి ఆ మాటలు రికార్డ్ చేస్తాడు ఫణి. 

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 ప్రేమ తీరాలు పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ తీరాలు పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ప్రేమతీరాలు పార్ట్ 15 (చివరి భాగం) చదవండి.


రాధను చూడగానే అమాంతంగా కౌగిలించుకుంది సరిత. “రాధా! వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. మనవాళ్లందరూ వచ్చారు. మీ వారికి చెప్పి బావను రెడీ చేయమను. నన్ను త్వరగా తయారుచేయి, ముహూర్తం టైం దగ్గరగా వస్తుంది. అబ్బా! ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇదంతా నీవల్లనే జరిగింది రాధ. నీ మేలు జన్మలో మరిచిపోను. రేపు నాకొడుకో బిడ్డనో పుడితే నీ పేరే పెట్టుకుంటాను,” గలగల నవ్వుతూ అంది.


“సరిత, ఇందులో నేను చేసిందేముంది? నీ అదృష్టం మంచిది. నీ బావతో నీ పెళ్లి రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. పద, నిన్ను త్వరగా రెడీ చేస్తాను,” తాను నవ్వుతూ అంది రాధ.


పెళ్లి మండపంలో ఖిన్నుడై కూర్చొని చూస్తున్నాడు ఫణి. “మేము అనుకున్నట్టుగా సమయానికి అందరూ వస్తారా? ఏ మాత్రం ఆలస్యం చేసినా సరిత మెడలో మూడుముళ్లు వేసేంతవరకు నన్ను వదలరు. ఇక్కడ అందరూ సరితకు సంబంధించిన వాళ్లే ఉన్నారు. కిరణ్‌ను నమ్ముకుని ఈ పెళ్లి నాటకం ఆడుతున్నాను. రమ కూడా లలితతో పాటు వాళ్లాయనను తీసుకువస్తానని నోటీసుతో అంది. ఇప్పటివరకు ఎవరు కనిపించడంలేదు…” బిక్కు బిక్కుమంటూ బయటకు చూస్తున్నాడు.


“పెళ్లికూతురుని తీసుకురండి!” పురోహితుడు చెప్పగానే రాధ వెళ్ళి సరితను తీసుకు వచ్చింది. సరిత ముఖం వెయ్యి వోల్ట్‌ల బల్బులా వెలిగిపోతుంది పెళ్లికూతురి ముస్తాబులో. “తాననుకున్నది సాధించాను” అనే గర్వం కూడా తొణికిసలాడుతోంది. “నా స్నేహితురాలి కోసం నేను ఏమైనా చెయ్యగలను” అన్న ధీమా రాధ కళ్ళల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది — అర్థం చేసుకునే వాళ్లకు.


మంత్రాలు చదువుతున్నాడు పురోహితుడు. చేతులు కదిలిస్తూ తంతు చేస్తూనే అతని చూపులు ఎదురుగా కనిపిస్తున్న ద్వారంవైపే ఉన్నాయి — ఎప్పుడెప్పుడు కిరణ్ వస్తాడో అన్న ఆత్రుత.

“అయ్యా… నువ్వు కొంచెం నేను చెప్పింది శ్రద్ధగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇద్దరూ జిలకర బెల్లం తీసుకుని ఒకరి తలమీద ఒకరు పెట్టుకోండి,” ఫణిని గమనిస్తూ పురోహితుడు అన్నాడు నవ్వుతూ.


“అలాగే ఇవ్వండి,” ఇబ్బందిగా చేయి జాపాడు ఫణి.


“బావా! ఏంటిది? నువ్వేదో పరధ్యానంగా ఉన్నావు. ఏమైంది? నవ్వుతూ ఉండొచ్చు కదా,” గుసగుసగా చెప్పింది సరిత.


“ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి…” పురోహితుడు మంత్రాలు మొదలుపెట్టగానే —

“ఆపండి పంతులుగారూ! ఈ పెళ్లి జరగడానికి వీలులేదు!” ఎదురుగా నిలబడి గట్టిగా చెప్పింది లలిత.


“ఎవరమ్మా నువ్వు? ఎందుకు పెళ్లి ఆపమంటున్నావు?” అని పెద్దమనుషులు లలిత దగ్గరకు వచ్చి అడిగారు.


“ఎందుకా? పీటల మీద కూర్చున్న ఆ పెద్దమనిషి నా భర్త. నా భర్తను నాకు కాకుండా చేసి తన మెడలో తాళి కట్టించుకోవడానికి అడ్డదారులు తొక్కిన ఆ దుర్మార్గురాలు — ఆవిడ!” అంది.


“చూడండి, ఆమె మాటలు నమ్మితే ఎన్ని కథలైనా చెబుతుంది. తాను ఒక మోసగత్తె! నన్ను, నా బావను మోసం చేసింది. ఈ పెళ్లి ఆపడానికి వచ్చింది. మెడలు పట్టి బయటకు గెంటండి!” అని సరిత పెళ్లి పీటలపై నుంచే అరచింది.


“అవునవును, ఎవరు ఎవరిని మోసం చేశారు? ఆ పెద్దమనిషినే అడగండి! నిజం ఏమిటో ఆయనే చెబుతారు. ఏమండి, ఇప్పటికైనా నోరు విప్పుతారా లేదా?” ఫణి వైపు చూస్తూ అడిగింది లలిత.


“ఆహా! ఎంత బాగా చెబుతున్నావో! మోసం చేసిందెవరో నీ వీడియోలు ఈ పదిమందిలో పెడితే నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి వెళ్ళగొడతారు. నోరు మూసుకుని వచ్చిన దారిలో వెళ్ళు, లేదంటే పోలీసులను పిలిచి జైలుకు పంపిస్తాను,” బెదిరిస్తూ అంది సరిత.


“నువ్వు పిలిచేదేమిటి? మేమే వచ్చాము నీ కోసం!” అని కిరణ్ నలుగురు ఆడ పోలీసులతో పాటు రవిని వెంటబెట్టుకుని లోపలికి వచ్చాడు.


సరితకు దిమ్మతిరిగిపోయింది. “ఇదేమిటి? పోలీసులు వచ్చారా? నా మోసం బయటపడిందా? ఎవరు చెప్పారు? ఒకవేళ… రాధ?” రాధ వైపు చూసింది — ‘నువ్వు చెప్పావా?’ అన్నట్లు.


రాధకు ముచ్చెమటలు పట్టాయి. “నేను చెప్పలేదు” అన్నట్లు తలూపి అక్కడనుండి జారుకోవడానికి చూసింది.


“రాధ! ఎక్కడికి వెళ్తున్నావు? నీ స్నేహితురాలిని పోలీసులు అరెస్ట్ చేస్తామంటుంటే నువ్వు తనకు సపోర్ట్‌గా ఉండాల్సింది పోయి భయపడుతున్నావెందుకు?” అని అడ్డంగా వచ్చి నిలిచాడు కరుణాకర్.


“అదేం లేదు. నేను ఎక్కడికీ పోవడం లేదు. మంచినీళ్లు తాగడానికి వెళ్తున్నాను. అయినా నేనెందుకు భయపడతానండి?” మాటలు తడబడుతూ అంది రాధ.


“ఏమో! నీ స్నేహితురాలు కదా — ఆమె చేసిన తప్పుల్లో నిన్ను కూడా భాగస్వామిని చేసిందని చెబితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారేమోనని నా భయం.”


“తనేం తప్పు చెయ్యలేదు. తనకు కావలసినది సాధించుకుంది అంతే. ఇందులో తప్పేముంది? పోలీసులు ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు,” ఏమి జరగనట్టే అంది.


“చూడు రాధ… పోలీసుల వరకూ వెళ్ళిందంటే అది మామూలు విషయం కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు పోలీసుల ముందు తెలిసిన విషయం చెబు. అప్పుడు వాళ్లు నీ నిజాయితీకి మెచ్చి నిన్ను ఏం అనరు. నీ స్నేహితురాలు అరెస్టు అయిందనుకో, మనం లాయరుని సంప్రదించి ఆమెను బెయిల్ మీద విడిపిద్దాం. ఏమంటావు?” అని నచ్చజెప్పాడు కరుణాకర్.


“మీరు చెప్పింది నిజమే కానీ నాకు భయంగా ఉంది. నన్ను కూడా జైల్లో పెడతారేమో. మీరు నిజంగా సరితను బయటకు తీసుకువస్తారా? చెప్పండి.”


“నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అసలు విషయం చెప్పు. సరిత తప్పులేదంటే మీకే మంచిది కదా. పద చెబుదువుగానీ,” భార్య చేతి పట్టి తీసుకెళ్లాడు కరుణాకర్.


“ఏమండి, మేము చేసిన దానిలో తప్పులేదని ఎవరు అనరు. నిజానికి మేము చాలా తప్పు చేసాము,” చెబుతుండగానే అందరి ముందుకు తీసుకువచ్చి నిలబెట్టాడు కరుణాకర్.


“ఏం మాట్లాడవేంటి! నీ తప్పు ఒప్పుకుని పద పోలీస్‌స్టేషన్‌కి,” అన్నాడు రవి.


“ఆగండి! జరిగింది నేను చెబుతాను,” అంది రాధ.


“రాధ, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా!” రాధ మాటలకు అడ్డుపడుతూ గయ్యిమనిలేచింది సరిత.


“భయపడుతున్నావా నీ గుట్టు బయటపడుతుందని? నీకేం భయం లేదు. నువ్వు చెప్పమ్మా,” అన్నాడు పోలీస్ రవి.


“సరిత నేను చిన్నప్పటి నుంచీ స్నేహితులం. తను పుట్టగానే వాళ్ల బావ ఇదిగో ఈ ఫణికి భార్యగా పేరు పెట్టుకున్నారు. పెద్దదైన సరిత మనసులో ఫణి మీద మనసు పెట్టుకుంది. ‘బావా తప్పా నా జీవితంలో ఇంకొకరికి స్థానం లేదు’ అనుకుంది. కాని ఈ ఫణి లలితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి సరిత ఆత్మహత్య చేసుకుందామనుకుంది. వాళ్ల నాన్నవాళ్లు గమనించి కాపాడి మంచి సంబంధం చూసి పెళ్లి చేసారు. కానీ సరితకు తన బావ మీద మనసుండడం వల్ల అతనితో కాపురం చెయ్యలేక అతన్ని వదిలేసి ఒంటరిగా బతికింది.


నా జీవితంలో కూడా కరుణాకర్ పరిచయమై పెళ్లి అయింది. అప్పుడు తెలిసింది — సరిత వాళ్ల బావనే చేసుకుంది మా ఆడపడుచు లలితని! కరుణాకర్‌కు లలితంటే ప్రాణం. ఈ విషయంలో నాకు ఆయనతో చాలా గొడవలు జరిగాయి. అదే కడుపుమంటతో సరితకు చెప్పాను. తను ఈ ఊరికి వచ్చింది. నేను, తను కలిసి లలితను ఎలాగైనా ఫణి నుండి విడదీయాలనుకున్నాం.

అప్పుడే కిరణ్ లలితతో సంతోషంగా ఉండడం మా కళ్లకు కనిపించింది. మేము అనుకున్నది అనుకున్నట్టే చేసాము. లలిత ఎటువంటి తప్పు చేయలేదు. తను పవిత్రురాలు… లలిత, నన్ను క్షమించు,” అంటూ లలిత చేతులు పట్టుకుని క్షమాపణ అడిగింది.


“ఫణి, ఇప్పటికైనా మా లలితను నమ్ముతున్నావా?” అడిగింది రమ.


“లలిత, నన్ను మన్నిస్తావా? ఆవేశంతో నిన్ను అనరాని మాటలన్నాను. నీ కంట కన్నీరు రాకుండా చూడాలనుకున్న నేనే నీ మీద చేయి చేసుకుని నిన్ను రంపపోకతకు గురి చేసాను. ఆ క్షణంలో నాలో ఏ భూతం ఆవహించిందో తెలియదు. తరువాత నా పొరపాటు తెలుసుకుని నేను ఎంత కుమిలిపోయానో నీకు తెలియదు. నీ కోసం వెతికినా నీ ఫోన్ పనిచేయలేదు. నువ్వు ఎక్కడికి వెళ్లావో, బాబుతో ఎంత ఇబ్బంది పడుతున్నావోనని బాధపడని క్షణమూ లేదు. బాబు, ఇలారా నాన్నా…” అంటూ లలితను పొదివిపట్టి బాబును దగ్గరకు తీసుకున్నాడు ఆనందంగా.


“ఏమండి, ఇందులో మీ తప్పులేదని నాకు తెలుసు. మనకు కాస్త ఎడబాటు రాసి ఉన్నట్టుంది. అది ఈ సరిత రూపంలో వచ్చింది. పోనీలేండి, మనం కలిశాము చాలు. కిరణ్, వీళ్ళు చేసింది క్షమించరాని తప్పే కాదనను, కానీ ఆడవాళ్లను జైల్లో పెట్టడం సరికాదు. మా వదిన చేసిన పనికి మా అన్నయ్య ఒంటరివాడు కావడం నేను చూస్తూ తట్టుకోలేను. అందుకని వాళ్లను నా కోసం వదిలేయమని చెప్పండి. మీరు మాకు చేసిన మేలు ఎన్నటికీ మరిచిపోను. ఇక నుండి నేను ఇద్దరు తోబుట్టువుల ముద్దుల చెల్లిని అవుతాను,” నవ్వుతూ కిరణ్‌తో చెప్పింది లలిత.


“లలిత, ఎంత గొప్ప మనసమ్మా నీది! నీ జీవితాన్నే నాశనం చెయ్యాలనుకున్న నీ వదినను క్షమిస్తున్నావంటే, నిజంగా నేను నీ అన్నను కావడం నా అదృష్టం. తన మాటలకు భయపడి నిన్ను చూసుకోలేకపోయానే కానీ, నాలో నేను ఎంత కుమిలిపోయానో నన్ను కూడా మన్నించు తల్లి,” లలితను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ అన్నాడు కరుణాకర్.


“కపర్ధి, నేను నీ మేనమామను తెలుసా? ఇకనుంచి మనిద్దరం ఫ్రెండ్స్ కాదు — బంధువులం! నీ అమ్మ ఇక మనపై ఆంక్షలు పెట్టదు. మనిష్టం ఉన్నట్టుగా ఆడుకోవచ్చు, తిరగొచ్చు. అంతేనా లలిత! ఫణి, లలితను బాబును తీసుకొని మా ఇంటికి రావాలి. మా ఇంటి ఆడపడుచుగా మా అమ్మా నాన్నలకు పరిచయం చేస్తాను. లలితకు పుట్టినిల్లు లేదనుకున్నది కదా — తనకు నేనిచ్చే బహుమానం అదే. వస్తావు కదూ లలిత?” ప్రేమగా అడిగాడు కిరణ్.


“మామయ్యా!” అంటూ అమాంతంగా కిరణ్‌ను గట్టిగా పట్టుకున్నాడు కపర్ధి.


“కిరణ్, నువ్వు అలా అడగకూడదు — శాసించాలి! ఆ హక్కు నీకుంది. ప్రతి ఆడపిల్ల కోరుకునే గౌరవం నాకు దక్కింది. ఇంతకంటే ఇంకేం కావాలి?” కిరణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని నవ్వుతూ అంది లలిత.


ఇక మా పని అయిపోయింది అంటూ రవి తో పాటు పోలీసులు వెళ్లిపోయారు. సరిత అవమానభారంతో అక్కడ నిలబడలేక వెళ్ళిపోయింది. అందరూ వెళ్లిపోయారు.


నేను ఒక్కదాన్ని ఒంటరిగా అయిపోయాను. “వీళ్లతో ఉంటేనే నా జీవితం సాఫీగా సాగుతుంది,” అనుకుంటూ మెల్లగా కరుణాకర్ పక్కనకి వచ్చి నిలబడింది రాధ.


=================================================================================

                                                     💐 సమాప్తం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి శ్రీమతి త్రిగుళ్ల లక్ష్మీశర్మ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 

ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page