top of page

తోయిబా

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Thoyiba' New Telugu Story Written By N. Dhanalakshmi

రచన: N. ధనలక్ష్మి


అనుకోకుండా దారిలో ఎదురైనా సమస్యను అధిగమించిన చిన్నారుల కథ....

@@@@@@@@@@@@@@@@@

అమ్మమ్మ ఊరికి సెలవులకి అని వచ్చాడు పది ఏళ్ల బంటి..అదే ఊరిలో ఉండే బన్నీ అనే ఆరేళ్ల పిల్లాడితో స్నేహం కుదిరింది..


బంటి ,బన్నీ కలిసి ఆడుకునేవారు.పెద్దవాళ్ళు ఏమి ఇచ్చినా సరే, పంచుకొని తినేవారు. కలిసిన కొద్ది రోజులకే ప్రాణ స్నేహితలయ్యారు ఇద్దరూ..


ఆ ఊరిలో రామ్ అనే యువకుడు ఉండేవాడు.

అతను పట్నంలో పెద్ద చదువులు చదివి ఉన్నాడు.

ఎన్నో కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చినా కూడా వెళ్ళకుండా తన గ్రామానికి వచ్చి తన నాన్నకి వ్యవసాయ పనుల్లో చేదోడవాదోడుగా ఉన్నాడు.తన తెలివితేటలతో గ్రామాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్ది రాత్రి వేళల్లో ఊరిలోని వారు ఎవరైనా చదవాలని ఆసక్తి చూపిస్తే వారికి చదువు నేర్పించేవాడు. రామ్ అంటే ఆ ఊరిలో అందరికీ ఇష్టం మరియు గౌరవం కూడా..


సాయంకాలం వేళలో పిల్లలందరికీ కథలు చెప్పేవారు..తెలియని ఎన్నో విశేషాలను నేర్పేవారు..పిల్లలందరూ రామ్ అన్నయ్య అంటు ఎనలేని అభిమానం చూపేవారు..అలా బంటి, బన్నీ కూడా చేరారు ఓ రోజు సాయంకాలం...


రామ్ కథని చెప్పడం మొదలుపెట్టాడు


" ఒక అడవికి రాజైన సింహం విచ్చలవిడిగా అడవిలో ఉండే అన్ని జంతువుల మీద పడి దాడి చేసేది. జంతువులు అన్నీ చేరి సింహంతో ఓ ఒప్పందం చేసుకున్నాయి. రోజుకొక జంతువు స్వయంగా ఆహారం అవుతాము అని..


వేటాడే బదులు ఆహారం తన దగ్గరికి వచ్చి చేరుతోంది కదా,, సింహం కూడా ఆనందంగా అంగీకరించింది. అలా రోజుకొక జంతువు స్వయంగా సింహం దగ్గరికి వెళ్ళసాగాయి. అడవిలో జంతువులు తగ్గిపోసాగాయి. ఆ జంతువులలో ఒక్కటైన కుందేలు చాలా బాధ పడసాగింది. సింహానికి బుద్ది చెప్పాలని అనుకుంది. ఓ పథకం ఆలోచించింది.. తన వంతు వచ్చింది. సింహం దగ్గరికి కావాలనే ఆలస్యంగా వెళ్ళింది. సింహానికి కోపం వచ్చి ఆలస్యానికి కారణం అడిగింది.


కుందేలు వినయంగా నమస్కరించి, “అడవిలోకి ఇంకో సింహం వచ్చింది. అడవిలో ఉన్న అన్ని జంతువుల మీద దాడి చేస్తూ ఈ అడవికి తానే రాజు అని ప్రకటించుకుంది. దాని బారి నుంచి తప్పించుకొని వచ్చాను” అని చెప్పింది.


సింహం కోపం తారాస్థాయికి చేరుకుంది.. “నేను ఉండగా ఈ అడవికి ఇంకొకరు ఎలా రాజు అవుతారు? అది ఎక్కడ ఉందో చూపించు. దాని అంతు చూస్తాను” అంటు ఆవేశంగా కుందేలు వెంట పయనం అయ్యింది..


కుందేలు బావి దగ్గరికి వెళ్లి , “ఇంకో సింహం లోపల దాక్కొని ఉంది” అని చెప్పింది.


సింహం కూడా వెళ్లి లోపలకి తొంగి చూసింది.. నీటిలో తన ప్రతిబింబం కనపడగానే కోపంగా గర్జించింది.. లోపలన్న ప్రతిబింబం అలాగే గర్జించింది..


ఆవేశంలో ఉన్న ఎవరైనా సరే, ఆలోచనా విధానాన్ని కోల్పోతారు. ఇక్కడ ఇదే జరిగింది. ఆవేశంలో ఉన్న సింహం అలాగే లోపలకి దూకేసింది.. అలా కుందేలు తన తెలివితేటలతో సింహం బారి నుండి తనని తాను రక్షించుకోవడంమే కాకుండా తన తోటి జంతువులని అందరిని కాపాడింది.."


ఈ కథ విన్న పిల్లలు “కుందేలు ఎలా చేయగలిగిందన్నా?”

అంటే రామ్ " ఈ రోజు మీకు కొత్త పదాన్ని నేర్పిస్తాను అన్నాను కదా పిల్లలూ… ఆ పదం ఏంటో తెలుసా?

"తోయిబా…" అంటే ఆత్మవిశ్వాసం ..

కుందేలుకు ఉన్నది అదే ..తోయిబా...


తను ఉన్న ఆకారాన్ని కానీ, బలాన్ని కానీ తక్కువ అంచనా వేయలేదు. తనని తాను నమ్మింది...

ఇప్పుడు చెప్పండి పిల్లలూ! మనకు ఉండవలసింది ఏంటి?

"తోయిబా " అని ఒక్కసారిగా పిల్లలందరూ అన్నారు...


కథ కంచికి.. పిల్లలందరూ ఇంటికి వెళ్ళారు. కానీ బన్నీ , బంటి ఇద్దరూ వెళ్లకుండా ఆడుకుంటూ జనసంచారం లేని ప్రదేశానికి వెళ్లిపోయారు.. బంటి ఆడుకుంటూ చూసుకోకుండా వెళ్ళిపోతూ బావిలో కాలు జారి పడిపోయాడు..తనకి ఈత కూడా రాదు..


తనని కాపాడమని బన్నీని అడగసాగాడు… బన్నీకి ఏమి చేయాలో పాలుపోలేదు.. చుట్టు పక్కల ఎక్కడ కూడా జనాలు లేరు..


కళ్ళు మూసుకొని రామ్ అన్న చెప్పిన కథని గుర్తుకు తెచ్చుకున్నాడు.


‘తోయిబా’ అనుకుంటూ దగ్గరలో ఉన్న తాడును తీసుకొని లోపలికి విసిరేసి, బంటిని గట్టిగా పట్టుకోమని చెప్పి బన్నీ తన శక్తిని ఉపయోగించి పైకి బలంగా లాగుతూ ఒక అరగంట తరువాత పైకి తీసుకొని వచ్చాడు..


పైకి రాగానే ఒకరిని ఒకరు హత్తుకొని తనివితీరా ఏడ్చారు… ఊరిలోకి వెళ్ళి జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పారు… అందరూ ఆశ్చర్యపోయారు.ఆరేళ్ల పిల్లాడు పదేళ్ల పిల్లాడిని ఎలా కాపాడాడు అని!


అక్కడే ఉన్న రామ్ నవ్వుతూ " ఇంత కష్టమైన పనిని కూడా బన్నీ అంత సులువుగా ఎలా చేశాడో తెలుసా? ఎందుకంటే వారిని ఎవరు కూడా ‘మీరు ఈ పని చేయలేరు, మీకు చేతకాదు’ అని ఎవరూ ఆపలేదు. బన్నీ తనని తాను నమ్మాడు. అందుకు అది సాధ్యపడింది."


“మీరు చెప్పిన తోయిబా మంత్రం వల్లే ఇది సాధ్యపడిం”దని చాలా ఆనందంగా బన్నీ చెప్పాడు.


అక్కడే ఉన్న గ్రామస్థులు “అంతా ఏంటి?” అన్నారు…


" తోయిబా..... ఆత్మవిశ్వాసం అని చెప్పారు అక్కడే ఉన్న పిల్లలంతా ఏకకంఠంతో....


ఓ చల్లని సాయంత్రం రామ్ కథలు చెప్తుంటే ఒక్కసారిగా వర్షం జోరున కురిసింది..పిల్లలంతా

సైలెంట్ గా ఉంటే, రామ్ కాగితపు పడవ చేసి వదిలిపెట్టాడు.. అది చూసిన పిల్లలు కాగితపు పడవలు చేసి వదులుతున్నారు… బంటి , బన్నీ కూడా అలాగే చేసి వదులుతూ ఆనందపడతున్నారు.


రామ్ అన్నా.. మీరు అంటుంటారు కదా.. మనసు పెట్టి చూస్తే ప్రతిది మనకి నేర్పిస్తుందని … ఈ పడవ ఏం నేర్పిస్తుంది?” అని అడిగాడు బంటి..


“మీరు పడవ వదిలారు. అది నేరుగా పోతుంది… ఏదైనా గాలి వస్తే పడవ అటు ఇటు కదులుతూ మళ్ళీ సరైన పొజిషన్ కి చేరుతుంది. అవునా కాదా!??”


“అవును అన్నయ్య …”


“మన జీవితంలో కూడా అంతే! ఎన్నో అనుకోని ఒడిదుడుకులు వస్తుంటాయి.. వాటినన్నిటినీ ఎంతో నేర్పుగా, యుక్తితో పరిష్కరించుకోవాలి తప్ప భయపడి ఆగిపోకూడదు...


మనం ఉన్న ఈ చెరువు గట్టు నుండి ఇంకోగట్టుకు పోవాలంటే పడవ ఎక్కుతాము.. అప్పుడు పడవ సరిగ్గా ఉందా లేదా ఒక్కటికి పది సార్లు చెక్ చేస్తాము. అలాగే మనం జీవితంలో పరిచయమై ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలి , నడుచుకోవాలి..

ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. అలా అని ప్రతి ఒక్కరినీ అనుమానించకూడదు.. వారితో ఫ్రెండ్షిప్ చేసి, వారి గురించిన అవగాహన రావాలి... ఎవరో చెప్పింది విని జడ్జ్ చేయకూడదు…”


“వావ్..సూపర్ అన్నయ్య... మీ లాగే మేము కూడా అన్నిట్లో మంచిని చూసి నేర్చుకుంటాం…”


బంటి కూడా ఎన్నో విలువైన విషయాలను నేర్చుకొని, ‘ఇంక ఎప్పుడు సెలవులు వచ్చినా ఈ గ్రామానికి తప్పకుండా వస్తాను’ అని తన మిత్రులందరితో బాధగా వీడ్కోలు చెప్పి తన ఊరికి పయనం అయ్యారు...


"నేను ఈ ఊరిని , బన్నీని, రామ్ అన్నని ముఖ్యమైన తోయిబా మంత్రాన్ని ఎప్పటికీ మరచి పోను” అని తన మనసులో అనుకున్నాడు బంటి.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.





29 views0 comments
bottom of page