top of page

సంక్రాంతి కథల పోటీ ఫలితాలు (పూర్తి వివరాలతో)



మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీకి అసంఖ్యాకంగా తమ రచనలను పంపిన ప్రియమైన రచయితలకు,ఆ కథలను ఓపికగా చదివి,తమ అభిప్రాయాలను మాకందించిన ప్రియాతి ప్రియమైన పాఠకులకు మా ధన్యవాదాలు.


మా ఊహకు మించిన రచనలు రావడమే కాకుండా దాదాపు ప్రతి కథ బహుమతికి అర్హమయ్యే స్థాయిలో ఉండటం మమ్మల్నీ,న్యాయ నిర్ణేతలనీ సంభ్రమానికి గురి చేసింది.


కానీ ఫలితం లేని పోటీకి అర్థం లేదనీ, ఫలితాల ప్రకటన మా బాధ్యతనీ తెలుసు కాబట్టి, మా న్యాయ నిర్ణేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలకు పాఠకుల ఆదరణ, అభిప్రాయాలూ జోడించి ఫలితాలు ప్రకటిస్తున్నాం.


ఇక బహుమతుల విషయంలో స్వల్పమైన మార్పులు చేశాం.


మొదటి,రెండవ, మూడవ బహుమతులలో ఏ విధమైన మార్పూ లేదు.


అయిదు ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కటి రూ : 500 /- అని గతంలో ప్రకటించాము.


ప్రస్తుతం 'ప్రోత్సాహక బహుమతులు' పేరును 'ప్రత్యేక బహుమతులు' గా మారుస్తున్నాము.


అయిదు బహుమతుల స్థానంలో పదిహేను ( 15 ) కథలకు ప్రత్యేక బహుమతులు అందిస్తున్నాము.


ఒక సభ ఏర్పాటు చేసి,విజేతలకు బహుమతులు అందించాలని మొదట భావించాము.


కానీ కోవిడ్ కారణంగా రచయితలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో బహుమతులను నేరుగా వారి ఖాతాలకు జమ చేయాలని భావిస్తున్నాం.


బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలు కూడా మెయిల్ ద్వారా పంపిస్తున్నాము.

విజేతలందరికీ వ్యక్తిగతంగా మెయిల్ చేస్తున్నాము.


బహుమతుల ప్రకటన :


(కథ పేరు మీద క్లిక్ చేస్తే నేరుగా ఆ కథను చేరుకోవచ్చు)


ప్రధమ బహుమతి పొందిన కథ : అమృతత్వం

రచన : వంజారి రోహిణి


ద్వితీయ బహుమతి పొందిన కథ : ఈ జీవితం నీది

రచన : సరస్వతి కరవది


తృతీయ బహుమతి పొందిన కథ : ఎదవ బతుకు

రచన : వసుంధర



ప్రత్యేక బహుమతి పొందిన కథ : 1. పారిజాతం

రచన : బలభద్రపాత్రుని ఉదయ శంకర్


ప్రత్యేక బహుమతి పొందిన కథ : 2. ఉండిపోరాదే నాన్నా ! ?

రచన : కె .బి.కృష్ణ



ప్రత్యేక బహుమతి పొందిన కథ : 3. ముట్టు శయ్య

రచన : కమల పారిజాత

ప్రత్యేక బహుమతి పొందిన కథ : 4. గంగమ్మ జాతర

రచన : ఓట్ర ప్రకాష్ రావు



ప్రత్యేక బహుమతి పొందిన కథ : 5. నిర్దోషులు నీరాజనాలు

రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి



ప్రత్యేక బహుమతి పొందిన కథ : 6 . జీవనయానం

రచన : కోటమర్తి రాధాహిమబిందు



ప్రత్యేక బహుమతి పొందిన కథ : 7. మనస్సు మెచ్చిన మగువ..!!

రచన : లక్ష్మి కుమార్


ప్రత్యేక బహుమతి పొందిన కథ : 8 . సహధర్మచారిణి

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి


ప్రత్యేక బహుమతి పొందిన కథ : 9 . ఊహల రెక్కలు

రచన : పోరాల శారద



ప్రత్యేక బహుమతి పొందిన కథ : 10 . గృహమేగా స్వర్గసీమ

రచన :రవి కుమార్ దేశరాజు


ప్రత్యేక బహుమతి పొందిన కథ : 11 . ఈ నేల మనది... ఈ ఊరు మనది

రచన : P. V. శేషారత్నం


ప్రత్యేక బహుమతి పొందిన కథ : 12. మౌన ఛేదన

రచన : సింహ ప్రసాద్


ప్రత్యేక బహుమతి పొందిన కథ : 13. ఉత్తరాలు

రచన : కప్పల సునాధ్


ప్రత్యేక బహుమతి పొందిన కథ : 14. పట్టుపరికిణీ -ఓణీ

రచన : యామినీ(తిన్ననూరి) అశోక్



ప్రత్యేక బహుమతి పొందిన కథ : 15. మమతలూ - అనుబంధాలు

రచన : యశోద పులుగుర్త



పై విజేతలందరికీ వ్యక్తిగతంగా తెలియజేయడంతో పాటు మెయిల్ ద్వారా ప్రశంసా పత్రాలు పంపబడతాయి.

ఈ ప్రశంసా పత్రాలు ప్రింట్ చేసి లామినేట్ చేసుకోవడానికి వీలుగా ఆకర్షణీయంగా రూపొందించాము.

బహుమతులు పొందక పోయినా ప్రచురింపబడ్డ మిగిలిన కథలను కూడా 'మంచి కథలు' గా భావిస్తూ ఆ కథలు పంపిన రచయితలను అభినందిస్తున్నాము.

వారికి నగదు బహుమతి ఇవ్వలేకున్నా , వారు కోరితే ప్రశంసా పత్రం పంపుతాము .


కథలను షేర్ చెయ్యాలి

రచయితలు మంచి కథలను వ్రాయడమే కాదు.వాటిని ఎక్కువమంది చదివేలాగా చూసుకోవాలి.మీ కధకు ఓ యాభై వ్యూస్ ఉన్నాయంటే ఓ పదిమంది మాత్రమే కథను పూర్తిగా చదివి ఉంటారు.ఈ రోజుల్లో పుస్తక పఠనం పైన ఆసక్తి తగ్గుతోంది. కాబట్టి మీరు వ్రాసిన రచనలను సామాజిక మాధ్యమాల ద్వారా బంధువులకు,మిత్రులకు,అభిమానులకు షేర్ చెయ్యాలి.వారి అభిప్రాయం తెలియజేయమని కోరాలి.

బహుమతులు మీరూ ప్రకటించవచ్చు,

మీకు ఇష్టమైన వారి స్మృత్యర్థం వారి పుట్టిన రోజున గానీ,వర్ధంతి రోజున గానీ రచనలకు అవార్డులు బహుకరించవచ్చు.బహుమతుల ఎంపిక మీదే.మేము కేవలం సహాయ సహకారాలు అందిస్తాము.వివరాలకు ఎడిటర్ ను సంప్రదించండి.




సమీక్ష పంపండి, బహుమతులు గెలవండి.

బహుమతులు పొందిన మొత్తం 18 కథల గురించి మీ సమీక్షను ఐదు పేజీలకు మించకుండా వారంలోగా పంపండి. ఉత్తమమైన సమీక్షకు రూ : 250 /- ,మరో మూడు సమీక్షలకు రూ : 116 /- చొప్పున బహుమతులు అందజేస్తాం.మీ సమీక్షలను story@manatelugukathalu.com కు పంపండి.


ఈ వారం ఉత్తమ కథ

ప్రతివారం , ఆ వారంలో ప్రచురింపబడ్డ కథలనుండి ఒక కథను 'ఈ వారం ఉత్తమ కథ' గా ఎంపిక చేసి రూ: 250 /- బహుమతిగా అందజేస్తాము.ఈ బహుమతులు 15 -02 -2021 నుండి ప్రారంభం అవుతాయి.


పుస్తక సంకలనం

మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురితమయ్యే కథలన్నిటిపై పూర్తి హక్కులు మాకే ఉంటాయి. బహుమతి పొందిన కథలను గానీ, ఇతర కథలనుగానీ కథా సంకలనంగా పబ్లిష్ చేయాలనుకొనే వారు editor@manatelugukathalu.com ను సంప్రదించండి.


వ్యాపార ప్రకటనలు

మనతెలుగుకథలు.కామ్ లో మీ వ్యాపార ప్రకటనలకు admin@manatelugukathalu.com ను సంప్రదించండి.

సాహితి సంస్థలకు సంబంధించిన పోస్ట్ లు,సాంస్కృతిక కార్యక్రమాలకు, పోటీలకు సంబంధించిన పోస్ట్ లు ఉచితంగా ప్రచురిస్తాము.

ఇతర వెబ్ సైట్స్/బ్లాగ్స్ కు సంబంధించిన ప్రకటనల కోసం admin@manatelugukathalu.com ను సంప్రదించండి.




1,067 views2 comments
bottom of page