top of page

సంసారీ సుఖీ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

https://youtu.be/TQ6tqAiReow

'Samsari Sukhi' New Telugu Story Written By Bhagavathula Bharathi

రచన: భాగవతుల భారతి


మన ఆలోచనలకూ తగ్గట్టుగానే మనం పొందే ఫలితాలు ఉంటాయని తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారు రచించారు.

న కాష్ఠే విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే

భావేహి విద్యతే దేవో తస్మాత్‌ భావోహి కారణం

"దేవుడు చెక్కలోనూ లేడు,రాతిలోనూ లేడు మట్టిలోనూ లేడు. మన భావనలోనే ఉన్నాడు... దేవుడు అనే మంచి భావనకు మనసే కారణం కాబట్టి... భావనలు సక్రమంగా చేయండి. మంచి భావనలు మంచి ఫలితాలనే ఇస్తాయి. ఈరోజు కి స్వస్తి... " అంటూ ప్రవచనం ముగించి లేచాడు … త్రిలోచన బ్రహ్మచారి.

"నేను ఐ. ఎ. యస్ కి ప్రిపేర్ అవుతున్నాను. నన్ను ఆశీర్వదించండి అయ్యగారూ?! "అంటూ వచ్చిన ఆమెను తేరిపార చూసి 'విజయీభవ' అని ఆశీర్వదించాడు త్రిలోచన బ్రహ్మచారి.

ఆయన చూసిన చూపుకు ఆమెకు భయంవేసి.. మరోసారి నమస్కరించి వడివడిగా వెళ్ళిపోయింది. ఆ వయసు ఆడపిల్లలు ఎవరుకనిపించినా త్రిలోచన బ్రహ్మచారికి మనసు కకావికలం ఐపోతుంది. కారణం తెలీనివారికి భయమేగా!

ప్రతి ఊరూ తిరుగుతూ ప్రవచనాలు ఇచ్చే త్రిలోచన బ్రహ్మచారి... బ్రహ్మచారేం కాదు.

"సద్గుణా నీకు ఆడపిల్లరా … ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టినట్లే.... మహాలక్ష్మి పుట్టింద"ని....ఇంట్లో అందరూ ముచ్చట పడిపోయారు,....

మరుసటి ఏడు "సద్గుణా నీకు మళ్ళీ ఆడపిల్లేరా...." అనగానే,

"ఇక ఆపుదాం" అన్నాడు.

"ఈ సారి మగపిల్లాడు కావచ్చుగా "

మగ పిల్లాడి మీద ఆశతో ,ఇంట్లోవాళ్ళ ఉవాచ.

రెండేళ్ళ తర్వాత ....

"గుణా! కవలపిల్లలురా! ఇద్దరూ ఆడపిల్లలే " చెప్పారు సద్గుణకి.

"నా జీవితం సర్వనాశనం… ఈ కవలపిల్లలను ఎవరికైనా , పిల్లలు లేనివాళ్ళకు ఇచ్చేసి, మనం మగపిల్లవాడికోసం ప్రయత్నించుదాం .....చుట్టాలంతా నలుగురు ఆడపిల్లల తండ్రి అని గేలిచేసి నవ్వుతారేమో" బాధ పడిపోతూ అన్నాడు.

"ఏమండీ మనకు నిజమైన శత్రువులు మన ఆలోచనలేనండీ ! నేనూ ఏదోక పని చేసి కష్టపడతాను. మీరెలాగూ వ్యవసాయమేగా.. చక్కని పంటలు పండించుదాం" అంది భార్య.

"కానీ ఇంత సంసారాన్ని ఎలా నెట్టుకురావాలీ? నా వల్లకాదు..." మానసికంగా కుంగిపోయాడు సద్గుణ.

ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో హరికథలూ, బుర్రకథలూ చెప్పటానికి… కళాకారులు వచ్చేవారు.

ఓ హరికథా పితామహుడు వచ్చి... కథచెబుతూ...

"పెక్కుసంతానం పెక్కుదుఖం...అందులో ఆడపిల్లలయితే మరీనూ, ఆబాధ. వర్ణనాతీతం... " అంటూ మెుదలుపెట్టాడు.

ఆ మాటలు సద్గుణ మీద చాలా ప్రభావం చూపినాయ్ .... కథలన్నీ ఐపోయాక..

"అయ్యా! మీరు సన్యాసం స్వీకరించారా? " అనిఅడిగారు..అంతా... ఆ పితామహుణ్ణి.

ఆ హరికథా పితామహుడు... విషయం దాటేస్తూ.... "అట్టే.. అట్టే.. పుచ్చుకున్నట్టే

సంసారీ దు:ఖ్ఖీ, సన్యాసీ సుఖీ " ..అంటూ వెళ్ళిపోయాడు.

ఇంకేం.. అసలే (మనసు) కోతి . అందులో కల్లు తాగింది. మళ్ళీ నిప్పులు తొక్కింది. ఇంతలో యజమాని వచ్చి చెవులుమెలేసాడు... ఇక ఈ కోతి మర్నాడే ఎవరికీ చెప్పకుండా పలాయనం చిత్తగించి, త్రిలోచన బ్రహ్మచారి గా మారాడు.

సద్గుణ పేరు మారింది... వేషం మారింది... మరి మనసూ? కానీ తర్వాత తెలిసింది సన్యాసం కూడా అనుకున్నంత ఈజీ కాదని, చాలా కష్టమని. వేళకి కూడుండదు. సత్రం భోజనం మఠంనిద్ర.

ఎవరైనా పిలిస్తే భోజనం, లేదంటే?... ప్రవచనాలు అలవాటుచేసుకుని, భక్తులిచ్చే కానుకలతోనే కడుపు నింపుకోవటం...

వానాకాలం వాన... శీతాకాలం చలి...

ఇంట్లో అయితే రోజల్లా పనిచేసినా ... సాయంత్రం రెస్ట్... భార్య సేవలూ..

మళ్ళీ ఇంటికి వచ్చేద్దామన్నా, తనను చేరదీసిన గురువుగారు వదల్లా...

ఇల్లు వదిలి ఇప్పటికి పాతికేళ్ళు. ప్రపంచంలో అన్నిరంగాలలో చాలా మార్పులు వచ్చాయ్.

ముఖ్యంగా ఆడపిల్లలలో..

పేర్లు తెలీవుగానీ.. ఆమె ఎవరో బరువులెత్తి పతకం సాధించింది... పరుగులరాణి ఒకామె. తుపాకీ పేల్చటంలో ఓ ఆమె. చదరంగం పోటీల్లో ఆమె ఎవరో... ప్రపంచ అందాల పోటీ లో కిరీటం...అందరూ ఆడపిల్లలే

భరతదేశం కీర్తికిరీటంలో వజ్రాల్లా మెరుస్తున్నారు..పోలీసులుగానూ .. లాయర్లుగానూ , కలెక్టర్లుగానూ ఇంకా అన్నింటా ...మరి నాపిల్లలు ఏమయ్యారో?!

ఏమండీ! అసలైన శత్రువులు మన ఆలోచనలేనండీ ...అని భార్య మాటలు చెవిలో మోగుతున్నాయ్.

ఇప్పుడు ప్రవచనాలకు తిరిగే ఓపిక తగ్గింది.

విశ్రాంతి కి గూడేదీ? మరి తిండి ఎట్లా?

అందుకే స్వగ్రామం వచ్చాడు. పాతికేళ్ళవయసున్న ఆడపిల్లలను, వాళ్ళు భయపడేటట్లుగా.. పట్టిపట్టి చూస్తున్నాడు,

పోల్చుకుందామని...

బంధానికైనా మోక్షానికైనా మనసేగా కారణం...

పాతికేళ్ళలో ఊరు చాలా మారింది. గుళ్ళో ప్రవచనాలు చెబుతూ, మధ్యమధ్య తన ఇంటివైపు వెడుతున్నాడు. వచ్చేస్తున్నాడు ఎవరూ గుర్తుపట్టకుండా...

కానీ ఆ దూరంగా చూస్తుంటే యింటి తలుపులు ఎప్పుడూ మూసే ఉంటున్నాయ్. ఏంచేయాలి? ఎవరినడగాలీ? రెండు రోజులాగి ఆ ఇంటి ముంగిట తచ్చాడాడు. ఇల్లు తాళంవేసి ఉంది. మరివీళ్ళూ?

పక్కింట్లోంచి యజమాని బయటికివచ్చి, సన్యాసిని చూసి వినయంగా నమస్కరిస్తూ

"అయ్యా! రాత్రి మీ ప్రవచనంవిన్నాను. మీలాంటి వారు నా ఊరురావటం మా అదృష్టం...గుళ్ళో మీకు సౌకర్యంగా లేదా? ఇల్లు కావలెనా ?" అడిగాడు.

"అదీ.... ఈ "...ఆ ఇంటికేసి చూస్తూ నసిగాడు.

"ఆ యిల్లు.... మాళవికమ్మది. అబ్బో మా దొడ్డ యిల్లాలు. భర్త ఎటో పోయాక నలుగురు ఆడపిల్లలలనూ, తనే కష్టపడి సాదింది. పిల్లలూ మహా బుద్దిమంతురాళ్ళు. తల్లి చెప్పినట్లే విన్నారు. ఎంత ప్రయోజకు లయ్యానుకుంటున్నారూ?!

పెద్దమ్మాయికి ఢిల్లీ గవర్నమెంట్ లో.. ప్రధానమంత్రి ముఖ్య సలహాదారుగానో... ఏదో ఉద్యోగంట. అందరూ రెండేళ్ళ క్రితమే ఢిల్లీ కి వెళ్ళిపోయారు.

మిగతా ముగ్గురూ కూడా కలెక్టర్ స్థాయి ఉద్యోగాలే అనుకుంటున్నారు. అందరూ పెద్దపెద్ద ఉద్యోగాలేట. ఆ తల్లి కడుపు చలవ. అందరూ ఆడపిల్లలే అని ఆతండ్రి వదిలేసి పోయాట్ట. వాడికిఅదృష్టం లేదు. " అని నుదుటిమీద బొటనవ్రేలితో అడ్డంగా రాసాడు. నుదిటిగీత అన్నట్లుగా.

"మరి" నసిగాడు త్రిలోచన బ్రహ్మచారి ఉరఫ్ సద్గుణ.

"కావాలంటే మీరు ఇందులో ఉండవచ్చు ఎవరికైనా అద్దెకు ఇమ్మన్నారు తాళంచెవి నాదగ్గరే ఉంది. కావాలంటే మనిషిని మాట్లాడి దుమ్ము ధూళి దులిపిస్తా... వస్తున్నా ఉండండి. " అంటూ తాళంచెవిని తెచ్చిచ్చాడు. "కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా.. మీ లాంటి వారు తమఇంట్లో దిగారని తెలిస్తే వాళ్ళూ సంతోషిస్తారు" అన్నాడు.

ఎక్కడనుండి బయలుదేరానో మళ్ళీ అక్కడికే వచ్చాగా!? శత్రువులు బయట ఎక్కడినుండో రారు. నా ఆలోచనలే నాశత్రువులై… బాధ్యతలనుండి తప్పించి నన్ను పరుగెత్తించి ...మళ్ళీ ఇక్కడికే పరుగెత్తించినాయ్....

హృదయభారంతో… తాళం తీసుకుని లోపలికి వెళ్ళాడు సద్గుణ ఉరఫ్ త్రిలోచన బ్రహ్మచారి .

భార్యాబిడ్డల ఫొటోలు... పెద్దయ్యాక దిగినవేననుకుంటా?!

ఓ ఆప్యాయతల కుంచెతో మమతల రంగులద్దిన సప్తవర్ణాల వాసంత సమీరాల గాలి, శరీరాన్ని తాకి,

ఈ గాలి చెప్పింది నాకు, నేనెెవ్వరో ఏమిటో.. ఇన్నాళ్ళ లోటేమిటో … మనసు బాధతో మూలిగింది.

ఢిల్లీకి సామానేం తీసుకుపోలా! ముఖ్యంగా దుమ్ము కొట్టుకుపోయిన ఆ మంచంపై వ్రాలి ...

సంసారీ సుఖీ.. సన్యాసీ దు:ఖ్ఖీ ..

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి

నా వాళ్ళు కన్నతల్లి లాంటి, ఈ ఊరికి, నాలాగానే ఏదో ఓరోజు తప్పకుండా వస్తారు. అప్పటివరకూ....నలుగురు పిల్లల తల్లి ఒడిలాంటి ఈ ఇంట్లోనే సేదతీరాలీ!

ఓ క్షణం కళ్ళుమూసుకున్నాడు సద్గుణ, తన్మయత్వంతో .

$$$$$$$$$$

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

హమ్మ నా అత్తో

కొత్త తరం

కొండచిలువ

శకుంతల వదిన

నిన్నా మెున్నటి పూవు

అగోచర

అమ్మ

ఎప్పటికెయ్యది?

సుక్కి

పరిధి

కాలు మెుక్కుతా

ఏమంటారూ?

నాన్న వీలునామా

నామకరణం

ప్రేమా?!

స్నేహలతలు

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


84 views1 comment
bottom of page