top of page

అఖిల్

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Akhil' New Telugu Story Written By N. Dhanalakshmi

రచన: N. ధనలక్ష్మి




చిన్నపిల్లల మనసు చాలా స్వచ్ఛమైనది. వాళ్ళు ఎటువంటి కల్మషం లేని వారు. అలాంటి స్వచ్ఛమైన మనస్సు కలవాడు అఖిల్. అఖిల్ తన స్వచ్ఛమైన మనసుతో

అందరిలో ఎలా మార్పుని తీసుకుని వచ్చారో తెలియజేసే కథ..


ఓ పట్నంలో అఖిల్ అనే అబ్బాయి 5వ తరగతి చదివేవాడు. అన్నిటిలో ముందుడేవాడు.

అఖిల్ అంటే చరణ్ సర్ కి చాలా ఇష్టం. ఎందుకంటే

అల్లరి చేయకుండా చెప్పిన మాట వింటాడు. అలాగే చెప్పిన పనిని ఎటువంటి తప్పులు లేకుండా చేయడమే కాకుండా కొత్తవి నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపేవాడు.

భోజన సమయంలో తన మిత్రులతో కలిసి తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. అఖిల్ తాను తెచ్చుకున్న అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు.

అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గా తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు. మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరి పారేస్తుంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు. ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని ఉన్నా, వాటిని కూడా తినేవాడు.

అది చూసి మిగతా పిల్లలు అఖిల్ ను ఎగతాళి చేసేవారు. “అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకు కూడా వదలకుండా తింటాడు" అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ ఉండేవాడు.


చరణ్ సార్ ఇదంతా విన్నాడు. ఓ రోజు అఖిల్ ద్వారానే అలా ఎందుకు చేశాడో పిల్లలకి తెలియచేయాలి అనుకున్నాడు...


చరణ్ క్లాస్ అంటే పిల్లలకి ఎంతో ఇష్టం.. పాఠాలను ఆసక్తి కలిగించేలా చెప్పడంతో పాటు తెలియని ఎన్నో విషయాలను చెపుతారని..


"కన్నా! ఈ రోజు మనం క్లాసెస్ వద్దు. సరదాగా కాసేపు మాట్లాడుకుందాం” అన్నారు...


“అలాగే సర్” అన్నారు పిల్లలు ఎంతో ఆనందంగా ...


“అఖిల్.. ఇటు రా కన్నా!” అంటు తనని పిలిచి.. “మన అఖిల్ అన్నిట్లో చురుకుగా ఉంటాడు. ప్రతి రోజూ మీతో పాటు నేను కూడా గమనించాను. మన అఖిల్ తన లంచ్ బాక్స్ లో ఉన్న ఫుడ్ ను కొంచం కూడా వేస్ట్ చేయకుండా చాలా క్లీన్ గా తింటాడు..


నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా ఇంత చక్కగా తింటున్నావు కదా! మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా, నీకు బాధ అనిపించదా? "


" సర్! వీరంతా నా ఫ్రెండ్స్. ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేమి బాధలేదు. వాళ్ళంతా నా ఫ్రెండ్స్ సర్.. ఇప్పుడు తగవులాడుకున్నా కొద్ది సేపటి తరువాత కలిసిపోతాము. అందుకే వారిని ఏమీ అనను... సార్ మీరే అన్నారు గా.. ‘ఎదుటివారిని మాటలతో బాధ పెట్టడం తేలికే కానీ సంతోష పట్టడం చాలా కష్టం’అని.. నేను అదే ఫాలో అవుతాను సర్.. ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా సర్?”


“చెప్పు అఖిల్”


“అలా తినడం అన్నది నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం.


" అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది. వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి తెస్తాడు.. ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా నా భోజనంలో ఉంది. అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!


అంతేకాదు. ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు. మీరు చెప్పారు కదా సర్.. బియ్యపు గింజ పండించడానికి 150 రోజుల పడుతుందని.. అలాంటప్పుడు నేనెలా ఆహారాన్ని వృథా చేయగలను సర్… రైతు కష్టాన్ని నేను అవమానపరిచినట్లే కదా! అందుకే నేను ఎవరు నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను”


“ఎంత గొప్పగా ఆలోచించావు అఖిల్..”


“సర్! నా ఈ ఆలోచనకు కారణం రాజు సర్.. తనకి మీ అభినందనలు చెందాలి”


“ఎవరు ఈ రాజు అఖిల్? మన స్కూల్ లో ఈ పేరుతో ఎవరు లేరు గా!?


“సర్! తను మన స్కూల్ కాదు సర్.. తానెవరో చెపుతాను వినండి సర్..


నేను కూడా అందరిలా ఒక్కప్పుడు ఆహారాన్ని వృథా చేస్తుండేవాడిని. కానీ ఓ సంఘటన నాలో మార్పుకి కారణమైంది సర్..


ఓ రోజు నేను స్కూల్ కి వస్తున్న దారిలో ఓ అబ్బాయి నా అంత ఏజ్ ఉన్నాడు.. చెత్త కుప్పల వద్ద ఎదో ఏరుతున్నాడు.. తను వెతికినది కనపడక ఏడుస్తున్నాడు.. నేను తన వద్దకు చేరుకొని ఏమి వెతుకుతున్నవని అడిగాను.. అప్పుడు ఆ అబ్బాయి ఏడుస్తూ తాను తిని రెండు రోజులు అయిందని, అందరు తినగా మిగిలిన ఫుడ్ ను చెత్త కుప్పలో వేస్తారుగా, అదే వెతుకుతున్నానని చెప్పాడు..


నాకు చాలా బాధగా అనిపించింది. నా లంచ్ బాక్స్ తనకిచ్చి తినమన్నాను సర్.. తను తీసుకొని తిన్నాడు. మీకు తెలుసా సర్.. ఆ అబ్బాయి తిన్న తర్వాత నాకు థాంక్స్ చెప్పాడు. నాకెందుకో చాలా సంతోషంగా అనిపించింది.


ఎంతోమందికి రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది. నా తల్లిదండ్రులపుణ్యమని. అమ్మ ఎప్పుడూ చెపుతుంది ఆహారాన్ని వృధా చేయకూడదని.. దాని అర్థం ఆ రోజు తెలిసింది సర్...


రాజుకి ఎవరు లేరని తెలిసింది..మా ఇంటికి పిలుచుకొని వెళ్ళాను. నాన్నగారికి రాజు విషయం చెప్పాను..


రాజును ఓ ఎన్జీఓ లో జాయిన్ చేశారు. తను ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నాడు సర్.. నేను, నాన్న, అమ్మ అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాము..


అమ్మ చెప్పింది సర్… మనం ఫంక్షన్ కి ఎక్కడ వెళ్ళిన సరే.. ఎంత తినగలిగితే అంతే పెట్టుకోమని, వృథా చేయకూడదని చెప్పారు సర్! అదే పాటిస్తున్న సర్..”


అఖిల్ చెప్పిన మాటలకు , అతని సమాధానానికి చరణ్ సర్ తో, పిల్లలంతా కరతాళ ధ్వనులతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..


స్నేహితులంతా తనిని ఎగతాళి చేసినందుకు క్షమాపణ చెప్పారు…

“పర్లేదు రా.. మనమంతా ఫ్రెండ్స్” అంటు హగ్ చేసుకున్నాడు అఖిల్


పిల్లలు మన అఖిల్ చెప్పినట్టుగా మనం కూడా ఇకపై ఆహారం వృథా చేయకుండా ఉందాము. సరేనా పిల్లలు.. ఏమి అంటారు..”


“ఒకే సర్.. అలాగే చేద్దాం సర్…”


“మేము కూడా ఫంక్షన్ కి ఎప్పుడైనా వెళ్ళితే మేము ఎంత తినగలిగితే అంతే పెట్టుకుంటాము సర్.. మా పుట్టినరోజు మాకు అందరిచ్చిన అమౌంట్

సేవ్ చేసుకొని ఆహారానికి కావాల్సిన సరకులను కొనుక్కొని ఎన్జీఓలకు, అనాధ ఆశ్రమాలకు ఇస్తాము సర్..”


“మంచి ఆలోచన కన్న...నేను కూడా ఇంకా పై నా శాలరీ లో కొంతభాగం ఎన్జీఓల కోసం సేవ్ చేస్తాను. నెలకి ఒక్కసారి అందరం కలిసి వెళ్దాం.. కొందరి ఆకలి అయిన మనం తీర్చినా వారు అవుతాము....”


“చరణ్ సర్.. మీరు సూపర్” అంటు పిల్లలందరూ క్లాప్స్ కొట్టారు...

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.




21 views0 comments

Comments


bottom of page