top of page

నా డిటెక్టివ్ అమ్మ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Na Detective Amma' New Telugu Story Written By N. Dhanalakshmi


రచన: N. ధనలక్ష్మి


ఈ ప్రపంచములో తల్లి ప్రేమను మించినది మరొకటి లేదు. ఇంకోటి ఉండదు.. బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలరు, ఎంతటి సాహసం అయినా చేయగలరు, ఎంతటి తెగింపు అయినా చూపగలరు. ఏ ప్రేమకైనా అంతం అనేది ఉంటుంది కానీ అమ్మ ప్రేమకి, అనురాగానికి ఎప్పటికీ అంతం అనేది ఉండదు. కొడుకు కోసం డిటెక్టివ్ గా మారిన ఓ అమ్మ కథ...

ముకుంద్, కృష్ణవేణి ల ముద్దుల సంతానం త్రిలోక్..

ముకుంద్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటాడు..

కృష్ణ వేణి ఏమో ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ, భర్తకి చేదోడు వాదోడుగా ఉంటుంది.

ఉన్న వాటిలో ఎంతో సంతోషంగా ఉంటారు..

త్రిలోక్ ఐదో తరగతి చదువుతుంటాడు..

అన్నిటిలో ముందుండే వాడు.

స్కూల్ నుండి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి, వాళ్ళమ్మతో కలిసి దగ్గరలో ఉండే పార్క్ కి వెళ్ళి ఆడుకునే వాడు..

అలా ఆడి తిరిగి ఇంటికి చేరుకొని ఇచ్చిన స్కూల్ వర్క్ ఫినిష్ చేసేవాడు..

అలా ఒక్కసారి పార్క్ కి వెళ్ళి ఆడుతుంటే తన ఫ్రెండ్ విక్కి సైకిల్ తొక్కుతూ కింద పడిపోయాడు .. పాపం మోకాలి చిప్పకు దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది. విక్కి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు.

ఇంటికి చేరిన త్రిలోక్ కృష్ణవేణిని గట్టిగ హత్తుకొని " అమ్మో ఎంత భయం వేసిందో తెలుసా అమ్మ! ఇకపై నేను ఎప్పుడు సైకిల్ తొక్కను బాబోయ్, నేను కూడా విక్కిలాగ పడిపోయి దెబ్బలు తగిలితే ఇంకా ఏమైనా ఉందా!? అప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ వేస్తే ఆ పెయిన్ అసలు తట్టుకోలేను..."

కృష్ణవేణి! నవ్వుతూ త్రిలోక్ ను దగ్గరికి తీసుకొని ..

"కన్నా! ఇప్పుడు చెప్పు.. నీకు ఏ సబ్జెక్ట్ ఆంటే చాలా ఇష్టం?"

"అమ్మా! నీకు తెలుసు కదా మాథ్స్ ఆంటే చాలా ఇష్టమని.. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు?"

“ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లెమ్ రాకపోతే వచ్చే దాకా వదలిపెట్టవు ! ఎందుకు!??”

“అమ్మా! అలా ఎలా వదిలిపెడతాను? వచ్చే వరకు డిఫరెంట్ మెథడ్స్ లో ట్రై చేస్తాను. ఎప్పుడు అయితే సొల్యూషన్ వస్తుందో అప్పుడే హ్యాపీ గా ఫీల్ అవుతాను…”

“ఎగ్జాక్ట్లీ రా కన్నా...

సైకిల్ కూడా ఒక ప్రాబ్లెమ్ అనుకో.. వచ్చే దాకా వదిలిపెట్టకుండా ట్రై చేయి, కింద పడినా సరే.. నీ ట్రయల్స్ అసలు వదిలిపెట్టకు.. నడిస్తే పడిపోతాను అనుకుంటే నువ్వు నడక ఎన్నటి కీ నేర్చుకోలేవు కదరా.. సేమ్.. సైకిల్ కూడా అంతే! మన పక్కింటి బాలు అన్న ఇక్కడే ఆడుకుంటూ ఉంటాడు.. తను పార్క్ కి డైలీ సైకిల్ పై వస్తాడు కదా.. తన దగ్గర తీసుకొని ట్రై చేయి ..”

“తప్పకుండా అమ్మా!”

త్రిలోక్ బాలు దగ్గర సైకిల్ తీసుకుని వాళ్ళమ్మ సాయంతో నేర్చుకోవడంతో మొదలు పెట్టాడు.. కింద పడి రెండు సార్లు దెబ్బలు తగిలించుకున్నా సరే.. అది వదిలిపెట్టలేదు.. అలా వారం రోజుల తరువాత పెర్ఫెక్ట్ గా ఎవరి సాయం లేకుండ తను తొక్కడం మొదలు పెట్టాడు.చాలా హ్యాపీ గా అనిపించింది త్రిలోక్ కి...

“రేయ్ కన్నా! నీకో సర్ప్రైజ్..” అంటు ఓ ఉదయాన త్రిలోక్ కి ముకుంద్, కృష్ణవేణి లు పుట్టిన రోజు కానుకగా సైకిల్ ను బహుమతిగా ఇచ్చారు..

ఆ రోజు మొదలు త్రిలోక్ స్కూల్ అవ్వడం ఆలస్యం సైకిల్ పై పార్క్ కి వెళ్ళి తన ఫ్రెండ్స్ తో కలిసి అలా సరదాగా రౌండ్స్ కొట్టేవాడు.. అలా యధావిధిగా ఒక రోజు పార్క్ లో సైకిల్ తొక్కేసి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు .ఇంతలో ఐస్ క్రీం బండి కనపడగానే సైకిల్ ని సైడ్ లో పార్క్ చేసి ఐస్ క్రీం బండి దగ్గరకి వెళ్ళాడు..

అక్కడికి విక్కి కూడా రావడంతో ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కొద్ది సేపు సరదాగా గడిపారు.. ఒకరికి ఒకరు బై చెప్పుకున్నాక, త్రిలోక్ ఇంటికి వెళ్ళాలి అని సైకిల్ దగ్గరకి వెళ్ళాడు.. అక్కడ సైకిల్ లేదు.. కున్నాక పక్కల అన్ని చోట్లా వెతికినా దొరకలేదు… ఏడుస్తూ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పి కన్నీరు మున్నీరు అయ్యాడు..

ముకుంద్ ఇంకో కొత్త సైకిల్ జీతం రాగనే తీసిస్తాను అన్నా సరే, త్రిలోక్ ఏడవడం ఆపలేదు..

" నాన్నా! నాకు ఇంకో సైకిల్ వద్దు. అదే సైకిల్ కావాలి .. పుట్టినరోజు కానుకగా మీరు ఇచ్చిన అదే సైకిల్ కావాలి..

నాకు సైకిల్ కొనివ్వడం కోసం మీరు ఎంత కష్టపడి ఉంటారు.. నాకు తెలుసు నాన్నా.. ఆ డబ్బు కోసం మీరు నెల కష్టపడాలి.. మీ కష్టాన్ని వేరే వాళ్ళు దోచుకుంటే ఎలా నాన్నా!” అని గుక్క పట్టి ఏడుస్తూ వాళ్ళ నాన్నని హత్తుకున్నాడు.

అదే బాధలో ఉండి వాళ్ళమ్మ ఎంత బ్రతిమాలినా సరే ఫుడ్ తినకుండా అలాగే ఏడుస్తూ నిద్రపోయాడు...

అదే బాధతో జ్వరం కూడా తెచ్చుకున్నాడు

బాధ పడుతున్న కొడుకుని చూసి కృష్ణవేణి ఎంతో బాధ పడింది. ఆ బాధని పోగొట్టాలి అంటే తను ఎలా అయిన సరే పోయిన సైకిల్ తీసుకురావాలని మరుసటి రోజు ఉదయం పార్క్ కి వెళ్ళి దగ్గరలో ఉన్న వాటిని గమనిస్తే అక్కడ ఉన్న షాప్ ల దగ్గర మూడు సీసీ కెమెరాలు ఉన్నాయి… అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలు ఉన్న షాప్ కి వెళ్ళి వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాటిని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా గమనించింది..

మూడో షాప్ దగ్గర తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది.. ఎవరో ఒక యువకుడు, ఇంకో స్కూల్ అబ్బాయి సైకిల్ ను తీసుకువెళ్లడం చూసింది..

ఆ వీడియోని తన ఫోన్ లో రికార్డ్ చేసింది..పోలీసులకి చెప్పితే వారి భవిష్యత్ పాడవుతుందని అనుకుంది..

ఆ అబ్బాయి వేసుకున్న యూనిఫాం బట్టి ఆ అబ్బాయిది ఏ స్కూలో కనిపెట్టింది.. అక్కడికి వెళ్ళి అబ్బాయిని చూసింది, ఆ అబ్బాయి ఏ ఏరియా లో ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది.. ఇంతలో ఆ అబ్బాయి ఆడుకోవడానికి బయటకి రాగానే తనని పక్కకి తీసుకొని వెళ్ళి సైకిల్ గురించి అడిగింది.. మొదట ఆ అబ్బాయి తెలియదు అని బుకాయించాడు ...

కృష్ణవేణి తన ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియో ను చూపించేగానే భయపడి

" ఆంటీ! నేను మా పక్కింటి అన్న బబ్లూ సాయంతో సైకిల్ దొంగిలించి తీసుకుని వెళ్ళి, ₹250 కి అమ్మేసాము.. ఆంటీ.. సారీ! మాకు ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు. అందుకే ఇలా ఏవైనా వస్తువులు కనపడగానే మేము ఇద్దరం దొంగతనం చేస్తున్నాము” అని చెప్పి గుక్క పెట్టి ఏడ్చాడు.

“చూడు బాబు ! డబ్బులు ఇవ్వలేదని ఇలా వేరే వారి వస్తువులు దొంగలించి అమ్మడం చాలా పెద్ద తప్పు..

పోలీసులు ఎప్పుడైనా పట్టుకొని నిన్ను జైల్ లో వేస్తే అప్పుడు మీ అమ్మానాన్నల పరిస్థితి ఏంటి! అది వాళ్ళకి ఎంత అవమానం..

అమ్మానాన్న కి మనం గొప్ప పేరు తీసుకురాకపోయిన పర్లేదు కానీ చెడ్డ పేరు మాత్రం తీసుకుని రాకూడదు..”

ఇదంతా అప్పుడే అక్కడకి వచ్చి విన్నాడు బబ్లు.. తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొని కృష్ణవేణి దగ్గరికి వచ్చి సారీ చెప్పి ఎక్కడైతే వాళ్ళు సైకిల్ అమ్మారో అక్కడికి తీసుకుని వెళ్ళాడు.

సైకిల్ కొన్న అతను మొదట ఇవ్వను అన్నాడు. కానీ అలా దొంగలించిన సెకండ్ హ్యాండ్ వస్తువులని కొనడం చట్టరీత్య నేరం అని కృష్ణవేణి చెప్పడంతో పాటు సాక్ష్యం గా వీడియోను చూపించడంతో అతడు సైకిల్ ని ఇచ్చేశాడు...

ఉదయము అనగా బయటికి వెళ్ళిన కృష్ణవేణి ఇంటికి ఇంకా రాకపోవడంతో ముకుంద్ కంగారు పడసాగడు.. ఇంతలో కృష్ణవేణి సైకిల్ తో రావడం చూసి ఆశ్చర్యపోయాడు...

తను మాట్లాడుతున్నా సరే.. కృష్ణవేణి పరుగున త్రిలోక్ ఉన్న రూంకి వెళ్ళింది.

త్రిలోక్ ని నిద్ర లేపి సైకిల్ చూపించగానే ఎంతో ఆనందపడ్డాడు. అప్పటి వరకు ఉన్న తన జ్వరం కూడా హమ్ పట్ స్వాహా అంటు వెళ్ళిపోయింది.

అమ్మా.. నా సైకిల్ అంటు ఆనంద పడుతూ ఎగురుతున్నాడు త్రిలోక్...

కృష్ణవేణి, ముకుంద్ ఎంతో ఆనందపడ్డారు త్రిలోక్ ని చూసి...

“అసలు సైకిల్ ఎలా దొరకింది కృష్ణా!???...”

కృష్ణవేణి ఎలా సైకిల్ ని వెతికి పట్టుకుంది మొత్తం చెప్పింది..

“అబ్బో.. నా భార్య పెద్ద డిటెక్టివ్! అయితే ఇకపై నేను జాగ్రత్తగా ఉండాలి సుమా!??”

“ఊరుకోండి మీరు మరీనూ! నా బిడ్డ బాధను ఎలా అయిన సరే దూరం చేయాలి. అది ఒక్కటే నా కర్తవ్యం అని భావించి ముందడుగు వేసి సఫలీకృతమయ్యాను.. తమకి ఇష్టమైన వస్తువు దూరం అయి, తన వారు బాధ పడుతుంటే నేనే కాదు.. ఎవరైనా సరే పెద్ద డిటెక్టివ్ అవుతారు”

తన భార్య కృష్ణవేణి వైపు గర్వంగా చూశాడు ముకుంద్...

“అమ్మా.. నాన్నా.. నా సైకిల్ మళ్ళీ దొరికింది కదా! ఈ ఆనందంలో మనమందరం కలిసి ఒక ల్ఫీ తీసుకుందాము” అని ఎంతో ఆనందపడుతూ పిలిచాడు త్రిలోక్.

“సరే రా కన్నా.. అంటు సైకిల్ తో నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు.....

త్రిలోక్ వాట్సప్ స్టేటస్ లో క్యాప్షన్ గా " నా డిటెక్టివ్ అమ్మ" అని పెట్టుకున్నాడు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.


79 views0 comments
bottom of page