top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 9

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Youtube Video link

'Kakathi Rudrama Episode 9' New Telugu Web Series


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
గత ఎపిసోడ్ లో…

కుమార సంభవానికి యక్షగానం ఆడుతుంది మధుసాని.

రాత్రిపూట అన్నమాంబిక వద్దకు వస్తాడు గోన గన్నారెడ్డి.

ఇక చదవండి...

రాజ ప్రాసాదము ఎత్తయిన గోడలను దాటి , ఇంతమంది కావలి వారికంట కారముగొట్టి.... పహరా కాసేవాళ్ళను తప్పించుకుని.. ఎట్లా వచ్చాడు?


దీక్షగా చూసినది.


గుండె ఆగినట్లయింది.ఇంతటి చలిగాలిలోనూ వొళ్ళంతా చెమట!

ఆమె ముందు నిలబడినాడు.

గోన వంశాబ్ధి సోముడు ' గన్నారెడ్డి'.


గంభీరంగా - హుందాగా - ధీర పురుషుని వలె -

అతడు నవ్వినాడు.- నమస్కరించినాడు.


"మీరు.......?"


"నేను, 'గజదొంగ..' అని లోకులు పిలిచే గన్నారెడ్డిని".


ఆమె ' ఆ' అనలేదు--" ఊ" అనలేదు.


"భయపడుతున్నారా?"


"లేదు".


"ఇంత చీకటిలో ఎట్లా రాగలిగారు?"

"దొంగను కదా!" అని స్నిగ్ధంగా నవ్వాడు.


"అంత పెద్దకోట గోడల నెక్కి-"

"మీ కోసం అని ఆకాశాన ఉన్నా ఎక్కుతాను".


"ఎవరన్నా చూస్తే"!

"చీకటి కరుణించింది".


"నేను ఇక్కడ ఉన్నానని మీ కెట్లా తెలుసు?

"తెలుసు..." మళ్ళీ అదే నవ్వు.

నిశ్శబ్దం."


"ఎందుకు వచ్చానని అడగలేదు".

" మీరే చెబుతారనీ".


" చెప్తాను........మీ మనస్సులో ఏముందో నాకు తెలీదు.కానీ మీకు చెప్పాలనే ఆకాంక్ష..... అందుకోసమే యింత సాహసం చేసి వచ్చాను."


" చెప్పండి".


"మా తండ్రిగారైన శ్రీగోనబుద్దారెడ్డి ప్రభువులకూ, ఆయనకు జన్మించినందువల్ల నాకూ కాకతీవంశమన్నా , సామ్రాజ్యమన్నా చచ్చేంతప్రేమ.ఆయన ఉన్నంతవరకూ

కాకతీ ప్రభువులను ప్రేమించారు.నేను ఉన్నంతవరకూ అంతే చేస్తాను- మా

అపార మైన భక్తివిశ్వసాలను ఎవరూ శంకించరు, శంకిస్తే భరించలేను."


" ఇది నాతో ఎందుకు చెబుతున్నట్టు?"

" మున్ముందు మీకు అర్ధమౌతుందని".


" మరి".

" కాకతి రుద్రదేవులను మిమ్ము గౌరవిస్తాము".


" ఊ. ".

"పెరగబోతున్న అన్యాయాన్ని తరగటానికే మేము కత్తులకు పదును పెడుతున్నాము.గజదొంగలమైనాము"


"ఊ!"


ఆమె అతని విగ్రహాన్ని చూస్తున్నది.తనకి యింతదూరంలో- తన స్వామిని- తన ప్రభువుని- తన సర్వస్వాన్ని........ఎంత సుందరదేహము- ఎంత గంభీరత- ఎంత

నిశ్చలత- ఎంత ధీరోదాత్తత !


" రాకుమారీ! నీ పెళ్ళి చెడగొట్టాను".

ఆమె పలకలేదు.


" దీనికి మీరు క్షమించాలి".

" ఎందుకని?"అన్నదామె స్నిగ్దంగా నవ్వి" ఎట్లా క్షమించను?".


" నేను మీ ఎదుట వున్నాను.నా వరలో ఖడ్గమున్నది.సంహరించ వచ్చును లేదా

' దొంగ' అని అరవండి. నేను పారిపోను.


" అహా!"

" నేను వచ్చింది , ఈ పెళ్ళి ని తాత్కాలికంగానైనా ఆపమని అభ్యర్థించటానికే."


" నాకు ఎన్నటకీ ఈ పెళ్ళి కాదు".

"ఎందుకని".


" నేను వరదారెడ్డిని భర్తగా వూహించలేను."

" ఆ నాడే పెళ్ళి జరిగివుటే".


" విధి మీ రూపేణా వచ్చి దాన్ని చెడగొట్టలేదా?"

" ఆ నాడే మీ తండ్రిగారికి ఈ పెళ్ళి ఇష్టంలేదని చెప్పవలసినది".


" వారు వినరు".

" మరి , ఈ సారి!"


" పెళ్ళికి ముందే విషంతో ఆత్మహత్య చేసుకుంటాను".

" రాకుమారీ!" అన్నాడు గన్నారెడ్డి ఆశ్చర్యంగా.


" స్వామీ !"

" మీరు నన్నట్లా పిలువరాదు".


" ఎందుకని?".

" నేను దోపిడీ దొంగను".


" అయితే నన్ను దోచుకోండి".

" అన్నమాంబికాదేవి!"


" ఆమె మిమ్ములను తప్ప ఎవరినీ పెళ్ళి ఆడదు".

" రాకుమారీ!"


" అసలు ఈ పెళ్ళి మీ కేల యిష్టము లేదు?".

" స్వార్థశక్తులతో మీ తండ్రిగారు వియ్యమందటం యిష్టం లేదు".


" నిజమే".

" మీరు నాకో ప్రమాణం చేయాలీ".


" తప్పక".

" మీరు ప్రాణత్యాగం చెయ్యరాదు".


" ప్రభూ".

" దేవీ".


ఆమె ముఖాన్ని చేతుల్లో కప్పుకున్నది.

అతను, తన పొడుగాటి చేతినిచాచి , ఆమె చేతులని తీసి-


"అన్నమాంబికా, నీవు నా ఆస్తివి.కన్నీరు తుడుచుకో.చిరునవ్వు నవ్వు.నేను నిన్ను

తీసుకుపోతాను".


"అసాధ్యము".

"ఎందుకని?".


"చుట్టు కట్టుదిట్టమైన కాపలా".

"నేనెట్లా వచ్చాను.గజదొంగలకు వచ్చిన మార్గం తెలిస్తే , పోయే మార్గం కష్టమా!".


"మీరు వచ్చేటప్పుడు వంటరివారు".


"దేవీ, నిన్ను తీసుకుపోయేమార్గం వుంది.అదీగాక నిన్ను సగౌరవంగా తీసుకుని వెళ్ళడానికి , ముఖ్యులైనవారు ఆదవోని వెలుపల ఎదురు చూస్తున్నారు."


ఆమె ముఖం ఆశ్చర్యంగా పెట్టి,

"ఎవరు వారు" అన్నది.


"మా సోదరి,కుప్పసానమ్మ దేవీ మీ కోసం ఎదురు చూస్తున్నారు.


"అయితే ఒక పని చేస్తాను."

"చెప్పండి".


"మీరు వొంటరిగా వెళ్ళండి".

"ఆనక......."


"నేను పురుషవేషంతో వస్తాను".


"మీ యిష్టం జాగ్రత్త!".

"పురుషవేషము , మీ రుద్రమదేవికే కాదు, నాకూ వచ్చు."


"అలాగా".

ఆ మాట అని చీకటిలో మాయమైనాడు.


ఇంకా ఊరు నిద్రలేవలేదు.అంతఃపురం గాఢసుషుస్తిలో అందఃకారంలో మునిగి వుంది--

ఆమె గబగబా పురుషవేషం ధరించింది .


వొడుపుగా బైటికొచ్చింది.

పాహరావాడు నిద్రలో జోగుతున్నాడు.తూర్పునక్షత్రం మిణుకు మిణుకు మంటున్నది.

ఎవరూ గుర్తుపట్టలేదు.

ఆమె నిర్భయంగా అంతఃపురం దాటి బైటికొచ్చింది.


అంతఃపుర కావలివాడు అనుకుని ప్రధానద్వారం దగ్గర వదిలేశారు.

తెల్లారి తెలిసింది.


రాత్రి గోనగన్నారెడ్డి అంతలావు ఆదవోని కోటగోడలు దాటి లోనికి ప్రవేశించాడట.

రాకుమారి అన్నమాంబికాదేవి కనిపించటం లేదట.


ఊరంతా ఈ వార్త!.


అంతఃపురంలో దుర్భరశోకం.


వెలుతురు ఈ వార్తని కాస్సేపటికి గాలితో చెప్పి రాజ్యాలు పాకించింది.

-------------------------------------------------------------

కళల కాణాచీ---- " రామప్ప దేవాలయము"

---------------------------------------

కాకతీయుల శిల్పకళావైభవానికి ప్రతీక 800 యేళ్ళ నాటి రామప్పదేవాలయము.ఈ

ఆ లయంలో అడుగడుగునా అన్నీ అద్భుతాలే.


ఓరుగల్లును ఏలిన కాకతీయరాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం.కాకతీయ వంశీకుల రాజదానియైన వరంగల్లు పట్టణమునకు 70 కిలో

మీటర్ల దూరంలో ములుగు జిల్లాలో వుంది.ఈ దేవాలయం అలనాటి శిల్పుల పని

తనానికి మచ్చు తునకగా చెప్పవచ్చు.ప్రక్కనే రామప్ప చెరువు కలదు.ఇది ఇఫటికీ

వేల ఎకరాల పంటలు పండి భూమాతను సస్యశ్యామలంగా చేస్తున్నాయి.కాకతీయు

ల పరిపాలన 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.కాకతీయరాజుగణపతిదేవుడు

వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించెను.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


88 views0 comments

Comments


bottom of page