top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 10

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Kakathi Rudrama Episode 10' New Telugu Web Series


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


గత ఎపిసోడ్ లో…

వరదారెడ్డి తో వివాహం ఇష్టం లేదని చెబుతుంది అన్నమాంబిక. పురుష వేషంతో కోటను దాటి గన్నా రెడ్డి ని చేరుకుంటుంది.

ఇక చదవండి


ఈ దేవాలయాన్ని 1213 లో గణపతిదేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించెను. ఈ ఆలయం నిర్మాణానికి 40 ఏళ్ళు పట్టిందట. ఈ ఆలయం గోపురం నిర్మాణానికి వాడిన ఇటుకలు నీటిలో వేస్తే తేలియాడుతాయి. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయంలో దైవం పేరు మీద కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పిపేరు మీద గా ఉండటం విశేషం.


ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వరఆలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో ప్రదాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణువు అవతారం రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవం గా వున్న ఆలయం.


ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేకశైలి, ఎత్తైనపీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి వుంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశద్వారం తో కలిగి మహామండపం వుంది.


ఇందలి గర్భాలయాన ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. ఇందలి మహామండపం మధ్య భాగాన కల కుడ్య స్తంభాలు, వాటి పై గల రాతి దూలాలు- రామాయణ , పురాణ, ఇతిహాస గాథలతో నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి వున్నాయి.


ఈ మహా మండపం వెలుపలి అంచున పై కప్పు క్రింది బాగాన నల్లని నునుపు రాతి ఫలకంపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కటి తార్కణాలు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి.


దేవాలయం శిల్పసంపద కాకతీయ రాజుల నాటి శిల్పశైలి తెలుపుతుంది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంభాలమీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడివున్నాయి. లోపల రెండు శివుడి సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా అందంగా చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది.

ఈ గుడి తరచూ జరిగన దండయాత్రల బారికి గురైంది. 17 వ శతాబ్దంలో వచ్చిన భూకంపం వలన కొద్దిగా శిథిలమైంది. ఆలయ ముఖద్వారం శిథిలమైంది.


"పేరిణీ శివ తాండవం" అను నృత్యరీతి ఈ శిల్పాల నుండి గ్రహించినదే. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై వుంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు వున్న చిన్నద్వారం ద్వారానే ప్రవేశం.


రామప్పగుడిలో శిల్పకళా చాతుర్యం, ఆలయ నిర్మణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణింపనలవి కానివి. ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికీ చూపరులకు అమితానందాన్ని కలిగిస్తుంది.


భరత నాట్య శాస్త్రమంతా మూర్తీభవించి, స్థంభాల మీదా, కప్పుల మీదా కనబడుతుంది. రామప్పగుడి లోని విగ్రహాలు, స్థంభాలపై కనబడుతుంది. ముఖ్యంగా దేవాలయ మంటపం పై కోణాల్లో నాలుగు ప్రక్కలా పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంభాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి ఉన్నాయి.


జాయప సేనాని రచించిన నృత్త రత్నావళి లో ఉదహరించిన నాట్య శిల్పమంతా

రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది.


ఆలయంలో మరో విశిష్టతను తెలిపే మరో అద్భుతం. . . . . సప్తస్వరాలు పలికే శిల్పం.


ఆలయ ప్రదాన ద్వారానికి ఎడమవైపున ఉండే శిల్పాన్ని వేళ్ళతో మీటితే ' సరిగమపదని" లు పలుకుతుంది.


ప్రధాన ఆలయం నక్షత్రాకారం గద్దెపై ఉంది. ఆలయం చుట్టూ చెక్కిన 526 ఏనుగు విగ్రహాలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా ఆలయం లోపల గల నల్లరాతి స్తంబాలపై మలచిన పురాణగాథల శిల్పాలు అద్భుతహ అనిపిస్తాయి. గోపికా వస్త్రాపహరణం మొదలుకుని నరకాశుర వధ వరకు ఎన్నో గాథలను ఈ రాతి స్థంభాలపై చూడవచ్చు.


రామప్ప చెరువును కాకతీయుల సేనాని రేచర్ల రుద్రుడు మానేరు నదిపై దీనిని నిర్మించెను.


ఓరుగల్లుకు 40 మైళ్ళదూరంలో రామప్ప గుడులు కలవు. వీటిని 1162 లో రుద్ర సేనాని అను రెడ్డి సామంతుడు నిర్మించెను. ఆ గుళ్ళలోని విగ్రహములు స్థంభాలపై

శిల్పములు, ముఖ్యముగా దేవాలయ మంటపంపై కోణములందు నాలుగు దిశలందు నిలిపిన పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరములు. ఆ విగ్రహాలపై సొమ్ముల అలంకరణములు, వాటి త్రిభంగి నాట్య భంగిమలు శిల్పకారులనే మోహింప జేసినట్లున్నది.


అందుచేతనే శిల్పులు ఆ సుందరాంగులకు తుష్టిపూర్తిగా ప్రసాధన క్రియలను సమకూర్చి అందు రెంటిని నగ్నత్వము గా తీర్చిదిద్ది ఆనందించినారు. దేవాలయములోని స్తంభాలపై నాట్యభంగిమములు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడినవి. జాయపసేనాని వ్రాసిన నాట్యశాస్త్రము ' నృత్య రత్నావళి' తంజావూరు లిఖిత భాండాగారము లో నున్నది. ఇఫటి వరకూ దానిని ఎవ్వరునూ ముద్రించుటకు పూనుకోలేదు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
108 views0 comments

Commenti


bottom of page